35.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

పంచాయతీ కార్మికులకు న్యాయం జరిగే వరకు సిపిఐ పార్టి అండగావుంటుంది: చాడ

పంచాయతీ కార్మికులకు న్యాయం జరిగే వరకు సిపిఐ పార్టి అండగావుంటుంది: చాడ

-రాష్ట్రంలో కార్మికుల దిగిపోయె దినం దగ్గర పడుతున్నా నేటికి గ్రామ పంచాయతీ కార్మికుల బతుకులు మారలేదు.చాడ వెంకటరెడ్డి..

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

నిత్యం పారుశుద్య పనుల్లో నిమగ్నమై ఏండ్ల తరబడి గ్రామపంచాయటి కార్మికులు పనిచేస్తున్నా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల దిగిపోయె దినం దగ్గర పడుతున్నా నేటికి గ్రామ పంచాయతీ కార్మికుల బతుకులు ఏమాత్రం మారలేదని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె చేస్తున్న సందర్భంగా దీక్ష శిబిరాన్ని సిపిఐ నాయకులతో కలిసి సందర్శించి కార్మికుల సమ్మెకు సిపిఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని రిటైర్మెంట్ వయస్సు వచ్చిన కార్మికులకు పర్మినెంట్ చేయకుండా కెసిఆర్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని గ్రామ పంచాయతీలో చదువుకున్న కార్మికులను అర్హతల ఆధారంగా పంచాయితీ కార్యదర్శులు నియమించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కార్మికుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్తి న్యాయం జరిగేంత వరకు కార్మికుల పక్షాన పోరాటం సాగిస్తామని అయన అన్నారు.
కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, తెలంగాణ వ్వవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు బొయిని అశోక్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్, అక్కన్నపెట,కొహెడ మండలలా కార్యదర్శులు కొమ్ముల భాస్కర్, ముంజ గోపి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి, భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర,జిల్లా నాయకురాల్లు గూడెం లక్ష్మి, గూడ పద్మ, సిపిఐ నాయకులు అయిలేని మల్లారెడ్డి, నిమ్మ ధర్మారెడ్డి, బూడిద సదాశివ, మ్యాకల సంపత్ సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

రైతులకు బేడీలు వేసింది మీరైతే.. ఉచిత కరెంటు ఇచ్చింది మేము..

రైతులకు బేడీలు వేసింది మీరైతే.. ఉచిత కరెంటు ఇచ్చింది మేము..

-కాంగ్రెస్ పార్టి అద్వర్యంలో సీఎం కేసిఆర్ దిష్టిబొమ్మ దగ్గం

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

రైతు రాజ్యం అని చెప్పుకొనే బిఆర్ఎస్ ప్రభుత్వం గౌరవేల్లి భూ నిర్వాసితులకు బేడీలు వేయించిన ఘనత మన ఎమ్మెల్యే సతీష్ బాబుకే దక్కుతుందని టీపీసీసీ మెంబర్ కేడెం లింగమూర్తి అన్నారు. కాంగ్రెస్ పార్టి అద్వర్యంలో హుస్నాబాద్ కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద టీపీసీసీ మెంబర్ కేడెం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య ల ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ప్రదర్శన చేసి సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు.. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గాంధీభవన్లో చేపట్టిన సత్యాగ్రహ దీక్ష నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే బీఆర్ఎస్ అనవసర రాద్దాంతం చేస్తుందని ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి హామీలు నెరవేర్చలేని బిఆర్ఎస్ నాయకులు ప్రజల దృష్టిని మరల్చేందుకే అనవసర రాద్దాంతం చేస్తున్నారని, రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, 24 గంటల ఉచిత కరెంటు అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, కనీసం 12 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం లేదని తొమ్మిదిన్నరేళ్ల పాలనలో విద్యుత్ సంస్థలను రూ.60వేల కోట్ల అప్పుల్లో ముంచిన ఘనుడు సీఎం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు.. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అంతేకాకుండా, రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసి, రైతులకు ఇందిరా జల ప్రభ ద్వారా బోర్లు వేసింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక చందు, మున్సిపల్ కౌన్సిలర్ పల్లపు రాజు కల్లేపల్లి కావ్య, వెంకటస్వామి, వెన్నెరాజు, పోతుగంటి బాలయ్య, బిక్యానాయక్, గుడాల నాగులు, కృష్ణస్వామి, విద్యాసాగర్, జవహర్లాల్, సతీష్ ,విశ్వతేజ, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే

రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే

కొండపాక యదార్థవాది

కొండపాక మండల కేంద్రంలో గల సబ్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వాసరి లింగారావు ఆధ్వర్యంలో సీఎం కెసిఆర్ దిష్టిబొమ్మ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను వక్రీకరించి బీఅర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రైతుల కష్టం తెలిసిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వటమే కాంగ్రెస్ పార్టీ విధానం అని రైతుల పక్షాన బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ విధానము తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మల్లేశం, యువజన అధ్యక్షుడు పార్శారములు, ఎస్సి సెల్ అధ్యక్షుడు మల్లికార్జున్, కోఆర్డినేటర్, చిరంజీవి, ఉప్ప సర్పంచ్ ఆరిఫ్, సీనియర్ నాయకులు, తాళ్ల అంజయ్య గౌడ్, వెంకట్ గౌడ్,యువజన నాయకులు, బ్రహ్మం, నాగరాజు, భాను ప్రకాష్, సిద్ధులు,రాజు ,హరీష్, నరేష్,భాను, నర్సింలు కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు

స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు

సిరిసిల్ల యదార్థవాది

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులకు బుదవారం సిరిసిల్ల మినీ స్టేడియంలో నాలుగవ, ఐదవ తరగతి లో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట్, కరీంనగర్ ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశములకు గాను విద్యార్థులకు జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించారు జిల్లా స్థాయిలో 176 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరైనారని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీర రాందాస్ పత్రిక ప్రకటనలో తెలిపిపారు. జిల్లాస్థాయిలో ఎంపికైన విద్యార్థిని విద్యార్థులు రాష్ట్రస్థాయిలో పాల్గొంటారని తెలిపారు.

యువతకు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్

యువతకు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్

-ఆర్మూర్ నియోజకవర్గంలో యువతి యువకులు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్..

-ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో..

ఆర్మూర్ యదార్థవాది

ఆర్మూర్ నియోజకవర్గం లోని యువతి, యువకులకు ప్రతి ఒక్కరికి కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలనే ఉద్దేశం తో స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో 18సంవత్సరాలు నుండి 35సంవత్సరాల వరకు డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి, డ్రైవింగ్ లైసెన్స్ ను రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం జరగబడుతుందని, ఐదు రోజులపాటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో దరఖాస్తు తీసుకున్నట్లు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు పండిత్ ప్రేమ్ తెలిపారు.. ప్రతి గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ లకు ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో, లేదా బర్త్ సర్టిఫికెట్, స్కూల్ బోనోఫైడ్ జిరాక్సులు, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వాలని ఇట్టి సదవకాశాన్ని వినియోగించుకోవలని అన్నారు. కార్యకమంలో ఖాందేష్ శ్రీనివాస్, పిఏ శ్రీకాంత్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పూజా నరేందర్, సుంకరి రవి, తదితరులు పాల్గొన్నారు.

సోషల్ మీడియాలో గుర్తింపు కొసం అత్యుత్సాహం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు.

సోషల్ మీడియాలో గుర్తింపు కొసం అత్యుత్సాహం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు.

-ప్రజ సమస్యలను పరిష్కారానికి ధర్నాలే పరిష్కారం కాదు.

-కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు.

కరీంనగర్ యదార్ధవాది

ప్రజాస్వామ్యంలో ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, కార్మికులు విద్యార్థులు ధర్నాలు చేసే ప్రయత్నంలో శృతిమించి ప్రవర్తిస్తున్నారని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు పత్రిక ప్రకటనలు తెలిపారు.. ప్రజల సమస్యలను అధికారులకు దృష్టికి తీసుకురావడానికి రాజకీయ నాయకులు, కార్మిక, విద్యార్థి సంఘా నాయకులు ధర్నాలు చేయడం సహజమే. ధర్నాలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం కోసం చేసే ప్రయత్నంలో ఒక భాగం మాత్రమే.. ఇటీవలి కాలంలో ధర్నాలు చేసే పద్ధతిలో సోషల్ మీడియా ప్రచారం కోసం పాకులాడుతూ ప్రభుత్వ కార్యాలయాల గేట్లు ఎక్కే ప్రయత్నం చేయడం విధులలో ఉన్న అధికారులపై, పోలీసులపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అయన అన్నారు. కరీంనగర్ లో కూడా వివిధ సంఘాల నాయకులు ప్రతినిధులు కలెక్టరేట్ ముందు ధర్నాలు చేసే పద్ధతిలో ఒక విపరీతమైన ధోరణి కనిపిస్తోందని, ధర్నాలు చేసే వివిధ సంఘాల ప్రతినిధులు, నాయకులు తమ వ్యక్తిగత గుర్తింపు కొరకు కలెక్టరేట్ గేట్లు ఎక్కే ప్రయత్నం చేయడం, అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారులతో ఘర్షణ పడడం ఈమధ్య పెరిగిపోతున్నదిని దీనికి సోషల్ మీడియా ప్రభావం కూడా తోడవడంతో ప్రతి ఒక్కరు ధర్నాలలో గేట్లు ఎక్కే ఫోటోలు పోలీసులతో తోపులాడే ఫోటోలను వెంటనే సోషల్ మీడియా వేదికలైన ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్ మొదలైన వాటిలో పెట్టుకుంటూ తమ గుర్తింపు కోసం పడే తాపత్రయం స్పష్టంగా కనబడుతుందని ఆయన అన్నారు. కలెక్టర్ కార్యాలయం ప్రజలకు సేవలందించే ఒక సేవ కేంద్రనికి ప్రతినిత్యం సామాన్యుడి నుండి మొదలుకొని ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల వరకు వేలాదిమంది తమ తమ పనుల నిమిత్తం, సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ను సందర్శిస్తూ ఉంటారని, జిల్లా నలుములలనుండి వృద్ధులు, వికలాంగులు, మహిళలు తమ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ కు వచ్చినప్పుడు ధర్నాల వల్ల తీవ్ర ఇబ్బందులు అసౌకర్యానికి గురవుతున్నరని, ధర్నాలు చేసే సంఘాల రాజకీయ పార్టీలు నాయకులు ప్రతినిధులు ఈ విషయాన్ని గమనించి ఒక క్రమ పద్ధతిలో, క్రమశిక్షణతో వారి ధర్నాలు కొన్ని నిమిషాల పాటు చేసుకుని మీడియా ద్వారా తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువస్తూ వినతి పత్రాన్ని సమర్పించుకోని వెళ్ళాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజల ఆస్తి ప్రత్యర్తి వర్గాల భూభాగం కాదని కూడా గ్రహించాలని, భారతీయ శిక్షా స్మృతి లో ‘విధి నిర్వహణలో ఉన్న అధికారులతో వాగ్వివాదానికి దిగిన, దురుసుగా ప్రవర్తించిన, బెదిరింపులకు పాల్పడినా, నెట్టివేసిన, అరెస్టు చేసే క్రమంలో ప్రతిఘటించిన తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

శాంతి భద్రతలకే తనిఖీలు: సర్కిల్ ఇన్స్పెక్టర్

శాంతి భద్రతలకే తనిఖీలు: సర్కిల్ ఇన్స్పెక్టర్

అల్లాదుర్గ్ యదార్థవాది

అల్లాదుర్గ్ సర్కిల్ రేగోడ్ పోలీస్ స్టేషన్ పరిది జగిర్యాల్ గ్రామంలో నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ లో తనిఖీలు చేపట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్ జార్జ్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ప్రజల రక్షణ, భద్రత భావం, సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం, ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని అన్నారు. కస్మికంగా కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా సుమారు 200 ఇళ్లను సోదాలు చేశామని, ప్రజలకు రోడ్డు భద్రత, సైబర్ నేరాలు పట్ల అవగాహన కల్పించి, నంబర్ ప్లేట్, ద్విచక్ర వానాలు, పత్రాలు సరిగాలేని, 29 ద్విచక్ర వాహనాలను, 04 ఆటోలు, 02 బోలెరో లను రేగోడ్ పోలీస్టేషన్ కు తరలిస్తున్నమని, సంబంధిత వాహనాల యజమానులు తమ వాహనాల పత్రాలను చూపించి వాహనాలను తీసుకువెళ్లాలని అయన తెలిపారు. గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర వహిస్తాయని, గ్రామంలో సి‌సి కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావడం గొప్ప విషయమని, తమ గ్రామాల స్వీయ రక్షణలో ప్రజలు బాగస్వాములు కావాలని తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుతాయని ప్రజలకు మరింత రక్షణ కల్పించడం జరుగుతోందని అన్నారు. ఈ తనిఖీలలో నలుగురు సబ్ ఇన్స్పెక్టర్, 28 మంది పోలీస్ లు పాల్గొన్నారు..

హాఫ్ మారథాన్ గోడపత్రిక ఆవిష్కరణ

హాఫ్ మారథాన్ గోడపత్రిక ఆవిష్కరణ

సిద్ధిపేట యదార్థవాది

సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల ఆగస్టు 6న నిర్వహించబోయే హాఫ్ మారథాన్ రన్ గోడపత్రికను సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో టియుడబ్ల్యుజే జిల్లా అధ్యక్షుడు రంగాచారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాఫ్ మారతాన్ రన్ కు జర్నలిస్టుల సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.అందరికీ ఆరోగ్యం పంచడమే లక్ష్యంగా పనిచేస్తున్న సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ సభ్యులకు మా సహకారం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే హాఫ్ మారతాన్ డిజిటల్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు,ఆసక్తి గల అభ్యర్థులు ప్రతినిత్యం వివిధ రకాల వ్యాయామాలు చేస్తున్నవారు ఈ రన్ లో పాల్గొనాలన్నారు. సిద్ధిపేట జిల్లా జర్నలిస్టులు అందరూ ఈ రన్ లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సిద్దిపేట ఆఫ్ మారథాన్ రన్ సిద్దిపేట పట్టణ అందాలను ప్రపంచానికి పరిచయం చేసేదిగా ఉంటుందని అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి క్రీడాకారుల్లో మారథాన్ పరుగును తెలియజేయుటకు, ప్రోత్సహించేందుకు హాఫ్ మారథాన్ రన్ నిర్వహిస్తున్నారని అన్నారు. ఇది గ్రామీణ క్రీడాకారులకు గొప్ప అవకాశమని https://shm23.iq301.com ఈ లింక్ ద్వారా అందరు రిజిష్టర్ చేసుకోవాలన్నారు.. కార్యక్రమంలో జర్నలిస్టులు యాదవ్ రెడ్డి, సంజీవరెడ్డి, పాండు, రామకృష్ణ, సింగోజు మురళీకృష్ణ ఆచార్యులు, జాని యూసుఫ్, నగేష్ రామేశ్వర శర్మ, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు బాపురెడ్డి, రాజు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలి

అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలి

నిజామాబాద్ యదార్ధవాది

అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు నల్ల వస్త్రాలు ధరించి స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి బస్టాండ్ భగత్ సింగ్ చౌరస్తా రైల్వే ఓవర్ బ్రిడ్జి మార్కెట్ యార్డ్ దుబ్బ చౌరస్తా మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతి పత్రం సమర్పించారు.. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు నూర్జహాన్, ఏ రమేష్ బాబు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్స్ అయాలు సమస్యలు పరిష్కరించాలని అనే సార్లు అధికారులకు ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో సోమవారం దేశవ్యాప్త కోర్కెల దినోత్సవం గా నిర్వహించడం జరిపామని వారు తెలిపారు.. అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని, పిఎఫ్ ఈఎస్ఐ అమలు జరపాలని, హెల్త్ స్కీమును ప్రకటించి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని, సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం గ్రాట్యూటీ పెన్షన్స్ సౌకర్యాన్ని కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్ కు 5లక్షలు ఆయాలకు 3లక్షలు ఇవ్వాలని పది సంవత్సరాల నుండి బకాయి ఉన్న డిఏడిఏ లను చెల్లించాలని, అధికారులు వేధింపులను నిరోధించాలని వారు కోరారు.. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు దేవగంగు, ప్రధాన కార్యదర్శి స్వర్ణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వై గంగాధర్, సిఐటియు నాయకులు కే రాములు, అంగన్వాడీ యూనియన్ నాయకులు చంద్రకళ, వాణి, సూర్య కళ, జ్యోతి, గోదావరి, యమునా, లక్ష్మి, తదితరులతోపాటు పెద్ద ఎత్తున అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు..

ఫోటోగ్రఫీ రంగంలో బహుమతి పొందిన కృష్ణ

ఫోటోగ్రఫీ రంగంలో బహుమతి పొందిన కృష్ణ

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

రంగుల ప్రపంచానికి అందమైన చిత్రాలను అందించే ఫోటోగ్రఫీ రంగంలో అద్భుతమైన కళాకారులను తయారు చేసేందుకు ఎన్నో కాంపిటీషన్ నిర్వహించిన సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ ఆధ్వర్యంలో గోవాలో 69వ ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ను జూలై 2 వ తేదీ నుండి 4వ తేదీ వరకు నిర్వహించినారు.ఫోటోగ్రఫీ వర్క్ షాప్ లో దేశం నుండి నలుమూలల 150 మందికి పైగా ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.వివిధ అంశాల మీద ఫోటోగ్రఫీ చేసి సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలానికి చెందిన దాసరి కృష్ణ కాంస్య పథకాన్ని ప్రశంస పత్రాన్ని సిగ్మా ఆర్ట్ అకాడమీ అధ్యక్షుడు ఎం సి శేఖర్ ముంబై చీఫ్ ఫ్యాకల్టీ సునీల్ మరాటి చేతుల మీదుగా అందుకోవడం చాలా గర్వంగా ఉందని ఇంకా పెద్ద పెద్ద అవార్డులు పొందడానికి కృషి చేస్తానని దాసరి కృష్ణ అన్నారు.ఫోటోగ్రఫీ పై మక్కువతో దాదాపు 25 సంవత్సరాల నుండి వివిధ రకాల ఫోటోలను చిత్రీకరిస్తూ అలాగే కాంపిటీషన్ వర్క్ షాప్ లలో పాల్గొని రకరకాల బహుమతులతో అవార్డులు అందుకున్న దాసరి కృష్ణ ను తోటి ఫోటోగ్రాఫర్లు మరియు గ్రామస్తులు అభినందించారు ఇలాంటివే కాకుండా బంగారు పతకాలను సాధించాలని కొనియాడారు..

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...