36.2 C
Hyderabad
Friday, May 3, 2024
హోమ్తెలంగాణలయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం.

లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం.

లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం.

హైదరాబాద్ మార్చ్ 15, యదార్థవాది ప్రతినిధి: 

చైతన్యపురి బస్ స్టాప్ లో  శుక్రవారం  లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ యంగ్ లైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా లయన్స్ క్లబ్ 320A, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ జూలూరు రఘు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పూర్తి చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యంగ్ లయన్స్ ఎవరెస్ట్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ వారిని అభినందించారు. ఇటువంటి గొప్ప సేవా కార్యక్రమాలని నిర్వహించడానికి ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా గుర్తించి తమకు వచ్చే సంపాదనలో కొంతైనా సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తే సమాజంలో ఎంతో బీద స్థితిని అనుభవిస్తున్న వారికి చేయూత నిచ్చిన వారు అవుతారని రఘు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో విపరీతమైన ఎండలు వేడిగాలితో సామాన్య ప్రజలకు దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ చలివేంద్రం ద్వారా పాదాచారులకు, ఆటో రిక్షా వారికి, అడ్డమీది మీద కూలీలకు, కోచింగ్లకు వచ్చే విద్యార్థిని, విద్యార్థులకు ప్రజలందరికీ చల్లని నీటిని అందించే  విధంగా స్వచ్ఛమైన నీటిని క్యాన్లలో ఏర్పాటు చేయడం జరిగినదని ఇట్టి వసతినీ ప్రజలందరూ ఉపయోగించుకొని అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవా సంఘం నాయకులు మొగుళ్ళపల్లి ఉపేందర్, ప్రముఖ న్యాయవాది పి,వి రవికుమార్, లయన్స్ బృందం సభ్యులు కాటం సునీల్, అధ్యక్షులు అరవింద్, రవీందర్, ఎదులకంటి శ్రీనివాస్ ఏం శ్రీనివాస్ ఈ యొక్క సేవా కార్యక్రమానికి  ముఖ్యంగా ఆర్థిక సహాయం అందించిన దాతలు లయన్స్ క్లబ్ సభ్యులు పసుపులేటి సుబ్బయ్య, మహేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, డీజే రమేష్ , మంత్రి రాజు, రాము గౌడ్, సుధాకర్ తెలంగాణ ఎడ్యుకేషనల్ అడ్వైజర్స్ సభ్యులు మామిడి అశోక్ గారు, కన్నె ఆనంద్ కుమార్, రమణారెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్