38.2 C
Hyderabad
Friday, April 24, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 100

9 మందిని ప్రాణాలు కాపాడిన కావలి రూరల్ పోలీసులు

సముద్రంలో చిక్కుకున్న 9 మందిని ప్రాణాలు కాపాడిన కావలి రూరల్ పోలీసులు

యదార్థవాది ప్రతినిధి కావలి

కావలి రూరల్ మండలంలోని చెన్నాయపాలెం సముద్ర తీరంలో పడవలో సరదాగా తిరుగుదామనుకొని ముసునూరుకు చెందిన 9 మంది యువకులు మధ్యాహ్నం ఫైబర్ పడవను మాట్లాడుకొని ఒకటిన్నర కిలోమీటర్ వెళ్లిన తరువాత పడవ మోటార్ చెడిపోయింది దిక్కు తోచని స్థితిలో ఏమి చేయాలో అర్ధం కాక 112 కు కాల్ చేసిన పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న కావలి రూరల్ పోలీసులు హుటాహుటిన మరో బోటులో బాధితుల వద్దకు చేరుకొని భరోసా కల్పించి, క్షేమంగా ఒడ్డుకు చేర్చారు కావలి రూరల్ పోలీసులు ఆనందభాష్పలతో కృతజ్ఞతలు తెలిపిన 9 మంది బాధితులు. సంతోషంతో ధన్యవాదములు తెలిపిన బాధితుల కుటుంబ సభ్యులు స్థానికులు ప్రజలు.

సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

యదార్థవాది ప్రతినిధి కడప

ఇంటి వద్ద ఉంటూ ఉద్యోగాలు చేస్తూ రోజుకు వేలల్లో సంపాదించండి…అంటూ వచ్చే మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ తెలిపారు. ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు అమాయకులైన వారిని మాయమాటలతో మభ్యపెడుతూ మెసేజ్ లింక్ తో ఉన్న నకిలీ వెబ్ సైట్ ల పేరు చెబుతూ యూట్యూబ్ లో యాడ్స్ ప్రమోషన్ చేస్తే భారీగా కమిషన్ ఇస్తామని ఆశచూపి మోసాలకు తెగబడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఇందుకు కొంత పెట్టుబడి పెట్టాలంటూ మాయ మాటలతో ఆశ చూపి ఇన్ కం ట్యాక్స్, ప్రోసెసింగ్ చార్జిలపేరిట లక్షలకు లక్షలు కొల్లగొడుతున్నారని అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ లకు స్పందించవద్దని సూచించారు. బ్యాంక్ ఖాతా తో పాటు ఇతర విలువైన వ్యక్తిగత సమాచారాన్ని ఎవ్వరికి.షేర్ చేయవద్దన్నారు

వృద్ధురాలిని కాపాడిన పోలీసు

ఆత్మహత్య కు పాల్పడబోతున్న వృద్ధురాలిని కాపాడిన పోలీసు

యధార్థవాది ప్రతినిధి పల్నాడు

ఆత్మహత్యకు పాల్పడబోతున్న వృద్ధురాలిని ముప్పాళ్ల పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మక్కెన మాధవరావు కాపాడారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చాగంటివారి పాలెం గ్రామానికి చెందిన 70 సంవత్సరాల వయస్సు గల వృద్ధురాలైనా ధర్మరాజుల సుబ్బులు కొడుకులు పట్టించుకోని చూసుకోవడం లేదని ఈ వయస్సులో పనికి పంపిస్తున్నారనే కారణంతో మనస్తాపం చెంది ఎన్ఎస్పీ కార్యాలయం వద్ద గల పెదనందిపాడు కెనాల్ దూకింది.ఎస్ఐ పట్టాభిరామయ్య ద్వారా సమాచారం తెలుసుకున్న స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మక్కెన మాధవరావు వెంటనే స్పందించి గంటసేపు కాలవలో వెతికి కాలవ అనుకుని ఉన్న తూటికరలో ఇరుకుపోయిన సుబ్బులు ను కాపాడారు.ఈ సందర్భంగా సుబ్బులు ను స్టేషన్ తీసుకువచ్చి కొడుకులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపినట్లు పోలీసులు తెలిపారు.తక్షణమే స్పందించి సుబ్బులు ను కాపాడిన స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మాధవరావు ను స్థానికులు అభినందించారు.

నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష తేదీల్లో మార్పులు

నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష తేదీల్లో మార్పులు

యదార్థవాది బ్యూరో ఢిల్లీ

పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష- 2023 తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది మే 5వ తేదీన జరగాల్సిన ప్రవేశ పరీక్షను మే 21న నిర్వహించనున్నారు. గతంలో ప్రకటించిన నోటిఫికేషన్‌ ఆధారంగా ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు జనవరి 31వ తేదీతో ముగిసింది. తాజాగా పరీక్ష తేదీలో మార్పు చోటుచేసుకోవడంతో ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును మార్చి 25 వరకు పొడిగించారు. మే 16న అడ్మిట్‌ కార్డులు, జూన్‌ 20న ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ మేరకు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్స్‌ (ఎన్‌బీఈ) ప్రకటన విడుదల చేసింది.

గుణదల మేరీ మాత ఉత్సవాలకు పటిష్ట భద్రత

గుణదల మేరీ మాత ఉత్సవాలకు పటిష్ట భద్రత

యదార్థవాది ప్రతినిధి విజయవాడ

నగర పోలీస్ కమిషనర్ శ్రీ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్ ఎన్.టి.ఆర్.జిల్లా, విజయవాడ నగరంలో ది.09.02.2023 తేదీ నుండి జరగనున్న గుణదల మేరీ మాత ఉత్సవాల సందర్భంగా పటిష్టమైన భద్రత ఏర్పాట్లును పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా పరిశీలించారు బంధోబస్త్ ఏర్పాట్లలలో లా & ఆర్డర్ ట్రాఫిక్ పార్కింగ్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి అధికారులకు, సిబ్బంది, టెంపుల్ నిర్వాహకులకు తగు సూచనలు సలహాలను అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు రోజులపాటు విజయవాడ నగరంలో జరగనున్న గుణదల మేరీ మాత ఉత్సవాల సందర్భంగా ఎక్కడా ఎటువంటి అవంచనీయ జరుగకుండా 1500 పోలీస్ అధికారుల సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ముఖ్య ప్రదేశాలలో సి.సి.కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు, మూవింగ్ పార్టీలను ఏర్పాటు చేసి భక్తుల రద్దీ ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది అని తెలియజేశారు అనంతరం పోలీస్ కమీషనర్ గుణదల మేరిమాత టెంపుల్ కి వచ్చే అన్ని రహదారులలో పర్యటించి పార్కింగ్ ట్రాఫిక్ ఎక్కడా అంతరాయం లేకుండా ఏర్పాటు చేయు బందోబస్త్ విషయమై ట్రాఫిక్ డి.సి.పి. కె. శ్రీనివాసరావు కి తగు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ కె. శ్రీనివాసరావు సెంట్రల్ ఏ.సి.పి. ఖాధర్ బాషా మాచవరం ఇన్స్పెక్టర్ కగుణారామ్, ట్రాఫిక్ అధికారులు సిబ్బంది మరియు మేరీ మాత టెంపుల్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

హత్య కేసు సేదించిన పోలీసులు

హత్య కేసు సేదించిన పోలీసులు

నిజామాబాద్ యదార్థవాది ప్రతినిధి

మల్కాపూర్ శివారులోని అటవీ ప్రాంతంలో జరిగిన హత్య కేసు చేదించిన నిజామాబాద్ పోలీసులు కమిషనర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు కేసు వివరాలు వెల్లడించారు మల్కాపూర్ తాండ కేశవత్ ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ నరేష్ షేక్ రజిని పట్టుకొని విచారించగా తన స్నేహితుడైన నిజాముద్దీన్ కత్తితో పొడిచి చంపానని నేరని అంగీకరించాడు వివరాల్లోకెళ్తే ఎండి నిజాముద్దీన్ షేక్ హజి తొమ్మిది సంవత్సరాలుగా ఇద్దరు స్నేహితులుగా కలిసిమెలిసి ఉన్నారు గత ఆరు నెలల క్రితం నిజాముద్దీన్ పని చేసే వద్ద హాజీని కొట్టినాడు. హజీకి పని దొరకకుండా నిజాముద్దీన్ చేసినాడు. నిజాముద్దీన్ కాలు విరిగిపోయినప్పుడు హజి చేసిన సేవలు కూడా గుర్తు పెట్టుకోకుండా అతన్నితో గొడవ పడినందున అతని నమ్మించి చంపివేయాలని అనుకున్నాడు హజి. ఆ విధంగా అతడు మూడు నెలల క్రితం అతన్ని దావత్ చేసుకుందాం అని పిలిచి మల్కాపూర్ శివారులోని అడవికి మందు తీసుకొని వెళ్లి అక్కడ నిజాముద్దీన్ కు మందు త్రాగిపించి , తాగిన మత్తులో నిజాముద్దీన్ ఉండగా హాజి అతని కత్తితో కడుపులో ఇష్టం వచ్చినట్టు పొడిచి చంపేసినాడు తర్వాత అతని ఎవరు గుర్తుపట్టకుండా అతనిపైన కట్టెలు వేసి కాల్చి వేసినాడు. అని చెప్పి తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు హాజి పై సెక్షన్ 384/2022 u/s 302 201 కేసు నమోదు చేసి జ్యూడిషల్ రిమాండ్ కు పంపుతున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో ACPవెంకటేశ్వర్ సి ఐ జె. నరేష్ పి. ఎస్ SIP G లింబాద్రి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

కేంద్ర మంత్రి నీ కలిసిన ఎంపీలు

కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన ఎంపీలు నాగేశ్వరరావు, రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్యే వెంకటవీరయ్య

యదార్థవది బ్యూరో ఢిల్లీ

ఖమ్మం జిల్లాలోని తన నియోజకవర్గం సత్తుపల్లి మీదుగా వెళ్లే జాతీయ రహదారులను మరింత విస్తరించాల్సిందిగా, రోడ్లకిరువైపులా డ్రైన్స్ మంజూరు చేయాల్సిందిగాకోరుతూ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,బండి పార్థసారథి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశారు ఢిల్లీలో మంగళవారం మధ్యాహ్నం గడ్కరీతో సమావేశమై తమ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా గుండా వెళ్లే జాతీయ రహదారులు, వాటి విస్తరణ, కొత్తగా కట్టిన కలెక్టరేట్ వద్ద అలైన్మెంట్ మార్పు,డ్రైన్స్ మంజూరు చేయాల్సిన అవసరం గురించి వివరించారు.ఎంపీలు, ఎమ్మెల్యే తన దృష్టికి తెచ్చిన అంశాలను మంత్రి సావధానంగా విని సానుకూలంగా స్పందించారు, ఇందుకు సంబంధించి అధికారులకు తగు ఆదేశాలిచ్చారు ఈ సందర్భంగా వారు గడ్కరీకి ధన్యవాదాలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు.

కొత్త రేషన్ డీలర్స్ సామాగ్రి పంపిణీ

కొత్త రేషన్ డీలర్స్ సామాగ్రి పంపిణీ

యదార్థవాది ప్రతినిధి ఆర్మూర్

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలో కొత్త రేషన్ డీలర్లుగా 30 మంజూరు అయినట్లు ఆర్మూర్ డివిజన్ రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ తెలిపారు. కొత్త రేషన్ డీలర్లకు సంబంధిత సామాగ్రి పంపిణీ చేశారు. డివిజన్ పరిధిలో మండలాల వారీగా మంజూరైన రేషన్ డీలర్ల వివరాలు, ఆలూర్ ఒకటి, ఆర్మూర్ ఐదు, బాల్కొండ రెండు, భీంగల్ నాలుగు, కమ్మర్పల్లి మూడు, మెండోరా నాలుగు, మోర్తాడ్ రెండు, ముప్కాల్ ఒక్కటి, నందిపేట్ మూడు, వేల్పూర్ నాలుగు, ఏర్గట్ల ఒకటి, అని తెలిపారు.

కార్యదర్శులకు, ఎంపీవోలకు అవగాహన కార్యక్రమం

కార్యదర్శులకు, ఎంపీవోలకు అవగాహన కార్యక్రమం

యదార్థవాది ప్రతినిధి కామారెడ్డి

గ్రామాలలో అనుమతి లేకుండా గృహాల నిర్మాణం చేపడితే వారికి పంచాయతీ కార్యదర్శులు నోటీసులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ, రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం లేఅవుట్ రూల్స్, బిల్డింగ్ రెగ్యులేషన్స్ ఇతర కార్యక్రమాలపై పంచాయతీ కార్యదర్శులకు, ఎంపీవో లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అసైన్మెంట్, ఫారెస్ట్ భూముల్లో గృహాలు నిర్మించడానికి అనుమతి ఇవ్వరాదని తెలిపారు. పౌల్ట్రీ పామ్ కు అనుమతి ఇవ్వవద్దని చెప్పారు. సంబంధిత పరిశ్రమల శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. సొంత స్థలంలో గృహాలు నిర్మించుకునే వారికి అనుమతి ఇవ్వాలని సూచించారు. చట్టం ప్రకారం లేఅవుట్ రూల్స్ పాటించాలని కోరారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు తడి పొడి చెత్తను సేకరించే విధంగా చూడాలన్నారు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించి తడి, పొడి చెత్తను వేరుచేసి తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువులు తయారుచేసి గ్రామాల్లోని రైతులకు విక్రయించి పంచాయతీ ఆదాయాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. పొడి చెత్తను విక్రయించి ఆదాయాన్ని రాబట్టాలని కోరారు. గ్రామాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టి భూగర్భ జలాల పెంపునకు అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. ఇంటి పనులు అన్ని గ్రామాల్లో 100% వసూలు చేయాలని తెలిపారు. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడారు. జిల్లాలో 146 గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ లో ఉన్నాయని తెలిపారు. పరిశుభ్రత కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో చేపట్టాలని చెప్పారు. సమావేశంలో జెడ్పి సీఈవో సాయా గౌడ్, ఇన్చార్జి డిపిఓ సాయిబాబా, డిటిసిపిఓ నరహరి, డిఎల్పిఓ సురేందర్, రిలయన్స్ ఫౌండేషన్ డిపిఎం రాజు, ఎస్బిఎం సమన్వయకర్తలు మధు కృష్ణ, నారాయణ ఎంపీవోలు, అధికారులు పాల్గొన్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన జోన్- 3 డిఐజి

జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన జోన్- 3 డిఐజి

యదార్థవాది ప్రతినిధి కామారెడ్డి

కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన జోన్- 3 రాజన్న రేంజ్ డిఐజి రమేష్ నాయుడు జిల్లా ఎస్పీ బి. శ్రీనివాస రెడ్డి అదనపు ఎస్పీ J అన్యోన్య పుష్పగుచ్చం సమర్పించి స్వాగతం తెలిపారు. తదుపరి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతరం పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలోని  అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన వెంటనే స్పందించి సహాయపడాలని అప్పుడే పోలీస్ శాఖకు మంచి పేరు వస్తుందని తెలియజేశారు. పోలీస్ శాఖ ఉద్యోగం (యూనిఫామ్ సర్వీస్) చాలా ఉన్నతమైనదని అందుకనే ప్రతి ఒక్క పోలీస్ అధికారి తన వంతు బాధ్యతగా సక్రమంగా విధులు నిర్వహించి బాధితులు పోలీస్ స్టేషన్ కు వచ్చిన వెంటనే వారి సమస్యలను క్లుప్తంగా విని అతి త్వరగా సమస్య పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులందరికీ సూచించడం జరిగినది. ఈ సమావేశానికి జిల్లాలోని ఎస్ఐలు, సిఐలు కామారెడ్డి బాన్సువాడ ఎల్లారెడ్డి డీఎస్పీ పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...