27.7 C
Hyderabad
Saturday, April 25, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 107

ఘన సన్మానం

ఘన సన్మానం

యదార్థవాది ప్రతినిధి ఆర్మూర్

ఆలూరు మండలం దేగాం గ్రామంలో గల ఉన్నత ప్రాథమిక పాఠశాలల్లో గ్రామ విద్యాభివృద్ది కమిటీ ఆద్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టారు రంగులు వెయించడం, నీటి వసతికి వాటర్ ట్యాంకులు ఎర్పాటు, మినరల్ వాటర్ ప్లంట్, టాయిలెట్స్ నిర్మించడం, పాఠశాలలకు అవసరమైన అన్ని వసతులు సమకూర్చి, విధ్యాభివృద్ధికి తొడ్పడుతున్న గ్రామ విద్యాభివృద్ధి కమిటీ సభ్యులను, స్థానిక నాయకులు ఉప సర్పంచ్ సరోజా గంగారెడ్డి, మాజీ సర్పంచ్ బియంక్ గనేష్, మాజి సోసైటి ఛైర్మెన్ ముత్యం రెడ్డి, భోజన్న, ఆంజనెయులు, నాగ రత్నమ్, పెద్ద సాయన్న, జెల్లా రాజు, ముత్తెన్న, చాకలి దేవన్న, గంగ మల్లు, భోజన్న, యెల్లయ్య లను ఎంఈఓ రాజగంగారం, చేతుల మీదుగా ఘానంగ సన్మానించారు. ఈ కార్యక్రమములో పాఠశాలల ఉపధ్యాయులు ఇందుమతి, అనురాద, శ్రీనివాస్, శ్రీధర్, సుమతి, రాజేశ్వర్, నరెందర్, విమల, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి

విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి

యదార్థవాది ప్రతినిది కామారెడ్డి

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంఘం అద్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ఆంధ్రభూమి కాలమిస్ట్ డాక్టర్ లచ్చయ్య మాట్లాడుతూ అందరికి ప్రాదమిక విద్య అందాలంటే ఈ బడ్జెట్ సమావేశాలలో విద్యారంగానికి అధిక నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో ఏ పి టి ఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు వేణుగోపాల్, బామ్ సేఫ్ రాష్ట్ర కార్యదర్శి నరేందర్, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు, బాబు, బివిఎం, ఉపాధ్యాయులు సాయి గౌతమ్, సిపిఐ ఎంఎల్ ప్రజాపంతా జిల్లా నాయకులు ప్రకాష్ దేవి సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్ఆండ్ఆర్ కాలనీ క్షేత్ర స్థాయిలో పర్యటించిన: జిల్లా కలెక్టర్

ఆర్ఆండ్ఆర్ కాలనీ క్షేత్ర స్థాయిలో పర్యటించిన: జిల్లా కలెక్టర్

యదార్థవాది ప్రదినిది సిద్దిపేట

సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలు నివసిస్తున్న ఆర్ఆండ్ఆర్ కాలనీలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గురువారం గజ్వేల్ మండలం ముట్రాజ్ పల్లి గ్రామ శివారులో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు నివసిస్తున్న ఆర్&ఆర్ కాలనీలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి కలెక్టర్ పర్యటించారు.. మల్లన్న సాగర్ ముంపుగ్రామాలు ఎర్రవల్లి, సింగారం, వేములఘాట్, పల్లెపహాడ్, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాల వాసుల ఆర్&ఆర్ కాలనీలో అవసరమైన మౌలిక వసతుల కల్పన, ఓపెన్ ప్లాట్ల, ఓక్కో గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులతో చర్చించారు. ఓపెన్ ప్లాట్ల చెయ్యాల్సిన లే అవుట్ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ఎలక్ట్రిసిటీ పనులు త్వరగా పుర్తి చేయ్యాలని, వాటర్ ట్యాంకు, డ్రైనేజీ వ్యవస్థ, మిషన్ భగీరథ నీటి సమస్య, వైకుంఠదామాలు, గుడులు, అంగన్వాడి, అక్కడక్కడా అసంపూర్తిగా వున్నా పనులను తొందరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు. ఆర్&ఆర్ కాలనీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల ప్రహరీ గోడ వద్ద పెద్ద బండ ఉన్నందున దాని పక్కన ఎత్తున ప్రహరీ గోడ నిర్మించాలని, పక్కనే నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల పనులను పరిశీలించారు, పాఠశాలల్లో సమారు 330 మంది పిల్లలు చదువుకుంటున్నరని, వారికి మీషన్ భగిరథ కనెక్షన్ ఇప్పించాలని, మన ఊరు మన బడి పథకంలోలా పాఠశాలకు కలరింగ్ స్టిల్ బోర్డు తో పేరును పెట్టాలని, మంపు గ్రామ ప్రజలు ఎ ఓక్కరు నష్టపోకుండా అందరికీ తప్పకుండా న్యాయం చేస్తాం అన్నారు. కలెక్టర్ వెంట ఆర్డిఓలు, అనంతరెడ్డి విజేందర్ రెడ్డి, టిఎస్ఈడబ్లుఐడిసి ఈఈ శ్రీనివాస్ రెడ్డి డిఈ మదుసుదన్, మిషన్ భగీరథ డిఈ సుమలత, కాంట్రాక్టర్లు, నిర్మాణా ఎజెన్సీ, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి..

డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి..

యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల

సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలో ఇండ్లు మంజూరై ఇప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభంకానీ డబుల్ బెడ్ రూం ఇండ్ల వెంటనే పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.గురువారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఇంజనీరింగ్ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, సిరిసిల్ల, తంగళ్ళపల్లి, ముస్తాబాద్, వీర్నపల్లి, గంభీరావుపేట, తహశీల్దార్లతో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాల ప్రారంభం, వేగవంతానికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గానికి 4 వేల 429 రెండు పడక గదుల ఇండ్లు మంజూరయ్యాయని, ఇందులో 3 వేల 178 ఇండ్లు ఇప్పటికే పూర్తికాగా మిగతావి వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. కొన్ని గ్రామాల్లో ఇండ్లు మంజూరైన కూడా ఇప్పటివరకు నిర్మాణ పనులు ప్రారంభించలేదని వీటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వివిధ దశల్లో ప్రగతిలో ఉన్న ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్, ఇంఛార్జి డీఆర్ఓ టి.శ్రీనివాస రావు, ఆర్ & బి ఈఈ శ్యామ్ సుందర్, పంచాయితీ రాజ్ ఈఈ సూర్య ప్రకాశ్, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఈఈ విరూపాక్ష, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ జానకి, మండల తహశీల్దార్లు, ఏఈ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యే తనయుడు

ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యే తనయుడు

యదార్థవాది ప్రతినిధి మంచిర్యాల

మంచిర్యాల నియోజకవర్గం, హజిపూర్ మండలం నంనూరు గ్రామంలో ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్ కుమార్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసు కుంటున్నారు ఒకవైపు ప్రజలకు అందుతున్న సంక్షేమాభివృద్ధి ఫలాలను అడిగి తెలుస్కుంటూనే మరోవైపు ఏమైన సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుని వాటికి పరిష్కార మార్గం చూపుతూ తండ్రికి తగ్గ తనయుడు అన్పించుకుంటున్నారు..

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా అరకొర నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో AISF ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం చేశారు ఈ కార్యక్రమంలో AISF రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి,జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు సంగెం మధు,జేరిపోతుల జనార్దన్ మరియు AISF నాయకులు పాల్గొన్నారు

పేరు గొప్ప ఊరు దిబ్బ

పేరు గొప్ప ఊరు దిబ్బ

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

కెజిబివి నాన్ టీచింగ్ వర్కర్ లకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని,వారిని క్రమబద్దీకరించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఐ.ఎఫ్.టి.యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.జనార్ధన్ డిమాండ్ చేశారు గురువారం ప్రగతిశీల కెజిబివి నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో కెజిబివి వర్కర్ల సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు ఆయన మాట్లాడుతూ కెజిబివి లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, వర్కర్ల కు ఈఎస్ఐ,పి.ఎఫ్,వైద్య సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నపుడు,2005 లో కెజిబివి లను ప్రారంభించారని, తెలంగాణ రాష్ట్రములో పెరుగుతున్న ధరల కనుగుణంగా వర్కర్ల వేతనాలు పెంచకుండా,వారిని పర్మినెంట్ చేయకుండా పని భారాన్ని పెంచడమే తప్ప,వర్కర్ లతో గొడ్డు చాకిరీ చేయించడమే పాలకుల విధానంగా మారిందని విమర్శించారు. ఆంధ్రాలో జగన్ ప్రభుత్వం నాన్ టీచింగ్ వర్కర్ లకు 14000 ల నుండి 18000 వేలు కేటగిరీల వారీగా జీతాలు చెల్లిస్తుంటే, తెలంగాణ రాష్ట్రం ధనిక,మిగులు రాష్ట్రమని గొప్పలు చెప్పుకున్న కేసిఆర్ ప్రభుత్వం,కెజిబివి నాన్ టీచింగ్ వర్కర్ లకు కేవలం 9750 రూపాయలకే పరిమితం చేశాడని, పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందంగా కేసిఆర్ పాలన తయారైందని మండిపడ్డారు. నాన్ టీచింగ్ వర్కర్ లకు కనీస వేతనం,పర్మినెంట్ చేసే బాధ్యత ఉన్నప్పటికీ ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కార్మిక వ్యతిరేక విధానాలలో భాగమేనని కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వ్యవస్థ ద్వారా కార్మిక వర్గాన్ని శ్రమ దోపిడీకి గురిచేసే విధానం తక్షణమే మార్చుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ కెజిబివి నాన్ టీచింగ్ వర్కర్స్ పద్మ కవిత మల్లిక రజిత అరుణ దుర్గమ్మ లావణ్య శెశిరేఖ కవిత శైనజ్ బేగం తదితరులు పాల్గొన్నారు.

బాల కార్మికులకు విముక్తి: జిల్లా ఎస్ పి రోహిణి

బాల కార్మికులకు విముక్తి: జిల్లా ఎస్ పి రోహిణి

ఆపరేషన్ స్మైల్ 9 దాడులలో 98 మంది బాల కార్మికులకు విముక్తి జిల్లా ఎస్ పి రోహిణి ప్రియదర్శిని

యదార్థవాది ప్రతినిది మెదక్

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ గత నెల రోజులుగా మెదక్ జిల్లా ఆపరేషన్ స్మైల్ 9 దాడులు నిర్వహించి బాలకార్మికులను విముక్తి కలిగించడం జరిగిందని, బట్టలషాప్ లలో, ఆటో మొబైల్ షాపుల్లో పని చేస్తున్న98 మంది బాల కార్మికులను గుర్తించి పట్టుకోవడం జరిగిందని తెలిపారు. 22 మంది అమ్మాయిలు, 76 మంది బాలురు ఉన్నారు. ఆపరేషన్ స్మైల్ 9 బృందం గుర్తించి పట్టుకున్న వారిని CWC DCPO వారికి అప్పగించడం జరిగిందని తెలిపారు. తదుపరి పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరచి పిల్లలకు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని ఎస్ పి తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కనబడితే వెంటనే డయల్100 కి కానీ 1098 కి కానీ కాల్ చేసి వారికి సమాచారం ఇవ్వగలరని ఎస్ పి తెలిపారు.

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం

యదార్థవాది ప్రతినిది దరాబాద్

హైదరాబాద్ వి ఎస్ టి లోని అన్నపూర్ణ బార్ వద్ద గల గోదాం లో భారీ అగ్నప్రమాదం సంభవించింది ఒక్క సారిగా పెద్ద ఎత్తున దట్టమైన పొగలతో ఎగిసిపడుతున్న మంటలు వ్యాపించడంతో భయాందోళనకు గురైన స్థానికులు ప్రజలు పోలీసులకు పైర్ సిబ్బందికి సమాచారం అందించారు మంటలు అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు గోదాం లో కేబుల్ వయర్స్ & ప్లాస్టిక్ మెటీరియల్ కు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసుల అనుమానం

నేటి నుండి చిన్నజాతర..

నేటి నుండి చిన్నజాతర..

యదార్థవాది ప్రతినిది మేడారం

ఆదివాసీ సంప్రదాయాలతో బుధవారం నుంచి శనివారం వరకు మేడారంలో వైభవంగా నిర్వహింస్తున్నారు. రెండేళ్లకోసారి మేడారం మహాజాతర నిర్వహిస్తుంటారు. తర్వాత ఏడాదికి నిర్వహించే మండమెలిగే పండగనే చిన్నజాతరగా పిలుస్తారు. దీన్ని ఈ సారి ఆదివాసీ సంప్రదాయాలతో బుధవారం నుండి శనివారం 4వ తేదీ వరకు మేడారంలో వైభవంగా నిర్వహింస్తున్నారు.. సమ్మక్క, సారలమ్మ ఆలయాలతో పాటు గద్దె ప్రాంగణాలను అలంకరించి సిద్ధం చేశారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం రూ.2.82 కోట్లతో తాగునీరు, మరుగుదొడ్లు, జల్లు స్నానాలు, దుస్తులు మార్చుకునే గదులు, విడిది గృహాలు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, పోలీసు బందోబస్తు, తదితర పనులు అధికారులు పూర్తిచేశారు. హనుమకొండ బస్టాండు నుంచి ప్రతి 45 నిమిషాలకు ఒక బస్సును ఉదయం 5 నుంచి సాయంత్రం 8 గంటల వరకు బస్సులు అందుబాటులో ఉంటాయని టి ఎస్ ఆర్ టి సి అధికారులు తెలిపారు. రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు మేడారానికి తరలిరానున్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...