34.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

బిక్షటన చేసిన కార్మికులు

బిక్షటన చేసిన కార్మికులు

కోహెడ మేజర్ న్యూస్:

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

కోహెడ మండల కేంద్రంలోని దుకాణ సముదాయాల వద్ద గ్రామ పంచాయతీ కార్మికులు శనివారం భిక్షాటన చేశారు.. గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ పంచాయతీ కార్మికులకు జీఓ నెం.60 ప్రకారం వేతనాల పెంపు మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దుచేసి, కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని, గ్రామాల్లోని ప్రజలకు అనారోగ్యానికి గురికాకుండా ఎల్లవేళలా పారిశుద్ధ్యం ను ప్రలాదోవి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా కష్టపడి పనిచేసే గ్రామ పంచాయతీ కార్మికులకు పర్మనెంట్ పంచాయతీ కార్మికులుగా గుర్తించాలి జీఓ నెం 51 ని సవరించాలి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి పి.ఆర్.సి.లో నిర్ణయించిన మినిమమ్ బేసికిను 19000/-వేల వేతనాన్ని పెంచాలి. జీఓ నెం 60 ప్రకారం స్వీపర్లకు,పంపు ఆపరేటర్ల,ఎలక్ట్రిషియన్లకు,డ్రైవర్లకు,వేతనాలు పెంచాలి కారోబర్ లకు,బిల్ కలెక్టర్ లకు, సహాయ కార్యదర్శులుగా నియమించాలి.పి.ఎఫ్.ఈ.ఎస్.ఐ ప్రమాధభీమా గ్రాట్యుటి గుర్తింపు కార్డులు ఇవ్వాలి.వయస్సు మీరిందనే సాకుతో కార్మికులను మార్చితే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో మెట్టు వెంకటరెడ్డి, తలారి అనిల్,ఆకుబత్తిని రాజమౌళి,పోచయ్య,మూటం సంపత్ 27 గ్రామాల పంచాయతీ కార్మికులు,మండల సంఘం కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు..

నూతన ఏసీపీ, సర్కిల్ భవన నిర్మాణనికి శంకుస్థాపన చేసిన: మంత్రులు

భవన ఏసీపీ, సర్కిల్ నూతన నిర్మాణనికి శంకుస్థాపన చేసిన: మంత్రులు

సిద్దిపేట యదార్థవాది

సిద్ధిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ లో ఏసీపీ, గౌరారంలో సర్కిల్ కార్యాలయ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో కలిసి శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి హరీశ్ రావు .. అనంతరం ఫ్లడ్ లైట్లను ప్రారంభించారు..ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సిద్ధిపేట పోలీసు కమిషనర్ శ్వేత, అడిషనల్ డీసీపీ మహేందర్, పోలీసు శాఖ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..

స్వాతంత్ర్య దినోత్సవ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం..

స్వాతంత్ర్య దినోత్సవ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం..

-తెలుగు ప్రతిభావంతులకు ప్రధానోత్సవం

-వేదిక హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ

హైద్రాబాద్ యదార్థవాది ప్రతినిది

తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రతిభావంతులకు ప్రతి సంవత్సరం ప్రదానం చేసే పురస్కారాలకు ప్రముఖ సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ అర్పిత దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డా.గణగళ్ళ విజయ్ కుమార్ తెలిపారు.. విద్య, వైద్యం, విధి నిర్వహణ, సమాజ సేవ, నృత్యం, కళ, క్రీడ, సాహిత్యం, చిత్రలేఖనం, పర్యావరణ పరిరక్షణ, శాస్త్రీయ సంగీతం (నాదస్వరం, డోలు, సాక్సోఫోన్, గాత్రం) ఆధ్యాత్మికం, ఉపాధి కల్పన తదితర రంగాల్లో ప్రతిభ గల వ్యక్తులు, చిన్నారులు అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జరిగే ఎంపిక ప్రక్రియలో భాగంగా రాష్ట్ర స్థాయి ‘ఆంధ్ర రత్న’ ‘తెలంగాణ రత్న’ ‘ స్టేట్ బెస్ట్ సిటిజన్ ‘ అవార్డులతో పాటు, ఇద్దరు అత్యుత్తమ ఉపాధ్యాయులకు ‘డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్’ ఇతర రంగాల్లో సేవలందించిన పదిమందికి ‘నేషనల్ బెస్ట్ సిటిజన్’ మరియు ‘ లైఫ్ టైం అచీవ్ మెంట్ ‘ అవార్డులను అందజేయనురని, అంతేకాకుండా, అభ్యర్థుల కేటగిరీల వారీగా ‘కళాబంధు’, ఎన్టీఆర్ స్మారక ‘కళా విభూషణ్’ డాక్టర్ సీ.నా.రే స్మారక ‘సాహిత్య కళానిధి’, ప్రముఖ నృత్య కళాకారులకు ‘సిద్ధేంద్రయోగి నాట్య కళా విశారద’ జాతీయ అవార్డులతో పాటు ఏదైనా మూడు రంగాల్లో విశేష ప్రతిభ గల ఇద్దరికి భారతదేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ” భారత ప్రతిభా రత్న ” ప్రతిష్ఠాత్మక పురస్కారం అందజేయనున్నామని వివరించారు. ఆసక్తి, ప్రతిభ ఉన్నవారు తమ దరఖాస్తులను 7780589775 వాట్సాప్ నెంబర్ కు ఆగష్టు 7వ తేదీ లోగా పంపుకోవాలన్నారు. ఎంపికైన వారికి ఆగస్టు 28వ తేదీన హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో అవార్డులను సినీ, రాజకీయ, అధికార ప్రముఖుల చేతుల మీదుగా ప్రధానం చేయనున్నామని డా.గణగళ్ళ విజయ్ కుమార్ వివరించారు.

మీ సేవలో జిల్లా పోలీస్ యంత్రాంగం

మీ సేవలో జిల్లా పోలీస్ యంత్రాంగం

-భారీ వర్షంలోను ప్రజా రక్షణే ప్రథమ లక్ష్యంగా ఖాకీల సేవలు.

-వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ఖాకీలు.

సిరిసిల్ల యదార్థవాది

భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, ప్రజా రక్షణే ప్రథమ లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం పనిచేసింది..
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నీటిలో చిక్కుకున్న 80 కుటుంబాలు, సిరిసిల్ల పట్టణంలో 60 మందిని, జిల్లాలోని మండలాల్లో సుమారు 140 మందిని, గర్భిణి మహిళలను, వృద్దులను వివిధ శాఖల సమన్వయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు జిల్లాలోని పోలీస్ యంత్రాంగం గురువారం ప్రజా రక్షణ ద్యేయంగా ప్రజలకు అందుబాటులో ఉండి, క్షేత్ర స్థాయిలో ప్రమాదకరంగా ఉన్న చెరువులు, వాగులు, రహదారుల వద్ద సిబ్బందితో పాటు బారికేడింగ్ ఏర్పాటు చేశారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్ల నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, పంచాయితీ శాఖలతో సమన్వయం చేసుకుంటూ రక్షణ చర్యలు కొనసాగిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం 24/7 అందుబాటులో ఉంటుందని ఎవరికి ఎలాంటి ఆపద వచ్చిన డయల్100 కి లేదా మీ దగ్గర్లో ఉన్న పోలీస్ వారికి సమాచారం అందిస్తే తక్షణ సహాయక చర్యలు చేప్పట్టడం జరుగుతుందని ప్రజలు పోలీస్ వారి సూచనలు పాటిస్తూ ఆప్రాంతంగా ఉండాలన్నారు..

పునరావాస కేంద్రాలలో 1065 మందికి ఆశ్రయం.

పునరావాస కేంద్రాలలో 1065 మందికి ఆశ్రయం.

జగిత్యాల యదార్థవాది

జగిత్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రజలను అప్రమత్తం చేస్తూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, సహాయ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నమని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా పత్రిక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోనీ 1069 చెరువులకు గాను వర్షాల వలన 864 చెరువులు పొంగి పొర్లతున్నాయనీ, రెండు చెరువులు దెబ్బతిన్నాయని ఇప్పటివరకు ఒక ఇళ్ళు పూర్తిగా, 94 పాక్షికంగా దెబ్బతన్నాయనీ, మూడు
రోడ్లు భవనాలు శాఖ కల్వర్టులు దెబ్బతిన్నాయని తెలిపారు. జిల్లాలో
సహాయ పునరావాస కేంద్రాలు జగిత్యాల పట్టణ మండలంలో దేవశ్రీ గార్డెన్స్, పొన్నాల గార్డెన్స్, క్వాలిగడ్డ ముస్లిం కమ్యూనిటీ, రాయికల్ మండల కేంద్రం లోని ZPHS బాలుర పాఠశాల, గొల్ల పల్లి మండలంలోని బొంకూర్ యాదవ కమ్యూనిటీ, వేనుగు మట్ల గ్రామంలోని రైతు వేదిక, ఇబ్రహీం నగర్ గ్రామంలోని ZPHS పాఠశాల, మెట్ పల్లి మండల కేంద్రం లోని కీర్తి ఫంక్షన్ హాల్, ఆత్మకూరు ZPHS, మల్లా పూర్ లోని ZPHS లలో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు 7 పునరావాస కేంద్రాలలో 1065 మందికి ఆశ్రయం కల్పించి భోజనం, త్రాగునీరు, చద్దర్లుతో పాటు వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని వర్షాల వలన ఎప్పటికప్పుడు సమాచారం కోసం గానీ, సేవలకు గాను 12 ఫోన్ కాల్స్ కంట్రోల్ రూం కు రావడం జరిగింది తక్షణ సహాయం, సమాచారం అందించామని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు సేవలందించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో సహకారం అందిస్తున్నామని తెలిపారు. అత్యవసర సేవలకు కంట్రోల్ రూం నెంబర్ 08724 222557 కు కాల్ చేసి తెలియజేయవచ్చని కలెక్టర్ ప్రకటనలో తెలిపారు.

అధికార యంత్రాంగంతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహింహిన: మంత్రి హరీష్

ఉమ్మడి మెదక్ జిల్లా అధికార యంత్రాంగంతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహింహిన: మంత్రి హరీష్

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది

ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అత్యవసర, అవసరమైన ఆదేశాల జారీ చేస్తున్నారని, వాటిని అనుసరిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని మంత్రి హరీశ్ రావు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు.. గురువారం జిల్లాల వారీగా పరిస్థితులపై ప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుసగా కురుస్తున్న వర్షాల వలన రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, వాగులు వంకలు అన్ని పూర్తిగా నిండి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రాజెక్టులు, చెరువులు పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలించాలని మంత్రి సూచించారు. వరద, వర్షం నీటికి రహదార్లు చెడిపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందని, అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఉమ్మడి జిల్లాలోని పట్టణాల్లో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వాటర్ ఫ్లోతో ఇబ్బంది ఉండకుండా చూసుకోవాలని, నిరంతర వానలకు గోడలు బాగా తడిచి ఉంటాయని, శిథిలావస్థలో ఉన్న ఇళ్ల నుంచి ప్రజల్ని తరలించి తాత్కాలిక క్యాంపులు, రిహాబిలిటేషన్- పునరావాస చర్యలు ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగంకు మంత్రి ఆదేశించారు.. చెరువులు నిండి ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు నిత్యం పర్యవేక్షించాలని, మత్స్యకారులను వెళ్లకుండా చూడాలని, మెదక్ జిల్లా పాపన్నపేట ఏడుపాయల వద్ద వరద ఉధృతి పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా మానిటరింగ్ చేయాలని తెలిపారు. మెదక్ 157, సిద్ధిపేట 257, సంగారెడ్డి 227 ఇల్లు పాక్షికంగా కూలిన నేపథ్యంలో వారికి అండగా నిలవాలని ప్రభుత్వం తరుపున ఆర్థిక సాయం అందించాలని ఆయా జిల్లా కలెక్టర్లకు మంత్రి ఆదేశించారు. సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో ఉంటూ, ఎప్పటికప్పుడు పరిస్థితులు తెల్సుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. సిద్ధిపేటలో 660 చెరువులు పూర్తిగా నిండిన నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని అన్నారు. కేసీఆర్ కిట్ సమాచారం ఆధారంగా డెలివరీ అయ్యే గర్భిణీల వివరాలు ముందుగా తెలుసుకొని వారి ఆరోగ్యాలు పర్యవేక్షించాని, 3,4 రోజుల ముందుగానే అడ్మిట్ చేసుకోవాలని తెలిపారు. అన్నపూర్ణ, తోటపల్లి, రంగనాయక సాగర్ తదితర ఉమ్మడి జిల్లాలో ఉన్న రిజర్వాయర్ల పరిస్థితులపై ఎప్పటికప్పుడు పరిరక్షించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రాత్రివేళ వర్షం ఎక్కువ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో, అందరూ అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి ప్రాణాష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు..

వాగులోకి ఎవరు వెళ్ళద్దు.

వాగులోకి ఎవరు వెళ్ళద్దు.

  • మత్స్యకారులు చేపలు పట్టేందుకు వెళ్లొద్దు.
  • జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

హుస్నాబాద్ యదార్థవాది

సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని బస్వాపూర్ వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.. వరద ప్రవాహాన్ని తిలకించేందుకు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో రావడంతో జిల్లా కలెక్టర్ స్వయంగా వాగు ప్రమాదంగా ప్రవహిస్తున్నందున ప్రజలెవరు రావద్దని ప్రజలను ఇండ్లకు పంపించారు.. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాట్లాడుతూ కొండపాక, కొమరవెల్లి మండలాల మీదుగా అధిక నీటితో బస్సాపూర్ వాగు ఉదృతంగా ప్రవహిస్తుందని, వాగు ఇంకా రెండు, మూడు రోజుల వరకు ఇదే ఉధృతి కొనసాగేలా ఉందని వాగు వద్దకు ప్రజలు రాకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని కోహెడ, రాజగోపాల్ పేట పోలీస్ లను ఆదేశించారు.. వర్షాలు తగ్గేవరకు రైతులు వ్యవసాయ పనులకు వెళ్ళదని సర్పంచులు, తాసిల్దార్లు ఎంపీడీవోలు ప్రజాప్రతినిధులు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

పట్టణంలో పునరావాస కేంద్రం ఏర్పాటు

పట్టణంలో పునరావాస కేంద్రం ఏర్పాటు

హుస్నాబాద్ యదార్థవాది

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హుస్నాబాద్ పట్టణంలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చైర్ పర్సన్ ఆకుల రజిత తెలిపారు.. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల
నేపథ్యంలో గురువారం హుస్నాబాద్ లోని ఎల్లమ్మ చెరువును మత్తడి, దుకాణదారుల నివాసాలను పట్టణంలోని వార్డులలో శిథిలమైన, కూలిపోయిన ఇండ్లను పరిశీలించారు.. భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని శిథిలమైన ఇండ్లలో నివాసం ఉండకుండా పురపాలక సంఘం హెల్ప్ లైన్ కు వివరాలు తెలుపాలని అన్నారు. హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ బాలుర పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐలేని అనిత, కమిషనర్ రాజశేఖర్, ఆకుల వెంకన్న మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు పురపాలక సంఘం సిబ్బందినాయకులు తదితరులు పాల్గొన్నారు..

జన హితమే-మా అభిమతం

జన హితమే-మా అభిమతం

బెజ్జంకి యదార్థవాది

బెజ్జంకి మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇళ్లు పాక్షికంగా ఇళ్లలోకి వర్షపు నీరు రాకుండా లింగాల లక్ష్మణ్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు లింగాల వెంకటేష్ అధ్వర్యంలో గురువారం పరదాలు అందచేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల దృష్ట్యా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో గ్రామంలోని రోడ్లు, జలమయమయ్యే అస్కరంవుందని, పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిని ఉన్నాయని, వారికి రక్షణగా తమ వంతుగా పరదాలు పంపిణీ చేయటం జరిగిందని, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించటం జరిగిందని, భారీ వర్షాల దృష్ట్యా పాటించాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో సభ్యులు బోనగిరి శ్రీనివాస్, లింగాల శ్రీనివాస్, రామంచ పర్షరాములు,బోనగిరి మధు, జంగిటి శంకర్,లింగాల శ్రీకాంత్,లింగాల రాజు, లింగాల దిలీప్, లింగాల జితేందర్,బోనగిరి అజయ్,పండుగ మధు తదితరులు పాల్గొన్నారు.

నీటి పారుదల శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది: ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్

నీటి పారుదల శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది: ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్

హైదరాబాద్ యదార్థవాది

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు… అత్యధిక వర్షపాతం ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో నీటి ప్రాజెక్టులకు వరద నీటి ప్రవాహం పెరుగుతుందని, రాష్ట్రంలో 19 టెరిటోరియల్ ప్రాంతాలలో చీఫ్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ ఆపరేషన్ బృందాలు పని చేస్తున్నాయని, ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నాయని ఆయన తెలిపారు. కడెం ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో ఉందని, ఉదయం తో పోలిస్తే ఇన్ ప్లో తగ్గిందని ప్రస్తుతం ఆ ప్రాజెక్టు వద్ద నీటి పారుదల శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ఎ.ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారని ఆయన తెలిపారు.. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని, భద్రాచలం పట్టణంలో వరద నీటి ప్రవాహం కట్టడి చేయడానికి భారీ మోటార్లుతో నీటిని తోడేస్తున్నామని, ఎలాంటి ప్రాణానష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. రెండు హెలికాప్టర్లు కూడా సిద్ధంగా ఉంచామని. పోలవరం గేట్లు ఎత్తి ఉంచాలని సంబంధిత ప్రాజెక్టు అధికారులతో నిరంతరం తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులు సంప్రదిస్తున్నారని, మిషన్ కాకతీయ ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా 46 వేల చెరువులు వర్షపాతంతో జలకళతో నిండి ఉన్నాయని, కేవలం 100 లోపు చెరువులకు మాత్రమే గండ్లు పడ్డాయి వాటిని పూడ్చుతున్నామని స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ తెలిపారు…

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...