29.2 C
Hyderabad
Friday, April 24, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 103

క్షత్రియ రామజోగి అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

క్షత్రియ రామజోగి అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

గజ్వేల్ యదార్థవాది ప్రతినిధి

సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఎఫ్డిసి, చైర్మన్ ప్రతాప్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, రామజోగి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో తెలంగాణ క్షత్రియ రామజోగి అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించి ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతి కులానికి ప్రాధాన్యత ఇస్తూ అందులో భాగంగా తెలంగాణ క్షత్రియ రామ జోగి కులం సమాజానికి అన్ని విధాలా అండగా ఉంటుందని ఈరోజు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న క్షత్రియ రామజోగి సమాజానికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా,తెలంగాణ క్షత్రియ రామజోగి అసోసియేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు, గుజ్జేటి వెంకటేశం, ఉపాధ్యక్షులు గుజ్జేటి శ్రీనివాస్,సభ్యులు రామచంద్రం, కిరణ్, రాజు, భారతి, లక్ష్మి, సుమలత, వసంత, తదితరులు పాల్గొన్నారు.

కోటి తలంబ్రాలు దీక్షలో… శ్రీరామకోటి

కోటి తలంబ్రాలు దీక్షలో… శ్రీరామకోటి

యదార్థవాది ప్రతినిధి గజ్వేల్

భద్రాచంలో రాముల వారి కల్యాణానికి ఉపయోగించే కోటి తలంబ్రాల దీక్ష అద్భుత కార్యక్రమంలో పాల్గొనే ధార్మిక సంస్థలను భద్రాచల దేవస్థానం ఎంపిక చేసుకుంది. అందులో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారు. సంస్థ వ్యవస్థాపక, అధ్యకులు రామకోటి రామరాజు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20సంవత్సరాల నుండి మా ఆధ్యాత్మిక సేవలు భద్రాచలం గుర్తించిందన్నారు. భద్రాచలం నుండి మాకు వడ్లు రావడం జరిగిందని భక్తులచే వాటిని గోతిలో మాత్రమే వొలిచి తిరిగి భద్రాచలం దేవస్థానానికి పంపాలి. వాటిని భద్రాచల దేవస్థానం వారు శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణం సమయంలో ఈ తలంబ్రాలను సీతారాములకు ఉపయోగిస్తారన్నారు ఈ అదృష్టం మాకు రావడం చాలా అందంగా ఉందని రామకోటి సంస్థ భక్తులు కొనియాడారు ఈ కార్యక్రమం త్వరలో శ్రీకారం చుట్టనున్నామని సంస్థ అధ్యక్షుడు రామకోటి రామరాజు అన్నారు.

భారతదేశ సంస్కృతికి పునాదులు చేతి వృత్తి దారులే.

భారతదేశ సంస్కృతికి పునాదులు చేతి వృత్తి దారులే. ఢిల్లీ పార్లమెంట్ సభ్యులు రామచంద్ర జంగడె.
యదార్థవాది బ్యూరో ఢిల్లీ
రాష్ట్ర రాజధాని న్యూఢిల్లీలోని స్థానిక కాన్స్టి ట్యూషన్ క్లబ్ లో జరిగిన ఆర్టిజన్ కళాకారులు,ప్రతినిధుల జాతీయ సెమినార్ కార్యక్రమం జాతీయ అధ్యక్షులు విశ్వనాథన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విశ్వకర్మ వంశీయులైన పార్లమెంట్ సభ్యులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టిజన్ సెక్రటరీ బి.బి.స్వేన్ హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ చేతివృత్తుల వారిని వివిధ రకాలుగా ఆదుకొనుటకు ఉపయోగపడే ఆర్టిజన్ స్కీం ప్రజల్లోకి తీసుకువెళ్లి దశాబ్దాల కాలంగా ఎంతో అవగాహన కల్పిస్తున్న విశ్వనాథన్ ను అభినందించారు. స్థానిక పార్లమెంట్ సభ్యులు రామచంద్ర జంగడె మాట్లాడుతూ మన దేశంపై దేశ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపాయలైన నిర్మాణాలు, కట్టడాలపై ఎంతోమంది ఎన్నో రకాల దాడులు చేసినా కూడా నేటికీ భారతదేశ సంస్కృతి గొప్పగా నిలబడ్డదంటే దానికి చేతివృత్తుల వారే కారణమని వారిని గౌరవించుకోవాల్సిన కాపాడుకోవాల్సిన బాధ్యత అవసరం మనకు ఉందని భావించి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విశ్వకర్మ కౌసల్య పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఇక వివిధ రాష్ట్రాల నుండి వివిధ జిల్లాల నుండి చేతి వృత్తులదారుల ప్రతినిధులుగా విచ్చేసిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రతి చేతి వృత్తిదారునికి తీసుకువెళ్లి వారు సమాజంలో ఆర్థికంగా ఎదగడానికి వారి యొక్క నైపుణ్యతను పెంపొందించుకొని సమాజంలో తమ ఉనికిని గౌరవాన్ని పెంపొందించుకోవడానికి అటు ఆర్థికంగా ఇటు సామాజికంగా ఎంతో ఉపయోగపడుతుందని ఈ పథకాన్ని ప్రతి చేతివృత్తిదారులకు అందజేయాలని ఆయా ప్రతినిధులను కోరారు.ఈ కార్యక్రమంలో MSME క్యాబినెట్ మినిస్టర్ నారాయణ రాణే,ఛత్తీస్ ఘడ్ పార్లమెంట్ సభ్యులు విజయ్ భగలే, FUMMA ఫౌండర్ రవీంద్రన్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ కళాకండాల రాష్ట్ర కన్వీనర్ కొండమూరి బంగారు బాబు,తెలంగాణ రాష్ట్రం నుండి అడ్లూరి రవీంద్ర చారి,గందాల శ్రీనివాస్ చారి,సింగోజు మురళీకృష్ణ ఆచార్యులు,పిల్లి గురుమూర్తి చారి తదితరులు పాల్గొన్నారు.

కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి..

కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి..

యదార్థవాది ప్రతినిధి అమరావతి

కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్ష ఫలితాలను ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసింది. ఫలితాలను ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ (APSLPRB) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆ సంస్థ అధికారులు తెలిపారు.కానిస్టేబుల్‌ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4,59,182 మంది అభ్యర్థులు హాజరుకాగా, వారిలో 95,208 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఓఎంఆర్‌ షీట్లు అందుబాటులో ఉంటాయని పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది.

రేపటి నుండి రేవంత్ రెడ్డి పాదయాత్ర..

రేపటి నుండి రేవంత్ రెడ్డి పాదయాత్ర

టార్గెట్.. మహబూబాబాద్ పార్లమెంట్..!!

యదార్థవాది ప్రతినిది

ములుగులో సమ్మక్క-సారలమ్మలకు మొక్కి యాత్ర ప్రారంభం..

నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు, పినపా నియోజకవర్గాల మీదుగా భద్రాచలం దాకా..!!

కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తున్న ఉత్సాహం.. ఏర్పాట్లలో అసెంబ్లీ టిక్కెట్ ల ఆశావాహులు…

గంజాయి పట్టుకున్న పోలీసులు..

గంజాయి పట్టుకున్న పోలీసులు..
1.25 కిలోల గంజాయి పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు..

యదార్థవాది ప్రతినిది మంచిర్యాల

మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధి లో గంజాయి ఇతర ప్రాంతం ల నుండి తీసుకు వస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అశోక్, సబ్ ఇన్స్పెక్టర్ లచ్చన్న సిబ్బంది తో కలిసి మందమర్రి లోని టోల్ ప్లాజా వద్ద అనుమానస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోని విచారించారు. వారిచ్చిన సమాచారం మేరకు మంచిర్యాల, రెడ్డి కాలనీలో ఒక ఇంటిలో నిల్వచెసిన 1.25 కిలోల గంజాయి దొరకడం జరిగిందని, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొన్నమని, అందులో ఒకరు మైనరు అని పోలీసులు తెలిపారు..

సైకో మొగుడు స్నేహితులు నుండి ప్రాణహాని

సైకో మొగుడు స్నేహితులు నుండి ప్రాణహాని

యదార్థవాది ప్రతినిధి కడప

అతను గౌరవ న్యాయవాది వృత్తి లో ఉండి భార్య ను శతవిధాల తన శాడీజంతో హింసిస్తున్నాడని బాధిత మహిళ కడప ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో భోరున విలపించారు. ఆమె తెలిపిన వివరాల మేరకు మైదుకూరు మండలం గడ్డంవారిపల్లె కు చెందిన అంబారపు మస్తానయ్య తో 13 సంవత్సరాల క్రితం పెద్దలు కుదిర్చిన వివాహం జరిగిందని తెలిపారు. తన అమ్మ నాన్న ప్రకాశం జిల్లా కంభం కు చెందిన వారని ఆమె తెలిపారు. తనకు ముగ్గురు సంతానం కలరని వారిని చదువు నిమిత్తం గోవా లో ఉంచారని పేర్కొన్నారు. పెళ్ళయిన నాటి తన భర్త అనేక రకాల వేధింపులకు గురి చేసేవాడని తెలిపారు. తన అమ్మ వారికి విషయం తెలిపితే చంపుతానని బెదిరింపులకు పాల్పడేవాడని వాపోయారు. ఇటీవల తన తమ్ముడు, నాన్న వచ్చినప్పుడు తన పరిస్థితిని గమనించి అప్పటికే చిత్రహింసలు తాళలేక లేవలేని పరిస్థితి గమనించి బాధపడుతుంటే 13 ఏళ్ళ గా పడుతున్న ఆవేదన, బాధలు చెప్పానని అలా అంటూ చెలరేగి ఒళ్ళంతా వాతలు పెట్టాడని బాధిత మహిళ సల్మా కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తూ జరిగిన దురాగతాలను వివరించింది. ఈ విషయం లో ప్రొద్దుటూరు ఎఎస్పీ ప్రేరణ ఎంతో ధైర్యాన్ని ఇచ్చారని తెలిపారు. బాధలు భరించలేక ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశానని కేసు నుండి తప్పించుకున్న తన భర్త మస్తానయ్య ను గుత్తి రైల్వేస్టేషన్ లో ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ వారు అరెస్టు చేసి రిమాండ్ లో పెట్టారని అయితే తన భర్త మస్తానయ్య స్నేహితులు ప్రసాద్, అరుణ్ లు తమను బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రసాద్ కానిస్టేబుల్ అని అరుణ్ ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతానని బెదిరింపులకు పాల్పడుతున్నారని వారి నుండి తమకు ప్రాణ హాని ఉందని భయకంపితుల య్యారు. ఈ విషయం లో తమకు న్యాయం చేయాలని, దోషులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

మూడేళ్లలో జగన్‌ సర్కార్‌ చేసిన అప్పు రూ.1.34 లక్షల కోట్లే: మంత్రి బుగ్గన

యదార్థవాది ప్రతినిధి అమరావతి

ఏపీ ఆర్థిక అంశాలపై తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు చేసిన ప్రకటనపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పందించారు..రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై యనమల నిరాధార ఆరోపణలు, అసత్య ప్రకటనలు చేస్తున్నారని ఆక్షేపించారు. ఈ విషయంపై తెదేపా రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని మంత్రి బుగ్గన ఆరోపిస్తూ తాజాగా ప్రకటన విడుదల చేశారు. స్థిరధరల వృద్ధి రేటులో 2021-22 ఏడాదికి సంబంధించి ఏపీ 11.22 శాతం వృద్ధి నమోదు చేసిందని మంత్రి స్పష్టం చేశారు. ఏవిధంగా లెక్కవేసినా మైనస్‌ 4శాతం వృద్ధి అనేది అసాధ్యమని మంత్రి వెల్లడించారు. కొవిడ్‌ సమయంలో దేశ వృద్ధిరేటు -6.60 శాతంగా నమోదైతే ఏపీ 0.08శాతం మేర వృద్ధి నమోదు చేసిందన్నారు. అనుభవజ్ఞుడైన యనమల జీఎస్డీపీని గణించటంలో తప్పుచేశారని మంత్రి బుగ్గన ఆక్షేపించారు. నవరత్నాల ద్వారా ఇప్పటికి రూ.1.92 లక్షల కోట్లు అందించినట్టు వెల్లడించారు. ప్రతి ఊరిలో ఏర్పాటైన సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజి క్లీనిక్‌లు, డిజిటల్ లైబ్రరీలు, మిల్క్ చిల్లింగ్ కేంద్రాలను అభివృద్ధిగా పరిగణించరా? అని మంత్రి పశ్నించారు. ఖజానా ఖాళీ.. రూ.100 కోట్లు మాత్రమే మిగిలిందంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి శ్రీలంక, జింబాబ్వేలా తయారైందని వ్యాఖ్యలు చేయటం బాధ్యతా రాహిత్యమన్నారు. 40ఏళ్లు పైబడిన యువనాయకుడు సీఎంగా ఎలా అభివృద్ధి చేస్తున్నాడో అర్థంకాక తెదేపా నేతలు తలలు పట్టుకుంటున్నారని మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు. 2019లో తెదేపా దిగిపోయే నాటికి రూ.2,64,451 కోట్ల అప్పు ఉంటే.. 2022 నాటికి రూ.3,98,903 కోట్లు అయినట్టు పార్లమెంటులో కేంద్రం ప్రకటించిందని తెలిపారు. గత మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1,34,452 కోట్లు మాత్రమేనని బుగ్గన స్పష్టం చేశారు.

హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ఆంక్షలు.. పెద్దగట్టు జాతర నేపథ్యంలో ఈ నెల 9 వరకు..

హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ఆంక్షలు.. పెద్దగట్టు జాతర నేపథ్యంలో ఈ నెల 9 వరకు..

యదార్థవాది ప్రతినిధి నల్గొండ

 సూర్యాపేట సమీపంలోని దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర సందర్భంగా ఆదివారం నుంచి హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట వద్ద ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటుందని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌ తెలిపారు.హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను సూర్యాపేట సమీపంలోని టేకుమట్ల (మూసీ) బ్రిడ్జి వద్ద జాతీయ రహదారి 65 నుంచి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారి 365 బీబీ మీదుగా మళ్లిస్తారు. రాఘవాపురం స్టేజ్‌, నామవరం, గుంజలూరు స్టేజ్‌ వద్ద తిరిగి 65వ జాతీయ రహదారిపైకి వెళ్లేలా రూట్‌మ్యాప్‌ రూపొందించారు. భారీ, సరకు రవాణా వాహనాలు మాత్రం టేకుమట్ల నుంచి ఖమ్మం జాతీయ రహదారి మీదుగా నాయకన్‌గూడెం నుంచి కోదాడకు వెళ్లేలా పోలీసులు చర్యలు చేపడుతున్నారు..విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలు కోదాడ, మునగాల, గుంపుల మీదుగా దురాజ్‌పల్లి సమీపంలోని స్వామి నారాయణ ట్రస్ట్‌ ఎదురుగా ఉన్న ఎస్సారెస్పీ కాల్వ నుంచి బీబీగూడెం, రోళ్లవాగుతండా మీదుగా టేకుమట్ల బ్రిడ్జి మీదకు మళ్లిస్తారు. భారీ, సరకు రవాణా వాహనాలు కోదాడ, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా నార్కట్‌పల్లి వద్ద జాతీయ రహదారి 65పైకి చేరుకోవాలి. అవసరమైతే వ్యక్తిగత వాహనాలు సైతం ఇదే మార్గంలో వస్తే ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉండవని పోలీసులు సూచిస్తున్నారు.

గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు..

గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు..

యదార్థవాది ప్రతినిధి అమరావతి

సీనియర్ ఐఎఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. 1993 బ్యాచ్‌కు సింఘాల్ ఇప్పటి వరకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించారు..రాజ్ భవన్‌లో మాననీయ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను సింఘాల్ మర్యాద పూర్వకంగా కలిసారు. వీరిరివురు కొద్దిసేవు సమావేశం అయ్యారు. సింఘాల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కీలకమైన శాఖలలో బాధ్యతలు నిర్వర్తించి మంచి అధికారిగా తనదైన ముద్ర వేసారు. కేంద్రంలో అత్యంత కీలకమైన డిఓపిటి డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్‌గా పనిచేసారు. కీలకమైన కరోనా సమయంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా సేవలు అందించి రాష్ట్ర ప్రజల మన్ననలు అందుకున్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...