42.2 C
Hyderabad
Friday, May 3, 2024
హోమ్తెలంగాణప్రజా తీర్పును గౌరవించాలి.

ప్రజా తీర్పును గౌరవించాలి.

ప్రజా తీర్పును గౌరవించాలి.

దుబ్బాక మార్చ్ 23, యదార్థవాది ప్రతినిధి:

పార్టీ ఫిరాయింపుల గురించి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి.మచ్చ శ్రీనివాస్, కాల్వ నరేష్ అన్నారు. శనివారం దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీ గుర్తుపై గెలిసిన ప్రజా ప్రతినిధులను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నది నిజం కాదా  కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మానం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేసిన ఆరు గ్యారంటీలకు ఆకర్షితులై ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉంటే మింగుడు బడని టిఆర్ఎస్ పార్టీ నాయకులుపనికిమాలిన విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం. రాష్ట్రంలో ఏ రోజైనా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగిందా అని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన కొనసాగుతా ఉంటే ఓర్వలేని బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి అధికార పార్టీకి సహకరించాలని కోరారు. లేనిపక్షంలో ప్రజలే మీ నాయకత్వాన్ని  చెప్పులతో కొట్టే కాలం వస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ ఉషయ్య గారి రాజిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అమ్మన కళధర రెడ్డి, పుట్ట బాలకిషన్, సత్తు శ్రీనివాస్ రెడ్డి, కర్ణంపల్లి రమేష్ గౌడ్, దుబ్బాక మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్, మల్లుగారి రామచంద్ర రెడ్డి. స్వామి, నస్కంటి నర్సింలు గౌడ్ తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్