41.2 C
Hyderabad
Friday, May 3, 2024
హోమ్Videosజిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

జగిత్యాల యదార్థవాది ప్రతినిధి 

ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జగిత్యాల ఇంటిగ్రేటెడ్ జిల్లా కలెక్టరేట్ లో జాతీయ పతాకాన్ని కలెక్టర్  యాస్మిన్ బాషా ఆవిష్కరించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సముదాయంలో ముందుగా మహాత్మ గాంధీ డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించి జాతీయ పతాకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రజలనుద్దేశించి కలెక్టర్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ ప్రజా పాలనలో ప్రజల అభివృద్ధి సంక్షేమ కొరకు రాష్ట్ర ప్రభుత్వం  సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని ఇందులో భాగంగా డిసెంబర్ 9 నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టిఎస్ఆర్టిసి బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం పెంచిందని ఈ పథకాల ద్వారా పేద ప్రజలకు ఎంతో ఉపయోగదాయకమని అన్నారు. అనంతరం విధులలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 354 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, రూ. 33.14 కోట్ల విలువ గల చెక్కును 1805 మహిళా స్వశక్తి సంఘాలకు స్త్రీనిధి రుణాల పంపిణి చేశారు. రూ. 2.10 కోట్ల చెక్కును తెలంగాణ మెప్మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ జిల్లా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి కింద చెక్కును అందించారు. రూ. 100.50 కోట్ల విలువ గల చెక్కును 911 మహిళా స్వశక్తి సంఘాలకు బ్యాంకు రుణాల కింద పంపిణి చేశారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన పలు శాఖల ఎగ్జిబిషన్ లో పంచాయతీ గ్రామీణాభివృద్ది పట్టణ పేదరిక నిర్మూలన మహిళా శిశు దివ్యాంగుల వయో వృద్దుల సంక్షేమ శాఖ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అక్షయ్ ఇండియన్ ఉద్యానవనం పట్టు పరిశ్రమ శాఖ పశు సంవర్ధక శాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖల స్టాళ్లను కలెక్టర్ అదనపు కలెక్టర్లు సందర్శించారు. ఈ కార్యక్రమాలలో ప్రభుత్వ విప్ ధర్మపురి నియోజకవర్గ శాసన సభ్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత శాసన మండలి సభ్యులు టి. జీవన్ రెడ్డి జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత దివాకర జిల్లాలోని అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్