40.2 C
Hyderabad
Friday, May 3, 2024
హోమ్జాతీయహైదరాబాద్‌ లో ఆల్ ఇండియా జిఎస్‌ఐ ఇండోర గేమ్స్ ప్రారంభం.

హైదరాబాద్‌ లో ఆల్ ఇండియా జిఎస్‌ఐ ఇండోర గేమ్స్ ప్రారంభం.

హైదరాబాద్‌ లో ఆల్ ఇండియా జిఎస్‌ఐ ఇండోర గేమ్స్ ప్రారంభం.

హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి

37వ ఆల్ ఇండియా జిఎస్‌ఐ ఇండోర్ గేమ్స్ ను హైదరాబాద్‌లోని వి-స్పోర్ట్స్ అకాడమీలో పద్మశ్రీ మిథాలీ రాజ్ ప్రారంభించారు. 2024 జనవరి 30-31 తేదీలలో జరుగుతున్న ఈ రెండు రోజుల ఈవెంట్‌కు రీజనల్ స్పోర్ట్స్ కౌన్సిల్ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీ సి.హెచ్ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ జిఎస్‌ఐ ఇండోర్ గేమ్స్‌లో పాల్గొనడానికి పాల్గొనడానికి పలు కార్యాలయాలనుండి 150 మంది పాల్గొంటున్నారు. ఇండోర్ గేమ్స్ లో క్యారమ్స్ బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్ చెస్ బ్రిడ్జ్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మిథాలీ రాజ్ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఫిట్‌గా చురుగ్గా ఉండేందుకు క్రీడల ప్రాముఖ్యతను విహరిస్తూ జీవితంలో విజయానికి  విలువలైన క్రమశిక్షణ అంకితభావం నిబద్ధత గల జీవితాన్ని ఆస్వాదించడానికి  క్రీడలు ఏంతో తోడ్పడతాయని అన్నారు. సి.హెచ్. వెంకటేశ్వరరావు సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ  ఈ వేడుకకు ముఖ్య అతిధిగా రావడానికి అంగీకరించినందుకు  మిథాలీ రాజ్ ను అభినందించారు. స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్‌ను పెంపొందించడానికి తమ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం కోసం జిఎస్ఐలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చి పాల్గొనే వారందరూ ఆరోగ్యకరమైన స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్‌లు  ఎల్.పి.సింగ్ ఎస్.ఎన్. మహాపాత్రో అన్షుమన్ ఆచార్య కె.వి. మారుతి  ఎం.ఎన్. ప్రవీణ్ లతో సంజయ్ చౌదరి శ్రీనివాసులు భూటియా దొర ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్