27.7 C
Hyderabad
Saturday, April 25, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 108

ఆపరేషన్ స్మైల్-9 విజయవంతం: జిల్లా ఎస్ పి

ఆపరేషన్ స్మైల్-9 విజయవంతం: జిల్లా ఎస్ పి

అన్నిశాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్-9 విజయవంతం, జిల్లాలో 26 మంది బాల కార్మికుల విముక్తి : జిల్లా ఎస్ పి అఖిల్ మహాజన్

యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాల, బాలికలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా జిల్లాలో ఆపరేషన్ స్మైల్ విజయవంతం కోసం పోలీస్, టాస్క్ ఫోర్స్ బృందం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ,లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంటుఅధికారులతో జిల్లాలో టీమ్ లుగా ఏర్పాటు చేసి ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థలను గుర్తించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని ఇందులో భాగంగా ఈ సంవత్సరం జనవరి 1 నుండి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ స్మైల్-9 కార్యక్రమాలో జిల్లా వ్యాప్తంగా 26మంది (బాలురు-17,బాలికలు-09) బాలకార్మికులను గుర్తించి వారి యొక్క తల్లిదండ్రుల వద్దకు చేర్చడం జరిగిందని జిల్లా ఎస్ పి తెలిపారు. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మానందరిపైనా ఉన్నదని, బాల కార్మిక వ్యవస్థ నిర్ములన కోసం బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. తరుచు బాలల చేత పనులు చేయిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందాని, వీధి బాలలను చూసినప్పుడు, డయల్ 100, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఆపరేషన్ స్మైల్ విజయవంతం చేయడానికి సహకరించిన అన్ని శాఖల అధికారులను జిల్లా ఎస్ పి అభినందించారు.

విద్యారంగానికి బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించాలి

విద్యారంగానికి బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించాలి

ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి జేరిపోతుల జనార్ధన్
యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

ప్రభుత్వాలు ప్రవేశ పెట్టబోయే వార్షిక బడ్జెట్లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జేరిపోతుల జనార్దన్ అన్నారు మంగళవారం సిద్దిపేట లోని ఎడ్ల గురువారెడ్డి భవన్ లో ఆయన ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సంగెం మధు,వర్కింగ్ ప్రెసిడెంట్ రామగళ్ల నరేష్ లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో విద్యకు కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదని,కొఠారి కమిషన్ సిఫార్సు చేసిన విధంగా కేంద్ర బడ్జెట్లో విద్యకు 10% నిధులు రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 30% నిధులు ఇవ్వాల్సి ఉండగా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి,బీఆర్ఎస్ ప్రభుత్వాలు విద్యారంగం పట్ల చిన్నచూపు చూస్తున్నాయని మండిపడ్డారు.. కేంద్ర బడ్జెట్లో గత 8 సంవత్సరాల నుంచి విద్యకు మూడు శాతం మించి నిధులు ఇవ్వడం లేదని,కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని కుంటు పడేలా చేస్తుందని,అదే విధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న నుండి బిఆర్ఎస్ ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాలుగా విద్యకు నిధులు తగ్గిస్తూ వస్తుందని,కేవలం 2014-15 బడ్జెట్లో 10.89% శాతం నిధులు కేటాయించి తర్వాత నుండి 2022 వరకు ప్రతి బడ్జెట్లో విద్యకు నిధులు తగ్గిస్తూ ఆరు శాతం నిధులు మంజూరు చేస్తుందని,తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తామని,విద్యార్థుల భవిష్యత్ బంగారుమయం చేస్తానని వాగ్దానాలు చేసిన కేసీఆర్ ఆ హామీలను తుంగలో తొక్కి ప్రభుత్వ విద్యను నాశనం చేస్తుందని అన్నారు..పొరుగు రాష్ట్రాలు అయిన కేరళ మహారాష్ట్ర తమిళనాడు ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో 25% పైగా నిధులు కేటాయిస్తు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటే మన రాష్ట్రంలో ఇలా ఆరు శాతం కేటాయిస్తూ మన రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోమ్మని చెప్పడం చూస్తుంటే సిగ్గు అనిపిస్తుందని వారు వాపోయారు..రాబోయే బడ్జెట్ సమావేశాల్లో వల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యకు 30% నిధులు కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వం 10% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు..లేనిపక్షంలో ప్రభుత్వాల విద్యార్థి వ్యతిరేక విధానాలను ఎండగడుతాం అని ఆయన హెచ్చరించారు..

విద్యార్థుల్లో ఆంగ్లభాషపై భయాన్ని పోగొట్టాలి

విద్యార్థుల్లో ఆంగ్లభాషపై భయాన్ని పోగొట్టాలి.

-సిద్దిపేట జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్.

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

పిల్లల్లో ఆంగ్ల భాషపై మక్కువ.. ఆత్మవిశ్వాసం కలిగించే విధంగా భాషా పై భయం పోగొట్టే విధంగా స్పెల్ విజార్డ్, స్టోరీ టెల్లింగ్ పోటీలు ఎంతో ఉపయోగపడతాయని సిద్దిపేట జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్, ఎన్సీఈఆర్టీ తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో భారతి ఫౌండేషన్ వారి సహకారంతో జిల్లా స్థాయి పోటీలు సిద్దిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు పంది రాజమల్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్నేహపూర్వక వాతావరణంలో విద్యార్థులను ఆకట్టుకునేలా బోధన ఉండాలి. వరసల ఆవరణలో తరగతి గదిలో అన్న భాషలోని సంభాషణ చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు ప్రశంసా పత్రము మరియు బహుమతులు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారి బేతి భాస్కర్, ఎంఈఓ యాదవ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు గీత, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ యూసుఫ్ ఎల్టా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎం కిరణ్మయి, ఎస్ జ్యోతి, ఆర్ జ్యోతి ,ఆస లక్ష్మణ్, సిహెచ్ పార్థసారథి, ప్రశాంత్, వి శ్రీనివాస్, పుల్లూరి ప్రభాకర్, మహేందర్ రెడ్డి, జయశీల, సరోజన, రవీందర్, వెంకటేష్, వైకుంఠం మరియు గైడ్ టీచర్లు పాల్గొన్నారు.

నీ స్థాయి హరీష్ రావు విమర్శించే స్థాయి కాదు

నీ స్థాయి హరీష్ రావు విమర్శించే స్థాయి కాదు
– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉదర మణిదీప్ రెడ్డి

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉదర మణిదీప్ రెడ్డి మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ…. చక్రధర్ గౌడ్ నువ్వు హరీష్ అన్నను విమర్శిస్తే పెద్దోనివి అయిపోతానని అనుకుంటున్నావు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే నాపై పోటీ చెయ్. నువ్వు ఒక దొంగ నోట్ల దొంగవీ. నువ్వు హరీష్ అన్న విమర్శిస్తావా….నీ స్థాయి హరీష్ అన్న కాలిగోటి మైలతో సమానం. నీ బండారం మొత్తం నాకు తెలుసు నువ్వే స్కూల్లో చదువుకున్నావో నేను కూడా అదే స్కూల్లో చదువుకున్న అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నీ పైన సిద్దిపేట్ టూ టౌన్ లో కేసు నెంబర్ 157/2006 u/s 120(B),489(A)(B)(C)(D) IPC నీ నువ్వు మర్చి పోవచ్చు కానీ సిద్దిపేట ప్రజలు మరియు నీ వివేకానంద కాలనీ ప్రజలు మర్చిపోరు. నువ్వు చదువుకున్న రోజులలోనే ఒక పెద్ద పోకిరివి. సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికీ నీ దొంగ నోట్ల ఫొటోస్ ఉన్నాయి. నువ్వు నీ కుటుంబ సభ్యులు క్రెడిట్ కార్డ్ ఇప్పిస్తాము. జాబ్స్ ఇప్పిస్తామని మోసం చేసిన రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అవసరం వచ్చినప్పుడు అవన్నీ బయట పెడతాం. అగ్గిపెట్టి ఫ్యాక్టరీ అని ఎగతాళి చేసి మాట్లాడుతున్నావు నువ్వు సిద్ధిపేటకు వచ్చి అగ్గి ముట్టుకుంటున్నావని మర్చిపోకు, అగ్గి ముట్టుకోవాలని చూస్తే మాడి మసై అయిపోతావు. కొంతమందికి బండ్లు, డబ్బులు ఇచ్చుకుంటూ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ లో మీ సొంత డబ్బా నువ్వే కొట్టుకుంటున్నావ్. మీ అత్తగారు సొమ్ముతో విర్రవీగడం కాదు. 15 సంవత్సరాల కింద మీ చరిత్ర ఏందో నాకు తెలవదు అనుకుంటున్నావా, దమ్ము దైర్యం ఉంటే రా నేనా నువ్వా చూసుకుందాం. మచ్చలేని మా నాయకుని విమర్శించుడు కాదు విమర్శిస్తే ఏదో పెద్ద నాయకుని అయితానని ఆలోచిస్తున్నావేమో, నీకు తెలుస్తలేదు హరీష్ అన్నను విమర్శిస్తే నిన్ను సిద్దిపేటలో ఒక జోకర్ గా చూస్తున్నారు. హరీష్ అన్న ప్రజా సేవకుడు పాలకుడు. ప్రజలకు తెల్సు ఎవరు ఏందో, నీలాగా మస్తు మంది వచ్చి పోయారు ఎన్నికల ముందు. హరీశ్ అన్న సిద్ధిపేట ప్రజల తల్లీకి కొడుకు, అక్కకు తమ్ముడు, చెల్లకు అన్న..అలాంటి సిద్దిపేట ఇంటి మనిషి పై నువ్వు విమర్శలా, ఇప్పటికైనా హరీష్ అన్నని విమర్శించడం మాని మీ సొంత పని నువ్వు చేసుకో లేదా నీ భరతం పట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిబీఆర్ఎస్ నాయకులు మాంకాల నవీన్, గాదగోని సత్యం గౌడ్, ప్రకాష్ పాండే, సిద్ధుల సంతు, బెందరం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరికి కంటి వైద్యం అందేలా చూడాలి

ప్రతి ఒక్కరి కి కంటి వైద్య వైద్యం అందేలా చూడాలి

యదార్థవాది ప్రతినిధి నంగునూరు

పేద ప్రజల కోసం ఏర్పాటుచేసిన కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి వైద్యం అందేలా చూడాలని కంటి వెలుగు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అజిముద్దిన్ అన్నారు. మంగళవారం నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించి వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కంటి వైద్య శిబిరానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమం విజయవంత కోసం ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని. ఇందుకు ప్రత్యేక టీములు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు, నంగునూరు మండలంలో నిర్వహించిన కంటి వెలుగు వైద్య శిబిరంలో నర్మెట్టలో 155 మంది తిమ్మాయపల్లిలో 155 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి అక్కడికక్కడే అద్దాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు అజిత్, లతా కృష్ణ,, ఎంపీడీవో వేణుగోపాల్, ఏపీఎమ్ఓ ఆంజనేయులు, వైద్యాధికారులు డాక్టర్ ప్రవీణ్ నాయక్ ,డాక్టర్ అంజలి రెడ్డి, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శిలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

అవగాహనతోనే కుష్టు వ్యాధి అంతం

అవగాహనతోనే కుష్టు వ్యాధి అంతం…

జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అజిముద్దీన్..

యదార్థవాది ప్రతినిధి నంగునూరు

అవగాహన ద్వారానే కుష్టు వ్యాధిని అంతం చేయొచ్చని లెప్రసీ ప్రోగ్రాం జిల్లా అధికారి డాక్టర్ అజిముద్దీన్ అన్నారు.
గాంధీ మహాత్ముని వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో కుష్టు వ్యాధిపై ఏర్పాటుచేసిన అవగాహన సమావేశం లో పాల్గొని మాట్లాడారు. లెప్రసీ వ్యాధిగ్రస్తుల పట్ల ఆదరాభిమానాలు చూపాలని తెలిపారు. కుష్ఠు వ్యాధి పాపం వలన శాపం వల్లనో రాదనిఇ ది ఒక బాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి అని చెప్పారు. వ్యాధిని ప్రాథమికంగా గుర్తించినట్లయితే అంగవైకల్యం రాకుండా కాపాడవచ్చు అన్నారు. ఎవరి శరీరం మీద నైనా స్పర్శ లేని మచ్చలు ఉన్న . కాళ్లు చేతులు మెద్దుబారినట్లు ఉన్న, మోకాలు మోచేతుపై బొడిపెలు ఉండి స్పర్శ లేకపోతే వెంటనే అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలన్నారు. కుష్టు వ్యాధిని ఎం డి టి చికిత్స ద్వారా పూర్తిగా నయం అవుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 85 మంది వ్యాధితో బాధపడుతూ మందులు వాడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వ్యాధి నివారణ పై ప్రతిజ్ఞ చేయించారు. గ్రామ సర్పంచ్ అబ్దుల్ అజిత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీటీసీ బాబు,ఏపీ ఎం ఓ లక్ష్మన్, జిల్లా డిపిఎంవో కృపలాదేవి, స్థానిక వైద్యాధికారులు డాక్టర్ ప్రవీణ్ నాయక్, డాక్టర్ అంజలి రెడ్డి, డాక్టర్ శివకృష్ణ, పి హెచ్ ఎన్ హేమలత, హెల్త్ అసిస్టెంట్ లింగంగౌడ్, భాస్కర్ భట్లు, ఏఎన్ఎం పద్మ, తదితరులు పాల్గొన్నారు.

అనాధ పిల్లలు దైవంతో సమానం

అనాధ పిల్లలు దైవంతో సమానం

యదార్థవాది ప్రతినిది గోదావరిఖని


ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్న.. అని అన్నాడో మహాకవి… సమాజంలో విధి వంచితులై.. అమ్మ నాన్నలను కోల్పోయిన అనాధ పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టడం ఆధ్యాత్మికత సేవతో సమానమని సామాజికవేత్త దేవీ లక్ష్మీ నరసయ్య అన్నారు. లయన్స్ క్లబ్ సభ్యులు మనోజ్ కుమార్ అగర్వాల్ – మనీషా దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భం పురస్కరించుకొని.. సోమవారం రాత్రి గోదావరిఖని గాంధీనగర్ లో గల MDHWS అనాధ పిల్లల సంరక్షణ కేంద్రంలో పిల్లలకు ఆయన అన్నదానం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ మనోజ్ కుమార్ పెళ్లిరోజు సందర్భంగా.. అనాధ పిల్లలకు అన్నదానం చేయడం చాలా సంతృప్తి ఇచ్చిందని,. ప్రతి ఒక్కరు తమ డైనందిక జీవితంలో ఏదో ఒక శుభకార్యం కు ఆడంబరంగా వృధా ఖర్చులు చేయడం కంటే.. విధి వంచితులైన ఇలాంటి అనాధ పిల్లలకు ఒక పూట అన్నం పెట్టడం బాధ్యతగా గుర్తించాలని తెలిపారు. దివ్యాంగుడైన రాజయ్య తనకు వచ్చిన కష్టం మరి ఏ కుటుంబంలో రాకూడదని భావించి ఎంతోమంది అనాధలను చేరదీసి వారిని అన్ని రంగాల్లో ఉన్నతులుగా తీర్చిదిద్దడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆ పిల్లలకు తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తున్న రాజయ్య నిజంగా గొప్పవాడని అన్నారు. ఈ ఆశ్రమం కు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని భరోసా ఇచ్చారు. అన్ని విధాలుగా బాగుండి మనమే ఒక పూట సమయానికి భోజనం చేయకపోతే ఎంతగానో ఇబ్బంది పడుతుంటాం.. అలాంటిది ఈ అనాధ చిన్నారులు రోజుల తరబడి ఆకలితో ఎంతగా ఇబ్బంది పడతారో ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో జయహో స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు జక్కని శ్రీలత నేత తోపాటు ఆశ్రమ నిర్వాహకులు పోచంపల్లి రాజయ్య, భూలక్ష్మి ఆశ్రమ పిల్లలు పాల్గొన్నారు.

ఎగసిపడుతున్న అగ్ని రవ్వలు..!

ఎగసిపడుతున్న అగ్ని రవ్వలు..!

యదార్థవాది ప్రతినిధి చిత్తూర్

చిత్తూర్ జిల్లా యాదమరి మండలం మోర్ధానపల్లె వద్ద గల అమర్ రాజా ఫ్యాక్టరీ నందు ఎగసిపడుతున్న అగ్ని మంటల్లో భారీ ఆస్తి నష్టం.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి వుండవచ్చునని సమాచారం..సంఘటనా స్థలానికి చేరుకున్న యాదమరి పోలీసులు,..మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్న అమరరాజా ఫ్యాక్టరీ ఉద్యోగులు…

గడప గడపకు మన ప్రభుత్వం

గడప గడపకు మన ప్రభుత్వం

యదార్థవాది ప్రతినిధి కొవ్వూరు

కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలం నెలటూరు గ్రామంలో 84 వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి డా.తానేటి వనిత పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని డ్వాక్రా మహిళలతో హోంమంత్రి సమావేశమయ్యారు. గత టీడీపీ పాలకులు డ్వాక్రా రుణాలను మాఫీ చేయకుండా మహిళలను మోసం చేశారు. దీని వలన డ్వాక్రా గ్రూపులు నిర్వీర్యం అయ్యాయని హోంమంత్రి గుర్తుచేశారు. సీఎం జగన్ ఆధికారంలోకి వచ్చాక డ్వాక్రా రుణాలను విడతల వారిగా మాఫీ చేస్తున్నారని తెలిపారు. అనంతరం నెలటూరు గ్రామంలోని ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులకు వివరించారు. అమ్మవడి, విద్యాకానుక, వసతి దీవెన, ఆసరా, చేయూత, రైతు భరోసా, పేదలకు ఇళ్ల స్థలాలు వంటి అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజల జీవితాలలో వెలుగులు నింపాయన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

స్పందన కార్యక్రమం

స్పందన కార్యక్రమం

యదార్థవాది ప్రతినిధి కడప

కడప జిల్లాలో బాధితులు పోలీసు శాఖ కు ఇచ్చే ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కే.కే.ఎన్.అన్బురాజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ‘స్పందన’ కార్యక్రమంలో బాధితులతో స్వయంగా ముఖాముఖి మాట్లాడి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి సమస్యలను తెలుసుకున్నారు. ‘స్పందన’ ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించి న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...