28.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

మానవీయ తప్పిదం వల్లే ఇండ్లల్లోకి వరదనీరు: చాడ వెంకటరెడ్డి.

మానవీయ తప్పిదం వల్లే ఇండ్లల్లోకి వరదనీరు: చాడ వెంకటరెడ్డి.

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హుస్నాబాద్ పట్టణంలోకి వరదనీరు రావడానికి మానవ తప్పిదమేనని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు.. మంగళవారం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్, జిల్లా కార్యవర్గ సభ్యులు యెడల వనేష్, జాగీర్ సత్య నారాయణ, జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ సిపిఐ నాయకులతో కలిసి క్షేత్ర పరిశీలించారు. నాగారం రోడ్డులొ 2008లొ చాడ వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో 83 లక్షలతో నిర్మించిన వారద మల్లింపు కాల్వ నిర్మాణం చేపట్టారు.. పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా అలాంటి పెద్ద కాల్వలు వుంటే మూడేళ్ల పట్టణంలోకి వరదనీరు వచ్చేది కాదని ఇది మానవ తప్పిదమేనని వెంటనే సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు స్పందించలని, హుస్నాబాద్ పట్టణం దినదిన అభివృద్ధి చెందుతుందని నేటి పరిస్థితులకు అనుగుణంగా ఎంతటి భారీ వర్షాలకైన పట్టణంలోని, ఇండ్లల్లోకి రోడ్లమీదికి వరద నీరు రాకుండా వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, గడిపె మల్లేశ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యెడల వనేష్, జాగీర్ సత్య నారాయణ,జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి,మంద శ్రీనివాస్ భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, అక్కన్నపెట మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్, ఎఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జనగాం రాజు కుమార్, ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జెరిపొతుల జనార్దన్,దళిత హక్కుల పోరాట సమితి జిల్లా సహాయ కార్యదర్శి నేలవేణి స్వప్న, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల ఉపాధ్యక్షురాలు జంగ విజయ, సిపిఐ మండల నాయకులు అయిలేని మల్లారెడ్డి, గట్టు మల్లేశం కందరపు రాజు, తదితరులు పాల్గొన్నారు.

పునరావాస కాలనీలో సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలి: జిల్లా కలెక్టర్

పునరావాస కాలనీలో సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలి: జిల్లా కలెక్టర్

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది

మల్లన్న సాగర్ పునరావాస కాలనీలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.. మంగళవారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో మల్లన్న సాగర్ ముంపు గ్రామాలైన ఎర్రవల్లి, సింగారం, ఏటిగడ్డ కిష్టాపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజరుపల్లి, లక్ష్మాపూర్, పల్లెపహాడ్ మరియు వేములఘాట్ గ్రామాల సర్పంచ్, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయా గ్రామాల బాధితులకు పునరావాస కాలనీలలో ఏర్పాటుచేసిన సౌకర్యాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాటిల్ మాట్లాడుతూ మల్లన్న సాగర్ పునరావాసంలో భాగంగా పునరావాస కాలనీలలో కేటాయించిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపు పూర్తిగా వచ్చిందని ఎవరికైనా రిజిస్ట్రేషన్ పూర్తిగా కాకపోతే త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. అదేవిధంగా కొన్ని కాలనీలో సిసి రోడ్లు, విద్యుత్, త్రాగునీరు తదితర సౌకర్యాలను కల్పించామని ఏ పునరావాస కాలనీలోనైనా ఎలాంటి సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత శాఖల ద్వారా వెంటనే సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట, గజ్వేల్ ఆర్డీవోలు రమేష్, బన్సీలాల్, విద్యుత్ శాఖ, ఆర్ డబ్ల్యూ ఎస్ మరియు సంబంధిత ఇంజనీరింగ్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం.. ప్రమాదాలను నివారిద్దాం: జిల్లా ఎస్పీ

ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం.. ప్రమాదాలను నివారిద్దాం: జిల్లా ఎస్పీ

జగిత్యాల యదార్థవాది

ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించడం మన అందరి బాధ్యత అని గుర్తుంచుకోవాలని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ అన్నారు.. మంగళవారం జగిత్యాల జిల్లా పట్టణంలో పోలీస్ సేఫర్ ఇండియన్ రోడ్, ఇండియన్ యూత్ సెక్యూలర్ ఆర్గనైజేషన్ ఎన్జీవో ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన నిబంధనలు పాటించే వారికి బహుమతుల ప్రధానంలో ఎస్పీ పాల్గొని మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించడం మన అందరి బాధ్యతగా తీసుకున్నప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని తెలిపారు. వేగం కన్నా ప్రాణం మిన్న గమ్యం చేరడం ముఖ్యం కానీ వేగం కాదు.. ఒకటి రెండు నిమిషాల్లో ముందు మాత్రమే చేరుకోగలమని కానీ అది ఏదైనా అనుకోని సంఘటన జరిగితే నిండు జీవితం బలి కావడం జరుగుతుందని వీలైనంతవరకు తక్కువ వేగంతో వాహనాలు నడపాలని ట్రాఫిక్ నిబంధనలు పాటించి గమ్యస్థానాలకు చేరుకోవాలని అన్నారు. దురదృష్టవంతు ఎక్కువగా యువత రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణం చెందుతున్నారని ముఖ్యంగా సాయంత్రం నుండి రాత్రి పది గంటల వరకు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నందున యువత వాహన వేగాన్ని నియంత్రణతో నడిపలని తెలిపారు. ట్రాఫిక్ నియమ అలా గూర్చి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఎన్జీవో ఓజాను ఎస్పీ అభినందించారు.. ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారికి చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పిలు వెంకటస్వామి, రవీందర్ రెడ్డి, జగిత్యాల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ నటేష్, రఫీ ఖాన్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు..

కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా వుంటుంది..

కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా వుంటుంది..

దుబ్బాక యదార్థవాది ప్రతినిది

గ్రామ పంచాయతిలలో పని చేస్తున్న పారిశుద్ధ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ దుబ్బాక ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 27 రోజులుగా కార్మికుల వేతనాల పెంపు పర్మినెంట్ చేయాలని, కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని రాష్ట్రవ్యాప్తంగా సమ్మె కొనసాగిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. జీవో నెంబర్ 60 ప్రకారం జీతాలు ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉన్న కెసిఆర్ ప్రభుత్వం ఇవ్వడం లేదని తెలంగాణ వస్తే ధర్నాలు రాస్తారోకో లు లేవని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాస్తారోకోలు ధర్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తీర్చాలని లేనిపక్షంలో కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉండి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండలి.

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండలి.

దుబ్బాక యదార్థవాది ప్రతినిది

వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల క్షేత్రస్థాయిలో 2, 17 వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అవగాహన చేస్తున్న చైర్ పర్సన్ గన్నే వనిత..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీజనల్ జ్వరాలు, దోమ కాటు వల్ల వచ్చే వ్యాధులపై, నీటి నిల్వ ఉన్న కుండీలలో వర్షపు నీటి ద్వారా దోమలు గుడ్లు పెట్టి ఉత్పత్తి అయి డెంగ్యూ మలేరియా లాంటి విష జ్వరాలు ప్రబలుతాయని వార్డు ప్రజలకు తెలియజేశారు. ప్రజలు ఇంటి చుట్టు ప్రక్కల పారిశుద్ధ్య సమస్య లేకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి, వార్డ్ కౌన్సిలర్ పులిగారి కల్పన, గోనేపల్లి దేవలక్ష్మీ బీఆర్ఎస్ నాయకులు భూమ్ రెడ్డి, ఎల్లం, ఆర్పీ లావణ్య, అంగన్వాడీ టీచర్ సుజాత, సమాఖ్య సభ్యులు, ఆశ వర్కర్లు, ఆర్పిలు వార్డు ప్రజలు పాల్గొన్నారు..

ఎమ్మెల్యే చిత్రపటానికి పాలభిషేకం..!

ఎమ్మెల్యే చిత్రపటానికి పాలభిషేకం..!

దుబ్బాక యదార్థవాది ప్రతినిది

దుబ్బాకలో వంద పడకల ఆసుపత్రిలో 71 మంది ఇబ్బంది కొరత కోసం గత అసెంబ్లీలో గలమెత్తి సమస్య తీర్చిన దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు చిత్రపటానికి స్థానిక క్యాంప్ కార్యాలయంలో పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు అంబటి బాలేష్ గౌడ్ మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం వంద పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం ఎమ్మెల్యే కృషి చేశారని సిద్దిపేట గజ్వేల్ వంద పడకల ఆసుపత్రిలో సిబ్బంది త్వరగా కేటాయించారు.. దుబ్బాక వంద పడగల ఆసుపత్రిలలో సిబ్బంది వైద్య సేవలు అందించారు అన్నారు. అంతేకాకుండా ఆస్పత్రి పనులు నత్త నడకన ఉండటంతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సంబంధిత కాంట్రాక్ట్ తో మాట్లాడి ప్రతిగతంగా పనులను పూర్తి చేయించి ఘనత రఘునందన్ రావుకే దక్కుతుందని, ఆసుపత్రికి వెళ్లాలంటే రోడ్డు వివాదాస్పదంలో ఉంటే వారితో మాట్లాడి పనులను పూర్తి చేయించారన్నారు. అసెంబ్లీలో గలమెత్తి కోరడంతో ఇటీవల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆస్పత్రిలో 71 మంది వైద్య సిబ్బంది నియమించేందుకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిస్థాయి సిబ్బందిని నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సుభాష్ రెడ్డి, వంశీ, మచ్చ శ్రీనివాస్, సుంకు ప్రవీణ్, గాజుల భాస్కర్, దూలం వెంకట్ గౌడ్, మరాఠీ బాబు, రమణారెడ్డి, రమేష్ రెడ్డి, నిహాల్ గౌడ్, తొగుట రవీందర్ తోపాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు..

ఆరోగ్యశాఖ వాహనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్..

ఆరోగ్యశాఖ వాహనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్..

హైద్రాబాద్ యదార్థవాది ప్రతినిది

హైదరాబాద్ లో పీపుల్స్ ప్లాజా వేదికగా 108, అమ్మఒడి వాహనాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు..
అనంతరం తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులతో కలిసి సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడే నాటికి 316 అంబులెన్సులు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 466 కు పెంచుకోగలిగామని అత్యవసర సేవలకు ఒకేరోజు 466 ప్రవేశ పెట్టడం సంతోషంగా ఉందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో లక్ష మందికి ఒక 108 వాహనం ఉంటే.. నేడు 75 వేలకు ఒక వాహనం అందుబాటులోకి వచ్చాయని ఆయన అన్నారు. మన తెలంగాణలో నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రులను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని, జిల్లాకు ఒక మెడికల్ కాలేజి, వరంగల్ హెల్త్ సిటీ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 50 వేల పడకలు అందుబాటులోకి వచ్చాయని, ఇప్పుడు కరోనా కాదు దాని తాత లాంటిది వచ్చినా ఎదుర్కొనెలా మన వైద్య రంగం పటిష్టం అయిందని ఆయన అన్నారు.. మాకు ఎలాంటి అనారోగ్యం వచ్చినా కేసిఆర్ ప్రభుత్వం అండగా ఉన్నదనే భరోసాతో తెలంగాణ ప్రజలు ఉన్నారని, దేశంలో ఉన్న బిజెపి, కాంగ్రెస్ రాష్ట్రాల్లో స్కాములు ఉంటే.. తెలంగాణలో స్కీములు ఉన్నాయని, బిజెపి, కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల్లో కొట్లాటలు, స్కాములు తప్ప అభివృద్ధి శూన్యమని మంత్రి అన్నారు.. ఆశ కార్యకర్తల సెల్ ఫోన్ బిల్లును ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమ్మద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, హైదరాబాద్ మేయర్ బీఅర్ఎస్ రాష్ట్ర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

బాల్యమంటే ఒక చిరు నవ్వు..

బాల్యమంటే ఒక చిరు నవ్వు..

-జిల్లాలో బాల కార్మికులకు విముక్తి..

-బాల్యం బంది కావద్దు.. బాల్యం ఎంతో విలువైనది..

-చిన్నారులను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం..

-జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శి..

మెదక్ యదార్థవాది ప్రతినిది

జిల్లా పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా 66 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారని జిల్లా ఎస్ పి రోహిణి ప్రియదర్శిని తెలిపారు..బాల్యమంటే ఒక నవ్వుల దొంతర ఆటపాటల పరంపర చిన్నారుల మొహంలో చిరునవ్వులు చిందించేలా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ప్రియదర్శిని అన్నారు.. మంగళవారం మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో వారు మాట్లాడుతూ బాల్యమంటే ఒక నవ్వుల దొంతర అని ఆటపాటల పరంపరఅని ఆడినా పాడినా నడిచినా పరుగెత్తినా ప్రవహించే ఓ తుళ్లింతల వరదలా ఆశల మిలమిలలూ జిజ్ఞాసల తళతళలూ మేళవించిన ఒక ఉత్సాహపు జాతర.. మరి అందరి బాల్యం అలాగే ఉందా? .. అంటే లేదు. ఇప్పటికీ- చాలా కుటుంబాల్లో సహజమైన బాల్యాన్ని ఆ బాల్యపు వికాస క్రమాన్నీ బతుకు తెరువే ఓ బండ బరువై.. నిర్దాక్షిణ్యంగా బందీ చేస్తోందని వికసించి ప్రకాశించాల్సిన బాల్యాన్ని బలవంతంగా మసక బారుస్తోందని బడికి వెళ్లాల్సిన బాలలు కష్టతరమైన పనుల్లో కష్టపడటం సమాజాభివృద్ధికి ఆటంకంఅని జాతిని సవాలు చేస్తున్న బాలకార్మిక సమస్య ఇంకనూ కొనసాగుతూనే ఉందని ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం వివిధ చర్యల్ని చేపడుతూనే ఉన్నా.. ఇది సామాజిక-ఆర్థిక సమస్యతో ముడిపడి ఉన్నదని దీన్ని రూపుమాపేందుకు ఆపరేషన్ ముస్కాన్ పోలీస్ బృందం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ లేబర్ డిపార్ట్మెంట్ సఖి సెంటర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంటు అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ బృందం దాడులలో కిరాణం షాప్ లలో మెకానిక్ షాపులలో హోటళ్లలో పనిచేస్తూ వదిలివేయబడిన పిల్లలు రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలు బాలకార్మికులుగా పని చేస్తున్న పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించామని తెలిపారు. అలాగే బాలలను పనిలో పెట్టుకున్న వారిపై 4 కేసులు నమోదు చేయడం జరిగిందని ఇందులో బాలురు 58, బాలికలు 08, పక్క రాష్ట్రాల బాలురు 11 మంది ఉన్నారని, చిన్నపిల్లలు వెట్టిచాకిరికి గురికాకుండా వారి మొహం లో చిరునవ్వులు చిందించేలా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సూచించారు. ఎవరైనా ఎక్కడైనా బాలకార్మికులను పనిలో పెట్టుకున్న లేక వారితో బలవంతంగా పని చేయించిన ఒంటరిగా బాధపడుతున్న బాలలను చూసినప్పుడు పోలీసులకు తెలపాలని వారు అన్నారు.. శారీరకంగా మానసికంగా, లైంగిక దోపిడికి గురవుతున్న బాలలను చూసినప్పుడు 1098 లేదా డయల్ 100, 112 కు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.

అక్రమ వడ్డీ వ్యాపారుని అరెస్ట్.

అక్రమ వడ్డీ వ్యాపారుని అరెస్ట్.

-భారత రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు పాటించాలి..

-నిబంధనలకు లోబడి చిట్టి, వడ్డీ వ్యాపారం చేసుకోవచ్చు..

-అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం..

-చిట్ ఫండ్ వ్యాపారులు పద్దతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవు..

-సిరిసిల్ల రూలర్ సర్కిల్ ఇన్స్పెక్టర్..

సిరిసిల్ల యదార్థవాది ప్రతినిది

భారత రిజర్వ్ బ్యాంక్ వారి నిబంధనలు అక్రమించి అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిని కటకటాల వెనక్కు పంపిస్తామని సిరిసిల్ల రూలర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగాలపల్లి మండల పరిధిలోని సారంపల్లి గ్రామంలో మునిగెల అంజయ్య అక్రమ అధిక వడ్డీ వ్యాపారం చేస్తునడని సమాచారంతో సిరిసిల్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సదన్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు సిబ్బంది తో కలసి దాడులు జరిపి అంజయ్య ఇంట్లో ఉన్న ప్రాంసరి నోట్స్, బాండ్ పేపర్స్, వాహనాలు, సాధబైనమా పేపర్స్, బుక్స్, నగదు స్వాధీనం చేసుకొని అంజయ్యపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని, అతని వద్ద స్వాధీనపరుచుకున్న వాటి వివరములు ఈ విధంగా ఉన్నాయి. 10 బాండ్ పేపర్స్ విలువ రూ. 20,72,064/-, 8 ప్రంసరి నోట్స్ విలువ రూ. 4,61,000/-, 21సాధబైనమా పత్రాలు పుస్తకాలు విలువ రూ. 20,90,300/-, నగదు రూ. 1,50,000/-, ఒక ద్విచక్ర వాహనం, ఒక ట్రాక్టర్ స్వాధీన పరచుకున్నట్లు మంగళవారం ఆయన పత్రిక ప్రకటనలు తెలిపారు.. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో దాడులు యధాతథంగా కొనసాగుతూనే ఉంటాయని, ఇకనైనా అక్రమ వడ్డీ వ్యాపారులు, చిట్ ఫండ్ వ్యాపారులు తమ పద్దతి మార్చుకోకపోతే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, హెచ్చరించారు. అప్పు తీసుకోవడం, ఇవ్వడం నేరం కాదు కానీ భారత రిజర్వుడు బ్యాంక్ నియమనిబందనలకు అనుగుణంగా మలుచుకోవాలని, తెలంగాణ మని లెండింగ్ చట్టంలోని నిబందనల ప్రకారం చట్ట బద్దంగా ఎవరైనా లైసెన్స్ తొ అప్పులు ఇవ్వవచ్చు, తీసుకోవచ్చు. కాని చట్ట విరుద్ధంగా, అధిక వడ్డీ రేట్లతో సామాన్యుల పై దౌర్జన్యం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ టాస్క్ లో సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా: ఎమ్మెల్యే సతీష్

గ్రామల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా: ఎమ్మెల్యే సతీష్

యదార్ధవాది హుస్నాబాద్ ప్రతినిది

కోహెడ మండలంలో రెండు కోట్ల 66 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్.. హుస్నాబాద్ నియోజకవర్గ కోహెడ మండలం పలు గ్రామాలలో సోమవారం నూతన గ్రామ పంచాయతీ భవనాలు,సీసీ రోడ్లు వివిధ అభివృద్ధి పనుల కోసం 2 కోట్ల 66 లక్షలు నిధుల తో శంకుస్థాపనలు చేసి మాట్లాడుతూ మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణ రాష్ట్రంలో సిద్దించిందని గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసి గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. సిసి రోడ్లు, మురికి కాలువలు, మరుగుదొడ్లను ప్రభుత్వం నిర్మిస్తోందని, గ్రామ అభివృద్ధికి నెల నెల నిధులు మంజూరు చేస్తుందని దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని, ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాలు వెనుకబడి పోయి అంధకారం తలపించిన, స్వరాష్ట్రం సాధించిన తర్వాత బంగారు తెలంగాణ ధ్యేయంగా కేసీఆర్ పాలనలో ముందుకు సాగుతున్నదని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, జెడ్పిటిసి శ్యామల, ఎంపీపీ కీర్తి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...