33.2 C
Hyderabad
Friday, April 24, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 102

రెండు పడకల ఇండ్ల నిర్మాణనికి 5లక్షలు ఇవ్వాలి

రెండు పడకల ఇండ్ల నిర్మాణనికి 5లక్షలు ఇవ్వాలి

సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ డిమాండ్.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పేదలకు రెండు పడకల ఇండ్ల కట్టుకుంటే 3లక్షలు ఇస్తామని చెప్పడం ఇండ్లు పూర్తి స్థాయిలో నిర్మాణం కాదని ప్రభుత్వం పునరాలోచన చేసి స్వంత ఇంటి స్థలం కలిగి ఉన్న వారికి 5 లక్షలు మంజూరు చేసి, పేదలందరికీ రెండు పడకల ఇండ్లు మంజూరి చేసేందుకు చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం హుస్నాబాద్ మండలం నాగారం గ్రామంలో సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన సందర్భంగా గడిపె మల్లేశ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాడి రెండో సారి అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం 9ఏండ్లు గడుస్తున్నా పేదలకు స్వంత ఇంటి స్థలం లేక బయట కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేక పోవడం వల్ల అనేక కుటుంబాలకు నిలువ నీడ లేకుండా పోయిందని ప్రభుత్వం వెంటనే ఇంటి స్థలం లేని పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి, ఇండ్లు నిర్మాణం చేసుకున్నావారికి త్రాగునీరు, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్లు మంజూరు, మురుగు కాల్వలు, సిసి రొడ్లు, రహదారులు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసి పేద కుటుంబాలను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలని బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి, సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి ఇజ్జగిరి కిష్టయ్య,సహాయ కార్యదర్శి కొమ్ము రవిందర్, రెడ్డి రాములు, కొమ్ము రాజయ్య, కొమ్ము సాగర్, కస్తురి శ్రీకాంత్, కొమ్ము సమ్మయ్య, బొంత అనిత, రెడ్డి సారయ్య, పొన్నాల ఎల్లయ్య, బొంత గట్టవ్వ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ బడ్జెట్‌ కేటాయింపులు

2023-24 తెలంగాణ రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలోనే, తెలంగాణ మంత్రి హరీష్‌ రావు బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టారు.

తెలంగాణ వార్షిక బడ్జెట్ 2023-24 రూ.2,90,396 కోట్లని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు.
2023-24 తెలంగాణ రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు ఉంటుందని వెల్లడించారు హరీష్‌ రావు. అలాగే, బడ్జెట్ లో ఆయిల్ ఫామ్ కు 1000 కోట్లు, నీటి పారుదల రంగం 26, 885 కోట్లు, విద్యుత్ రంగం 12, 727 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు తెలంగాణ మంత్రి హరీష్‌ రావు.

ఆసరా పింఛన్లు 12,000 కోట్లు

దళిత బంధు 17, 700 కోట్లు

బీసీ సంక్షేమం 6,229 కోట్లు

గిరిజన సంక్షేమం.. షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి కింద 15, 233 కోట్లు

కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ 3,210 కోట్లు

బడ్జెట్ లో ఆయిల్ ఫామ్ కు 1000 కోట్లు,

నీటి పారుదల రంగం 26, 885 కోట్లు,

విద్యుత్ రంగం 12, 727 కోట్లు

ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు.

ఆయిల్ ఫామ్‌కు రూ.1000 కోట్లు..

దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు

ఆసరా పెన్షన్లకు రూ.12,000 కోట్లు..

గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ.15,223 కోట్లు..

బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు..

వ్యవసాయశాఖకు రూ.26,831 కోట్లు..

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.3,210 కోట్లు..

షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.36,750 కోట్లు

పంచాయతీరాజ్‌కు రూ.31,426 కోట్లు..

వైద్య, ఆరోగ్య శాఖకు రూ.12,161 కోట్లు..

విద్యా రంగానికి రూ.19,093 కోట్లు..

రుణమాఫీ పథకానికి రూ.6,385 కోట్లు..

హరితహారం పథకానికి రూ.1,471 కోట్లు..

పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు..

రోడ్లు, భవనాల శాఖకు రూ.2,500 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు..

హోంశాఖకు రూ.9,599 కోట్లు..
మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.2,131 కోట్లు..

మైనారిటీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు..

రైతు బంధు పథకానికి రూ.1,575 కోట్లు..

రైతు బీమా పథకానికి రూ.1,589 కోట్లు..

కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రూ.200 కోట్లు

చెక్ డ్యాం వద్ద గంగమ్మకు పూజలు

చెక్ డ్యాం వద్ద గంగమ్మకు పూజలు

యదార్థవాది ప్రతినిధి గజ్వేల్

గజ్వేల్ మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో నీ కూడవెల్లి వాగు చెక్ డ్యాం వద్ద గంగమ్మ తల్లికి తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆదివారం ప్రత్యేకమైన పూజలు చేశారు ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రైతుల అవసరాల దృష్ట్యా కాలేశ్వరం కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ లాంటి ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణం చేసి మండుటెండర్ల సైతం రైతుల పొలాలకు గోదావరి నీళ్లను పారించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని అన్నారు, ఈరోజు గజ్వేల్ ప్రాంతంలో చేబర్తి చెరువు నుండి ప్రారంభమై మర్కుక్, జగదేపూర్, గజ్వేల్ మండలంలోని కొడకండ్ల బూరుగుపల్లి సింగాటం అందిపూర్ పిడిచేట్ కొల్గురు, సిరిసిల్ల నుండి హైయర్ మానేరు వరకు 36 చెక్ డ్యాం లు నిండుకుండలా నిండుతూ హయ్యర్ మానేరు వరకు గోదావరి జిల్లాలు వెళ్తాయన్నారు, కూడవెల్లి వాగు ఇరువైపుల రైతులకు వేల ఎకరాల్లో మండుటెండర్ల సైతం భయపడకుండా రైతుల పంట పొలాలకు జలాలను పారిస్తున్నారు అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ వంటేరు విజయవర్ధన్ రెడ్డి, మండల కో ఆప్షన్ అబ్దుల్, రాజు, చంద్ర గౌడ్, స్వామి, భాస్కర్ రెడ్డి, భరత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వాహద్, సత్తయ్య బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు ఉన్నారు.

వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం..

వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం…

యదార్థవాది ప్రతినిధి డిచ్ పల్లి

మండల కేంద్రంలో గల కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల లో భాగంగా మాడవీధుల్లో స్వామివారు ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యక్తిగత కార్యదర్శి రాజారాం హల్దె దంపతులు స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామి వారి రథోత్సవాన్ని పూజలు నిర్వహించి ప్రారంభించారు ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయపడతానని ఈ సందర్భంగా రాజారాం హల్దె తెలిపారు.. అనంతరం కిల్లా రామాయణాన్ని సందర్శించి పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు రవి, ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు

సాయిబాబా మందిరం వార్షికోత్సవ వేడుకలు

సాయిబాబా మందిరం వార్షికోత్సవ వేడుకలు

యదార్థవాది ప్రతినిది గజ్వేల్

సిద్దిపేట జిల్లా గజ్వేల్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదివారం సాయిబాబా మందిరం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ రాజమౌళి సాయిబాబా ను దర్శించుకుని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయిబాబా ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఉండాలని దైవ నామ స్మరణ తోనే ముక్తి లభిస్తుందని ప్రతి ఒక్కరూ దైవ భక్తి కలిగి ఉండాలని అన్నారు సాయిబాబా వార్షికోత్సవం సందర్భంగా భక్తుల విరాళాలతో వెండి సింహాసనం దేవాలయానికి అందజేశారు, భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు దైవ నామ స్మరణ తో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ కార్యక్రమంలో అర్చకులు రాజు పంతులు,కౌన్సిలర్స్, కో ఆప్షన్ సభ్యులు, యువకులు, మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు

సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ

సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ

గజ్వేల్ యదార్థవాది ప్రతినిధి

మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో ఆదివారం గ్రామ సర్పంచ్ వంటేరు విజయవర్ధన్ రెడ్డితో కలిసి సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి సిసి రోడ్డు నిర్మాణ పనులను తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ అబ్దుల్, రాజు, చంద్ర గౌడ్ స్వామి భాస్కర్ రెడ్డి ,భరత్ రెడ్డి ,శ్రీనివాస్ రెడ్డి ,బిఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు గ్రామస్తులు ఉన్నారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి 26వ తేదీ డెడ్‌లైన్..

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి 26వ తేదీ డెడ్‌లైన్..

యదార్థవాది ప్రతినిధి కర్నూల్

 ఉద్యోగుల సమస్యలను ఈనెల 26వ తేదీలోపు పరిష్కరించాలని ఏపీజేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.లేకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ.. 26వ తేదీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి, ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అంతలోపు సమస్యలపై చీఫ్ సెక్రెటరీకి లేఖ రాస్తామని తెలిపారు. ఏపీ అమరావతి జేఏసి రాష్ట్ర మహాసభ ముగిసిందని తెలియజేసిన ఆయన.. ఈ మహాసభ విజయవంతమైందని హర్షం వ్యక్తం చేశారు. ఏపీజేఏసీ 94 సంఘాల నుంచి 100 సంఘాలకు పెరిగిందని.. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగుల మహాసభ ఎప్పుడూ జరగలేదని అన్నారు.. మూడున్నరేళ్లుగా ఉద్యోగులు ఓపిక పట్టారని.. అసలు ఉద్యోగులను ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని, దాంతో ఉద్యోగుల జీవితాలు దారుణంగా తయారైందని ఫైర్ అయ్యారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీం కార్డు కూడా ఎందుకు పనికిరాకుండా పోయిందని మండిపడ్డారు. డీఏలు ఇచినట్టే ఇచ్చి, ఆ వెంటనే వాటిని వెనక్కి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ ఉద్యోగుల సమస్యపై మనసు పెట్టకపోవడం వల్లే.. పరిష్కారం కావట్లేదని దుయ్యబట్టారు. ఆర్టీసీ ఉద్యోగులుగా పని చేసి.. రూ. 2,500 సంపాదించే వారికి కూడా రేషన్ కార్డు పోయిందని వాపోయారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ లేదని.. సీఎం స్వయంగా పరిష్కరిస్తారని ఎదురు చూసినా కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పటిష్టమైన బందోబస్తు

పటిష్టమైన బందోబస్తు

యదార్థవాది ప్రతినిధి కొమురవెల్లి

కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల కు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు సందర్భంగా అడిషనల్ డిసిపి అడ్మిన్ ఎస్. మహేందర్ పార్కింగ్ ప్రదేశాలను, శీఘ్ర దర్శనం, వీఐపీ దర్శనం, సాధారణ దర్శన ప్రదేశాలను, టెంపుల్ ఆవరణను పరిశీలించి అధికారులకు, సిబ్బందికి, కమ్యూనికేషన్స్ సెట్ ద్వారా బందోబస్తు పర్యవేక్షణ చేస్తూ సిబ్బందికి తగు సూచనలు సలహాలు తెలిపి మాట్లాడుతూ మూడవ ఆదివారం సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడం ఆదేశానుసారం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, సీసీ కెమెరాల ద్వారా కొమరవెల్లి పోలీస్ స్టేషన్ లో నిరంతరం పర్యవేక్షణ చేయడం జరుగుతుందని తెలిపారు. భక్తులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే పోలీస్ కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని సూచించారు. దర్శనానికి వచ్చే భక్తులు పోలీసు వారి సలహాలు సూచనలు పాటిస్తూ మల్లికార్జున స్వామిని ప్రశాంతంగా దర్శించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసిపి ఫణిందర్, హుస్నాబాద్ ఏసిపి సతీష్, హుస్నాబాద్ సీఐ కిరణ్, కోమురవెల్లి ఎస్ఐ చంద్రమోహన్, మరియు పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

నాగలి పట్టే చేతులు..శాసనాలు చేయాలి: కేసీఆర్‌

యదార్థవాది ప్రతినిధి నాందేడ్‌

దేశ పరిస్థితులను చూసిన తర్వాత తెరాసను భారాసగా మార్చామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. దేశంలో మార్పు తీసుకొచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.. పార్టీని దేశమంతటా విస్తరించాలనే లక్ష్యంతో నాందేడ్‌ లోని సచ్‌ఖండ్‌ బోడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహారాష్ట్రలోని పలువురు నాయకులకు భారాస కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ, అంబేడ్కర్‌, పూలే వంటి మహనీయులకు జన్మనిచ్చిన పుణ్యభూమి మహారాష్ట్ర అని అన్నారు.”దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయింది. ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఎందరో నేతలు ఎన్నో మాటలు చెప్పారు. కానీ, ఆ మేరకు మార్పులు రాలేదు. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా కనీసం తాగునీరు, విద్యుత్‌ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. మహారాష్ట్రలో ఎందరో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతులు ఎంతో కష్టపడి పంటలు పండించినా చివరకు ఆత్మహత్యలు తప్పట్లేదు. అందుకే ‘అబ్‌కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌’ నినాదంతో భారాస వచ్చింది. భారత్‌ బుద్ధి జీవుల దేశం.. ఎన్నాళ్లో ఎదురు చూశాం. ఇప్పుడు సమయం వచ్చింది. నాగలి పట్టే చేతులు..శాసనాలు చేయాల్సిన రోజులు వచ్చాయి.” అని కేసీఆర్‌ అన్నారు..అధికారమిస్తే.. 24 గంటల విద్యుత్‌దేశంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. కేవలం బొగ్గుతోనే దేశమంతటా 24 గంటల విద్యుత్‌ ఇవ్వొచ్చని ఆయన తెలిపారు. భారాసకు అధికారం ఇస్తే రెండేళ్లలో మహారాష్ట్రలో 24 గంటల విద్యుత్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో వచ్చిన మార్పు..దేశమంతా రావాల్సిన అవసరముందన్నారు. వచ్చే పరిషత్‌ ఎన్నికల్లో మరాఠా ప్రజలు భారాసను గెలిపించాలని కేసీఆర్‌ కోరారు. దేశమంతా గులాబీ జెండా ఎగరాలి, కిసాన్‌ సర్కార్‌ రావాలన్నారు. భారాస అధికారంలోకి వస్తే దేశమంతా రైతుబంధు, దళితబంధు అమలు చేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

రాష్ట్రాభివృద్ధికి.. మూడు రాజధానులే మార్గం..

యదార్థవాది ప్రతినిధి తిరుపతి

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే.. మూడు రాజధానులే మార్గమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు..ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రానికి స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని అన్నారు. విభజన సమయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి ఇతర ప్రయోజనాలు రావాలన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు రాజధానులుంటేనే.. రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. అంతకుముందు.. దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలిచిందని, ఆదర్శవంతమైన రాష్ట్రంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సంక్షేమాభివృద్ధి.. భవిష్యత్‌లో కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానన్నారు. సీఎం జగన్‌కు ప్రజాదరణ వెయ్యి రెట్లు పెరిగిందన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...