2023 డైరీని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ వెంకట్రావు.. ఎస్పీ రాజేంద్రప్రసాద్..
యదార్థవాది ప్రతినిధి సూర్యాపేట
Tuwj iju ప్రచురించిన 2023 నూతన సంవత్సర డైరీ ని శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఎస్పీ రాజేంద్రప్రసాద్ లు విడివిడిగా ఆవిష్కరించారు.tuwj iju రాష్ట్ర కార్యదర్శి విరహత్ అలీ ఆదేశాలమేరకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చలసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సూర్యాపేట డిఎస్పి పరిక నాగభూషణం… జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు మిక్కిలినేని శ్రీనివాసరావు ..tuwj iju జిల్లా కార్యదర్శి డాక్టర్ బంటు కృష్ణయ్య.. ఎలక్ట్రానిక్ మీడియా సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బత్తుల మల్లికార్జున్ రెబ్బ విజయ్ కుమార్ కోశాధికారి తల్లాడ చందన్ నియోజకవర్గ అద్యక్షుడు మల్లేష్… కార్యదర్శి నాగరాజు.. ఉపాధ్యక్షుడు రామకృష్ణ ..ఆర్గనైజింగ్ సెక్రటరీలు కొండా శ్రీనివాసరావు నక్క నాగరాజు నవీల బద్రీనాథ్ కార్యవర్గ సభ్యుడు కొండ్లే కృష్ణయ్య ఎస్కే జహీర్ వరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
మల్లన్నసాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ప్రగాల్బాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వాసితుల వంద కోట్లు ఎం చేశారని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం హాత్ సే హాత్ జోడో, దుబ్బాక ఆత్మ గౌరవ పాదయాత్రలో భాగంగా మూడవ రోజు తొగుట మండలం ఎల్లారెడ్డిపేట, తుక్కాపూర్ గ్రామంలోని ప్రజల్ని కలుస్తూ వారి సమస్యల్ని తెలుసుకుంటూ పాదయాత్ర ముందుకు సాగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆరేళ్లుగా నిర్వాసితులకు రావాల్సిన బకాయిలను ఇవ్వకుండా జాప్యం చేయడమే కాకుండా మల్లన్న సాగర్ ప్రారంబోత్సవంలో మహా అంటే వంద కొట్లే కదా ఇచ్చేయండి అని తేలికగా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకెప్పుడు పూర్తి పరిహారాలు ఇస్తారని అన్నారు. మూడో టిఎంసి భూసేకరణ సమయంలో అప్పటి కలెక్టర్, ఎమ్మెల్యే లు తుక్కాపూర్ గ్రామ నిర్వాసితులకు 200 డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి సభ అనంతరం ఎంపి, సైతం హామీ ఇచ్చారని పోటా పోటీగా పాలాభిషకాలు చేసి గ్రామస్థులను మోసం చేశారని విమర్శించారు. ఏ తెలంగాణ కోసం యువకులు, సబండ వర్గాల, ప్రజలు చేసిన పోరాటం అంత వృధా అయిపోయిందని, ఉద్యోగాలు రాక చదువుకున్న యువత నిరుద్యోగులుగా మిగిలిపోయారని, అబద్ధపు హామీలతో రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కి ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. దుబ్బాక నియోజకవర్గ ప్రాంతం వివక్షకు లోనయిందని, ఓటు వేసేటప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుని ఎన్నుకొని అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆయన ప్రజల్ని కోరారు, మల్లన్న సాగర్ జలాశయం నిర్మాణంలో సర్వం కోల్పోయి ఎలాంటి ప్రత్యాన్మయాం చూపకపోవడంతో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వంతో పోరాడి నిర్వాసితులకు న్యాయం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గాంధారి నరేందర్ రెడ్డి, కొంగరి నరసింహులు మైపాల్ రెడ్డి, విజయ పాల్ రెడ్డి సీనియర్ నాయకులు శ్రీనాకర్ రెడ్డి, రేపక తిరుపతి, రమేష్, శ్రీనివాస్ గౌడ్, ఉప్పలయ్య, లింగాల కృష్ణ, బాల్ రెడ్డి, విష్ణు, బర్రెంకల స్వామి, గోపాల్, చిక్కుడు స్వామి, బొంబాయి ఎంకటి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంఘాల ఐక్యవేదిక పోరాట కమిటీ ఆధ్వర్యంలో రెండు పడకల ఇండ్లు ఇవ్వాలని, స్థలాలువున్నా వారికీ ఐదున్నర లక్షలు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ వినతి పత్రం సమర్పించారు..శుక్రవారం ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద జిల్లా రైతు సంఘం అద్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ సంవత్సరాలుగా ఇల్లు లేక అనేక అవస్థలు పడుతున్న నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పడకల ఇండ్లు కట్టించి ఇస్తానని 8 సంవత్సరాలు గడుస్తున్న నేటికి నిరుపేద ప్రజల ఆశ ఆశాగానేవుందని, ఎంతో ఆశతో ఎదురు పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ కట్టించి ఇవ్వాలని, స్థలాలువున్నా వారికీ ఐదున్నర లక్షలు ఇవ్వాలని, ఈ బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఆర్మూర్ డివిజన్ సెక్రెటరీ సిద్ధాల నాగరాజు, వికలాంగుల ఐక్యవేదిక నాయకులు కుల్దీప్ శర్మ, ఐద్వా నాయకులు సరస్వతి, మస్రత్ బేగం, వేగం రేచల్ జ్యోతి, వృత్తిదారుల సంఘం నాయకులు సాయిలు, కెవిపిఎస్ నాయకులు అంబులెన్స్ రాజు, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.
కూడవెల్లి, హల్దివాగులోకి గోదావరి జలాలను విడుదల చేసిన మెదక్ ఎం పీ కొత్త ప్రభాకర్ రెడ్డి
యదార్థవాది ప్రతినిధి గజ్వెల్
సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గజ్వెల్ నియోజకవర్గంలో జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్దీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తో కలిసి. కొడకండ్ల వద్ద మల్లన్నసాగర్ జలాలను కూడవెళ్లి వాగులోకి, వర్గల్ వద్ద కొండపోచమ్మ సాగర్ జలాలను హల్ది వాగు లోకి ఎంపీ విడుదల చేశారు ఈసందర్భంగా గంగమ్మ కు ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడుతూ కూడవెల్లి, హల్దివాగు పరివాహ ప్రాంతాల పరిధిలో నేడు పెద్ద ఎత్తున పంట పొలాలు సాగు చేయడం జరిగిందన్నారు నేడు వాగుల్లో పంట పొలాలు ఎండిపోయే అవకాశం ఉండటంతో రైతుల విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆదేశాల మేరకు శుకరవారం నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు..నీటి విడుదల మూలంగా..వేలాది ఎకరాల పంట పొలాలకు మేలు నాడు ప్రాజెక్టులు నిర్మిస్తుంటే..తమకు ఉనికి ఉండదని.చెప్పరాని కుట్రలు చేయడం జిల్లా కోర్టు నుండి మొదలు కొని సుప్రీంకోర్టు వరకు..కేసులు వేశారన్నారు నేడు ప్రాజెక్టుల నిర్మాణంతోనే..నీటిని విడుదల చేసుకుంటున్నామని ఆయన తెలిపారు ఈ సందర్భంగా తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి నాగలితో ఎంపీ ని సన్మానించారు..
సిద్దిపేట జిల్లా పట్నంలో శ్రీ మార్కండేయ దేవాలయంలో 60వ వార్షికోత్సవం సందర్భంగా శివ పార్వతి కల్యాణోత్సవంలో మృత్యుంజయ హోమంలో పాల్గొన్న మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలీలు ఐక్యంగా ఉండి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక చేనేత కార్మికుల ఆకలి చావులు ఆత్మహత్యలు వలస బతుకులు తగ్గాయన్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు బక్కి వెంకటయ్య, సిద్దిపేట జిల్లా సంఘం అధ్యక్షులు డాక్టర్ కస్తూరి సతీష్, పట్టణ పద్మశాలి సమాజం అధ్యక్షులు కాముని రాజేశం, ప్రధాన కార్యదర్శి బూర మల్లేశం, ప్రచార కార్యదర్శి ముదిగొండ శ్రీనివాస్, ఇప్పకాయల శ్రీహరి, గుండు రవితేజ, ఉష కోయల గణేష్, కొండబత్తిని కోటి, బూర మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
నూతన సచివాలయం లో అగ్నిప్రమాదం సంఘటనపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ స్పందించారు అంబేడ్కర్ సెక్రటేరియట్‌ను కేసీఆర్ పుట్టిన రోజు ప్రారంభించడం ఏంటని ప్రశ్నించారు. వాస్తు బాగాలేదని సెక్రటేరియట్ కూలగొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ”నేను వద్దన్నాను, దేవుడు వద్దు అనుకున్నాడు. అందుకే సెక్రటేరియట్ కాలిపోయింది. నాతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. దేవుడు కూడా కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నాడు. దేవుడికి నచ్చకనే సెక్రటేరియెట్‌కు వ్యతిరేకంగా నిలబడ్డాడు” అంటూ వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఎంతో కాలం చెల్లదని… కేసీఆర్ ఇప్పటికైనా పశ్చాత్తాపడి మారాలని సూచించారు. కేసీఆర్ ఈసారి ముఖ్యమంత్రిగానే గెలవరని.. ఇక ప్రధాని ఏం అవుతారని ఆయన ఎద్దేవా చేశారు అంబేడ్కర్ జయంతి రోజే సెక్రటేరియట్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు
అబుదాబి నుంచి కాలికట్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ ఐఎక్స్ 348 లో మంటలు చెలరేగడంతో తిరిగి అబుదాబి విమానాశ్రయంలో దిగినట్లు ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో మొత్తం 184 మంది ప్రయాణికులు ఉన్నారు..ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఐఎక్స్ 348లో మంటలను చూసిన పైలట్ అబుదాబికి తిరిగి తీసుకువచ్చి సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. విమానం ఇంజనులో సాంకేతిక లోపం వల్లనే మంటలు చెలరేగాయని ఎయిర్ ఇండియా అధికారులు చెప్పారు. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో విమాన ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వికారాబాద్ జిల్లా కలెక్టర్
యదార్థవాది ప్రతినిది వికారాబాద్
వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా నియమితులు అయిన నారాయణ్ రెడ్డి శుక్రవారం నగరంలోని శ్రీనగర్ కాలనిలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా కలెక్టర్ ను విద్యా శాఖ మంత్రి అభినందించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతోంది. తాజాగా ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి సీబీఐ ఎదుటహాజరయ్యారు.. అవినాష్ రెడ్డి ఫోన్ కాల్ డేటా ఆధారంగా గతంలో కృష్ణ మోహన్ రెడ్డితో పాటు వైఎస్ భారతి ఇంట్లో పనిచేసే నవీన్‌కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో కడప కేంద్ర కారాగారంలో సీబీఐ విచారణకు ఈరోజు వీరిద్దరూ హాజరయ్యారు. ఈ నెల 28న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని నాలుగున్నర గంటలపాటు విచారించిన సీబీఐ.. ప్రధానంగా ఆయన కాల్‌డేటాపై ఆరా తీసింది. నవీన్ అనే వ్యక్తి పేరిట ఉన్న మొబైల్ నంబర్‌కు అవినాష్ ఎక్కువగా కాల్ చేసి మాట్లాడినట్లు దర్యాప్తులో గుర్తించింది. ఈ నేపథ్యంలో అతనితో పాటు కృష్ణ మోహన్ రెడ్డి సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎర్రగంగిరెడ్డి, అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి, రిమాండు ఖైదీలుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్‌లను ఫిబ్రవరి 10న విచారణకు హైదరాబాద్‌కు రావాలని సీబీఐ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే.
ప్రపంచ వేదికపై దేశం, ఆంధ్ర రాష్ట్ర జెండా ఎగురవేయాలి: సీఎం జగన్
యదార్థవాది ప్రతినిది తాడేపల్లి
అర్హులైన విద్యార్థులందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన కింద నిధులను ప్రభుత్వం అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు ఉచిత విదేశీ విద్యను అందిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో టాప్-200 వర్సిటీల్లో ఉచిత ఉన్నత విద్య అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్థులకు మొదటి విడతలో సాయంగా రూ. 19.95 కోట్లను బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. జగనన్న విదేశీ విద్యా దీవెన రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం. మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. పేద విద్యార్థులు ప్రపంచంలోనే టాప్ వర్సిటీల్లో చదువుకునే అవకాశం కల్పించాము. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల పేద విద్యార్థులకు అవకాశం ఇచ్చాము. పేదల చదువుకు పేదరికం అడ్డుకాకూడదు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే. విదేశీ వర్సిటీల్లో 213 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. వీరికి తొలివిడతగా రూ.19.95 కోట్ల సాయం అందిస్తున్నాము. ప్రపంచ వేదికపై దేశం, ఆంధ్ర రాష్ట్ర జెండా ఎగురవేయాలి. మన పిల్లలు ప్రపంచ స్థాయిలో రాణించాలని ఆకాక్షించారు. చిత్తశుద్ధితోనే పరిస్థితులు మార్చాలనే తాపత్రయం నుంచి ఈ ఆలోచన వచ్చింది. మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. విద్య మీద పెట్టే ప్రతి పెట్టుబడి కూడా మానవ వనరుల మీద పెట్టినట్టే. కుటుంబాల తలరాతలే కాదు.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి తలరాతలు కూడా మారుస్తాయి. మహాత్మ గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, అంబేద్కర్ వంటి వాళ్లు పెద్ద యూనివర్శిటీల నుంచి వచ్చినవారే. అందుకే పిల్లలు చదువుకునేలా అడుగులు వేయిస్తున్నామని అన్నారు. గతంలో కేవలం రూ. 10లక్షలు మాత్రమే ఇచ్చేవారు. 2016-17కి సంబంధించి రూ.300 కోట్లు బకాయిలు పెట్టారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్లు, మిగిలిన విద్యార్థులకు గరిష్టంగా రూ.కోటి వరకు సాయం అందిస్తున్నాము. ట్యూషన్ ఫీజు వందశాతం రీయింబర్స్‌మెంట్స్ ఇస్తున్నామన్నారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే సీఎంఓలో అధికారులు అందుబాటులో ఉంటారు. ఇబ్బంది ఉంటే వెంటనే కాల్ చేయండి. ప్రతీ విషయంలో మీకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.