29.2 C
Hyderabad
Friday, April 24, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 104

రాగట్లపల్లిలో ఎలుగుబంటి సంచారం

రాగట్లపల్లిలో ఎలుగుబంటి సంచారం

రాగట్లపల్లిలో ఎలుగుబంటి సంచారం పట్టుకున్న అటవీ శాఖ అధికారులు

యదార్థవాది ప్రతినిది కామారెడ్డి

కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రాగట్లపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి ఎలుగుబంటి సంచారించడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రాగట్లపల్లి గ్రామ ప్రజలు గత మూడు రోజులుగా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. పొలం పనులకు వెళ్లే రైతులు గ్రామస్తులకు మూడు రోజులుగా ఎలుగుబంటి ఊళ్లో తిరుగుతూ కనిపిస్తూ ఉందని గ్రామస్తులు, ఎలుగుబంటి గ్రామపంచాయతీ ఆవరణలో చెట్లపదల్లోకి వెళ్లినట్టు అటవీశాఖ అధికారులకు తెలిపారు. జిల్లా అడవి శాఖ అధికారి సిబ్బందితో రాగట్లపల్లి గ్రామానికి చేరుకొని ఎలుగుబంటి తిరిగే ప్రాంతాన్ని పరిశీలించి. వరంగల్ అడివిశాఖ అధికారులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న రిస్క్ టీం వరంగల్ ఆపరేషన్ వైద్యుడు ప్రవీణ్ కుమార్ బృందం ఘటన స్థలానికి చేరుకొని మెదక్ జిల్లా పర్వతాపూర్ గ్రామం నుంచి జెసిపి వాహనాన్ని రప్పించారు వాహనంతో గుండు రాళ్లను ముళ్లపదలను మొదట తొలగించారు. డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలోని రిస్క్ టీం బృందం సభ్యులు మత్తు ఇంజక్షన్లను రెఫెల్తో షూట్ చేశారు దీంతో ఎలుగుబంటి 20 నిమిషాల్లో మత్తులోకి జారుకుంది. అడవిశాఖ సిబ్బంది డి ఎఫ్ ఓ ఆధ్వర్యంలో ఎలుగుబంటిని వలలో బంధించి తీసుకువెళ్ళారు. గురజాగుంట, రాగట్లపల్లి, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలుబంటిని చూసేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలించారు. ఎలుగుబంటిని పట్టుకోవడానికి సహకరించిన గ్రామస్తులకు రిస్క్ టీమ్స్ సిబ్బందికి పోలీసులకు అడవి శాఖ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎలుగుబంటి వయసు 12 సంవత్సరాల వరకు ఉంటుందని డిఎఫ్ఓ నికిత తెలిపారు..

అచ్చ సిద్దిపేటలో పెద్దల మాయాజాలం.

అచ్చ సిద్దిపేటలో పెద్దల మాయాజాలం
రాత్రికి రాత్రే మార్పులు చేర్పులు
తొంగి చూడని అధికారులు

 

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి

సిద్దిపేట జిల్లాలోని కోటిలింగేశ్వర ఆలయంలో కొందరు పెద్దలదే హవా నడుస్తున్నది . ఏకంగా బస్టాండ్ బస్టాండ్ కే ఎసరు పెట్టారు. సిద్దిపేటలోని మెదక్ రోడ్ లో గల బస్టాండ్ కూల్చి స్థానంలో రాత్రికి రాత్రే ఎలాంటి అనుమతులు లేకుండా టిఫిన్ సెంటర్ కోసం షెడ్డు నిర్మాణం ఏర్పాటు చేశారు. గతంలో కొన్ని టీవీ చానల్స్ లో గుడి అక్రమాలపై కొన్ని కథనాలు ప్రసారం చేసినప్పటికీ ఇంతవరకు ఏ ఒక్క అధికారి కూడా సందర్శించిన దాఖలాలు లేవు. ప్రజల సౌకర్యార్థం ఉన్న బస్టాండ్ ని కూల్చి ఆ స్థానంలో టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసేంత అవసరం ఏమిటి? అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు . ఒక్కరి వ్యాపారం కోసం ఇంత స్వార్థమా? గుడికి ఈ టిఫిన్ సెంటర్ ద్వారా వచ్చే ఆదాయం కరువైనదా అయితే గుడి ఆదాయం ఎటు మల్లుతోంది. అయితే ఈ గుడికి ఈశాన్యం మూలన పోయిన ఏర్పాటు చేస్తే అంత మంచిది కాదని కొందరు వాదిస్తున్న వారి వ్యాపారం కోసం ఈ వాదనలను బేఖాతరు చేస్తున్నారు. ఈ ఆదాయం గుడికా లే ఎవరి జేబులోకైననా అని అందరూ గుసగుసలాడుతున్న వేల ఒకరు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఆ అధికారులు వారి పరిధిలో ఉంటే లేదా తగు సంబంధిత సంబంధిత అధికారులకు ఈ ఫిర్యాదును అందించి కోటిలింగేశ్వరుని ఆలయ దోపిడీని అరకడతారా చూడాలి. అయితే ఈ ఫిర్యాదులో బస్టాండ్ విషయమే కీలకంగా ఉన్నట్టు సమాచారం . ఈ గుడిలో 15 సంవత్సరాలుగా పెత్తనం సాగిస్తున్న ఓ ఉద్యోగి గుడిలోని ప్రతి అంశంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

విద్యార్థులే ఉపాధ్యాయులైతే వారి ఆనందం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

యదార్థవాది ప్రతినిది మెదక్

మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం బూరుగుపల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో శనివారం ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్న పదవ తరగతి విద్యార్థులు. విద్యార్థులు ఉపాధ్యాయులై వారి అనుభూతులు అభిప్రాయాలు పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయులుగా సిహెచ్ శివ, డీఈఓ గా చిట్యాల అనిల్, డిప్యూటీ డిఈఓ గా ఈర్ల రుచిత, ఎంఈఓ గా పి రాఘవరెడ్డి, వ్యవహరించారు. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు అందరూ బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఎస్ఎంసి చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

పిడి యాక్ట్ పై పోలిస్ సిబ్బందికి అవగాహన: డిజిపి అంజనీ కుమార్

పిడి యాక్ట్ పై పోలిస్ సిబ్బందికి అవగాహన: డిజిపి అంజనీ కుమార్

యదార్థవాది ప్రతినిది హైదరాబాదు

రాష్ట డిజిపి అంజనీ కుమార్ తెలంగాణ జిల్లా పోలీస్ కమిషనర్ల, ఎస్పీల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.. పెండింగ్ కేసులు, పిడి యాక్ట్, శివరాత్రి జాతర బందోబస్తును అంశాల గుర్చి సమీక్షా నిర్వహించారు..ఈ సందర్భంగా అంజనీ కుమార్ మాట్లాడుతూ కరుడుగట్టిన నేరస్తులపై పీడి యాక్ట్, క్రైమ్ రేట్, మహాశివరాత్రి జాతర బందోబస్తు, వర్టికల్, విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి విధులు నిర్వహించే వారు పారదర్శకంగా ఉండాలని, ప్రతీ కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్, రిసెప్షన్, క్రైమ్ వర్టికల్, టెక్ టీమ్, స్టేషన్ రైటర్, కోర్టు డ్యూటీ ఆఫీసర్, తదితర వర్టికల్, విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి తరచుగా శిక్షణ తరగతులు నిర్వహించి వారి యొక్క పనితనాన్ని మరింత మెరుగుపరచాలని తెలిపారు. హైకోర్టు ప్రభుత్వ స్పెషల్ జిపి ముజీబ్ కుమార్ మాట్లాడుతూ సదాశివాని పీడి యాక్ట్ అమెండ్మెంట్ గరుడ గట్టిన నేరస్తులపై పీడి యాక్ట్ ఏ సమయంలో ఎన్ని రోజులలో ఎన్ని నెలల్లో నేర ప్రవృత్తిని బట్టి నేరస్తులపై ఏఏ కేసులలో పెట్టాలో తదితర అంశాలను తెలిపారు..

పోలీస్ స్టేషన్ కార్యాలయాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

పోలీస్ స్టేషన్ కార్యాలయాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల

సిరిసిల్ల టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ లను శనివారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్శించి స్పెషల్ బ్రాంచ్, డిసీఆర్బీ, టాస్క్ఫోర్స్,షీ టీమ్,ఐటీ కోర్,ప్రింగర్ ప్రింట్ కార్యాలయాలను పరిశీలించి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు రికార్డులను క్రమపద్ధతిలో నిర్వహించుకోవాలని అధికారులకు సూచించారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ రవికుమార్,డిసీఆర్బీ డిఎస్పీ బాలకిషన్, సి.ఐ లు అనిల్ కుమార్, ఉపేందర్, నవీన్ కుమార్ ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు..

 

పంచాయతీ కార్యదర్శి సస్పెండ్..

పంచాయతీ కార్యదర్శి సస్పెండ్..

యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల

మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యంపై ఎల్లారెడ్డిపేట పంచాయతీ కార్యదర్శి సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి.. మండల పంచాయతీ అధికారి, ఉపాధి హామీ అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారి, సాంకేతిక సహాయకులకు షోకాజు నోటీసులు జారీచేసిన కలెక్టర్.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను సంరక్షించడంలో విఫలమైన అధికారులపై జిల్లా కలెక్టర్ వేటు వేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్దె చెరువు ట్యాంకు బండుపై నాటిన నాలుగు వరుసల మొక్కల్లో చాలావరకు నీళ్లు అందించని కారణంగా ఎండిపోవడం, ప్రధాన రహదారి పక్కల నాటిన మొక్కల సంరక్షణ కూడా సరిగా లేకుండా ట్రీగార్డులు, సపోర్టు కర్రలు పడిపోవడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ సంబంధిత సిబ్బందిపై తీవ్ర చర్యలకు పూనుకున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రతిరోజూ పర్యవేక్షణ జరుపుతూ వాచ్ అండ్ వార్డుల పనితీరును పర్యవేక్షిస్తూ మొక్కల రక్షణకు బాధ్యత వహించాల్సిన పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ తన బాధ్యతల నిర్వహణలో వైఫల్యం చెందడంతో ఆయనను కలెక్టర్ విధులనుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పనులపై పర్యవేక్షణ జరపాల్సిన సాంకేతిక సహాయకుడు ప్రభాకర్, ఏపీఓ కొమురయ్య, మండల పంచాయతీ అధికారి వజీర్లకు షోకాజు నోటీసులు జారీ చేశారు. హరితహారం కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే సహించేదిలేదని ఆయన హెచ్చరించారు. రానున్న వేసవి దృష్టిలో ఉంచుకుని మొక్కల సంరక్షణకు మండల పంచాయతీ అధికారులు, ఎంపీడీఓ లు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వర్టీకల్స్ సమర్ధ అమలుపై సమీక్ష సమావేశం

వర్టీకల్స్ సమర్ధ అమలుపై సమీక్ష సమావేశం

యదార్థవాది ప్రతినిది మెదక్

ఫంక్షనల్ వర్టీకల్స్ పై సమీక్ష సమావేశం శనివారం మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి.రోహిణి ప్రియదర్శిని నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ పోలీసుశాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పలు రకాల వర్టీకల్స్ ను అన్ని స్థాయిల పోలీసు అధికారులు సమర్ధవంతంగా అమలయ్యే విధంగా చూడాలని అన్నారు పోలీసు శాఖ అమలు చేస్తున్న పలు రకాల వర్టీకల్స్ రిసెప్షన్, బ్లూ కోట్స్, పెట్రో కార్స్, స్టేషన్ రైటర్లు, క్రైమ్ రైటర్లు, క్రైం సిబ్బంది, కోర్టు డ్యూటీ ఆఫీసర్స్, వారెంట్, సమన్స్ సిబ్బంది, టెక్ టీమ్, 5 ఎస్, మెడికల్ సర్టిఫికెట్స్, ఎఫ్.ఎస్.ఎల్., సెక్షన్ ఇంచార్జ్, ఐఓలు, జనరల్ డ్యూటీ సిబ్బందికి సంబందించిన వర్టీకల్స్ పై సమగ్రంగా సమీక్ష నిర్వహించి జిల్లా సిబ్బందికి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మెదక్ డిఎస్పి సైదులు తూప్రాన్ డిఎస్పి యాదగిరి రెడ్డి డిసిఆర్బి సిఐలు శ్రీధర్ దిలీప్ ఎస్బి సిఐ నవీన్ బాబు సిసిఎస్ సిఐ గోపీనాథ్ నర్సాపూర్ సిఐ షేక్ మదర్ లాల్ తూప్రాన్ సిఐ శ్రీధర్ రామయంపేట సిఐ చంద్రశేఖర్ రెడ్డి డిసిఆర్బి ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

 

కూలీల పైకి దూసుకెళ్లిన లారీ..

కూలీల పైకి దూసుకెళ్లిన లారీ..

యదార్థవాది

శ్రీకాకుళం జిల్లాలో లారీ బీభత్సం.. ఆముదాలవలస మండలం మదండిలో ఉపాధి హామీ కూలీల పైకి దూసుకెళ్లిన లారీ.. ఈ ప్రమాదంలో అక్కడి కక్కడే మృతి చెందిన కూలీలు.. నలుగురు మృతి, ఒకరి ప్రతి పరిస్థితి విషమం ఆసుపత్రికి తరలింపు. వివరాలు తెలియాల్సి ఉంది..

వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలి

వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలి

దేశ సరిహద్దులో సిపాయి కార్మికులు.. గ్రామంలో సఫాయి కార్మికులు..

నిజాంబాద్ యదార్ధవాది ప్రతినిధి

సఫాయి కార్మికుల వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతి వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు దాసు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఆర్మూర్; ఆలూరు మండలంలోని పలు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి పిప్రి గ్రామపంచాయతి వర్కర్స్ తో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. దాసు ఈ సందర్భంగా మాట్లాడుతూ సపాయి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 5 ఫిబ్రవరి 2023 తేదీన జక్రాన్ పల్లి మండల కేంద్రంలో రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో వివిధ జిల్లాల నుండి ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారని మహాసభలను హెచ్ఆర్ఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రపాటి మాధవరావు ప్రారంభిస్తారని, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఆయన తెలిపారు. దేశ సరిహద్దులో సిఫాయి కార్మికులు, గ్రామంలో సఫాయి కార్మికులు ప్రజల కోసం తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్న విషయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించాలని, నేడు పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని సఫాయి కార్మికుల వేతనాలు పెంచి వారిని పర్మినెంట్ చేయాలని దాసు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు నాయకులు పద్మ సత్యమ్మ ఎల్లమ్మ,చిట్టిబాబు భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మహిళను కాపాడిన పోలీసులు

మహిళను కాపాడిన పోలీసులు

యదార్థవాది ప్రతినిధి ప్రకాశం

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఓ వివాహిత రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోబోతున్న సమాచారాన్ని గిద్దలూరు జర్నలిస్ట్ సహాయంతో తెలుసుకున్న పోలీసులు హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మహిళను కాపాడారు. భర్తతో విభేదాలు రావడంతో మనస్థాపన చెందిన మహిళ తన ఐదు సంవత్సరాల తన కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు ఆత్మహత్య చేసుకోబోతున్న మహిళను చిన్నారిని పోలీస్ స్టేషన్ కు తరలించి ఎస్ఐ బ్రహ్మనాయుడు కౌన్సిలింగ్ ఇచ్చారు.తర్వాత వారి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. తన కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకోబోతున్న మహిళను కాపాడిన పోలీసులను జర్నలిస్ట్ లను ప్రజలు అభినందిస్తున్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...