36.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

ప్రాజెక్టు దిగువ ప్రాంతా ప్రజలు జాగ్రత్తలు ఉండాలి..

ప్రాజెక్టు దిగువ ప్రాంతా ప్రజలు జాగ్రత్తలు ఉండాలి..

నిజామాబాద్ యదార్ధవాది

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎగువ పరిహాక ప్రాంతాలైన ఉత్తర తెలంగాణ లో అతి భారీ వర్షాల సూచన కారణంగా శ్రీరామ్ సార్ ప్రాజెక్టు గేట్లు 8గేట్లు ఎత్తి 20000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు ఉన్న ప్రాంత ప్రజలను, ప్రాజెక్ట్ ఎస్ ఈ శ్రీనివాస్ రెడ్డి, అధికారులను, పోలీస్, రెవెన్యూ, ప్రజలను అప్రమత్తం చేశారు. పోలీస్ శాఖ అధికారులు తగు ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. ప్రాజెక్టు నుంచి గోదావరిలోకి వరద నీరు పోటెత్తడంతో పది నిమిషాలు క్రితం 8 గేట్లు ఎత్తి 20000 క్యూసెక్కుల దిగువకు వదిలారు. మత్స్యకారులు, గొర్రెల కాపరులు, రైతులు నది వైపు వెళ్ళవద్దని హెచ్చరించారు. నదీ పరివాహ ప్రాంతంలోకి పశువులు, గొర్రెలు వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు. ప్రాజెక్టు దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరడం జరిగింది.శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో జెన్కో లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిన జెన్ కో సి ఈ రమేష్ బాబు. ఎస్ ఈ శ్రీనివాస్..

భారీ వర్షంతో అప్రమత్తం అయిన పోలీస్ యంత్రంగం.

భారీ వర్షంతో అప్రమత్తం అయిన పోలీస్ యంత్రంగం.

సిరిసిల్ల యదార్థవాది

సిరిసిల్ల పట్టణంలో మున్సిపల్ పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులతో క్షేత్రస్థాయిలోకి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. ఈ సంద్భంగా అయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సహాయక చర్యలు చేపట్టి జలమయమయ్యే ప్రాంతాలను గుర్తించి పునరావాస కేంద్రానికి తరలిస్తున్నమని, నర్మల ఎగువ ఎగువ మానేరు నీటి ఉధృతి ప్రమాదస్దాయిలో ఉండటంతో ఎగువ మానేరు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.. ప్రజలు ప్రమాదాల భారీన పడకుండా వంతెనలపై రాకపోకలను నిషేధించి బారికేడ్లు, ఫ్లెక్సీ లు ఏర్పాటు చేసి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని, 12 మందితో కూడిన జిల్లా DRF టీమ్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, పిల్లలు, యువకులు సెల్ఫీలు తీసుకోవడానికి, ఈత కొట్టడానికి నీటి ప్రవాహాల దగ్గరికి వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని, విపత్కర సమయాల్లో డయల్100కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అంధిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడుతమని తెలిపారు…

మిడ్ మానేర్ పరివాహక గ్రామా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

మిడ్ మానేర్ పరివాహక గ్రామా ప్రజలు
అప్రమత్తంగా ఉండాలి..

సిరిసిల్ల యదార్థవాది

రాష్టం లో భారీ అతి భారీ వర్షాల వల్ల మిడ్ మానేర్ డ్యామ్ గేట్లు ఎత్తి ఔట్ ఫ్లోలు పెంచే అవకాశం ఉందని బి. జగన్
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పి. సుమతీ దేవి సూపరింటెండింగ్ ఇంజనీర్ పత్రిక ప్రకటనలో తెలిపారు.. ఏ క్షణంలో ఐయిన మిడ్ మానేర్ డ్యామ్ గేట్లు ఎత్తి ఔట్ ఫ్లోలు పెంచే అవకాశం ఉన్నందున రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు తగు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, మిడ్ మానేర్ పరిసర గ్రామాలలో దండోరా వేయాలని, నదీ పరివాహక ప్రాంతం లోకి రైతులు, చేపలు పట్టేవారు, పశువుల కాపరులు పశువులను తీసుకుని వెళ్లరాదని, మిడ్ మానేరు జలాశయం దిగువ పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలను అప్రమత్తం ఉండాలని తెలిపారు…

సేవాతత్వం చాలా గొప్పది

సేవాతత్వం చాలా గొప్పది

కొండపాక యదార్థవాది

స్వార్ధం లేని సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయమని, మనిషి జన్మ ఎత్తాకా సాటి మనిషి కోసం , సమాజం కోసం మంచి చేసే ఆలోచన ప్రతి మనిషి కి అవసరం అని వైస్ ఎంపీపీ దేవీ రవీందర్ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకొని దుద్దెడ జాగృతి ఫ్రెండ్స్ అసోసియేషన్ 24వ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. జాగృతి సంఘ అధ్యక్షుడు కాసాని బుచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దేవి రవీందర్ రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ ర్యాగల దుర్గయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవకు గమ్యం ఎంచుకోకుండా ముందుకు సాగడం ప్రశంసనీయమన్నారు. ప్రతి ఏటా విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించడం అంతఃకరణ శుద్ధితో సేవ చేయడం అభినందనీయం అన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు యువజన సంఘాలకు జాగృతి ఫ్రెండ్స్ ఆదర్శంగా నిలుస్తుంది కొనియాడారు. కాగా దుద్దెడ గ్రామానికి చెందిన హైస్కూల్ పదవ తరగతి విద్యార్థులు వైద్యుల పవన్ కళ్యాణ్ , మైలారం అజయ్ కుమార్లు బాసర ట్రిపుల్ ఐటీ లో సీట్లు కైవసం చేసుకున్న సందర్భంగా వారిరువురికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. 20 గ్రాముల వెండి పథకంతో పాటు నగదు ముట్టజెప్పారు. ఇది ఇలా ఉండగా స్థానిక ఉప సర్పంచ్ గుండెల్లి ఆంజనేయులు విద్యార్థులు ఇద్దరికీ తల రెండు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. కాగా అంతకుముందు కార్గిల్ అమరవీరులకు కొవ్వొత్తులు వెలిగించి సంఘ సభ్యులతో పాటు అతిధులు నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆరెపల్లి మహాదేవ్ గౌడ్, ఎంపీటీసీ గురజాడ బాలాజీ, పిఎసిఎస్ మాజీ చైర్మన్ మంచాల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పెద్దాంకుల శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు అనంతల నరేందర్, తిమ్మారెడ్డిపల్లి సర్పంచ్ మల్లమారి రవీందర్, చంద్రబాను సంఘ సభ్యులు వడ్లకొండ శ్రీనివాస్, పెద్ది శ్రీనివాస్, నరహరి, నాగరాజు, హరీష్ , వెంకటరమణ మల్లెష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి హరీష్ రావుకు అందత్వం ఎప్పుడు వచ్చింది.?

మంత్రి హరీష్ రావుకు అందత్వం ఎప్పుడు వచ్చింది.?

తన్నీరు హరీష్ రావు పుట్టక ముందే త్యాగాల భారత కమ్యూనిస్టుపార్టీ (సిపిఐ)నేతలు
ఉన్నారన్నది మర్చిపోయారు.

సిపిఐకి మంత్రి తన్నీరు హరీష్ రావు వెంటనే క్షేమపణ చెప్పాలి.

సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ డిమాండ్.

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సోమవారం సిద్దిపేటలో జరిగిన ఆశా, అంగన్ వాడి కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడిన మాటలు వింటుంటే మంత్రికి ఇంత అంధత్వం ఎప్పుడు వచ్చింది..అనే అనుమానం కలుగుతుందని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ అన్నారు.. బుధవారం అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అయన మాట్లాడుతూ మంత్రి తన్నీరు హరీష్ రావు వయసు చాలా చిన్నదని, ఆయన పుట్టక ముందు నుండే భారత కమ్యూనిస్టుపార్టీ (సిపిఐ) 100 సంవత్సరలుగా అనేక త్యాగాలు చేసిన త్యాగదనులు నేటికి లక్షలాది మంది నాయకులు కార్యకర్తలు ఉన్నా మంత్రికి కనబడడంలేదా..అంటు గడిపె మల్లేశ్ గాటుగా విమర్శించారు.. అసలు అంగన్ వాడి, ఆశా వర్కర్లను మభ్యపెట్టి అనేక విధాలుగా ప్రలోభ పెట్టి వారిని వామపక్ష పార్టీల నుంచి బిఆర్ఎస్ పార్టీలొ సభ్యం తీసుకునేల మీ వైపుకు తిప్పుకున్నారన్నది మంత్రి మర్చిపోవద్దని గడిపె మల్లేశ్ అన్నారు. అధికార దాహంతో అడ్డుదారులు తొక్కి పైకొచ్చిన మీరు వాస్తవాలు చూడలేని‌ కళ్లు లేని కబోదులుగా మారితే ప్రజల్ని మిమ్మలిని ఏ విధంగా అర్థం చేసుకుంటారనే విషయాన్ని కూడా మర్చిపోయి మాట్లాడటం సరైంది కాదని ఇటివల మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టు కార్యకర్తలే లేకపోతే మీ బిఆర్ఎస్ పార్టీ బతుకు మీ బతుకు ఎక్కడ ఉండేదో ఒకసారి ఆలోచించుకోవాలని, ఆనాడు కమ్యూనిస్టులు వీర యోధులు లేకుంటే లక్షలాది మంది కార్మిక నాయకులు, పిడిత ప్రజలు శ్రమజీవులు ప్రపంచలో పేదరికం నిర్మూలన కోసం సూర్య చంద్రులు ఉన్నంత వరకు కార్మికులు కర్షకులు పేదలు కమ్యూనిస్టుల వెంటే ఉంటారని ఇప్పటికైనా మంత్రి హరీష్ రావు జ్ఞానోదయం చేసుకొవలని మంత్రి హరీష్ రావుకు సూచించారు.. మీ పార్టీకి మీకు అధికార దాహం కమ్యూనిస్టులకు శ్రామిక జన రాజ్యాధికారం కోసం త్యాగాలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని రాజకీయలను వ్యాపారంగా మార్చి డబ్బిచ్చి ఓట్లు కొనే నీచ సంస్కృతిని ప్రవేశపెట్టిందని, మీ వంటి పెట్టుబడిదారు పార్టీలే ఇంత మాట్లాడిన మీకు నీతి నిజాయితీ గనుక ఉంటే మీకు దమ్ముంటే దామాషా ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టాలని, కమ్యూనిస్టులు దేశంలోని అన్ని చట్ట సభల్లో స్థానాలు గెలవకపోతే అప్పుడు మాట్లాడండి.. ఎన్నికల్లో డబ్బిచ్చి ఓట్లను కొనకపోతే కమ్యూనిస్టుల గెలుపుని ఎవ్వరూ ఆపలేరన్నది నగ్న సత్యమని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న మంత్రి ఇప్పటికైనా తెలుసుకోవాలని, తెలంగాణ సాయుధపోరాటం ఫలితం ఆనాటి త్యాగాల పునాదుల మీదనే నేడు ఆధికారంలో ఉన్నారని కమ్యూనిస్టులను కించపరచకుండా కమ్యూనిస్టులకు వెంటనే క్షమాపణ చెప్పాలని సిపిఐ త్యాగాలను గౌరవిస్తే మంత్రి తన్నీరు హరీష్ రావుకు మంచిదని గడిపె మల్లేశ్ అన్నారు.. విలేఖరుల సమావేశంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ కార్యదర్శి పిల్లి రజినీ, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర సమితి సభ్యులు నేలవేణి స్వప్న,సిపిఐ మండల నాయకులు అయిలేని మల్లారెడ్డి, మౌటం బాలయ్య, పోదిల కనకస్వామి, శివరాత్రి మల్లయ్య, పుదరి రఘుపతి, ఇంద్రాల మల్లయ్య, గట్టు మల్లేశం, మహిళా సమాఖ్య నాయకురాల్లు పెద్ది నిర్మల, పాల్గొన్నారు..

స్నేహితురాలికి, నాటి స్నేహితులు.. చేయూత.

స్నేహితురాలికి, నాటి స్నేహితులు.. చేయూత.

యదార్థవాది హుస్నాబాద్ ప్రతినిది

వారంతా ఒకప్పటి విద్యార్థులు చిన్నతనంలో అంతా కలిసి సిద్దిపేట జిల్లా కోహెడ హైస్కూల్లో విద్యను అభ్యసించారు. అందరూ ఒకొక రంగంలో దూర ప్రాంతాలలో స్థిరపడ్డారు, అయినను స్నేహానికి ఉన్న గొప్పతనం చాటుతూ కష్టకాలంలో ఉన్న స్నేహితురాలికి మేమున్నామంటూ ముందుకు వచ్చి చేయూతను అందించారు. వివరాల్లోకి వెళితే పరివేద గ్రామనికి చెందిన కంకణాల రాజిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు, అతని భార్య కంకణాల రజిత 1999 -2000 విద్యా సంవత్సరంలో పదవ తరగతి కోహెడ హైస్కూల్లో చదివింది. నాటి స్నేహితులు బుధవారం స్నేహితురాలైన కంకణాల రజితకు మేమున్నామంటూ మనోధైర్యం కలిగించి, ఆమెకు స్నేహపూర్వకంగా అందరూ కలిసి రూ.72500-00 ఆర్థిక సహాయాన్ని అందించి కొండంత ధైర్యాన్ని ఇచ్చి స్నేహానికి ఉన్న గొప్పతనాన్ని చాటి చెప్పారు..

ప్రతిపక్షాల వలలో పడొద్దు: మంత్రి హరీష్

ప్రతిపక్షాల వలలో పడొద్దు: మంత్రి హరీష్

  • సమ్మె వీడి.. విధుల్లో చేరండి.. కార్మికులను అన్ని విధాలుగా అండగా ఉంటా..
  • క్వాలిఫైడ్ కార్మికులను అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శి గా చేస్తాం..
  • రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు..

సిద్ధిపేట యదార్థవాది

తెలంగాణ రాష్ట్రం కురుస్తున్న వర్షల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల వ్యాపించి గ్రామాలలోని ప్రజలకు అంటువ్యాధులు పెరిగే అవకాశం వుందని, పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం తప్పకుండా తీరుస్తుందని, గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, దయచేసి గ్రామ పంచాయతీ కార్మికులంతా సమ్మె వీడి విధుల్లో చేరాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు పారిశుద్ధ్య కార్మికులను కోరారు..ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ వెయ్యి రూపాయల వేతనాన్ని పెంచారని, ఇప్పటికీ ఆయన దృష్టిలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు ఉన్నాయని, సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని మంత్రి భరోసా ఇచ్చారు. పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మీతో చర్చలు జరుపుతరని, వీలైనంత వరకూ కార్మికుల సమస్య తీరుతుందని పారిశుద్ధ్య కార్మికులంతా సమ్మెను విరమించి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల కంటే మన తెలంగాణ రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు ఎక్కువగా ఇస్తున్నట్లు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో కనీసం మనుషులుగా కూడా ఆ ప్రభుత్వాలు చూడట్లేదని ఉత్తర ప్రదేశ్ లో 5 వేల 200, మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో 5 వేల 200, ఛత్తీస్గఢ్ లో అసలు ప్రభుత్వం వేతనం ఇవ్వడం లేదని గ్రామ పంచాయతీలే తోచినంత ఇస్తున్నాయని, ఒరిస్సాలో ఇంటికి 5 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, పశ్చిమ బెంగాల్ లో అయితే “పెయిడ్ వర్కర్స్” అని పెట్టి నెలకు కేవలం 500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, కేరళ శానిటేషన్ వర్కర్లు పెట్టి ఇద్దరికీ ఇంటికి కేవలం 30 రూపాయలు ఇస్తున్నారని, అంటే ఒక కార్డులో పని చేస్తే కనీసం 4 నుంచి 5 వేలు కూడా రాని పరిస్థితి ఉన్నదని అన్నారు. పనికి మాలిన రాజకీయాలు చేసే కొన్ని పార్టీల ఉచ్చులో పడొద్దని సీఏం కేసీఆర్ మిమ్మల్ని చల్లగా చూస్తారని, ఏలాంటి సమ్మెలు, ధర్నాలు చేయవద్దని, రాబోయే రోజులలో క్వాలిఫైడ్ కార్మికులను అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శి గా చేయాలని సీఏం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని అయన అన్నారు.

ఆర్మూర్ లో జంట హత్యలు

ఆర్మూర్ లో జంట హత్యలు.

  • జంట హత్యలతో స్థానికులు భయాందోళనలు..

నిజామాబాద్ యదార్థవాది

అక్క చెల్లెలు పై గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, ఇంటికి నిప్పంటించిన ఘటన ఆర్మూర్ పట్టణంలో చోటు చేసుకుంది.. విషయం తెలుసుకున్న నిజామాబాద్ ఇంచార్జ్ సిపి ప్రవీణ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జిరాయాత్ నగర్ లో నివసిస్తున్న అక్క మగ్గిడి రాజవ్వ (72), చెల్లెలు మగ్గిడి గంగవ్వ (62) మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి నివాసం వుంటున్న ఇంటికి నిప్పంటించిన విషయన్ని స్థానికులు ఇంట్లో నుండి పొగలు రావడం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఇంట్టి కిటికీలు బద్దలు కొట్టి మంటలు ఆర్పే క్రమంలో మృతులు ఇద్దరు కనబడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వృద్ధ మహిళల వద్ద ఒంటినిండా సుమారు 15 నుండి 20 వరకు బంగారం ఉంటుందని స్థానికులు చెప్పారు. నగలు, బంగారం కోసం దుండగులు ఎవరైనా వీరిని హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి డాగ్బ్స్వాడ్ బృందంతో తనిఖీలు నిర్వహించారు.

పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి: కలెక్టర్ జీవన్ పాటిల్

పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి: కలెక్టర్ జీవన్ పాటిల్

సిద్దిపేట యదార్థవాది

హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గ, మున్సిపల్ రెవెన్యూ అధికారులతో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సమావేశం నిర్వహించారు..ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జూలై 11న జరిగిన సమావేశానికి నేటి రోజు చుస్తే పనుల్లో చాలా పురోగతి సాధించారని అభినందిస్తు ఇంతే వేగంగా జాబితా సవరణ పూర్తి చెయ్యాలన్నారు. ఓటర్ జాబితా సవరణలో భాగంగా డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల ముందు, మనకు వచ్చిన ప్రతి దరఖాస్తు పూర్తి చేయాలని, ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో ధృవీకరణ పూర్తి చేయాలని, బిఎల్ఓస్ ఇంటింటికి తిరిగి 6 కంటే అధికంగా ఉన్న ఓటర్ల వివరాల ధృవీకరణను పూర్తి చేయాలని సిద్దిపేట జిల్లాలో ఇంటింటి సర్వే నేపథ్యంలో వచ్చిన దరఖాస్తులు, ఆన్ లైన్ ద్వారా ఫారం 6, ఫారం 7, ఫారం 8 క్రింద వచ్చిన దరఖాస్తులను జూలై 27 నాటికి ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని అన్నారు. ఓటరు జాబితా నుంచి ఓటర్ల వివరాలు తొలగించిన నేపథ్యంలో దానికి గల కారణాలను స్పష్టంగా తెలియజేయాలని, నియోజకవర్గ పరిధిలో ఈవిఎం, వివిప్యాట్ వినియోగం పై విస్తృతఅవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, నియోజకవర్గంలో ఉన్న మండలాల్లో ఉన్న పోలింగ్ స్టేషన్ లను క్షేత్ర స్థాయిలో వెళ్ళాలని, భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా ప్రతి పోలింగ్ స్టేషన్ లో మౌలిక ఏర్పాటు చెయ్యాలని తహసీల్దార్ లకు సూచించారు. బిఎల్ఓస్, ఈఆర్ఓలు, అందరు అధికారులు సమన్వయంతో పనిచేసి మళి విడత సమావేశం లోపు అన్ని పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్డిఓ బెన్ సాలమ్, మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల నియమావళి కచ్చితంగా తెలిసి ఉండాలి: కలెక్టర్

ఎన్నికల నియమావళి కచ్చితంగా తెలిసి ఉండాలి: కలెక్టర్

-హరువులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు అయ్యేలా చూడాలి..

-పోలింగ్ కేంద్రాల వద్ద భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించాలి.

-కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి

సిరిసిల్ల యదార్థవాది

రాబోవు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బిఎల్ఓ లు సమర్దవంతమైన, స్పష్టమైన ఎలక్టోరల్ రోల్ ను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫోటో ఎలక్టోరల్ రోల్స్ 2వ ఎస్ఎస్ఆర్ 2023 పై మంగళవారం బూత్ స్థాయి అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించిన జిల్లా కలెక్టర్..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకమైన ఎన్నికల జాబితా తయారు చేయాలని, ఓటర్ల జాబితాలో మార్పులు చేయడంలో జాగ్రత్త వహించాలని ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల జాబితాను నిర్దారించి ఫారం -6 , ఫారం -6A ,ఫారం -6B ,ఫారం -7 ,ఫారం -8 ల గురించి ఓటర్లకు బూత్ లెవల్ అధికారులు తెలియజేయాలన్నారు. గరుడ (బిఎల్ఓ) యాప్ లో వివరాలను సక్రమంగా నమోదు చేయాలని, ప్రతి పోలింగ్ స్టేషన్లను సందర్శించాలని, ఓటర్లకు సమీపంగా పోలింగ్ కేంద్రాలు ఉండేలా జాగ్రత్త వహించాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని, ఓటరుగా ఉన్న ప్రతిఒక్కరి ఫోటో, ఇతర వివరాలు సరిగా ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వికలాంగుల వృద్దుల కొరకు ప్రత్యేకంగా ర్యాంపులతో పాటు మౌళిక సదుపాయాలను ఖచ్చితంగా కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ , ఆర్డీఓ పవన్ కుమార్, తహశీల్దార్ రాజు, అసెంబ్లి లెవల్ మాస్టర్ ట్రైనర్లు, ఇతర ఎన్నికల అధికారులు పాల్గోన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...