కామారెడ్డి మున్సిపాలిటీలో పని చేయుచున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంగళవారం కామారెడ్డి మున్సిపల్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ దేవేందర్ కు వినతిపత్రం సమర్పించారు వెంటనే స్పందిస్తూ రెండు మూడు రోజుల్లో పెండింగ్ జీతాలు ఇస్తామని అలాగే మార్చిలోపు ఏరియర్స్ పి ఎస్ .ఈఎస్ఐ చెల్లిస్తామని హామీ ఇచ్చారు సిఐటియు జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ మద్దతు తెలిపీ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం పాలకవర్గం పనిచేయాలని మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ కాలనీ ఏర్పాటు చేయాలని అసెంబ్లీ సమావేశంలో మున్సిపల్ కార్మికులకు బడ్జెట్ కేటాయించకపోవడం చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దీపక్ జిల్లా కోశాధికారి నాయకులు మధు వీరయ్య దీవెన శివరాజవ బి రాజవ్వ ఎర్రోళ్ల నరసవ్వ గంగవ్వ రంజిత్ భరత్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ పార్టీ గతఎన్నికల మేనిఫెష్టోలో ముస్లింలకు ఏపీలో ఇస్లామిక్ బ్యాంకులు ఏర్పాటుచేసి వడ్డీలేని రుణాలు ముస్లిం మైనార్టీలకు అందచేస్తామని నాటి ప్రతిపక్ష నేత ..నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి వై .యస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు కానీ నేటివరకు రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం కోసం ప్రతినియోజకవర్గంలో ఇస్లామిక్ బ్యాంక్ లు ఏర్పాటుచేయలేదని ఆజుమన్ -ఏ -ఇస్లామియా విజయవాడ ఎన్టీఆర్ జిల్లాకమిటీ అధ్యక్షుడు షేక్ ఖాజా మొహినుద్దీన్ ,ప్రధాన కార్యదర్శి షేక్ నాగూర్ వేలగపూడి సచివాలయంలో వున్నా మైనార్టీ వెల్ఫేర్ ప్రధానసచివాలయంలో సమర్పించి.తదనంతరం ఏపీ మైనార్టీ వెల్ఫేర్ స్పెషల్ సెక్రెటరీ ఏ . ఏం .డి ఇంతియాజ్ అహ్మద్ కు వినతి పత్రం సమర్ఫించి రాష్ట్రంలో వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ లు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు వినతిపత్రంలో వున్నా పలు అంశాలను వివరించారు
సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీ ఆదివారం నిర్వహించనున్న హాఫ్ మారథాన్ పరుగు పోటీల్లో యువతి, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని హుస్నాబాద్ ఏసిపి సతీష్ తెలిపారు. హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆన్ లైన్ లో హాఫ్ మారథాన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారంతో ముగిసిందని, అందులో 21కె పరుగు పోటీకి 87 మంది, 10కె పరుగు పోటీకి 132 మంది, 5 కె పరుగు పోటీకి 1818 మంది మొత్తం 2037 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. ఈ హాఫ్ మారథాన్ లో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, సిపి శ్వేత రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రధానం చేస్తారన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, యువతీ, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని హాఫ్ మారథాన్ ను విజయవంతం చేయాలని కోరారు.
జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం రాజారాంపల్లి గ్రామానికి చెందిన బండారి పెద్ద కనుకయ్యకి చెందిన పూరి గుడిసె శనివారం నాడు అగ్ని ప్రమాదానికి గుడిసె కూలిపోయి, కూతురు పెళ్లికి దాచుకున్న డబ్బులు, బంగారం, ధాన్యం బస్తాలు, బట్టలు, సర్టిఫికెట్ లు పూర్తి అగ్నికి ఆహుతై, కట్టుకోడానికి బట్టలు లేని పరిస్థితి ఉన్నావారిని మంగళవారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు, మంత్రి మండలం బిఆరెస్ పార్టీ నాయకులు కలిసి 2 లక్షల 55 వేలు రూపాయల విరాళాలతో పాటు రెండు నెలకు సంబంధించిన నిత్యావసర వస్తువులను కనకయ్య కుటుంబానికి అందించడం జరిగింది, అనంతరం ఎల్లాపూర్ కుటుంబాన్ని ఓదార్చి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు, అనంతరం స్నేహలత గారు కనుకయ్య కుటుంబ సభ్యులకు బట్టలను అందించారు ఈ సందర్భంగా ఎల్లాపూర్ గ్రామానికి చెందిన సిద్దార్థ అనే బాబు తాను సొంతంగా దాచుకున్న డబ్బులు 1050 రూపాయల కనుకయ్య కుటుంబానికి అందించారు.
సిద్దిపేట జిల్లా కొండపాక మండల కార్యాలయంలో రికార్డుల తనీఖీకి అనుమతి లభించిందని సీసీఆర్ సెంట్రల్ కమిటీ సభ్యులు శ్రీనివాస్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గుండ్ల శివచంద్రం,స్టేట్ మీడియా కో ఆర్డినేటర్ సాజిద్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో వారు ఒక ప్రకటన విడుదల చేశారు.. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కార్యాలయంలో రికార్డుల తనిఖీల కోసం కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ సభ్యులు దరఖాస్తు చేయగా, సంబంధించిన పౌరసమాచార అధికారి సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ తప్పుడు సమాధానాన్ని ఇచ్చారన్నారు. దీనిపై జిల్లా సభ్యులు మొదటి అప్పిలేట్ అధికారి అయిన గజ్వేల్ రెవిన్యూ డివిజనల్ అధికారికి (ఆర్డీఓ) కూ అప్లై చేయడంతో అప్పీల్ ను పరీశీలించిన ఆర్డీవో మండల రెవెన్యూ కార్యాలయం పౌర సమాచార అధికారికి రికార్డుల తనిఖీల /పరిశీలన కోసం అనుమతిని ఇవ్వాలని ఆదేశించారు. ఆర్డీఓ ఆదేశాల ప్రకారం కొండపాక మండలం కార్యాలయ పౌర సమాచార అధికారి నుండి రికార్డుల పరిశీలన/తనిఖీల కోసం ఈ నెలలో మూడు 14,15, 17 తేదీలను తెలుపుతూ అనుమతి ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం సవ్యంగా పనిచేయడానికి అధికార యంత్రాంగంలో పారదర్శకత్వం జవాబుదారీతనాన్ని తీసుకురావడం కోసం అధికార యంత్రాంగాల అదుపులో ఉన్న సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రజలలో విషయం పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి భారత ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని తీసుకువచ్చిందని దీనిని ప్రతి ఒక్క భారత పౌరులు ఉపయోగించుకోవాలని తెలిపారు.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పేదలకు చెందవలసిన సంక్షేమ పథకాలు ఇప్పటి చేరలేదు చాడ వెంకటరెడ్డి..
యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన70 ఏడ్లు గడిచిపోయినప్పటికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పేదలకు చెందవలసిన సంక్షేమ పథకాలు ఇప్పటి చేరలేదు చాడ వెంకటరెడ్డి అన్నారు. ఇంటి స్థలాలు, పక్క ఇండ్లులేక గత 40 సంవత్సరాలుగా పూరి గూడిసెల్లొ మగ్గుతున్న పాలక, ప్రభుత్వ అధికారులు పేద ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నాయని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం హుస్నాబాద్ మండలం కూచనపెల్లి గ్రామంలో జరిగిన సిపిఐ గ్రామ శాఖ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ గుడిసే వాసుల గోడు పట్టని పాలకవర్గం. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి గుడిసెలు వేసుకొని జివనం సాగిస్తున్నా పేద ప్రజలకు ఇంటి నివేశన స్థలాల పట్టాలు, రెండు పడకల ఇండ్లు మంజూరు చేసి ఆదుకోవలని చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు బొయిని అశోక్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి యెడల వనేష్, రైతు సంఘం మండల కార్యదర్శి అయిలేని సంజివరెడ్డి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కొహెడ కొమురయ్య,భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, ఎఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జనగాం రాజు కుమార్, సిపిఐ మండల నాయకులు పుదరి రఘుపతి, ఇంద్రాల మల్లయ్య, సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి చెప్యాల సిద్ధయ్య, యువతి, యువకులు,మహిళలు, రైతులు కూలీలు తదితరులు పాల్గొన్నారు.
భారతదేశంలోనే దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడను రానున్న రోజుల్లో యాదాద్రి తరహాలో అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.. వేములవాడలో జరగనున్న మహా శివరాత్రి వేడుకల పైన మంత్రి కే. తారకరామారావు స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబుతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని మంగళవారం హైదరాబాద్ లో నిర్వహించారు. శివరాత్రి ఉత్సవాలకు రాష్ట్రం తో పాటు, దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివస్తారని తెలిపిన కేటీఆర్, ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ముఖ్యంగా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టణం మొత్తంలో పారిశుద్ధ్య నిర్వహణ పైన ప్రత్యేక దృష్టి సారించాలని, ముందస్తు జాగ్రత్తగా అదనపు అంబులెన్స్, ఫైర్ అంబులెన్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. వేములవాడ జాతరకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు అదనపు నిధుల కేటాయిస్తామని తెలిపారు. ప్రతి ఏడాది శివరాత్రి వేడుకల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలన్న మంత్రి కేటీఆర్, ఇందుకోసం రాష్ట్ర సాంస్కృతిక శాఖతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. సమీక్ష సందర్భంగా వేములవాడలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పైన అధికారులు మంత్రికి వివరాలు అందజేశారు. వేములవాడ గుడి చెరువు బండ్ (Bund) ను వరంగల్ తరహాలో నిర్మించనున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు భవిష్యత్తులో పర్యాటక ప్రాంతాలకు మారుపేరుగా నిల్వనున్నాయన్న కేటీఆర్ ఆ దిశగా వాటిని అభివృద్ధి చేసే ప్రణాళికలతో ముందుకు సాగాలని ఆదేశించారు. సిరిసిల్ల శివారులోని రామప్ప గుట్టపై అతి ఎత్తైన శివుని విగ్రహం, కాటేజీల నిర్మాణం, అడ్వెంచర్ గేమ్స్, వేములవాడ శివారులోని నాంపల్లి గుట్టపై కేబుల్ కార్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఆలయంకు వచ్చే పట్టణంలోని అన్ని ప్రధాన రహదారులలో ఫుట్ పాత్ లను నిర్మించాలని తెలిపారు. చెక్ డ్యాం ల నిర్మాణం వల్ల నీటి నిర్వహణతో పాటు, వాటి పరిసర ప్రాంతాలను అందమైన ప్రదేశాలుగా తీర్చిదిద్దెందుకు చర్యలు తీసుకోవాలని, రాజన్న ఆలయానికి అనుసంధానంగా ఉన్న సంస్కృత పాఠశాలకు అనుబంధంగా నృత్య పాఠశాల, సంగీత పాఠశాల ఏర్పాటు చేయడంతో పాటు వాటికి ప్రత్యేకంగా భవన నిర్మాణాలు చేపడతామన్నారు. అత్యున్నత ప్రమాణాలతో వేములవాడ యువత కోసం మినీ స్టేడియం నిర్మాణం తొందరలోనే పూర్తి చేస్తామన్నారు. కొదురుపాక నుంచి వేములవాడ వరకు నాలుగు లైన్లు రహదారి నిర్మాణం, నాంపల్లి గుట్టపై రెండవ ఘాట్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలను వెంటనే ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వేములవాడ స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు తో పాటు, ఆర్ అండ్ బి, శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,ఎస్పీ అఖిల్ మహజన్, వేములవాడ ఆలయ అధికారులు, వివిధ విభాగాలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయిడుపేట లోని శ్రీ కాళహస్తి వైపు వెళ్ళు రహదారి లోని మూడు షాప్ లు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధం షాపులు మూసి వుండడం తో తప్పిన ప్రాణ నష్టం సంఘటనా స్థలానికి చేరుకున్న నాయుడుపేట అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు లోకి తీసుకు వచ్చింది చిన్న చిన్న షాపులు అవ్వడం తో పెద్దగా అస్తి నష్టం జరగలేదు అని సమాచారం
ప్రమాదపు సంఘటన స్థలలను పరిశీలించిన ఏసిపి వెంకటేశ్వర్లు
యదార్థవాది ప్రతినిది ధర్పల్లి
ధర్పల్లి మండల కేంద్రంలో సోమవారం నిజామాబాద్ ఏసిపి వెంకటేశ్వర్లు ప్రమాదపు సంఘటన స్థలాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ.ఎక్కడైతే ప్రమాదపు సూచనలు ఉన్నాయో అక్కడ గ్రామ ప్రజలను, గ్రామ అభివృద్ధి కమిటీ ,రాజకీయ నాయకులను, రైతులను పిలిచి అవగాహన కల్పించారు. అలాగే ధర్పల్లి సీఐ సైదాకు ఎస్ఐ వంశీకృష్ణారెడ్డికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసిపి వెంకటేశ్వర్లు, సీఐ సైదా, డిచ్ పల్లి సిఐ మోహన్, ధర్పల్లి ఎస్సై వంశీకృష్ణ , బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు హన్మంత్ రెడ్డి,మాజీ సర్పంచ్ కర్క గంగారెడ్డి, విడిసి చైర్మన్ చెలిమల రంజిత్, వీడీసీ సభ్యులు,రైతులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొనడం జరిగింది.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో 11 హై స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ఉదయం, సాయంత్రం 50 రోజులపాటు అల్పాహారం అందిస్తున్న దాత లోయపల్లి నర్సింగరావు. ఈ సందర్భంగా
ఆయన మాట్లాడారు విద్యార్థులు పరీక్ష విషయంలో ఎలాంటి భయాందోళన చెందకుండా ఏకాగ్రతతో ప్రణాళిక ప్రకారం చదువుకోవాలని మండలంలోని ప్రతి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు మొదటి స్థానం ఉత్తీర్ణత ఫలితాలు సాధించేలా కృషి చేయాలని అన్నారు. విద్యార్థులు పరీక్ష విషయంలో ఎలాంటి ఆందోళన చెందకుండా ఎప్పటికప్పుడు ఉపాద్యాయులు ప్రోత్సహించాలని,వాళ్ళ విషయంలో ఎలాంటి అవసరం ఉన్న ముందు ఉంటానని ఉపాద్యాయులకు తెలిపారు. ఉపాధ్యాయులు ఆల్ఫాహారం కార్యక్రమం ఏర్పాటు చేసి లోయపల్లి నర్సింగరావు గారికి డిఈఓ రాజు,ఎస్సి ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్,విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఈఓ రాజు,ఎస్సి ఎస్టీ ఉపాద్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్, జడ్పీటీసీ మిణుకురి రాంరెడ్డి, వైస్ ఎంపీపీ జిడిపల్లి నర్సింహారెడ్డి,మండల సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు మిద్దెల రాజు,పలు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు ఉపాద్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.