29.2 C
Hyderabad
Friday, April 24, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 110

సీపీఐ ప్రజాపంథా సురేష్ ను పరామర్శించిన: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

సీపీఐ ప్రజాపంథా సురేష్ ను పరామర్శించిన: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

యదార్థవాది ప్రతినిది హైదరాబాద్

సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా నిజామాబాద్ జిల్లా నాయకులు సురేష్ ను సోమవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన సీపీఐ(ఎంఎల్) ఇటీవల అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్సపై డాక్టర్లను ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. సురేష్ కు మంత్రి మనోధైర్యం నింపారు. త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షించారు. మంత్రి వెంట సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్,సహాయ కార్యదర్శి దేవారామ్,నిమ్స్ సూపరింటెండెంట్ సత్యనారాయణ,రమేష్ తదితరులు ఉన్నారు..

జాతిపిత వర్ధంతి

జాతిపిత వర్ధంతి

యదార్థవాది ప్రతినిది సిరసిల్ల

దేశ స్వతంత్ర పోరాటంలో ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను స్మరిస్తూ, గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో రెండు నిమిషాల పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎస్పీ మహాజన్ మాట్లాడుతూ భారతదేశం కోసం, ఎందరో ద్యగాదనులతో నేడు ప్రజలకు స్వేచ్చ స్వాతంత్య్రం కల్పించడం జరిగిందని, వేలాది మంది స్వాతంత్ర పోరాటంలో పాలుపంచుకొని తమ ప్రాణాలను సైతం అర్పించారని, వారి త్యాగ ఫలితంగానే నేడు మనమంతా ఆ ఫలాలను అనుభవిస్తున్నామని తెలిపారు. అలాంటి త్యాగధనులను స్మరించుకోవడం దేశ పౌరులుగా మనందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, అడ్మినిస్ట్రేషన్ అధికారి హమ్మదుల్లా ఖాన్, సి.ఐ ఉపేందర్, పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

భారత సంస్కృతి చాల గొప్పది:గవర్నర్ దత్తాత్రేయ

భారత సంస్కృతి చాల గొప్పది:గవర్నర్ దత్తాత్రేయ

యదార్థవాది ప్రతినిది విశాఖపట్నం

భారతదేశంలో రైతే రాజు మహిళలను గౌరవించడం మన సంస్కృతి అని విశాఖపట్నం హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.. బిజెపి సీనియర్ నాయకులు ఉప్పిలి అప్పలకొండ స్వగృహంలో అల్పాహార విందులో గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ విభజన సమయంలో రెండు రాష్ట్రాలు మధ్య దూరంతో పాటు ప్రజల్లో మధ్య దూరం ఎక్కువవుతుందని అందరూ భావించారని, కానీ రెండు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు మరింత దగ్గరవుతున్నారని ఆయన అన్నారు. వెనుకబడిన వర్గాల ప్రజలందరూ కూడా ఉన్నత విద్యను అభ్యసించినప్పుడే మనం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళటం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ తో పాటు పలువురు బిజెపి నాయకులు, యాదవ సంఘం నాయకులు, ఇతర అసోసియేషన్ సభ్యులు బండారు దత్తాత్రేయను సన్మానించారు..

మహాత్మా గాంధీ వర్ధంతి ఘన నివాళులు

మహాత్మా గాంధీ వర్ధంతి ఘన నివాళులు

యదార్థవాది ప్రతినిది కూర్మన్నపాలెం

జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ వర్ధంతి గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో వాడవాడలా సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా జీవీఎంసీ 87 వార్డు కణితి గాంధీ బొమ్మ దగ్గర ఆ వార్డు వైసిపి సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహనికి పూల మాలలు వేసి బాపూజీకి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశవాసులందరినీ ఏకతాటిపై నిలిపి, పరాయి పాలన నుండి భరతమాతను విముక్తి చేయడం కోసం సత్యం, అహింసలే ఆయుధాలుగా చేసుకుని, విజయం సాధించి, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిలో పోరాట స్ఫూర్తిని నింపినటువంటి మహోన్నత వ్యక్తి బాపూజీ అని కీర్తించారు. ప్రతీ ఒక్క భారతీయుడు మహాత్ముని స్మరించుకుని , అహింసా వాదుతో ఎంత కఠినమైన లక్షనైనా చేదించొచ్చని నిరూపించి వలసవాదాన్ని చేరి నుండి భారతవానికి విముక్తి కలిగించి ప్రపంచానికి నూతన పోరాట వరవడి నేర్పిన జాతిపిత మహాత్మా గాంధీ అని ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు పయనించాలని అకాంక్షించారు.. ఈ కార్యక్రమంలో ప్రగడ వేణుబాబు, మద్దపు దామోదర్, దుగ్గపు దానప్పలు, ప్రగడ శ్రీనివాస్, సబ్బవరపు ఈశ్వరరావు, దాసరి అప్పడు, జాజుల శ్రీను, బోండా గోవిందరాజులు, బుల్లెట్ రమణ, దాకా సత్తిబాబు, బొడ్డ తాత, కొన్న అప్పలరాజు, ప్రకాష్ , తదితరులు పాల్గొన్నారు.

మహాత్మునికి ఘననివాళులు

మహాత్మునికి ఘననివాళులు

యదార్థవాది ప్రతినిది మైలవరం నియోజకవర్గం.

విజయవాడ గొల్లపూడిలోని శాసనసభ్యుని కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధీ 75వ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలు, త్యాగాలను గురించి స్మరించుకున్నారు. జాతిపిత మహాత్ముడు సత్యాగ్రహం, అహింస, సహాయ నిరాకరణ, శాంతియుత పోరాటాలతో బ్రిటిష్ వారిని మనదేశం నుండి తరిమేసి మన దేశ పౌరులకు స్వేచ్చ, స్వాతంత్ర్యం సాధించడంలో ముఖ్య భూమిక పోషించారని, ప్రజలు ఆయన ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సమిష్టి కృషితో కళింగుల సమస్యలు పరిష్కారం: తమ్మినేని సీతారాం

సమిష్టి కృషితో కళింగుల సమస్యలు పరిష్కారం: తమ్మినేని సీతారాం

యదార్థవాది ప్రతినిది విశాఖపట్నం

విశాఖ జిల్లా కళింగ కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం.. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళింగ కులస్తులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలని సీతారాం తేలిపారు. ఉదయ గోదావరి జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలతో కళింగ అసోసియేషన్లు ఉన్నాయని ఆయా ప్రాంతాల్లో ఉన్న కళింగలు సమస్యలను అసోసియేషన్ తెలియజేయాలని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబ సభ్యుల సమస్యల పరిష్కారానికి ప్రబుత్వం తరుపున అన్నిసహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. కళింగ కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పేడాడ రమణకుమారిని సీతారాం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్, శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి పిరియా విజయ, మాజీ కేంద్ర మంత్రి కిళ్లి కృపారాణి, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్, మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ చౌదరి బాబ్జి, పోలీస్ అధికారులు, న్యాయమూర్తులు, ప్రముఖ వైద్యులు,వివిధ రాజకీయ పార్టీ నాయకులు, రెవిన్యూ అధికారులు, ప్రముఖ న్యాయవాదులు, వివిధ ప్రభుత్వ,కళింగ కుటుంబ సభ్యుల అధికారులు పాల్గొన్నారు.

శారదా పీఠంలో నృత్య ప్రదర్శన చేసిన: బిందు

శారదా పీఠంలో నృత్య ప్రదర్శన చేసిన: బిందు

యదార్థవాది ప్రతినిది విశాఖపట్నం

విశాఖ శ్రీశారదాపీఠం వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి రెండు రోజులుగా పెందుర్తి శారదా పీఠంలో అధికారుల ప్రముకులు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలతో శ్రీశారదాపీఠం కళకళలాడింది. శ్రీ సాయి కళానికేతన్ రాగిణి కూచిపూడి నాట్య మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి కూచిపూడి నాట్య మయూరి యోగీత బిందు ప్రదర్శించిన నాట్యం భక్తులతో పాటు ప్రముఖులను సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తించింది. తన నాట్యం చూసి భక్తులు కరతాల ధ్వనులతో యోగీత బిందువును ఆశీర్వదించారు. పీఠాధిపతులు స్వరూప నందేంద్ర స్వామీజీ యోగీత బిందు కు ప్రశంస పత్రాన్ని అందజేశారు. చిన్న వయసులోనే అద్భుత ప్రదర్శన చేస్తున్న బిందుకు ఉజ్వల భవిష్యత్తు ఉందని కొనియాడారు ఈ నాట్యంలో నాట్య మండలి చిన్నారులు అనేకమంది పాల్గొన్నారు

ఐక్యమత్యమే మన అభివృద్ధి..

ఐక్యమత్యమే మన అభివృద్ధి..

యదార్థవాది ప్రతినిది అనకాపల్లి

అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం లో కాపు సంక్షేమ భరోసా కేంద్రం నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న కాపు సంక్షేమ వ్యవస్థాపకుడు కర్రి వెంకట రమణ.. రాజకీయాలు కు అతీతంగా కాపుల సంక్షేమం కోరుకునేవారు, అణగారిన మన కుటుంబ సభ్యులకు అన్ని రంగాల్లో సంక్షేమానికి “భరోసా” కల్పించేందుకు సహకారం అందించాలని వెంకట రమణ తెలిపారు. ఆంద్ర రాష్ట్ర వ్యాప్తంగా కాపులు జీవిత కాలం సభ్యత్వం తీసుకోవాలని వారు తెలిపారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన:కే.వి సాగర్ బాబు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన:కే.వి సాగర్ బాబు

యదార్థవాది ప్రతినిది తిరుపతి

దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జరగబోయే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన శ్రీకాళహస్తీశ్వర ఆలయ కార్య నిర్వాహక అధికారి కే.వి సాగర్ బాబు..శ్రీ మేధా గురుదక్షిణామూర్తి సన్నిధానంలో విశేష పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు, ఆలయ ఏ.ఈవో. సతీష్ మల్లీ, ఆలయ సూపర్ డెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ రెడ్డి మరియు వేద పండితులు ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.

గ్రామపంచాయతీ భవనము నిధులు మంజూరు

గ్రామపంచాయతీ భవనము నిధులు మంజూరు

యదార్థవాది ప్రతినిది నిజామాబాద్

నిజామాబాద్ జిల్లా మండల కుర్దుల్ పేట్ గ్రామానికి సిసి రోడ్డు, గ్రామపంచాయతీ భవనము ఎమ్మెల్యే బాజిరెడ్డి మంజూరు చేయించారని సర్పంచ్ గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కలసి ధన్యవాదాలు తెలియచేశారు.. ఇకర్యక్రమములో ధర్పల్లి జడ్పిటిసి జగన్, ఎంపీటీసీ సతీష్, బిఆర్ఎస్ నాయకులు ఆదిత్య, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...