36.2 C
Hyderabad
Friday, May 3, 2024
హోమ్ఆంధ్రప్రదేశ్ఉచిత పథకాలకు చెక్.!

ఉచిత పథకాలకు చెక్.!

ఉచిత పథకాలకు చెక్.!

*కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి..

*రాజకీయ నిపుణుల, మేధావుల అభిప్రాయం..

న్యూఢిల్లీ యదార్థవాది ప్రతినిధి:

రాజకీయ పార్టీలు అధికారం కోసం లేదా.. అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రకటించే ఉచిత పథకాలను కేంద్ర ప్రభుత్వమే చేరువతీసుకుని కొత్త చట్టాన్ని అమలు చేయాలని నిపుణులు ఆర్థికవేత్త సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉచిత పథకాలను సమీక్షించి చట్టం చేయకుంటే భారత దేశం దివాలా తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ దేశంలోని బ్యాంకులను ముంచి పారిపోయిన నిరవ్ మోడీ విజయ్ మాల్యా లగా వ్యవహరిస్తే బ్యాంకుల దివాలా లాగా దేశం కూడా దివాలా  తీస్తుందని అంటున్నారు. ముఖ్యంగా పథకాలను పరిమితులు విధిస్తూ నిబంధన పెట్టాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది అనుత్పదక వ్యాయాల కాకుండా.. ఉత్పాదక వ్యాయాల విషయంలోని పథకాల అమలు చేస్తే బాగుంటుందని కొందరి అభిప్రాయం. ఇకపోతే పని దినాలు కల్పించాలని చేపట్టిన ఉపాధి హామీ పథకం కూడా దివాలా పథకం గా మారింది. వేల కోట్ల ఖర్చు చేస్తున్న సమగ్రంగా పనులు జరగడం లేదు.. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ పంజాబ్ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో అనుత్పదక పథకాలకు వేలకోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుండడంతో మౌలిక సదుపాయాల కల్పన పడకేస్తోంది. అలాగే పథకాలను కొనసాగించేందుకు వేల కోట్ల అప్పులు చేయాల్సి వస్తుంది ఉచిత టీవీలు ల్యాప్ ట్యాప్ సైకిల్ కుట్టు మిషన్లు ఇలా అనేక వస్తువులు ఇస్తామంటున్నాయి.. రేపు పార్టీలు ఉచితంగా మద్యం బంగారాన్ని పంపిణీ చేస్తామంటూ పథకాలను ప్రవేశపెట్టిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఉచితంగా ఇవ్వద్దని రాజ్యాంగంలో ఎక్కడ లేదు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు పథకాలను జోరుగా అమలు చేస్తున్నాయి. ఇలాంటి వాటిని కేంద్ర ఎన్నికల సంఘం కట్టడీ చేయలేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కట్టడి చేసేలా ఒక నూతన చట్టాన్ని అమల్లోకి తేవాల్సిన అవసరం ఉందని మేధావులు సూచిస్తున్నారు. విద్యా వైద్యం వంటి పేదల సంక్షేమ సంబంధించిన రంగాలలో ఉచితాలు అవసరం ఉంది వీటికి డబ్బులు విచించాల్సిందే.. ఉచిత పథకాలకు పరిమితులు ఉండాలని రాజకీయ నిపుణులు సైతం సూచిస్తున్నారు. పన్నుల ద్వారా ప్రజల నుండి వసూలు చేసిన డబ్బును ఉచిత పథకాలకు కేటాయిస్తూ మౌలిక సదుపాయాలకు రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి. ఎఫ్ ఆర్ బి ఎం పరిమితికి మించి అప్పు కోసం కేంద్రాన్ని కోరుతున్నారు.. ఉచిత పథకాలకు నిధులను ధారబోయకుండా ఇలాంటి మౌలిక సదుపాయాలకు వేచిస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఈ క్రమంలో కేంద్రం చట్టం చేసి పరిమితులు విధించేలా రాజ్యాంగ సవరణలు చేయాలని నిపుణుల మేధావుల అంటున్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్