34.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

పేద దళిత పాస్టర్లను ఆదుకుంటాం: ఎమ్మెల్యే సతీష్

పేద దళిత పాస్టర్లను ఆదుకుంటాం: ఎమ్మెల్యే సతీష్

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

పేద క్రైస్తవ దళిత పాస్టర్లకు దళిత బంధు ఇప్పించేందుకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే సతీష్ అన్నారు.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో సోమవారం ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గోని మాట్లాడుతూ క్రైస్తవ సోదరులు ఏకతాటిపై ఉండాలని, నియోజకవర్గంలో క్రైస్తవ చర్చిల నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుమతులు మంజూరు అయేవిదంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా క్రైస్తవ సమాధుల కోసం 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో క్రైస్తవుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని, నియోజకవర్గంలోని పాస్టర్లకు ఎటువంటి సమస్యలు ఉన్న నేరుగా తన దృష్టికి తీసుకురావాలని నూతనంగా ఏర్పడ్డ హుస్నాబాద్ నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు..

అంబులెన్స్ హామీ మరిచిన ఆరోగ్య మంత్రి.!

అంబులెన్స్ హామీ మరిచిన ఆరోగ్య మంత్రి.!

  • -బిజెపి మండల శాఖ అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

హుస్నాబాద్ నియోజకవర్గ కోహెడ మండలంలో అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడాల్సిన 108 అంబులెన్స్ సేవలు ఏప్పుడు అందుతాయని బిజెపి మండల శాఖ అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థానిక ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సొంత జిల్లాలోనే ఆరోగ్య శాఖ పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో ఎలా ఉంటుందని అన్నారు. బిజెపి పార్టీ నేతృత్వంలో గత సంవత్సర కాలం నుండి కోహెడ మండల కేంద్రంలో 108 అంబులెన్స్ అవసరమని మంత్రి, ప్రభుత్వం దృష్టికి చాలాసార్లు తీసుకెళ్లిన ఎలాంటి స్పందనలేదని, అంబులెన్స్ కావాలని స్వలాభాన్ని ఆశించకుండా ప్రజల కోసం మండలంలోని అన్ని పార్టీల యువకులు ఆదివారం కోహెడ మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ధర్నా నిర్వహించగా అధికార బలంతో ఎమ్మెల్యే సతీష్ బాబుకు వారిపై కేసులు నమోదు చేయించడం ఏంటని ఆయన అన్నారు.. గతంలో కోహెడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు త్వరలో కోహెడకు అంబులెన్స్ ను మంజూరు చేపిస్తానని హామీ ఇచ్చి కొన్ని నెలలు గడుస్తున్నా ఇంతవరకు హామీ నెరవేర్చ లేదని మంత్రి ఇచ్చిన హామీ మరిచారా అని ఎద్దేవా చేశారు.. ఇప్పటికైనా మంత్రి హరీష్ రావు కలగజేసుకొని కోహెడ మండలానికి 108 అంబులెన్స్ మంజూరు చేయాలని, ధర్నా చేసిన యువకులపై పెట్టిన కేసులను బేషరతుగా తొలగించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టేందుకు బిజెపి వెనుకాడబోదని తెలిపారు. ఈ సమావేశంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శులు పెళ్లి నరసయ్య గౌడ్ జలిగం రమేష్ గుగ్గిల శ్రీనివాస్ బండ జగన్ కంది సత్యనారాయణ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు..

ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా.. నేస్తం సొసైటీ.

ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా.. నేస్తం సొసైటీ.

-మృతురాలు సోయం పోషవ్వ కుటుంబసభ్యులను పరామర్శించిన నేస్తం సొసైటీ సభ్యులు..

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

సిద్దిపేట జిల్లా,హుస్నాబాద్ మండలం, కూచన పల్లి గ్రామానికి చెందిన సోయం పోషవ్వ అనారోగ్యంతో కొద్దిరోజుల క్రితం మరణించారు.ఆదివారం నేస్తం సోషల్ సర్వీస్ సొసైటీ సభ్యులు సోయం పోషవ్వ కుటుంబాన్ని పరామర్శించారు. సొసైటీ అడ్వైజర్, జర్నలిస్టు మడప రాజిరెడ్డి సొసైటీ తరఫున 50 కిలోల బియ్యాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో నేస్తం సోషల్ సర్వీస్ సొసైటీ కార్యదర్శి బండి వంశీ,కోశాధికారి కార్తీక్, సభ్యులు నమిలికొండ శ్రవణ్, అఖిల్ ఇతర సభ్యులు పాల్గొన్నారు..

11వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు..

11వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు..

నిజామాబాద్ యదార్ధవాది

తెలంగాణ విద్యార్థి పరిషత్ 11వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థి పరిషత్ నాయకులు,కార్యకర్తలు, విద్యార్థులు ఆదివారం నగరంలోని అమరవీరుల స్థూపం వద్ద జిల్లా అధ్యక్షుడు చేతుల మీదుగా సంస్థ పతాకాన్ని ఆవిష్కరించి. మిఠాయి పంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థి పరిషత్ ఉద్యమాలలో పురుడోసుకొని విద్యార్థి ఉద్యమాలే దేయంగ ముందుకు వెళ్తున్న సంస్థ అని తెలంగాణ విద్యార్థి పరిషత్ లో కార్యకర్త,జిల్లా నాయకుడిగా పనిచేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం అక్కడినుండి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి రక్త ధన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్త దాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు సజ్జనం భానుచందర్ కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలతో పాటు రక్తదానం చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ 2012 జూలై 30 వ తేదీన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం స్వప్నాన్ని నెరవేర్చుకోవడానికి ఏర్పడిన సంస్థ ఆనాటి ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగసి ఉద్యమించిన సంస్థ పార్లమెంట్ ముట్టడి, అసెంబ్లీ ముట్టడితో సమైక్య వాదుల,తెలంగాణ ద్రోహుల పిచం అనిచిన సంస్థ ఈ తెలంగాణ విద్యార్థి పరిషత్ అని కొనియాడారు, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ విద్య, నిరుద్యోగం పై బలమైన గళం వినిపించి ఉద్యమించిన సంస్థ రాష్ట్ర సాధన స్వప్నాన్ని నెరవేర్చుకునే వరకు విశ్రమించలేదని అదేవిధంగా రాష్ట్రం సిద్ధించిన తర్వాత స్వారాష్ట్రంలో విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడంపై సగటు విద్యార్థి సంక్షేమంపై మరియు సాంఘిక సంక్షేమ హాస్టల్లో సమస్యలపై ఉద్యమిస్తు అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ కుల మత రాజకీయాలకు దూరంగా ఉంటూ ఏ రాజకీయ పార్టీకి అంటకాగకుండా కేవలం విద్యారంగ అభివృద్ధియే సంస్థ యేజెండ మార్చుకొని పోరాడుతున్న సంస్థని ఇక ముందు కూడా ఇదే విధంగా తెలంగాణ విద్యార్థుల కోసం విద్యారంగం కోసం నిరంతర ఉద్యమాలు చేస్తూ ముందుకు వెళ్తుందని తెలియజేశారు. రక్తదాన శిబిరంలో 15 మంది రక్త దానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు అఖిల్, కామారెడ్డి జిల్లా ఇన్చార్జ్ అనిరుద్రాజ్, సాంఘిక సంక్షేమ హాస్టల్ ఇన్చార్జ్ ఎర్ర ప్రవీణ్, కార్యకర్తలు వినయ్,సాయి,గణేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు

ధనానికి ఇం”ధనం” కార్మికుడి చెమట చుక్కే: మంత్రి హరీష్

ధనానికి ఇం”ధనం” కార్మికుడి చెమట చుక్కే: మంత్రి హరీష్

-రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కార్మిక భవన్ మంజూర్.!

-కార్మికులకు లక్షన్నర నుండి రూ.3 లక్షలకు భీమా పెంపు.

-5లక్షల వరకూ ఆరోగ్య శ్రీ వైద్య సేవలు.

సిద్ధిపేట యదార్థవాది ప్రతినిది

ఏ ప్రగతికైనా మూల ఆధారం కార్మికుడే.. ప్రభుత్వం అయినా ప్రైవేట్ అయినా నడిచేది కార్మికుడి కష్టం మీదే.. సంపాదించే ధనానికి ఇం”ధనం” కార్మికుడి చెమట చుక్కేనని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ అన్నారు..జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కొండా భూదేవి గార్డెన్ లో ఆదివారం జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం అధ్యక్షతన, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికుల బహిరంగ సభలో మంత్రి హాజరై మాట్లాడుతూ ప్రతీ భవన నిర్మాణ కార్మికుడు కార్డు కలిగి ఉండాలని, అందుకు అవసరమైన డబ్బులు తానే వెచ్చిస్తున్నట్లు, కార్డు ఉంటేనే మీరు లబ్ధి పొందే అవకాశం ఉన్నదని, ప్రతి కార్మికులు రిజిస్ట్రేషన్ చేయించుకుని కార్డు పొందాలని, ఇందు కోసం క్యాంపు కార్యాలయంలో కౌంటర్ ఏర్పాటు చేసినట్లు, అవసరమైతే మీ అనువైన సమయం అమావాస్య రోజున ఐదు కౌంటర్లు ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవాలని కుటుంబం బరువు బాధ్యత మీపై ఆధారపడి ఉన్న సంగతి మరువొద్దని, నిత్యం శ్రమించి రాత్రిపూట దూపకు అలవాటు కావొద్దని, తక్కువ చేస్తూ మీ ఆరోగ్యం కాపాడుకోవాలని కార్మికులకు మంత్రి ఆరోగ్య సూత్రాలు తెలిపారు.. రైతుభీమా తరహాలో కార్మిక భీమా చేయాలని నిర్ణయించినట్లు మంత్రి ప్రకటించారు. డిజిటల్ కార్డుల రూపకల్పనకు స్పెషల్ డ్రైవ్ చేపడుతామని తెలిపారు. ఈ మేరకు అప్పటికప్పుడే కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, కమిషనర్ రాణి కౌముదితో చర్చించారు. మార్గదర్శకాలకు అనుగుణంగా ఓ ఏజెన్సీ ద్వారా సభ్యత్వం పొందిన కార్మికుడి వేలిముద్ర సేకరించి, నామిని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందని, దాంతో సమగ్రమైన సమాచారం కలిగి ఉండటంతో అర్హులైన మీకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ ఫలం అందుతుందని అవగాహన కల్పించారు. ఒక్కసారి డిజిటల్ కార్డు చేసుకుంటే ఐదేళ్ల వరకే పరిమితం అయిందని, తిరిగి రెన్యూవల్ బాధలకు మీరు పడుతున్న బాధలు గుర్తించి ఇప్పుడు ప్రభుత్వం పదేళ్లకు పెంచిందని ఇది వరకూ లక్షన్నర ఉన్న భవన నిర్మాణ కార్మికుడి భీమా ఇక నుంచి రూ.3 లక్షలకు పెంపునకు సీఎం కేసీఆర్ చర్చించి కృషి చేస్తానని మంత్రి హరీశ్ హామీనిచ్చారు.. ఇటీవల కార్మిక-ఆరోగ్య శాఖ కార్మికుడి వైద్య సేవలపై చర్చించి ఒప్పందం కుదుర్చుకుందని, రూ.5లక్షల వరకూ ఉచితంగా ఆరోగ్య శ్రీ వైద్య సేవలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వర్తించేలా చర్యలు ఉంటాయని మంత్రి హరీశ్ వెల్లడించారు. అలాగే క్యాన్సర్, గుండె చికిత్సలకు రూ.10 లక్షల వరకూ ఆరోగ్య భీమా వర్తించేలా ఈ ఆగస్టు నెల నుంచి అమలు కాబోతున్నదని తెలిపారు. సిద్ధిపేట శివారు మందపల్లిలో కార్మిక భవన్ నిర్మాణం కోసం ఎకరం స్థలాన్ని కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. సిద్ధిపేటలో ఎల్అండ్ టీ, సెట్విన్, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా శిక్షణ కేంద్రం, న్యాక్ శిక్షణ కేంద్రాలు ఉన్నాయని, వాటి ద్వారా మీలో నైపుణ్యాలను పెంచుకోవచ్చునని, ఆయా శిక్షణ కేంద్రాల్లో వెళ్లేలా మీ పిల్లలను ప్రోత్సహించాలని, ఆ శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.. సిద్ధిపేటలో జరిగిన భవన నిర్మాణ కార్మికుల బహిరంగ సభలో ఆసక్తికరంగా ఫోను లైనులో కార్మిక మంత్రి మల్లారెడ్డి, ఆరోగ్య మంత్రి హరీశ్ సంభాషణ జరిపారు. ఈ మేరకు కార్మికులను ఉద్దేశించి కష్టపడ్డ, పాలు అమ్మిన, పూలు అమ్మిన, ఎమ్మెల్యేగా, మీ కార్మిక మంత్రిగా ఇవాళ మీతో మాట్లాడుతున్నానని సభలో కార్మికులందరినీ ఉత్సాహపరిచారు.. మంత్రి హరీశ్ కోరిక మేరకు సిద్ధిపేట జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కార్మిక భవన్ మంజూర్ చేస్తానని తెలిపారు.

పేదల అభ్యున్నతి లయన్స్ క్లబ్ సేవలు..

పేదల అభ్యున్నతి లయన్స్ క్లబ్ సేవలు..

-విద్య, వైద్య రంగాల్లో లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం

-జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మ

సిద్ధిపేట యదార్థవాది ప్రతినిది

పేదల అభ్యున్నతి లయన్స్ క్లబ్ సేవలు వివిధ రంగాల్లో చేపట్టిన సేవలు అభినందనీయమని పరిషత్ చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మ అన్నారు..ఆదివారం లయన్స్ భవన్ లో 2023-24  సంవత్సరానికి నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్య, వైద్యం, సామాజిక సేవ తదితర రంగాల్లో లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు దర్శినీయని, సిద్దిపేట లయన్స్ క్లబ్ కు మహిళా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం శుభసూచకమని, ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు లయన్స్ క్లబ్ వారు  నోట్ బుక్స్, స్పోర్ట్స్ డ్రెస్ లు, గ్లాసులు, ప్లేట్లు పంపిణీ చేస్తూ వారికి చేయూతను అందించడం గొప్ప విషయమని అన్నారు. మారు గ్రామాల్లో సైతం ఆరోగ్య శిబిరాల ద్వారా పేదలకు వైద్య సేవలు అందించి సహయం చేస్తున్నారని లయన్స్ క్లబ్ నూతనంగా ఏర్పాటు చేసిన  స్మైల్ ప్రోగ్రాం ద్వారా ఎన్ఆర్ఐల ద్వార సేకరించిన డాలర్స్ తో ప్రభుత్వ పాఠశాలల్లో సేవా కార్యక్రమాలు చేపట్టడం హర్ష నియమన్నారు. లయన్స్ క్లబ్బులతో పాటు మరి కొంతమంది దాతలను చైతన్యపరిచి సమాజ హితం కోసం సేవా కార్యక్రమాలను విస్తరించాలని కోరారు. లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. మంత్రి హరీష్ రావు కూడా సేవా కార్యక్రమాలను చేసే వారికి నిరంతర సహాయ సహకారాలు అందిస్తారన్నారు. సిద్దిపేట లయన్స్ స్మైల్ ప్రోగ్రాం ద్వారా చిన్నకోడూరు మండలం రామంచ ప్రాథమిక పాఠశాల 165 మంది విద్యార్థులకు 75 వేల విలువైన స్పోర్ట్స్ డ్రెస్సులను, ములుగు ఉన్నత పాఠశాల 400 మంది విద్యార్థులకు పదివేల విలువ గల అంబలి త్రాగడానికి గ్లాసులను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రోజా శర్మ చేతుల మీదుగా అందించారు. సిద్దిపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా జ్యోతి, ప్రధాన కార్యదర్శిగా నిర్మల రాణి, కోశాధికారిగా సుధ, క్లబ్ కమిటీలచే ఫాస్ట్ డిస్టిక్ట్ గవర్నర్ సూర్యారాజ్ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో డిప్యూటీ గవర్నర్ -2 అమర్నాథరావు, లైన్స్ క్లబ్ ప్రతినిధులు మరియు ప్రవీణ్, పద్మావతి,రాధాకృష్ణ, డాక్టర్ శ్రీనివాస్, శ్రీధర్, సుజాత, గంప రమేశ్, వినోద్ మోదాని, రవీందర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు…

మా గ్రామాన్ని విలీనం చేయవద్దు.

మా గ్రామాన్ని విలీనం చేయవద్దు.

-తప్పుడు అంగికరపత్రంతో కలెక్టర్ కు నివేదిక..

-గ్రామ పంచయతీ తీర్మానం లేకుండా విలీనం చేయవద్దు..

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో
విలీనం చేయవద్దని పెద్ద ఎత్తున ధర్నా చేపటట్టిన సర్పంచ్ బత్తిని సాయిలు..సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పోతారం (ఎస్) గ్రామాన్ని హుస్నాబాద్ మున్సిపాలిటీలో కల్పవద్దని డిమాండ్ చేస్తూ గ్రామ సర్పంచ్, గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్ మున్సిపాలిటీలో తమ గ్రామాన్ని విలీనం చేయొద్దని సంవత్సర కాలంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు విన్నవిస్తున్న తమ అంగీకారం లేకున్నా గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపడానికి తాము అంగీకరించినట్లు కలెక్టర్ కు తప్పుడు ప్రతిపాదనలు పంపించరని అన్నారు. తమ గ్రామంలో 50 శాతం మంది భూమిలేని నిరుపేదలు ఉన్నారని, 600 కు పైగా ఉపాధి హామీ కూలీ పనులు
చేసుకుంటున్నారని మున్సిపాలిటీలో కలిపితే ఇంటి పన్ను, నల్ల పన్నులు పెరిగి గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విలీన ప్రక్రియను విరమించుకోవాలని తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలిపే ఆలోచనలు ఎమ్మెల్యే సతీష్ బాబు సహృదయంతో విరమించుకోవాలని అన్నారు. ఈ ధర్నాలో ఎంపీటీసీ పోరం అధ్యక్షుడు బొమ్మగాని శ్రీనివాస్, దొంతర వేణి శ్రీనివాస్, ఆలేటి ఈశ్వర్ రెడ్డి, బత్తిని లక్ష్మి, గీకూరు నాగరాజు, సరిత, రవి, కవిత, ఎల్లయ్య, లలిత, శ్రీనివాస్, రాములు, మణెమ్మ, మోహన్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు..

30న సిద్దిపేట జిల్లా శాలివాహన (కుమ్మర) కార్యవర్గ ఎన్నికలు..

రేపు సిద్దిపేట జిల్లా శాలివాహన (కుమ్మర) కార్యవర్గ ఎన్నికలు..

-నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు

-పలు అంశాలపై చర్చ..తీర్మానాలు..

సిద్ధిపేట యదార్థవాది ప్రతినిది

ఈనెల 30 ఆదివారం సిద్దిపేట జిల్లా శాలివాహన (కుమ్మర్ల) సంఘానికి నూతన కార్యవర్గ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కార్యవర్గ అడక్ కమిటీ నాయకులు జయంతి రావు ఆధ్వర్యంలో శాలివాహన జిల్లా నూతన బాడీ ఎన్నిక జరుగునని న్యాయవాది వరుకోలు రాజలింగం తెలిపారు.. కుమ్మర కుల బంధువులు మేధావులు, జిల్లాస్థాయి కమిటీ సభ్యులు మండల కమిటీ బాధ్యులు పాల్గొనాలని తెలిపారు.. సిద్దిపేట నీలిమ గార్డెన్ లో ఉదయం 10 గంటలకు జరిగే ఎన్నికలల్లో సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని ఎన్నికలను విజయవంతం చేయాలని కోరారు.. జిల్లాకు సంబంధించిన కుమ్మరుల అభివృద్ధికై చర్చావేదికలో పాల్గొనాలని సూచించారు..

  1. కుమ్మర్ల అభివృద్ధి..
  2. రానున్న ఎలక్షన్లలో కుమ్మరులకు ప్రయోజనం..
  3. మంత్రి తన్నీరు హరీష్ రావు కుమ్మర్లకు కేటాయించిన పైలెట్ ప్రాజెక్టు..
  4. సంఘానికి కేటాయించిన రెండు ఎకరాలను ఏవిధంగా అభివృద్ధిపై..
  5. శంకర్ నగర్ లోని శాలివాహనులకు కేటాయించిన 200 గజాల అభివృద్ధిపై..
  6. మండలాల కమిటీలు ఏర్పాటుకై..
  7. ప్రతి గ్రామంలో తొలి బోనం..
  8. చేతివృత్తుల మిషనరీల కోసం ప్రభుత్వానికి నివేదిక..
  9. కుమ్మరి వృత్తికి అవసరమైన
    మట్టికి ఎదురవుతున్న ఇబ్బందులను
    ప్రభుత్వ దృష్టికి..
  10. ప్రతి మండల్ కేంద్రంలో కుమ్మర భవన నిర్మాణం కోసం..
  11. సిద్దిపేట జిల్లా స్థాయి శాలివాహన కుమ్మర్ల నూతన కమిటీ ఏర్పాటు..

వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి చెందిన ఘటన కలిచివేసింది.

వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి చెందిన ఘటన కలిచివేసింది.

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో శుక్రవారం వాగులో కొట్టుకుపోయి మరణించిన ఏడెల్లి రాజయ్య భౌతిక కాయాన్ని శనివారం పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవాబుపేట గ్రామంలో నిన్న వాగులో వ్యక్తి గల్లంతయిన విషయం తెలుసుకొని హుటాహుటిన అధికారులు, ప్రజాప్రతినిధులు సహాయక చర్యలు చేపట్టారు, ఎమ్మెల్యే కూడా స్వయంగా వెళ్లి పరిశీలించారు.. అయినా ఫలితం లేకపోయిందని ఆ దుర్ఘటనలో రాజయ్య మృతి చెందడం బాధాకరమని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం హుస్నాబాద్ పట్టణంలో కొమ్మరి శ్రీరామ్ రెడ్డి ఇటీవల మృతి చెందిగా వారి కుటుంబసభ్యులను హుస్నాబాద్ మండలం రాములపల్లి గ్రామంలో సర్పంచ్ మధు రెడ్డి తల్లి గంగం వెంకట నర్సవ్వ ఇటీవల మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరితో పాటుగా బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు, సిద్దిపేట జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి, అక్కన్నపేట జడ్పిటిసి భూక్యమంగ, అక్కన్నపేట ఎంపీపీ మాలోతు లక్ష్మి, మాజీ జెడ్పిటిసి బీలు నాయక్, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఎడబోయిన తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి, చిగురుమామిడి మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, రైతు స స అధ్యక్షులు పెనుకుల తిరుపతి, నవాబుపేట సర్పంచ్ సుద్దాల ప్రవీణ్, ఎంపీటీసీ మంకు స్వప్న తదితరులు పాల్గొన్నారు.

ప్రకృతి వైపరీత్యాలతో జాగ్రత్త ఉండాలి.

ప్రకృతి వైపరీత్యాలతో జాగ్రత్త ఉండాలి.

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

హుస్నాబాద్ నియోజకవర్గంలో కన్నారం గ్రామంలో వాగులో కొట్టుకుపోయి మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులను కట్కూరు గ్రామంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్.. అక్కన్నపేట మండలం కన్నారం గ్రామంలో గత నాలుగు రోజుల క్రితం చెరువు మత్తడి వాగులో కొట్టుకుపోయి మృతి చెందిన పొన్నాల మహేందర్ కుటుంబాన్ని శనివారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహేందర్ మృతి చాలా బాధాకరమని, అతని అన్న, తండ్రి గతంలో మరణించారని అతని తల్లి మాత్రమే ఉన్నారని ఒక్కగానొక్క కొడుకు ఆ తల్లికి ఆసరాగా నిలుస్తాడ అనుకుంటే ఈ విధంగా జరగడం బాధాకరమని, గత 50 సంవత్సరాలలో ఇంతటి భారీ వర్షాలు ఎప్పుడూ కురవలేదని రాష్ట్రవ్యాప్తంగా వాగులు వంకలు చెరువులు నుండి మత్తల్లు పారుతున్నందున ప్రజలందరూ గమనించి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు స్వీయ నియంత్రణ పాటించాలని చిన్న అజాగ్రత్త వారి కుటుంబానికి గర్భశోకాన్ని మిగులుస్తుందని తెలిపారు. అలాగే హుస్నాబాద్ నియోజకవర్గం లో దాదాపు 700 పైచీలుకు చెరువులు కుంటలు అన్నీ నిండి నిండుకుండలా ఉన్నాయని ఎక్కడ ఎలాంటి నష్టం జరగలేదని దేవుని దయ వల్ల వర్షాలు తగ్గుముఖంపడ్డాయని అనంతరం కట్కూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బడుగు రామచంద్రయ్య తల్లి ఈశ్వరమ్మ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను గ్రామానికి చెందిన నారాయణరెడ్డి తల్లి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...