36.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

బీర్ బాటిల్స్‌ కోసం హత్య.!

బీర్ బాటిల్స్‌ కోసం హత్య.!

-మద్యానికి బానిసైన యువకుల దాడిలో యువకుడు మృతి..

హైద్రాబాద్ యదార్థవాది

హైదరాబాద్‌ మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బీర్ బాటిల్స్‌ కోసం గొడవ.. కత్తితో దాడి యువకుడు మృతి.. మృతుడ్ని సాయి వరప్రసాద్‌గా నిర్ధారించిన పోలీసులు.. జిల్లెలగూడ నుంచి సాయి వరప్రసాద్‌.. బీరు బాటిల్స్‌ కొనుక్కుని వెళ్తున్న క్రమంలో కొందరు యువకులు.. అడ్డుకుని బాటిల్స్‌ తమకు ఇచ్చేయాలని కోరడంతో సాయి వరప్రసాద్‌ ససేమీరా అనడంతో వాగ్వాదం చోటుచేసుకుందని, ఈ క్రమంలో కత్తితో సాయిపై ఆ యువకులు దాడి చేయగా రక్తపు మడుగులో అక్కడికక్కడే సాయి కుప్పకూలిపోయాడు. బీర్‌ బాటిల్‌ హత్య ఉదంతంపై కేసు నమోదు చేసుకుని మీర్ పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. పల్లె నితీష్ గౌడ్, కిరణ్ గౌడ్, సంతోష్ యాదవ్, పవన్‌లను పోలీసులు అనుమానిస్తున్నారు..

గ్రామపంచాయతీ కార్మికులకు సంఘీభావం.

గ్రామపంచాయతీ కార్మికులకు సంఘీభావం.

ఆలేరు యదార్థవాది

ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె కు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బీర్ల అయిలయ్య మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా గ్రామ పంచాయతీ కార్మికులు వేతనాల పెంపు, పర్మినెంట్ చెయ్యాలని, కారోబార్, బిల్ కలెక్టర్లను పంచాయతీ సహాయ కార్యదర్శులుగా నియమించాలని రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కొనసాగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జివో నెంబర్ 60 ప్రకారం జితలు, ప్రమోషన్లు ఇవ్వాలని, కెసిఆర్ ప్రభుత్వం ఇవ్వటం లేదన్నారు. తెలంగాణ వస్తే మన బ్రతుకులు మారుతాయనుకుంటే ఏ వర్గానికి లబ్ధి చేకూరలేదని, తేలంగాణ వస్తే ధర్నాలు రాస్తారోకోలు లేవని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాస్తారోకోలు, ధర్నాలో ఉన్నాయని, ఇప్పటికైనా వారి న్యాయమైన డిమాండ్లు తిర్చేవరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సిరిబోయిన మల్లేష్ యాదవ్ మాజీ జెడ్పిటిసి గంగాపురం మల్లేష్ మాజీ ఎంపిపి వీసం వెంకటేశ్వర్లు, సర్పంచ్ శ్రీశైలం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మదర్ గౌడ్ , చాడ శశిధర్ రెడ్డి, రఘునాధ రాజు , సీలా బాలకృష్ణ , NSUI నాయకులు రేగు రమేష్, జంపాల నాగచందర్, తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు మరింత చేరువలో పల్లె వెలుగు..

ప్రజలకు మరింత చేరువలో పల్లె వెలుగు..

-ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్”

-రేపటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్”

-బస్‌ పాస్‌ పోస్టర్లను ఆవిష్కరించిన టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌.

హైదరాబాద్ యదార్థవాది

హైదరాబాద్‌ లోని బస్‌ భవన్‌లో సోమవారం “పల్లె వెలుగు టౌన్‌ బస్‌ పాస్‌” పోస్టర్లను సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ “జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, చిరువ్యాపారులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. వారి ఆర్థిక భారం తగ్గించేందుకు “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్” ను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకువచ్చిందని, కొత్తగా “పల్లెవెలుగు టౌన్ బస్ పాస్”కు మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్ ను అమలు చేయనుందని, టౌన్‌ పాస్ తో ప్రయాణికులు కరీంనగర్, మహబూబ్ నగర్ లో 10 కిలో మీటర్లు, నిజామాబాద్, నల్లగొండలో 5 కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయొచ్చువచని, ఇందుకు 10 కిలోమీటర్ల పరిధికి నెలకు రూ.800, 5 కిలోమీటర్ల పరిధికి రూ.500గా “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్” ధరను ఖరారు చేసిందని అన్నారు. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్ లో జనరల్ బస్ పాస్ అందుబాటులో ఉందని ఆ బస్ పాస్ ను జిల్లా కేంద్రాల్లోనూ అమలు చేయాలని ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు కొత్తగా “పల్లెవెలుగు టౌన్ బస్ పాస్”ను సంస్థ తెచ్చిందని అన్నారు. ఈ కొత్త టౌన్ పాస్ ఈ నెల 18 (మంగళవారం) నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. కొత్తగా తీసుకువచ్చిన ఈ పాస్ ను హైదరాబాద్, వరంగల్ లో మాదిరిగానే ప్రయాణికులు ఆదరించి.. సంస్థను ప్రోత్సహించాలని సజ్జనర్ కోరారు. బస్ పాస్ కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్‌ రవిందర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌, ఈడీలు మునిశేఖర్‌, కృష్ణకాంత్, పురుషోత్తం, వినోద్ కుమార్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యంలో భాగంగా హుస్నాబాద్ లో 10కె రన్.

ఆరోగ్యంలో భాగంగా హుస్నాబాద్ లో 10కె రన్.

-ఆరోగ్య పరిరక్షణకు అందరూ పాటుపడాలి.

-మన ఆరోగ్యం కోసం శరీరంలో ఉండే క్యాలరీస్ ఖర్చు చేయాలి.

-సిద్దిపేట పోలీస్ కమిషర్ ఎన్. శ్వేత

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 10కె రన్ హుస్నాబాద్ పట్టణంలోని అక్కనపెట్ రోడ్లో పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ప్రారంభించారు.. సోమవారం అక్కన్నపేట రోడ్డు, జనగామ క్రాస్ రోడ్ నుండి మళ్లీ ఎనె వరకు ప్రమోషనల్ రన్ కొనసాగింది.. ఈ సందర్భంగా పోలీస్ వారు మాట్లాడుతూ ఆరోగ్య హుస్నాబాద్ లో భాగంగా స్వచ్ఛ హుస్నాబాద్ చైతన్యాన్ని అందరికీ తెలియపరిచే విధంగా 10కె రన్ నిర్వహించడం జరిగిందన్నారు. మంత్రి తన్నీరు హరీష్ రావు గారి చొరవతో రంగనాయక సాగర్ ప్రాజెక్టు పై ఆగస్టు 6న హాఫ్ మారథాన్  రన్ నిర్వహించడం జరుగుతుందని, సిద్దిపేట జిల్లా యువతి యువకులు ప్రజలు ప్రజాప్రతినిధులు ఇతర జిల్లా యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ఈవెంట్ ఆహ్లాదకరమైన వాతావరణంలో  అత్యద్భుతంగా ఒక పండుగ వాతావరణం లో  నిర్వహించడం జరుగుతుందని  అందులో భాగంగా హుస్నాబాద్ పట్టణంలోని మహిళలకు బాల బాలికలకు యువతి యువకులకు ప్రత్యేకంగా 10కె ప్రమోషనల్ రన్  నిర్వహించడం జరిగిందని అన్నారు. మహిళలు బాల బాలికలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణకు పాటుపడాలని ఆరోగ్యమే మహాభాగ్యమని ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేదని  ప్రతిరోజు వాకింగ్, రన్నింగ్, యోగా, ధ్యానం, స్విమ్మింగ్,  తప్పకుండా చేయాలని సూచించారు. 24 గంటల్లో ఒక గంట మన కుటుంబం మన ఆరోగ్యం గురించి మనము సమయం కేటాయించలని సూచించారు. డబ్బులు ఉంటే దాచుకోవాలి, శరీరంలో ఉండే క్యాలరీస్ ఖర్చు చేయాలని సూచించారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ https://shm23.iq301.com  ఈ లింక్ ఓపెన్ చేసి వారి యొక్క వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్  చేసుకొని హాఫ్ మారథాన్ రన్ లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఐలేని అనిత, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎడబోయిన రజని అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్ మహేందర్, హుస్నాబాద్ ఏసిపి సతీష్, సీఐ కిరణ్, ఎస్ఐ మహేష్, అక్కన్నపేట ఎస్ఐ వివేక్, హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్, కార్యవర్గ సభ్యులు, హుస్నాబాద్ పట్టణ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు యువతీ, యువకులు, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కత్తుల బాపిరెడ్డి, కార్యవర్గ సభ్యులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గాన్ని చల్లగా చూడమ్మా.

నియోజకవర్గాన్ని చల్లగా చూడమ్మా.

చేగుంట యదార్థవాది

మహంకాళి అమ్మవారి జాతర ఉత్సవాలో పాల్గొన్న దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి.. ఆదివారం చేగుంట మండలం వడియారం గ్రామంలో మహంకాళి అమ్మవారి దర్శించుకుని అయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గ ప్రజలను అమ్మవారు సుఖసంతోషాలతో చల్లగా చూడాలని కోరుకుందాం.. దుబ్బాక నియోజకవర్గం అన్ని విధానం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు. అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని, బీఆర్ఎస్, బీజేపి పార్టీలు రెండు ఒకటే అని అన్నారు. కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ యువజన అద్యక్షులు సాయికుమార్ గౌడ్, చెగుంట మండల అద్యక్షులు వడ్ల నవీన్, కుమార్, ఉపాధ్యక్షులు మాసాయిపేట శ్రీనివాస్ ,జనరల్ సెక్రటరీ అన్నం ఆంజనేయులు, కాసమైన మహేష్ మోజామిల్,sc సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింలు సోషల్ మీడియా మోహన్ నాయక్ ఫిషర్ మన్ సోమ వెంకట్ సీనియర్ నాయకులు బాల్ రెడ్డి కొండి శ్రీనివాస్ చౌదరి శ్రీనివాస్ అనీల్ కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు..

కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిఘటిద్దాం!

కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిఘటిద్దాం!

సిద్దిపేట యదార్థవాది

క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విశాల ఐక్య పోరాటాలకు సన్నద్ధం కావాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బీరం మల్లేశం కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో అదివారం కార్మిక సంఘాల జిల్లా సదస్సు సిఐటియు, జిల్లా కార్యదర్శి కాముని గోపాలస్వామి, ఏఐటీయూసి జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి, హెచ్ఎంఎస్ జిల్లా అధ్యక్షుడు ఈదరి మల్లేశం ల అధ్యక్షతన జరగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బీరం మల్లేశం వక్తలుగా ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి కిష్టపురం లక్ష్మణ్, హెచ్ ఎం స్ జిల్లా కార్యదర్శి జి మధు పాల్గొని మాట్లాడుతూ…. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కార్పొరేట్ అనుకూల కేంద్ర బిజెపి ప్రభుత్వం బరితెగించి ప్రజా, కార్మిక వ్యతిరేక పరిపాలన సాగిస్తున్నది. జాతీయ సహజ వనరులు, ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా స్వదేశీ, విదేశీ కార్పోరేట్లకు అమ్మేస్తున్నది. డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్, ఇతర నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజల నడ్డివిరిచింది.ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలపై ఉక్కుపాదం మోపింది. రాజ్యాంగ బద్ధంగా పౌరులకున్న ప్రాథమిక హక్కులకు సైతం పాతరేస్తున్నది. ఉపాధి, నిరుద్యోగం, అధిక ధరలు, ఆకలి, అసమానతలు, ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్యలను పట్టించుకోకపోగా,
స్వాతంత్య్రానంతరం దేశ ప్రజానీకం ఎంతో శ్రమించి అభివృద్ధి చేసుకున్న ప్రభుత్వరంగ మౌలిక వసతులు, సహజ వనరులను కార్పొరేట్లు లూఠీ చేసే విధానపర నిర్ణయాలను కేంద్రం అమలు చేస్తున్నది. వ్యూహాత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వరంగ • సంస్థల్లో 100 శాతం వాటాలు తెగనమ్ముతున్నది. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ (ఎన్ఎంపి) పాలసీ ద్వారా మౌలిక వసతులను లీజు పేరుతో ధారాదత్తం చేస్తున్నది. జాతీయ రహదారులు, రైళ్ళు, విద్యుత్ స్టేషన్లు, ట్రాన్సిమిషన్, చమురు-సహజ వాయివు పైప్ లైన్లు, బొగ్గు గనులు, టెలికం టవర్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు, ఎఫ్.సి.ఐ గోడౌన్లు, క్రీడా మైదానాలతో సహా ప్రజా ఆస్తులన్నింటిని కార్పొరేట్లకు అమ్మేస్తుంది. దీని వల్ల రాబోయే కాలంలో ప్రజలు ఈ సౌకర్యాల కోసం వేలాది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగుల కష్టార్జితమైన పిఎఫ్, పెన్షన్ నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు అప్పజెప్తున్నది. మన రాష్ట్రంలో సింగరేణిలోని 4 బొగ్గు గనులను వేలం వేసింది. హైదరాబాద్లో కేంద్రీకృతమై వున్న బిడిఎల్, బిఇఎల్, బిహెచ్ఐఎల్, హెచ్ఎఎల్, మిథాని లాంటి సంస్థలలో సుమారు 25 నుండి 50 శాతం దాకా వాటాలు అమ్మేసింది. కార్మికులు, మధ్యతరగతిలో అత్యధికులు పాలసీదార్లుగా వున్న ఎల్బీసిలో లక్ష కోట్ల రూపాయల వాటాలు అమ్మేందుకు తెగబడింది.
అనేక త్యాగాలు, రక్త తర్పణతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లు మారుస్తూ పార్లమెంట్ లో చట్టం చేసింది. వేతనాల కోడ్ చట్టంతో కనీస వేతనాలు నిర్ణయించే మౌలిక విధానానికి మంగళం పాడింది. పారిశ్రామిక సంబంధాల కోడ్ చట్టంతో సమ్మె హక్కును కాలరాస్తున్నది. సామాజిక భద్రతా కోడ్, వృత్తి సంబంధిత రక్షణ, ఆరోగ్యం- పని పరిస్థితుల కోడ్లతో పిఎఫ్, ఇఎస్ఐ, వెల్ఫేర్ బోర్డులపై గొడ్డలి వేటు వేస్తున్నది. తిరిగి 12 గంటల పని విధానం అమల్లోకి తెస్తున్నది. ఇలాంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై రాబోయే కాలంలో మరింత ఉధృతంగా పోరాటాలు నిర్వహించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు ఈ సదస్సులో సిఐటియు జిల్లా అధ్యక్షుడు సంద బోయిన ఎల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి కళావతి, ఎం పద్మ, బండ్ల స్వామి, జిల్లా సహాయ కార్యదర్శి లు చొప్పరి రవికుమార్, తునికి మహేష్ లు జిల్లా కమిటీ సభ్యులు ఎన్.వేణుగోపాల్, మామిడాల కనకయ్య,ఎస్.రంగారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు అందే అశోక్, జిల్లా సహాయ కార్యదర్శి బెక్కంటి సంపత్, జిల్లా కోశాధికారి జి నర్సింలు హెచ్ఎంఎస్ జిల్లా నాయకులు ఇదారి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

అంకిత భావంతో వృత్తి ధర్మాన్ని నిర్వహించాలి: పోలీస్ కమీషనర్

అంకిత భావంతో వృత్తి ధర్మాన్ని నిర్వహించాలి: పోలీస్ కమీషనర్

-బదిలీ పై వెళ్తున్న ఏసీపీ, ఆర్ఐ లకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు.

గోదావరిఖని యదార్థవాది ప్రతినిది

వృత్తి పట్ల బాధ్యత అంకిత భావం విధేయత కలిగి ఉంటే ఎక్కడ విధులు నిర్వహించిన సంతృప్తికరమైన జీవితం గడుపుతారని రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి (డిఐజి) పేర్కొన్నారు.. రామగుండం పోలీస్ కమిషనరేట్ నుంచి బదిలీపై వెళుతున్న
జైపూర్ ఏసీపీ గోపతి నరేందర్, గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి మోహన్, అర్ముడ్ రిజర్వు ఇన్స్పెక్టర్ మధుకర్, శ్రీధర్, అంజన్న అనిల్, రాజేష్ లకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల తరఫున ఆదివారం ఘనంగా ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం గోదావరిఖనిలోని ఇల్లందు క్లబ్ లో నిర్వహించారు. జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులతో కలిసి బదిలీపై వెళ్తున్న పోలీస్ అధికారులకు జ్ఞాపికాలను అందచేసి శాలువా తో సత్కరించారు.. ఈ సందర్బంగా సీపీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకొని, ఎప్పటికప్పుడు పరిస్థితులను అవగాహన చేసుకుంటూ, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం ద్వారానే ప్రజల హృదయాల్లో అమూల్యమైన స్థానం పొందవచ్చుని, విధులు అంకితభావంతో నిర్వహిస్తూ, ఎక్కడి సమస్యలు అక్కడే చాకచక్యంగా పరిష్కరించే అధికారులు ఉన్నప్పుడే ఉన్నతాధికారులకు ఊరట కలుగుతుందని, తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం కలుగుతుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ సర్వసాధారణమని తాము ఎక్కడ విధులు నిర్వహించిన అంకిత భావంతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కాలానుగుణంగా ఎన్నో మార్పులు సమాజంలో వస్తున్నాయని సమయాన్ని సందర్భాన్ని బట్టి విధులు నిర్వర్తించాలని విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏసీపీ నరేందర్, గిరి ప్రసాద్ లు మాట్లాడుతూ సమర్థవంతమైన, వృత్తి పట్ల అంకిత భావం గల కమిషనర్ దగ్గర పని చేయడం వల్లనే ఎప్పటికప్పుడు సందర్భోచితంగా సూచనలు పొంది, ప్రజల సమస్యలు పరిష్కరించడం సాధ్యమైందని తద్వారా తమకు కూడా మంచి పేరు వచ్చిందని వివిధ సందర్భాలను, పరిస్థితులను గుర్తు చేశారు. రామగుండం కమీషనరేట్ లో పనిచేయడానికి అధికారుల నుండి మన్ననలు పొందడనికి పోలీస్ అధికారుల, సిబ్బంది, సహకారం మరువలేనిది అని అందరికీ పేరు పేరునా ఏసీపీ లు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.. కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్, మంచిర్యాల డిసిపి సుధీర్ కేకన్, పెద్దపల్లి ఏసిపి మహేష్, మంచిర్యాల ఎసిపి తిరుపతిరెడ్డి, బెల్లంపల్లి ఏసిపి సదయ్య, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి మోహన్, సిసిఎస్ ఏసీపీలు వెంకటేశ్వర్లు, ఉపేందర్, సి హెచ్ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఏసిపి బాలరాజు, ఏఆర్ ఏసి పి లు సుందర్ రావు, మల్లికార్జున్, కమ్ స్టేట్ పరిధిలోని సిఐలు, ఆర్ఐ లు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

లేక్ పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.

లేక్ పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

కరీంనగర్ యదార్థవాది

కరీంనగర్ పోలిస్ కమిషనరేట్ లో లేక్ అవుట్ పోస్ట్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం దిగువ మానేరు జలాశయం వద్ద లూపిన్ దయాగ్నోష్టిక్స్ వారి సహకారం తో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా సందర్శకులు, వాకర్స్, సమీప ప్రాంతాలకు చెందిన వంద మందికి ఉచితంగా మధుమేహం, రక్తపోటు వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. దీనిలో లూపిన్ దయాగ్నోష్టిక్స్ ఏరియా మేనేజర్ కడివేంది సతీష్ పల్ల, నరేందర్, లేక్ అవుట్ పోస్ట్ రిజర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ అర్షం, సురేష్, హెడ్ కానిస్టేబుల్ మల్లేశం, కానిస్టేబుల్ ఎండి.గౌస్,హోమ్ గార్డ్స్. మునిందర్, చక్రపాణి, స్వచ్చ భారత్ కార్యనిర్వాహకులు రాంప్రసాద్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అప్పుల బాధలతో యువకుడు మృతి.

అప్పుల బాధలతో యువకుడు మృతి.

కుకునూర్ పల్లి /కొండపాక యదార్థవాది

కుకునూరు పల్లి మండల, గ్రామంలో కొంతం మహిపాల్ అప్పుల బాధలతో ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందడు.. మృతునికి మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ, ట్రాక్టర్ నడుపుకుంటూ కుటుంభాన్ని పోచిస్తూ ఉన్నాడు.. వ్యవసాయంలో పంటలు సరిగా పండక, ట్రాక్టర్ వల్ల కూడా అప్పుల పాలయ్యాడు, చేసిన అప్పు తీర్చే మార్గం దొరుకక మనస్థాపంతో కలతచెంది, ఎప్పటిలాగే భార్య పిల్లలతో భోజనం చేశాక భార్యా పిల్లలు ఒక రూమ్ లో మృతుడు ఒక రూమ్ లో పడుకున్నాడని, నివారం తెల్లవారుజామున మహిపాల్ భార్య నిద్ర లేచి మహిపాల్ నిద్ర లేపేందుకు వెళ్లగా ఎంత పిలిచినా డోర్ తీయకపోయేసరికి ఇంటి చుట్టుపక్కల వాళ్ళని పిలిచి రూమ్ డోర్లు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా చీర తో ఉరివేసుకొని మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం కోసం గజ్వెల్ ప్రభుత్వ దవాఖానకు పంపించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని కుకునూరుపల్లి ఎస్సై పుష్పారాజ్ తెలిపారు..

కొండపాక ఎంపీపీ కి వినతి పత్రం అందజేత..

కొండపాక ఎంపీపీ కి వినతి పత్రం అందజేత..

యదార్థవాది న్యూస్ కొండపాక జులై 15

పంచాయితీ సిబ్బంది మూకుమ్మడిగా గత పది రోజలుగా సమ్మె చేస్తున్నా విషయం తెలిసిందే , తమ డిమాండ్ల ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, పరిష్కరించె దిశగా సహాయం కావాలని కోరుతూ శనివారం స్థానిక ఎంపీపీ సుగుణ ను తన నివాసంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా సుగుణ మాట్లాడుతూ త్వరలోనే కార్మికుల డిమాండ్ల పరిష్కార మార్గాలను మంత్రి హరీశ్, ముఖ్య మంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని, సాధ్యమంతవరకు సమస్యల పరిష్కారానికి పాటు పడతానని ఆమె తెలిపారు. కార్యక్రమంలో పంచాయితి కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...