35.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

కార్మికుల పట్ల చిన్నచూపు తగదు: బీజేపీ

కార్మికుల పట్ల చిన్నచూపు తగదు: బీజేపీ

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అనుకుంటే కేవలం కేసిఆర్ కుటుంబం మాత్రమే రాజభోగాలు అనుభవిస్తూ, గ్రామా పంచాయతి కార్మికుల పట్ల చిన్నచూపు చూస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపుసురేందర్ రెడ్డి అన్నారు.. శనివారం హుస్నాబాద్ ఎంపిడిఓ కార్యాలయం వద్ద సమ్మె నిర్వహిస్తుంన్న గ్రామా పంచాయతి కరోబారులు, కార్మికులకు శిబిరానికి హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కారోబారులు కార్మికులు తమ 17 సమస్యలు పరిష్కరించాలని న్యాయమైన డిమాండల కోసం 10 రోజులుగా సమ్మె నిర్వహిస్తుంటే కనీసం స్పందించకుండా, నిర్లక్ష్యం చేయడం దారుణమని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కర్మికులతరుపున బీజేపీ పార్టి తరుపున కోట్లడుతుందని తెలిపారు. ఈ సమస్యను ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు, అక్కన్నపేట మండల అధ్యక్షులు గోళ్లపల్లి వీరాచారి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నునవత్ మోహన్ నాయక్, పట్టణ ఉపాధ్యక్షులు గాదాసు రాంప్రసాద్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు పోలోజు రాజేందర్, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులు అనిల్ నాయక్, ప్రధాన కార్యదర్శి రైనా నాయక్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.

గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.

-భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ డిమాండ్.

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

నిరంతరం గ్రామీణ ప్రాంతాల్లో చాలి చాలని జీతాలతో ఏండ్ల తరబడి గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్నా పారుశుద్య కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని గత పది రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉన్నట్లు ఉందని గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యం చేయడం కెసిఆర్ ప్రభుత్వానికి తగదని తక్షణమే ముఖ్యమంత్రి చొరవ తీసుకొని కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్. శనివారం హుస్నాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట చేస్తున్న రిలే నిరాహారదీక్ష చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు సంఘీభావం తెలిపారు..కార్యక్రమంలో భారత జాతీయ మహిళా మండల సమాఖ్య నాయకురాల్లు నేలవేని స్వప్న,పెద్ది నిర్మల గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

ఘనంగా బోనాల పండుగ..

ఘనంగా బోనాల పండుగ..

-ఆకట్టుకున్న పోతురాజుల నృత్యాలు

హుస్నాబాద్ యదార్థవాది

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని సివి రామన్ ఉన్నత పాఠశాలలో పోచమ్మ బోనాలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన బోనాలు, పోతురాజుల నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర పండుగని, 18వ శతాబ్దంలో హైదరాబాద్ లో ప్లేగు వ్యాధితో అనేకమంది ప్రజలు చనిపోయారని, అప్పుడు అమ్మవారికి బోనాలు చేస్తామని ప్రజలు మొక్కుబడి చేసుకొని అప్పటినుండి బోనాలు చేస్తున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ప్రతి హిందువు జరుపుకోవాల్సిన పండుగ బోనాల పండుగ అని, ఈ పండుగను తమ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పద్మ, గూడు కిరణ్, వెంకటేశ్వర్లు, రమేష్, ప్రీతి ,భాస్కర్, ప్రియాంక, వర్ణమాల, మమత, శివ, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు..

సబ్ స్టేషన్ లో నైట్ వాచ్మెన్ మృతి

సబ్ స్టేషన్ లో నైట్ వాచ్మెన్ మృతి

కొండపాక / కుకునూర్ పల్లి యదార్థవాది

కుకునూర్ పల్లి మండల పరిధిలోని కొడకండ్ల 33 కెవి సబ్ స్టేషన్ లో నైట్ వాచ్మెన్ గా పని చేస్తున్న పూస బాలకిషన్ శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు తెలిసింది.. కొడకండ్ల 33 కెవి సబ్ స్టేషన్ లో నైట్ వాచ్మెన్ గా చేస్తుండే అదే గ్రామానికి చెందిన పూస బాలకిషన్ నైట్ వాచ్మెన్ గా చేస్తుండే పనిచేస్తుండేవారు.. మధ్యలో కొన్ని రోజులు పని మానేసి ఈ మధ్యే మళ్ళీ తిరిగి సహాయక నైట్ వాచ్మెన్ ఉద్యోగంలోచేరాడు, ఎప్పటిలాగానే గురువారం తన షిఫ్ట్ ముగుంచుకొని అక్కడ రెస్ట్ రూమ్ లో పండుకున్నదని, తిరిగి తెల్లవారుజామున నిద్రలేవకపోయేసరికి అక్కడ ఉన్న మిగతా సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుకునూర్ పల్లి ఎస్సై పుష్పరాజ్ సంఘటన స్థలానికి చేరుకొని విచరించారు నిద్రలో మరణించి ఉంటాడని భావించి కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని గజ్వేల్ హాస్పిటల్ కు తరలించారు..

కొత్త రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి.

కొత్త రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి.

హుస్నాబాద్ యదార్థవాది

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9ఏళ్ళు అవుతున్న కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని అక్కనపేట సీపీఐ పార్టి మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్ ఆధ్వర్యంలో అక్కనపేట తహసీల్దార్ ఇ.సంజీవ్ కుమార్ వినతి పత్రం అందచేశారు.. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 9ఏళ్ళు గా కొత్త రేషన్ కార్డులు, రేషన్ కార్డులలో సవరణలు లేకుండా తాత్సారం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సమస్యలను మర్చిపోయి ఎన్నికల హడావుడి చేస్తున్నారని అన్నారు. రైతుల పొట్ట కొట్టడానికే ధరణి పోర్టల్ ఏర్పాటు చేశారని, రైతులు సాదా బైనమా, ఆర్.ఓ.ఆర్ లేకుండా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా నిమ్మకు నిరత్తేనట్టు వ్యవహరిస్తోన్న పాలక ప్రభుత్వంపై సీపీఐ పార్టి ఆధ్వర్యంలో ఉద్యమించాల్సిందేనని తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మళ్ళీ అధికారం చేపటెందుకు ఎన్నో గారడీలు చేస్తున్నారని ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఇప్పుడు ఎవరు నమ్మరని ఇప్పటికైనా వెంటనే ప్రజ సమస్యలు పరిష్కరించాలని, లేనిచో రానున్న రోజుల్లో సీపీఐ ప్రజా ఉద్యమలు నిర్వహించి బిఆర్ఎస్ ని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అయన అన్నారు. కార్యక్రమంలో కొమ్ముల పార్శరాములు, కిన్నెర కొమురయ్య, గంగయ్య, అత్తెన సంపత్, వరుకుటం కొమురయ్య, ఉల్లి సంపత్, రాజకొమురయ్య, సరిత, రాజవ్వ, లక్ష్మీ, రాజవిరు తదితరులు ఉన్నారు.

గర్భిణీ స్త్రీల కు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ

గర్భిణీ స్త్రీల కు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ

హుస్నాబాద్ యదార్థవాది

హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను అందచేసిన మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, ఆస్పత్రి సూపర్డెంట్ రమేష్.. ఈ సందర్భంగా చైర్ పర్సన్ ఆకుల రజిత మాట్లాడుతూ మహిళల్లో రక్తహీనత పోషక ఆహార లోపాలను తగ్గించేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు ఎంతగానో ఉపయోగపడతాయని, ఆరోగ్యమే మహాభాగ్యమని నినాదంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే మన స్త్రీల కోసం ఈ న్యూట్రిషన్ కిట్లు ప్రవేశపెట్టారని వారికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావంతో ఉండాలని ఆమె అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, 1 వ వార్డు కౌన్సిలర్ కొంకటి నళినీ దేవి, గర్భిణీ స్త్రీలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు..

18యేండ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హాక్కు: జిల్లా కలెక్టర్

18యేండ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హాక్కు: జిల్లా కలెక్టర్

జగిత్యాల యదార్థవాది

18యేండ్లు నిండి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత సముదాయాల సమావేశ మందిరంలో ఎన్నికలకు సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నకిలీ ఓటర్లను గురించి అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చాలని అధికారులను అదేశించారూ. అన్ని పోలింగ్ స్టేషన్ల వ్యక్తిగత తనిఖీ చేసి w.r.t AMF మరియు ఎన్నికల విభాగానికి సంతకం చేసిన కాపీని తమకు అందజేయాలని ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన విధి విధానాలను అనుసరించి పోలింగ్ స్టేషన్‌ను ఖరారు చేయాలని, ఎన్నికల విభాగానికి అవసరమైన ప్రొఫార్మాలో నివేదికలను తయారు చేసి రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు. (3) కంటే ఎక్కువ ps ఉన్న స్థానాల కోసం PS యొక్క గుర్తించాలని, ముసాయిదాలో గుర్తించబడిన భవనాలను, ఈ మార్గదర్శకాలను అనుసరించి సవరించిన షెడ్యూల్ ప్రకారం 6, 7, 8 ఫారమ్‌లను క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు..ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, మంద మకరంద, రెవెన్యూ ఆధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

క్షేత్రస్థాయిలో అధికారులు రైతుల వద్దకు వెళ్ళాలి..

క్షేత్రస్థాయిలో అధికారులు రైతుల వద్దకు వెళ్ళాలి..

-వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పంటలు వేయాలి..

-అకాల వర్షాలతో నష్ట పోతున్న రైతులను ఆయిల్ ఫాం సాగుకు ప్రోత్సహించాలి..

-జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్..

సిద్ధిపేట యదార్థవాది

అయిల్ ఫాం సాగులో వేగం పెంచి ఇచ్చిన లక్ష్యాన్ని చేరేలా పని చెయ్యాలి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.. జిల్లా సమీకృత కార్యాలయంలో గురువారం వ్యవసాయ, ఉద్యాన వన, అయుల్ ప్రేడ్ కార్పొరేషన్, డ్రిప్ కంపెనీ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.. జిల్లాలో ఇప్పటివరకు సూమారు 2059 ఎకరాలు సేకరణ 600 ఎకరాల పైన మొక్కలు పెట్టడం పూర్తి చేశారని జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి సునితా కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత లాభదాయకమైన పంట అయుల్ ఫాం సాగు జిల్లాలో వేగం పెంచాలని, వర్షాకాలం ప్రారంభమైనందున రైతులు పంటలు వేసెలోపు వారితో మాట్లాడి ఆయిల్ ఫాం సాగు చేసేలా ప్రేరెపించాలని, ఈ నెలలోనే మనం పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలని, ఏఈఓ లు ప్రతి రైతు వద్దకు వెళ్ళి ఆయిల్ పాం వల్ల కలిగే లాభాలు తెలుపి ప్రేరణ కల్పించాలని గ్రామాల్లో అయిల్ ఫాం సాగును పెద్ద ఎత్తున ప్రచారం చెయ్యాలని అయిల్ ఫాం సాగుకు రైతులతో డిడి కట్టించడమే కాకుండా ప్లాంటేషన్ జరగాలి రోజు పిల్డు మీదికి వెళ్లి తెలుసుకోవాలని డిఎఓ కి తెలిపారు. ఏఓ లు వారి మండలాలోని పనిలో వెనకబడిన క్లస్టర్ల ను రోజువారీ పర్యవేక్షణ చెయ్యాలని, వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆయిల్ ఫాం సాగు వల్ల వచ్చే లాభాలను తెలుపుతూ రైతులను ప్రోత్సహించాలని అన్నారు. వ్యవసాయ, ఉద్యాన వన శాఖ, ఆయిల్ ప్రేడ్ కార్పొరేషన్ అధికారులు సమన్వయంతో పని చేయ్యాలని తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్, ఆయిల్ ప్రేడ్ కార్పొరేషన్ మెనెజర్ సురేందర్ రెడ్డి, కార్పొరేషన్ ఇంచార్జి సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ముత్యాల పోచమ్మలకు ఘనంగా బోనాలు.

ముత్యాల పోచమ్మలకు ఘనంగా బోనాలు.

సిద్ధిపేట యదార్థవాది

సిద్దిపేట పట్టణంలోని స్థానిక కేసీఆర్ నగర్ గుండ్ల చెరువు డబల్ బెడ్ రూమ్ గృహ సముదాయంలో మైసమ్మ ముత్యాల పోచమ్మ దేవాలయంలో గురువారం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు కాలనీవాసులు.ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, స్థానిక కౌన్సిలర్ నాయిని చంద్రం, మెడికల్ కౌన్సిల్ మెంబర్ పాల సాయిరాం, మాజీ కౌన్సిలర్ బండారు నర్సింలు పాల్గొని అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మ వారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ దేవాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా బిఅర్ఎస్ నాయకులు కడవేర్గు రాజనర్సు మాట్లాడుతూ ఆషాడ మాసం అంటేనే తెలంగాణలో బోనాల పండుగకు ప్రత్యేకమైన విశిష్టత ఉందని డప్పు చప్పుల్లతో పోతరాజుల నాట్య విన్యాసాలతో ఆడపడుచులు మహిళలు ఎంతో పవిత్రంగా భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనం నైవేద్యం సమర్పిస్తారని కార్యక్రమంలో చిన్న పెద్ద అందరూ పాల్గొని గ్రామ దేవతలను భక్తిశ్రద్ధలతో కొలిచి తమ పిల్లా పాపలను పాడి పంటలను చల్లగా కాపాడాలని ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆనందంగా జీవించేలా చూడాలని కోరుకుంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో మైసమ్మ, ముత్యాల పోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు గట్టయ్య,వీరేశం, జెల్ల పద్మ,పద్మశ్రీ రెడ్డి,సింగోజు మురళీకృష్ణ ఆచార్యులు, భవాని, లక్ష్మి, మంజుల, పద్మ, భిక్షపతి, కనకయ్య, యాకయ్య, నాగరాజు, నరేష్, గణేష్, తిరుపతి, ఆస్మ తదితరులు పాల్గొన్నారు.

హుస్నాబాద్ లో కాంగ్రెస్ పై నిర‌స‌న‌

హుస్నాబాద్ లో కాంగ్రెస్ పై నిర‌స‌న..

-సబ్ స్టేషన్ ముందు రేవంత్ దిష్టిబొమ్మకు ఉరి..

-రోడ్డుపై నిర‌స‌న తెలిపిన రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు..

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

వ్య‌వ‌సాయానికి 3 గంట‌ల క‌రెంట్ స‌రిపోతుంద‌ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన‌ వ్యాఖ్య‌ల‌పై హుస్నాబాద్ లో సబ్ స్టేషన్ ముందు రేవంత్ దిష్టిబొమ్మకు ఉరి వేసి అంబేడ్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ రైతు వ్య‌తిరేక విధానాల‌ను నిర‌సిస్తూ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అధ్వర్యంలో ధ‌ర్నా నిర్వ‌హించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ‌లో రైతుల‌కు సీయం కేసీఆర్ అండ‌గా నిలిస్తే… కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల పొట్ట‌కొట్టేందుకు చూస్తుంద‌ని ఉచిత విద్యుత్ పై రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌ను బీఆర్ఎస్ తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌ద‌ని అన్నారు. నాడు టీడీపీ ప్ర‌భుత్వ‌ రైతు వ్య‌తిరేక విధానాల‌పై బ‌షీర్ బాగ్ వ‌ద్ద ఆందోళ‌న చేస్తున్న రైతుల‌పై చంద్ర‌బాబు నాయుడు కాల్పులు జ‌రిపి ముగ్గురిని పొట్ట‌న‌పెట్టుకున్నాడ‌ని, ఇవాళ ఆయ‌న శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా ఉచిత క‌రెంట్ వ‌ద్దంటున్నాడ‌ని, దేశానికి అన్నంపెట్టే రైతులు అంటే కాంగ్రెస్ పార్టీకి మొద‌టి నుంచి కండ్ల మంటేన‌ని అయన అన్నారు. మొన్న‌నేమో ధ‌ర‌ణి వ‌ద్ద‌న్నార‌ని, ఇప్పుడేమో ఉచిత క‌రెంట్ వ‌ద్ద‌ని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ దర్నలో జడ్పీ చైర్మన్ రాజిరెడ్డి, ఎంపీపీ మానస, హుస్నాబాద్ మున్సిపల్ చెర్ పర్సన్ ఆకుల రజిత, నియోజవర్గ బీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు, కార్య‌క‌ర్త‌లు, రైతులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...