27.7 C
Hyderabad
Saturday, April 25, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 106

సంతాపం తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు

విశ్వనాథ్‌ కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారు – సీఎం జగన్..

యదార్థవాది ప్రతినిది

విశ్వనాథ్‌ కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారన్నారు సీఎం జగన్. ప్రముఖ దర్శకుడు కళాతపస్వి, పద్మశ్రీ కె.విశ్వనాథ్ మరణం పట్ల ముఖ్యమంత్రి జగన్ సంతాపం తెలిపారు. విశ్వనాథ్‌గారి మరణం తీవ్ర విచారానికి గురిచేసింది. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్‌గారని తెలిపారు ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీరంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయి. తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారని వెల్లడించారు. ఇక అటు కె.విశ్వనాథ్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథను ఎంచుకొని తన అద్భుతమైన ప్రతిభతో.. వెండి తెర దృశ్య కావ్యంగా మలిచిన అరుదైన దర్శకుడు కె.విశ్వనాథ్ అని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. గతంలో కె.విశ్వనాథ్ గారి ఆరోగ్యం బాగాలేనప్పుడు వారి ఇంటికి వెళ్లి పరామర్శించానని, ఆ సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య జరిగిన చర్చను సీఎం గుర్తు చేసుకున్నారు..

పత్రిక స్వేచ్ఛను హరించే విధంగా అక్రమ కేసులు

పత్రిక స్వేచ్ఛను హరించే విధంగా అక్రమ కేసులు

నేడు ప్రశ్నించే జర్నలిస్టుల పరిస్థితి ప్రశ్నార్థకం

తిరుపతి యదార్థవాది ప్రతినిది

నేడు సమాజంలో ప్రశ్నించే గొంతుకులను అధికారంతో అక్రమ కేసులు బాణాయించి నొక్కే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని, ఐక్యత లోపంతోనే ఇలాంటి అక్రమ కేసులు జర్నలిస్టులపై కూడా పెడుతున్నారని పౌరుల హక్కుల సంఘం ఉభయ తెలుగు రాష్ట్రాల కన్వీనర్, న్యాయవాది క్రాంతి చైతన్య అభిప్రాయపడ్డారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల శశి కుమార్ అనే జర్నలిస్టుపై అక్రమ కేసు బనాయించి అనారోగ్యంగా ఉన్నాడని తెలిసినా శశిని రిమాండ్ కు తరలించారని, ఆ మనోవేదనతోనే శశి తనువు చాలించాడన్నారు టిటిడి లోపాలను ఎత్తి చూపుతూ వార్తల ప్రచురణ చేసిన కోలా లక్ష్మీపతి అనే సీనియర్ జర్నలిస్టుపై కూడా కేసులు పెట్టారని గుర్తు చేశారు. శ్రీ వారి ఆలయం ముందు వేసిన పందిళ్లను అద్దెలకు కాకుండా శాశ్వత పందిళ్లను ఏర్పాటు చేయాలని మేలు అనడం తప్పా? అని ప్రశ్నించారు. హోటల్ అద్దెకు తీసుకున్న ప్రైవేటు వ్యక్తి టిటిడి కి చెల్లించాల్సిన కోట్ల రూపాయలను ఎగ్గొట్టి వెళ్లిపోతే ఆ డబ్బును టీటీడీ నష్టపోకుండా రికవరీ చేయాలని వార్తలు రాయడం నేరమా అని క్రాంతి చైతన్య నిలదీశారు. ఈ అంశాలపై వార్తలు రాయడం కారణంగా టిటిడి కి ఏ విధంగా పరువు నష్టం జరిగిందో ఆలోచించాలన్నారు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అనేకమంది ప్రజాప్రతినిధులపై వారు చేస్తున్న విధానాలపై ఎన్నో కథనాలు జర్నలిస్టులు రాస్తుంటారని ఇలాంటి వాటిపై వారు కనుక కక్ష సాధింపు ధరణి ఏర్పరచుకుని ఉంటే సమాజం ఏ పరిస్థితుల్లో ఉండేదో ఆలోచించాలన్నారు ప్రస్తుతం మాచర్ల శ్రీనివాసులు అనే జర్నలిస్టుపై కూడా గంజాయి అక్రమ రవాణాకు సహకరిస్తున్నాడని అక్రమ కేసును పెట్టారన్నారు. వాస్తవానికి మాచర్ల శ్రీను తిరుమలలో భక్తులకు జరుగుతున్న అసౌకర్యాలను సంబంధిత ఉన్నతాధికారికి సమాచారం మాత్రమే ఇచ్చారని, ఆ విషయాలను ఎక్కడ పత్రికల్లో ముద్రించలేదని తెలిపారు. తనపై ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు పెట్టడానికి టిటిడి విజిలెన్స్, తిరుమల టూ టౌన్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని మాచర్ల శ్రీను తమకు సమాచారం అందించారని ఈ సందర్భంగా క్రాంతి కుమార్ తెలిపారు. ఈ క్రమంలోనే శీనుపై సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ లో గంజాయి అక్రమ రవాణకు సహకరిస్తున్నాడని కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు తరలించారన్నారు ఈ విషయాలను గమనిస్తుంటే సమాజంలో ప్రశ్నించే గొంతుకులను అణగదొక్కే ప్రయత్నాలు అధికారంను అడ్డుపెట్టుకొని చేస్తున్నారన్న వాస్తవాలు తేటతెల్లమవుతున్నాయన్నారు శీను అరెస్టులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డిబిఆర్ హాస్పిటల్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టుగా నమోదు చేశారని, వాస్తవానికి మాచర్ల శ్రీనివాసులు నివాసం ఉంటున్న సుబ్బారెడ్డి నగర్ లో తన ఇంటి వద్ద నుండి పోలీసులు అరెస్టు చేసి తీసుకెళుతున్న సీసీ ఫుటేజ్లు తమ వద్ద ఉన్నాయని తెలిపారు ఇలా పత్రిక స్వేచ్ఛను హరించే విధంగా అక్రమ కేసులు పెట్టి జర్నలిస్టులలో ఐక్యతను దెబ్బతీసే విధంగా పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం సభ్యులు హేమాద్రి, అడ్వకేట్లు రవీంద్రనాథ్, వాసుదేవ్ పాల్గొన్నారు.

అథ్లెటిక్స్ టీమ్ కోచ్ గా మధుసూదన్

అథ్లెటిక్స్ టీం కోచ్ గా మధుసూదన్

యదార్థవాది ప్రతినిధి మెదక్

మధ్యప్రదేశ్ లోని భూపాల్ స్టేడియంలో ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు రెండు రోజు పాటు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరుగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొనే టీం కు కోచ్ గా అథ్లెటిక్స్ అసోసియేషన్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్ నియమితులయ్యారు. జాతీయ స్థాయిలో జరిగే ఖేల్ ఇండియా పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటే విధంగా కృషి చేస్తామన్నారు.

కొత్త తిరుపతిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ

కొత్త తిరుపతి ని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ

సిరికొండ యదార్థవాది ప్రతినిధి

సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామంలో గల ఎదురుకొండ వెంకటేశ్వర స్వామి కొత్త తిరుపతిని గురువారం మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ఆలయంలోని స్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా అరికెలను గ్రామ సర్పంచ్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు శాలువాతో సన్మానించి, తీర్థ ప్రసాదాల అందజేశారు.

విద్యార్థికి సముద్రాల ట్రస్తు ఆర్థిక సహాయం

విద్యార్థికి సముద్రాల ట్రస్టు ఆర్థిక సహాయం

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి

ఉన్నత విద్య చదవలనుకున్న విద్యార్థినికి ఆర్థిక ఇబ్బంది తలెత్తడంతో సిద్దిపేటకు చెందిన సముద్రాల చారిటబుల్ ట్రస్టు ఆర్థిక సహాయం అందించింది. గజ్వేల్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన దుబాషి అరుణ భానుప్రసాద్ దంపతుల కుమార్తె అర్చన గుజరాత్ రాష్ట్రంలో ఎన్ ఎఫ్ ఎస్ యూ లో ఇంటిగ్రేటెడ్ బీ టెక్ సైబర్ క్రైం కోర్సులో ప్రస్తుతం రెండవ సంవత్సరం చదువుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ ను ఆ యూనివర్సిటీ అనుమతించలేదు. దాంతో అర్చనకు సంవత్సరానికి కాలేజీ ఫీజు సుమారు లక్ష పది వెలు, హాస్టల్ కు సుమారు లక్ష 50 వేలు చెల్లించాలి. నిరుపేద కుటుంబానికి చెందిన అర్చన తండ్రి 8నెలల క్రితం కాలువిరిగి మంచంపట్టాడు. అమ్మాయి కి ఫీజు చెల్లించే పరిస్థితి లేక కాలేజీ నుంచి వచ్చి ఇంటి వద్దనే ఉంటుంది. సిద్దిపేటకు చెందిన సముద్రాల చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు శ్రీనివాస్ విషయం తెలుసుకుని గురువారం అర్చనకు రూ.10వెల ఆర్ధిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం స్కాలర్షిప్ రాదనే విషయం తెలియక తన కూతురు గుజరాత్ లోని యూనివర్సిటీ లో చేరిందని విద్యార్థిని తల్లి అరుణ తెలిపింది. దినసరి కూలి చేస్తూ పిల్లల్ని చదివించుకునే పరిస్థితి లో భర్త ప్రమాదానికి గురయ్యారని దాంతో అతడు కూలి పనికి వెళ్లడం లేదని చెప్పింది. ప్రభుత్వం కానీ దాతలు ముందుకొచ్చి తన కూతురు ఉన్నత చదువు కోసం సహాయపడలని వేడుకుంది. తనకు గత సంత్సరం పాటుగా ఆర్థికంగా ఆదుకుంటున్న సముద్రాల ట్రస్టు కు రుణపడి ఉంటామని అర్చన చెప్పింది.

పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి

పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి

పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి

బిజెపి ఎంపీ అరవింద్ ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి..

యదార్థవాది ప్రతినిది ఆర్మూర్

పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ అన్నారు.. ఆర్మూర్ లో మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ బిజెపి ఎంపీ అరవింద్ ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, పండించిన పసుపు పంటకు మద్దతు ధర లేక రైతులు ఆందోళనలో ఉన్నారని, పసుపుకు గిట్టుబాటు ధర కల్పించి, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని తెలిపారు. పసుపు రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాసే కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, ఇప్పటికైనా ఎంపీ అరవింద్ రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్మూర్ ప్రాంత రైతులు, రైతు సంఘం నాయకులు భూమన్న, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎంఈఓ ల బృందం

జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎంఈఓ ల బృందం.

యదార్థవాది ప్రతినిధి ఆర్మూర్

బదిలీపై వచ్చిన నూతన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును, జిల్లా ఎంఈఓ ల బృందం గురువారం నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి స్వాగత అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాక్లూర్ ఎంఈఓ రాజ గంగారెడ్డి, ఆర్మూర్ ఎంఈఓ రాజగంగారం, జక్రంపల్లి ఎంఈఓ శ్రీనివాస్, నిజామాబాద్ ఎంఈఓ రామారావు, మోర్తాడ్ ఎంఈఓ ఆంధ్రయ, భీంగల్ ఎంఈఓ స్వామి, వేల్పూర్ ఎంఈఓ వనజ, వర్ని ఎంఈఓ శాంత కుమారి, తదితరులు పాల్గొన్నారు.

దేశ సేవలో యువత ముందు ఉండాలి

దేశ సేవలో యువత ముందుండాలి

సిరికొండ యదార్థవాది ప్రతినిది

దేశంకోసం తమ వంతు సేవ చేసే లక్ష్యంతో యువత ముందుకు రావడం స్ఫూర్తిదాయకమని దేశ సేవలో యువత ముందుండాలని సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీచైర్మన్ రావుట్ల నర్సయ్య అన్నారు. ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ ఫలితాలలో సత్యశోధక్ పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు గడ్డల నిహాల్, దేశెట్టి అరుణ్ కుమార్ లను ఆయన గురువారం సత్కరించారు వారు ఇండియన్ ఆర్మీ జనరల్ డ్యూటీ విభాగంలో ఎంపికైనట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగారెడ్డి శంకర్రవి సతీష్,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టులకు అండగా ఉంటా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

జర్నలిస్టులకు అండగా ఉంటా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్.

యదార్థవాది ప్రతినిధి సిరికొండ

జర్నలిస్ట్ సోదరులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.గురువారం సిరికొండ మండలానికి చెందిన పత్రిక విలేకరులు హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను జర్నలిస్టు మిత్రులకు అందేలా చూడాలని ఎమ్మెల్యేను కోరడంతో ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రభుత్వం తరఫున అందే సంక్షేమ పథకాలను వర్తింప చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో జర్నలిస్ట్ మిత్రులు ఎమ్మెల్యే స్పందనకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు అంగూరి గణేష్ గౌడ్, ములుగు రాజేశ్వర్, నూనె నరేందర్, సిహెచ్ ముక్కంటి, బాదె వినోద్, బాడాల సంతోష్ ఆర్ చందన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వసతి గృహాల పై విచారణ జరపాలి

వసతి గృహాల పై విచారణ జరపాలి కొండ ప్రశాంత్

యదార్థవాది ప్రతినిధి మెదక్

మెదక్ జిల్లా బీసి సంక్షేమ వసతి గృహలను జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారులపై విచారణ జరపాలని జిల్లా కేంద్రంలో ఆల్ ఇండియా ప్రోగ్రెస్ స్టూడెంట్ యూనియన్ ఆఫీసులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కన్వీనర్ కొండ ప్రశాంత్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వసతి గృహాలను పరిశీలించినప్పుడు అనేకమైన సమస్యలు మా దృష్టికి వచ్చేయ్ అన్నారు వసతి గృహాలలో విద్యార్థులకు సరైన వసతులు కల్పించడం లేదు వారికి రావలసిన కాస్మోటిక్ చార్జీలు ఇతర సామాగ్రిని విద్యార్థుల బుక్స్ ను ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నారు వసతి గృహాల అధికారుల పై విచారణ జరిపి తగు చర్యలు చేపట్టాలని లేనియెడల కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యవర్గ సభ్యులు సాయి కుమార్ నాయకులు శివ అలీమోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...