27.7 C
Hyderabad
Saturday, April 25, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 109

జీవో నెంబర్ 1 రద్దు చేయాలి

జీవో నంబర్.1 రద్దు చేయాలి.
అఖిలపక్షం డిమాండ్

యదార్థవాది ప్రతినిధి ఏలూరు

ప్రజాస్వామిక హక్కులను కాలరాసేలా జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నం.1 తక్షణమే రద్దు చేయాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. సోమవారం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఏలూరు స్థానిక గాంధీ మైదానంలో అఖిలపక్ష నాయకులు జీవో నం.1పై నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్,సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి కిషోర్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ రెడ్డి అప్పలనాయుడు తదితరులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ముఖ్యమంత్రి జగన్ నియంత మాదిరిగా జీవో నం.1ని తీసుకువచ్చారని విమర్శించారు. ప్రజల గొంతుకను అణిచివేయాలనుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. రాజ్యాంగంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రతి పౌరునికి కల్పిస్తే వైసిపి ప్రభుత్వం వాటిని హరిస్తూ పౌర హక్కులను కాలరాస్తుందన్నారు. జగన్ నియంతృత్వ పాలనకు జీవో నం.1 నిదర్శనం అన్నారు. ప్రజా ఉద్యమాలు అణచివేసేందుకు వైసిపి ప్రభుత్వం అక్రమంగా జీవోలను విడుదల చేసిందన్నారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను తీసుకువచ్చి ప్రతిపక్షాల ఉద్యమాలను అణిచివేసేందుకు ముఖ్యమంత్రి జగన్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తప్పుడు జీవో నం.1ని తక్షణమే రద్దు చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. జీవో నం.1 రద్దు అయ్యే వరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. గాంధీజీ విగ్రహానికి నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బండివెంకటేశ్వరరావు, ఉప్పులూరి హేమ శంకర్, సిపిఎం నాయకులు డిఎన్ విడి ప్రసాద్, బి సోమయ్య, కే శ్రీనివాస్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు బద్దావెంకట్రావు, కాకర్ల అప్పారావు, ఎర్ర శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకులు ఇళ్ళ శ్రీనివాస్, కస్తూరి తేజస్విని, నగిరెడ్డి కాశీ నరేష్, గుబ్బల నాగేశ్వరరావు, అఖిలపక్ష నాయకులు ఎస్. సాయిబాబా, కే వరప్రసాద్, గేదెల నాగేశ్వరరావు, ఎం విజయ, అడ్డగర్ల లక్ష్మీ ఇందిర, పోలా భాస్కర్, టి శ్రీను, అల్లు సాయి చరణ్, పైడి లక్ష్మణరావు, బొండా రాము, డి వీరి నాయుడు, ఎం రాము, జి రమణ, భూపతి రాఘవ, కొండ శివ, బి జగన్నాథం, వైయస్ కనకారావు, ఏసుబాబు, బ్రహ్మం, నరసింహమూర్తి, కోటేశ్వరరావు, నూకరాజు, కోరాడ అప్పారావు, క్రాంతి, కే సుజాత, ప్రమీల, సరళ, జె .సుజాత, బి ఉమా దుర్గ, తదితరులు పాల్గొన్నారు.

హుండీల లెక్కింపు

హుండీల లెక్కింపు.

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్థానిక మోహిని పుర వీధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం హుండీల ద్వారా వచ్చిన ఆదాయ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ హుండీల లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అర్చక బృందం,ఆలయ వంశపారంపర్య చైర్మన్ నగేష్ విష్ణు,ఆలయ ఈవో విశ్వనాధ్, దేవాదాయ,ధర్మాదాయ శాఖ సిద్దిపేట డివిజన్ పరిశీలకులు రంగారావుల సమక్షంలో వికాస తరంగిణి,శ్రీ సంతోషి మాత సేవా సమితి,రాజ రాజేశ్వరీ సేవా సమితి సభ్యులతో కూడిన భక్త బృందం హుండీల లెక్కింపులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ ఈ ఓ విశ్వనాథ్ మాట్లాడుతూ 15-9-2022 నుండి 30-1-2023 వరకు దేవాలయానికి హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కించినట్టు తెలిపారు.మొన్నీమధ్యే ముక్కోటి ఏకాదశి మహా పర్వదిన మహోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులు వేలాదిగా వచ్చి ఆ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారని తెలిపారు. తేదీ 15.9.2022 నుండి 30.1. 2023 వరకు 138 రోజులకు గాను హుండీ లెక్కింపు జరపగా 16,07,295/-రూపాయలు వచ్చాయని ఈ రూపాయలను ఏపీజీవీబీ గ్రామీణ బ్యాంక్ లో జమ చేసినట్టు తెలిపారు.

సర్వేంద్రియానం నయనం ప్రధానం

కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

సిద్దిపేట జిల్లా కేంద్రం స్థానిక 23వ వార్డులోని మంత్రి హరీష్ రావు ఇంట్లో సోమవారం కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక వార్డు కౌన్సిలర్ నాయకం లక్ష్మణ్ తో కలిసి ప్రారంభించిన స్థానిక మున్సిపల్ చైర్మన్ కడవేర్గు మంజుల రాజనర్సు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని మనకున్న అన్ని అవయవాల్లో అత్యంత ముఖ్యమైనది మన కండ్లు అటువంటి ముఖ్యమైన అవయవాలు ఎటువంటి వ్యాధిన పడకూడదని ఒకవేళ వ్యాధి ఏదైనా సోకితే దానిని ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం కంటి వెలుగు అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో దేశంలోనే ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ప్రవేశ పెట్టని పథకం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్నవారికి అద్దాలు ఉచితంగా అందించి,ఈ వైద్య పరీక్షల్లో ఎవరికైనా తీవ్రమైన కంటే జబ్బులు ఉన్నట్టు తేలితే వైద్యులు ప్రత్యేక శ్రద్ధతో ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా నిర్వహించి
పూర్తి ఆరోగ్యంగా ఇంటికి పంపిస్తున్నారని ఇటువంటి కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు.అనంతరం స్థానిక కౌన్సిలర్ నాయకుం లక్ష్మణ్ మాట్లాడుతూ వైద్య పరీక్షల్లో ఆపరేషన్ తప్పనిసరి అని తేలితే ఆపరేషన్ చేయించుకోవాలని ఈ ఆపరేషన్లు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారని సకల సౌకర్యాలతో ఆపరేషన్లు చేయించి ఇంటికి క్షేమంగా పంపించే బాధ్యత తమదేనని తెలిపారు.ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి శిబిరాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, స్థానిక వార్డు అధ్యక్షులు రాచబోయిన యాదగిరి,  బిసి సెల్ సెక్రటరీ పబ్బోజు దయాకర్ చారి,నాయకం కరుణాకర్,యూత్ అధ్యక్షుడు పల్లె చంద్రశేఖర్ గౌడ్,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లోక లక్ష్మీరాజం,అధిక లింగం గౌడ్,SC సెల్ సెక్రటరీ పింజర అశోక్ కుమార్,సానిటరీ ఇన్స్పెక్టర్ వనిత, అంగన్వాడి టీచర్ వనిత, ఆర్పి లావణ్య, జవాన్ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

రాజన్న ప్రీమియం లీగ్ 2023 లోగో ఆవిష్కరన..

రాజన్న ప్రీమియం లీగ్ 2023 లోగో ఆవిష్కరన..

యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల

“రాజన్న ప్రీమియం లీగ్ 2023” వాలీబాల్ మరియు కబడ్డీ పోటీల లోగో ఆవిష్కరించిన మంత్రి కే తారక రామారావు.. జిల్లాలో గ్రామీణ యువతీ యువకులను క్రీడలలో ప్రోత్సహించడానికి సోమవారం మంత్రి కే తారక రామారావు చేతుల మీదుగా “రాజన్న ప్రీమియం లీగ్ 2023” వాలీబాల్ మరియు కబడ్డీ పోటీల లోగో, షెడ్యూల్ ను వీర్నపల్లి మండలంలోని రైతు వేదిక ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, రాష్ట్ర పవర్‌లూం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ,
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ , జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ఉపేందర్ రావు లు పాల్గొన్నారు .

టీఎస్‌ఆర్టీసీకి స‌రికొత్త‌ సాంకేతికత సొబగులు

టీఎస్‌ఆర్టీసీకి స‌రికొత్త‌ సాంకేతికత సొబగులు

యదార్థవాది ప్రతినిది హైదరాబాదు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌

టీఎస్‌ఆర్టీసీకి స‌రికొత్త‌ సాంకేతికత సొబగులు

వేగవంతమైన, నాణ్యమైన సేవలకు సాప్ట్వేర్‌ అప్‌గ్రేడ్‌

ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌(ఈఆర్పీ) అమలుకు నల్సాప్ట్‌తో టీఎస్‌ఆర్టీసీ ఒప్పందం

దేశంలోనే అన్ని ఎస్‌.ఆర్‌.టి.యులో ఇదే మొద‌టిది కావ‌డం విశేషం

9 నెలల కాలంలో పూర్తి కానున్నట్లు అంచ‌నా

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రయాణికులకు వేగవంతమైన,నాణ్యమైన సేవలను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) చర్యలు చేపట్టింది. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొత్త సాంకేతికతతో నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్‌ చేయాలని సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ గారు, ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ గారు భావించారు. అందులో భాగంగానే ఒరాకిల్‌ ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌(ఈఆర్పీ) అమలుకు హైదరాబాద్ కేంద్రంగా ప‌ని చేస్తూ ప్రపంచవ్యాప్తంగా సేవ‌లు అందిస్తున్న నల్సాప్ట్‌ కంపెనీతో టీఎస్‌ఆర్టీసీ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. బస్ భవన్‌లో సోమవారం సంస్థ‌ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు, నల్సాఫ్ట్ సీఈవో సీఏ వెంకట నల్లూరి గారు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వాటిని పరస్పరం అందజేసుకున్నారు. దేశంలోనే అన్ని ఎస్‌.ఆర్‌.టి.యులో ఇదే మొద‌టిది కావ‌డం విశేషం.

“10వేల‌ బ‌స్సులు, 47, 528 వేల మంది ఉద్యోగులు, 99 డిపోలు, 364 బస్ స్టేషన్‌లతో అతిపెద్ద నెట్‌వ‌ర్క్‌ క‌లిగి ఉన్నసంస్థ‌. ప్రతి రోజూ 32 లక్షల కిలోమీటర్లు బ‌స్సుల‌ను న‌డుపుతూ సుమారు 45 లక్షల మంది ప్రయాణికుల గ‌మ్యస్థానాల‌కు చేర‌వేస్తూ దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. కార్గో, పెట్రోలు బంకులు, స్వంతంగా జీవా బ్రాండుతో వాటర్ బాటిళ్లు, త‌దిత‌ర విభిన్న సేవ‌లతో ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువైంది. 9377 గ్రామాలకు ర‌వాణా సేవ‌లు అందిస్తున్న సంస్థలో కార్యక‌లాపాల నిర్వహ‌ణకై ఇ.ఆర్‌.పిని అమలు చేయడం చాలా సవాళ్ల‌తో కూడుకున్న పని. అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం ద్వారా సంస్థ అంతర్గత సామర్థ్యాన్ని మెరుగుపరచాలని యాజమాన్యం భావించింది. అందుకే ఒరాకిల్‌ ఈఆర్పీ ప్రాజెక్ట్‌ను అమలు చేయాలని భావించాం. రాష్ట్రంలోని డిపోలు, జోన్లతో పాటు హెడ్‌ ఆఫీస్‌లోని ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌, ఇంజనీరింగ్‌, తదితర విభాగాలను ఈఆర్‌పీ ఏకీకృతం చేస్తుంది. నల్సాప్ట్ ఇంప్లిమెంటేషన్ పార్టనర్‌గా ఉంటుంది. సమర్థవంతమైన ఈ వ్యవస్థ టీఎస్‌ఆర్టీసీ అభివృద్ధికి దోహదం చేస్తుంది” అని టీఎస్‌ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నర్ పేర్కొన్నారు.

అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో టీఎస్‌ఆర్టీసీ ముందంజలో ఉందని, సాంకేతికత ద్వారానే వేగంగా ప్రయాణికులకు చేరువ అవుతున్నామనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. “ఆన్‌లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్(ఓపీఆర్‌ఎస్‌), బస్ పాసుల జారీ, లాజిస్టిక్, పార్శిల్ సేవలు, బస్సు ట్రాకింగ్‌, క్యూఆర్‌ కోడ్ ఆధారంగా యూపీఐ చెల్లింపులు, బుకింగ్‌ కౌంటర్ల ఆన్‌లైన్‌, ప్రజల సౌకర్యార్థం అద్దె బస్సుల బుకింగ్‌, ప్రయాణ టికెట్‌తో పాటు తిరుపతి దేవస్థానం శీఘ్ర దర్శన సదుపాయాన్ని ఆన్‌లైన్‌ ద్వారానే అందిస్తున్నామ‌ని చెప్పారు. బస్సుల లోకేషన్‌ను కచ్చితంగా తెలుసుకోవడానికి ‘బస్సు ట్రాకింగ్‌ యాప్‌ను, సంస్థ రెవెన్యూ నిర్వహణకు కమర్షియల్‌ యాప్‌ను, ఉద్యోగుల హాజరు, సెలవుల మంజూరు, ఫిర్యాదులను స్వీకరించడానికి ఉద్యోగుల యాప్‌లను ఇటీవలే ప్రారంభించామని తెలిపారు. ప్రాజెక్టు అమలు భాగస్వామిగా నల్సాఫ్ట్‌ కంపెనీ ఉంటుందని స్పష్టం చేశారు. 20 ఏళ్లకుపైగా నల్సాప్ట్‌.. ఒరాకిల్‌ పార్ట్‌నర్‌గా ఉందని, అప్లికేషన్‌ సొల్యూషన్స్‌, వేగవంతమైన సేవలను అందించడంలో ఆ కంపెనీకి అనుభవముందన్నారు.

2023 సంవత్సరం టి.ఎస్‌.ఆర్‌.టి.సికి ఐటీ సంవత్సరం అని పేర్కొంటూ సంస్థ‌కు ఇది మంచి ఫలితాలనిస్తుందని భావిస్తున్న‌ట్లు చెప్పారు. ఇది అన్ని కార్యకలాపాలను ఏకీకృతం చేయడంలో సహాయపడుతుందని, సంస్థ‌కు గొప్ప ప్రారంభం అవుతుందని, ఇది ఐటీ కార్యక్రమాల యుగం అన్నారు. రోజువారీ కార్యకలాపాల్లో సాంకేతికతను ఉపయోగించకుండా ఏ సంస్థ కూడా పురోగమించదన్నారు.

ఈ సందర్భంగా నాల్‌సాఫ్ట్ సీఈవో శ్రీ సీఏ వెంకట నల్లూరి మాట్లాడుతూ ఇది సమిష్టి కృషి అన్నారు. అంకిత‌భావంతో ప‌ని చేసి నిర్ధేశించుకున్న కాలానికి పూర్తి చేయ‌గ‌ల‌మ‌నే విశ్వాసం ఉంద‌న్నారు. ప్రయాణికులకు నాణ్యమైన సేవలను అందించే టీఎస్‌ఆర్టీసీతో తమ కంపెనీ ఒప్పందం కుదుర్చుకోవడం గర్వంగా ఉందని అన్నారు. ఈ ఒరాకిల్‌ ఈఆర్పీ ప్రాజెక్టు 9 నెలల్లో పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో ఆపరేషన్లను కేంద్రీకృతం చేయడం, మార్గాలను క్రమబద్దీకరించడం, ఇంధన నిర్వహణ, వ్యక్తిగత, స్టోర్‌లు, వర్క్‌షాప్‌లు, సమర్థవంతంగా ఆదాయ నిర్వహణ, తదితర విషయాలపై ఫోకస్‌ చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్లు శ్రీ మునిశేఖ‌ర్‌, శ్రీ వినోద్ కుమార్‌, చీఫ్ మేనేజ‌ర్ (ఎఫ్ అండ్ ఎ) శ్రీమ‌తి విజ‌య పుష్ఫ‌, సి.ఒ (ఐటీ) శ్రీ రాజ‌శేఖ‌ర్‌, న‌ల్సాష్ట్ ప్ర‌తినిధులు శ్రీ అనిరుద్ధ్‌, శ్రీ అఖిల్‌, శ్రీ వికాస్‌, శ్రీ హ‌రిప్ర‌స‌న్న‌, శ్రీ శివ‌రామ‌కృష్ణ‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

మల్లన్న సాగర్ సందర్శించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ అధికారులు.

మల్లన్న సాగర్ సందర్శించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ అధికారులు.

యదార్థవాది ప్రతినిది సిద్దిపేట

సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ ను సందర్శించిన ఫ్యాకల్టీ ఇంచార్జ్ ప్రియాంక్ భర్త్ నేతృత్వంలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ అధికారులు. ఈ సందర్భంగా గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, మల్లన్న సాగర్ ఇఇ వెంకటేశ్వర్లు, మల్లన్న సాగర్ పంపు హౌస్ డిఇ శ్రీనివాస్ లు శ్రీ కొమురవెల్లి మల్లన్న సాగర్ గురించి వివరిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంమని రాష్ట్రంలోని పాత ఆయకట్టును స్థిరీకరించడం తోపాటు నూతనంగా లక్షలాది ఎకరాల ఆయకట్టిన సాగులోనికి తీసుకురావడం లక్ష్యంగా 2016 రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక శ్రద్ధతో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభించారని ఇప్పటికీ దాదాపు పూర్తయిందని తెలిపారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు గురించి ఆసక్తిగా విన్న ఎన్డీఏ అధికారులు మల్లన్న సాగర్ ను చూసి పంప్ హౌస్ అండర్ టర్నల్ లోకి బస్సు మరియు ఇతర వాహనాల ద్వారా ప్రయాణించి ఇంజనీరింగ్ టెక్నాలజీని చూసి ఇంత పెద్ద ప్రాజెక్టును చూడడం ఇదే మొదటిసారి అని ఈ ప్రాజెక్టును నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన: జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని

ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన: జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని

యదార్థవాది ప్రతినిది మెదక్

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్.పి పి.రోహిణి ప్రియదర్శిని ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు.. ఈ సందర్భంగా ఎస్.పి మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయప్రయాలకు ఓర్చి వస్తారని, స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు తెలిపారు.

గాంధీ మహాత్మునికి ఘన నివాళి

గాంధీజీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

యదార్థవాది ప్రతినిది సిద్దిపేట

భారత స్వతంత్ర పోరాటంలో ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను స్మరిస్తూ గాంధీ వర్ధంతి సందర్భంగా కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత గాంధీజీ ఫోటోకు పూలమాలవేసి నివాళులు అర్పించినారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నేటి మన స్వాతంత్రం మన స్వేచ్ఛ ఆనాటి వీరుల అసమాన త్యాగఫలం, ఆ మహానుభావుల మహా ప్రసాదం, దేశ స్వాతంత్య్ర కొరకు త్యాగాలు చేసిన అమర వీరులకు మనం ఎల్లవేళలా స్మరిస్తూ వారి అడుగుజాడల్లో నడవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ శ్రమించడమూ, సేవా దృక్పథమూ, ఆధ్యాత్మిక దృక్కోణమూ మన జీవితంలో ప్రధానాంశాలు అంశాలుగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్ మహేందర్, ట్రాఫిక్ ఏసిపి ఫణిందర్, ఎస్బి ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ కుమార్, సిసిఎస్ సిఐ సంజయ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ధరణి కుమార్, సూపరిండెంట్లు ఎస్.కె జమీల్ పాషా, ఫియాజుద్దీన్ మరియు కార్యాలయ సిబ్బంది అధికారులు కలసి పుష్పాలు వేసి నివాళులర్పించి భారత స్వతంత్ర పోరాటంలో ప్రాణాలర్పించిన మహనీయుల అమరవీరులు త్యాగాలను స్మరిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో 2 నిమిషాలు మౌనం పాటించారు.

షాహిద్ దివాస్ ను స్మరిస్తూ నివాళులు అర్పించిన: ఎస్.పి గౌస్ ఆలం

షాహిద్ దివాస్ ను స్మరిస్తూ నివాళులు అర్పించిన: ఎస్.పి గౌస్ ఆలం

యదార్థవాది ప్రతినిది ములుగు

షాహిద్ దివాస్ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను స్మరిస్తూ నివాళులు అర్పించిన జిల్లా నూతన ఎస్.పి గౌస్ ఆలం జనవరి 30/1948 హత్యకు గురైన మహాత్మా గాంధీ మరణానికి గుర్తుగా షాహిద్ దివాస్ ను జరుపు కుంటం. ఈ సందర్బంగా ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గౌష్ ఆలం మరియు అధికారులు, సిబ్బంది మౌనం పాటించి స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎస్పీ గౌస్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులందరినీ స్మరించుకునే రోజుగా ఈ రోజున పాటిస్తారని, అహింస శాంతి దినంగా పాటిస్తారని, దేశ స్వాతంత్రం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారందరినీ దేశం స్మరించు కోవాల్సిన, గౌరవించు కోవాల్సిన భాద్యత మనందరి మీద ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎస్.పి బోగోని సదానందం (కమాండంట్ ), డి.ఎస్.పి సుభాష్ బాబు, ఆర్. ఐ రాధారపు స్వామి, సి. ఐ సార్ల రాజు, ఎస్. ఐ కమలాకర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

తక్షణమే సమస్యలు పరిష్కారం..

తక్షణమే సమస్యలు పరిష్కారం..

సమస్యల తక్షణ పరిష్కారానికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కె.కె రాజు.

యదార్థవాది ప్రతినిది విశాఖపట్నం

సమస్యల తక్షణ పరిష్కారానికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కె.కె రాజు.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సోమవారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అన్నివార్డులలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించిన రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె రాజు.. ఈ సందర్భంగా కె.కె రాజు మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి ఆయా పథకాలునేరుగా లబ్ధిదారులకు అందేవిదంగా ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని, పథకాల అమలు ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు, ప్రజల సమస్యలు ప్రజా ప్రతినిధులు నేరుగా తెలుసుకునేందుకు గడపగడపకు మన ప్రభుత్వము కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో 50వార్డు కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్, డైరెక్టర్లు రాయుడు శ్రీను, నూకరాజు,పైడి శ్రీను,50వార్డు నాయకులు బాగాతి విజయ్,కృష్ణారావు మాస్టర్, పాతపట్నం రామ్మోహన్, నారాయణ స్వామి,సీపాన రాము,శివరాం Avn రాజు, సోని, చిరంజీవి, జగన్నాధం, వేణు, నారాయణరావు, పూజారి రాము, శివాజి, శ్రీనివాస్ రాజు, మురళీధర్, ఏం.వి.రెడ్డి, సీనియర్ నాయకులు షేఖ్ బాబ్జి, కె.చిన్నా, ధమoయతి, జ్ఞానేష్, సునీల్, గురువొజి, సచివాలయం సిబ్బంది, వాలంటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...