29.2 C
Hyderabad
Friday, April 24, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 111

గ్రామా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి

గ్రామా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి

యదార్థవాది ప్రతినిది

గ్రామ దేవతలకు జాలబిషకేకం నిర్వహించి గ్రామంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆలూర్ మండల కేంద్రంలో గ్రామ అభివృద్ది కమిటీ అద్వర్యంలో గ్రామ దేవతలకు గంగా జలాభిషేకం నిర్వహించిన గ్రామస్తులు.. గత కొన్ని సంవత్సరలుగా గోదావరి నది జలాలు తీసుకువచ్చి గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు.. ఆదివారం విడిసి కార్యాలయం వద్ద ప్రారంభం అయిన శోభ యాత్ర అన్ని దేవాలయాలను కలుపుతూ గ్రామ ప్రధాన వీధుల గుండా కొనసాగించారు, పంటలు బాగా పండాలని, గ్రామ ప్రజలు రోగాల భారిన పడకుండా కాపాడాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రజలు.ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బందు సమితి డైరెక్టర్ ఆలూరు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ మల్లేష్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బార్ల గణపతి, కళ్లెం సాయిరెడ్డి, ఎడ్ల పోశెట్టి, రఘుపతి, కొత్తూరు గిరీష్, సంజీవ్, నారాయణ, గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గోన్నారు..

గ్రూప్‌-4లో మరో 141 ఉద్యోగాలు

గ్రూప్‌-4లో మరో 141 ఉద్యోగాలు

గ్రూప్‌-4లో మరో 141 ఉద్యోగాలను కలుపుతూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకొన్నది. కొత్త ఉద్యోగాలకు శుక్రవారమే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వగా, శనివారమే టీఎస్‌పీఎస్సీ ప్రకటన జారీ చేసింది.

గత నోటిఫికేషన్‌కు అనుబంధంగా ప్రకటన

8,180కి పెరిగిన గ్రూప్‌-4 ఉద్యోగాలు

రేపటితో ముగియనున్న దరఖాస్తుల గడువు

హైదరాబాద్‌ : గ్రూప్‌-4లో మరో 141 ఉద్యోగాలను కలుపుతూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకొన్నది. కొత్త ఉద్యోగాలకు శుక్రవారమే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వగా, శనివారమే టీఎస్‌పీఎస్సీ ప్రకటన జారీ చేసింది. రాష్ట్రంలో 25 విభాగాల్లో 8,039 గ్రూప్‌-4 ఉద్యోగాలను భర్తీకి నిరుడు డిసెంబర్‌ 1న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్‌కు అనుబంధంగా బీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీలో కొత్తగా 141 ఉద్యోగాల భర్తీకి శనివారం ప్రకటన జారీ చేసింది.
బాయ్స్‌ ఇనిస్టిట్యూట్‌లో 86 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. వీటికి పురుషులు, మహిళలు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. గర్ల్స్‌ ఇనిస్టిట్యూట్‌లో 55 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు ఉండగా, వీటికి మహిళలు మాత్రమే అర్హులు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హులని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ తెలిపారు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించారు.

కొత్తగా చేర్చిన ఉద్యోగాలను కలిపితే గ్రూప్‌-4లో పోస్టుల సంఖ్య 8,180కి పెరిగింది. అయితే, దరఖాస్తులకు సోమవారంతో గడువు ముగియనున్నది. నిరుడు డిసెంబర్‌ 30 నుంచి జనవరి 30వ తేదీ వరకు దరఖాస్తులకు టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది. శనివారం వరకు గ్రూప్‌-4 ఉద్యోగాలకు 7,41,159 మంది దరఖాస్తు చేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, కొత్తగా జత చేసిన ఉద్యోగాల భర్తీలో వారిని పరిగణనలోకి తీసుకుంటామని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ తెలిపారు.

మరోసారి వాయిదా వేసిన కేంద్ర ప్రభుత్వం

ఎన్నికల తర్వాతే జనగణన..

మరోసారి వాయిదా వేసిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: 2021లో జరగాల్సిన దేశవ్యాప్త జనగణన ప్రక్రియను 2024కు వాయిదా వేస్తూ కేంద్ర సర్కార్‌ గతవారం విధానపరమైన నిర్ణయం తీసుకొన్నది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం 2024, జూలై తర్వాతనే జనగణన ఉండే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. దీని వెనుక బీజేపీ రాజకీయ కారణాలు దాగివున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో కులాల వారీగా లెక్కలు తేల్చేందుకు కులగణన చేపట్టాలని బీహార్‌లోని నితీశ్‌ సర్కార్‌తో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ ఏడాది 10 రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల తర్వాతనే జనగణన చేపట్టాలనే యోచనలో మోదీ సర్కార్‌ ఉన్నట్టు తెలుస్తున్నది.
150 ఏండ్లలో తొలిసారిగా.. ప్రతి 10 ఏండ్లకోసారి జరుగుతున్న జనాభా లెక్కలు 150 ఏండ్ల చరిత్రలో తొలిసారిగా వాయిదా పడ్డాయి. కేంద్ర బడ్జెట్‌-2022లో నిధులు కూడా కేటాయించింది. ఈ సారి నిర్వహించనున్న జనగణన పూర్తిగా డిజిటల్‌ ప్రక్రియ. ఇందుకు ఒక అప్లికేషన్‌, వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు.
సెప్టెంబర్‌ 30 వరకు పొడగింపు జనగణన వాయిదాకు సంబంధించి రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా కమిషనర్‌ అన్ని రాష్ర్టాలకు సమాచారం చేరవేశారు. పాలనాపరమైన పరిమితులపై విధించిన నిషేధాన్ని ఈ ఏడాది జూన్‌ 30 వరకు పొడిగిస్తున్నట్టు అందులో పేర్కొన్నది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం పాలనా యూనిట్ల సరిహద్దు ఫ్రీజింగ్‌ ముగిసిన మూడు నెలల తర్వాత జనగణన నిర్వహించాల్సి ఉంటుంది.

అంగన్వాడి టీచర్లు పని భారాన్ని తగ్గించాలి

అంగన్వాడీ టీచర్ల పనిబారాన్ని తగ్గించాలి
అందె బీరన్న
యదార్థవాది ప్రతినిధి చేర్యాల

రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి వర్కర్స్ జీతం తక్కువగా ఇచ్చి పని భారాన్ని పెంచింది చేర్యాల మండలంలోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి అందె బీరన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉపాధ్యాయరాళ్లకు జీతం తక్కువ పని ఎక్కువగా ఇస్తున్నారని ఐసిడిఎస్ ఆఫీసులో చేయాల్సిన పనులను అంగన్వాడి టీచర్స్ ఫోన్ యాప్ లో చెయ్యమనడం వల్ల సమయం పూర్తిగా వృధా అవుతుందని పంచాయతీ, మండల అధికారులు వారి అధికారిక కార్యక్రమాలకు సైతం టీచర్లను తప్పనిసరిగా హాజరుకావాలని ఇబ్బందులకు గురి చేయడం వల్ల, అధికారుల భయానికి విద్యార్థుల భోధన కంటే ఎక్కువ సమయం అధికారులు కార్యక్రమాలకు మీటింగ్లకు ఆఫీసులకు వెళ్లి సమయానికి ఇంటికి రాకపోవడం సరైన మార్గా సదుపాయాలు లేకపోవడం వల్ల కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం తో భర్తలు కూడా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అర్జెంట్ పది నిమిషాలలో ఈ సమాచారం ఇవ్వాలి అని ఫోన్ల ద్వారా వారిని ఇబ్బందుల గురిచేయడం వల్ల ఇంట్లో చెప్పలేక ఎవరికీ చెప్పుకో పరిస్థితి లేక మానసికంగా శరీరకంగా క్రుంగి కొంతమంది అనారోగ్యాల పాలవుతున్నారు అధికారులు చెప్పిన పని చేసినప్పటికిని పనికి తగ్గ ఫలితం ఈయకపోగా బెదిరిస్తున్నారు వారికి 14వేల 500 గా వున్నా జీతాన్ని 25 వేలకు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు ఇప్పడికైనా ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కారించాలని లేని యెడల ఏఐఎఫ్బి గా ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు నంగి తిరుపతి, ఆత్మకూరి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి

మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి హరీష్ రావు


యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

నంగునూర్ మండలం ఆంక్షపూర్ గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబాన్ని మంత్రి హరీష్ రావు పరామర్శించారు.. అదే గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త యాదగిరి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు.

కోమటిబండ మిషన్ భగీరథ నాలెడ్జి సెంటర్ లో రాష్ట్ర స్తాయి వర్క్ షాప్.

కోమటిబండ మిషన్ భగీరథ నాలెడ్జి సెంటర్ లో రాష్ట్ర స్తాయి వర్క్ షాప్.

యదార్థవాది ప్రతినిది సిద్దిపేట

మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కోమటిబండ మిషన్ భగీరథ నాలెడ్జి సెంటర్ లో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ మిషన్ భగీరథశాఖ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ సిఇలు, ఎస్ఇ లు, ఇఇలు, డిఇలకు రాష్ట్ర స్తాయి వర్క్ షాప్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యదర్శి స్మిత సబర్వాల్ మాట్లాడుతూ  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంటింటికి శుద్ధమైన త్రాగునీరు అందించాలే సదాశయంతో చేపట్టిన గొప్ప కార్యక్రమం మిషన్ భగీరథ. వేలాది కోట్ల రూపాయలను వ్యయం చేసి వేలాది కిలోమీటర్ల మెయిన్ వాటర్ పైప్ లైన్లు, OHSR ల నిర్మాణం, ఇంటింటికి నల్లాల బిగింపు పూర్తయి ఇంటింటికి సుఖమైన త్రాగు నీరు అందించబడుతుందని, ప్రభుత్వ ఆశయం మేరకు ఇంటింటికి శుద్ధమైన త్రాగునీరు అందించడంలో మిషన్ భగీరథ అధికారులు, ముందస్తు ప్రణాళిక బద్దంగా పనిచేసి అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి వాటర్ లీకేజీలు కాకుండా సరిచూసుకొని రానున్న వేసవి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా శుద్ధమైన మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరా చెయ్యాలని అన్నారు. వ్యవసాయానికి నీటి ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేసేటప్పుడు మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు సరఫరా చేసేందుకు అవసరమైన నీరు లభ్యమయ్యేలా చూసుకోవాలని, మున్సిపాలిటీలో మరియు గ్రామపంచాయతీలలో స్థానిక సంస్థల అధికారుల సమన్వయంతో త్రాగునీరు సరఫరా చేయాలని తెలిపారు. మిషన్ భగీరథ ఎస్ఇలు, ఇఇలు క్షేత్రస్థాయిలో మిషన్ భగీరథ మెయిన్ గ్రిడ్ మరియు ఇంట్రా విలేజ్ పనులను పరిశీలించి నిర్మాణాలకు కలరింగ్ మరియు మిషన్ భగీరథ పేరుతో సహా వర్క్ వైస్, గ్రిడ్ వైస్ రిపోర్టును మార్చి చివరిలోగా అందించాలని తెలిపారు.

మానవత్వం చాటుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

మానవత్వం చాటుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

యదార్థవాది ప్రతినిది దుబ్బాక

లింగుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం ఎదురెదురుగా వస్తున్న ఆటో బైక్ ఢీ, పలువురికి తీవ్రగాయాలు నియోజకవర్గ పర్యటనలో భాగంగా అటుగా వెళ్తున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. తన కారు ని ఆపి, సహాయక చర్యలు క్షతగాత్రులని తన వాహనం తో పాటు, అంబులెన్స్ లో ఆసుపత్రి కి తరలింపు మిరుదొడ్డి మండలం లింగుపల్లి గ్రామ సమీపంలో ఆటో మరియు ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి అటుగా వెళుతున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తన వాహనం ఆపి దిగి సాయక చర్యలు చేపట్టారు.
తన సహాయక సిబ్బంది, అక్కడకు చేరిన మరికొందరి సహాయంతో గాయపడిన వ్యక్తులను వెంటనే తన వాహనంతో పాటు మరికొందరిని అంబులెన్స్ లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యల కు ఫోన్ చేసి, క్షతగాత్రులకి తక్షణమే మంచి వైద్యం అందించాలని ఆదేశించారు. క్షతగాత్రులలో ఒకరిని లింగుపల్లి గ్రామానికి చెందిన జోగ్యారి నర్సింలు గా గుర్తించారు.

నేటితో ముగియనున్న నాగోబా జాతర.. స్వగ్రామాలకు మెస్రం వంశీయులు..

నేటితో ముగియనున్న నాగోబా జాతర.. స్వగ్రామాలకు మెస్రం వంశీయులు..

యదార్థవాది ప్రతినిధి ఆదిలాబాద్

ఆదీవాసీలు అత్యంత వైభవంగా జరుపుకునే నాగోబా జాతర నేటితో ముగియనుంది. ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతర ఇవాళ ముగియనుంది..పంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరల్లో నాగోబా జాతర ఒకటి. ఈనెల 21న ఈజాతరకు మెస్రం వంశీయులు గంగాజలాన్ని తీసుకువచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని ఆదివాసులంతా జాతరకు వచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈజాతర వారం రోజుల పాటు ఇక్కడే ఉండి సంప్రదాయం ప్రకారం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఇంద్రవెల్లి మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఎడ్ల బండ్లలో వచ్చిన వారు తమ ఎడ్ల బండ్లను తీసుకొని నేడు జాతర ముగియడంతో తమ స్వగ్రామానికి బయలుదేరారు..

మాటలేమో సబ్ కా వికాస్.. చేతలేమో సబ్ కుచ్ బక్వాస్..

మాటలేమో సబ్ కా వికాస్.. చేతలేమో సబ్ కుచ్ బక్వాస్..

యదార్థవాది ప్రతినిధి నిజామాబాద్

ధర్మపురి అరవింద్ ఎంపీగా గెలిచిన తర్వాత నిజామాబాద్ జిల్లాకు ఒక్క రూపాయైనా ప్రత్యేకంగా తెచ్చారా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. శనివారం బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణకు ప్రత్యేకంగా ఇచ్చింది ఏమీ లేదని, మాటలేమో ‘సబ్ కా వికాస్.. చేతలేమో సబ్ కుచ్ బక్వాస్’ అంటూ విమర్శించారు. దుర్మార్గపు, అసమర్ధ ప్రభుత్వం కేంద్రంలో ఉందన్నారు. మనం కట్టే పన్నుల్లో 46 శాతం మాత్రమే తిరిగి వస్తున్నాయని, తాను చెప్పింది తప్పయితే రాజీనామాకు కూడా సిద్ధమన్నారు. జాతీయ రహదారులు వేసి టోల్ వసూలు చేస్తలేరా? అని ప్రశ్నించారు. మోదీని దేవుడు అంటున్నారు.. ఎవరికి దేవుడు? అని ప్రశ్నించారు. కర్ణాటక, మహారాష్ట్ర కొట్లాటను అపలేని వ్యక్తి.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపారట.. అంటూ ఎద్దేవా చేశారు. ఫిబ్రవరి ఒకటిన పెట్టే బడ్జెట్ చివరి బడ్జెట్ అవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు.. గత నెలరోజుల కిందట ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా నేతలను పిలిపించుకొని నిజామాబాద్ అభివృద్ధిపై చర్చించారని, సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల మేరకు నిధులు ఇచ్చారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇంతవరకు నిజామాబాద్‌లో రూ. 936 కోట్ల 68 లక్షలు ఖర్చు చేశామని, రాబోయే ఆరు నెలల్లో మరో వంద కోట్లు వెచ్చిస్తామని స్పష్టం చేశారు. తిలక్ గార్డెన్ అభివృద్ధి చేస్తున్నామని, రూ. 50 కోట్లతో కళాభారతి కడుతున్నామని, జిల్లాలోని కళాకారులు, సాహితివేత్తలు, రచయితలకు అత్యుత్తమమైన కళాభారతిని అందించాలని భావిస్తున్నామన్నారు. తెలంగాణ జెండాను ఎత్తింది నిజామాబాద్ జిల్లా అని అన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు రూ. 50 కోట్ల చొప్పున మంజూరు చేశామని, చెప్పినవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

జమున అభినయనం ప్రజల గుండెల్లో చెదరని ముద్ర

జమున అభినయనం ప్రజల గుండెల్లో చెదరని ముద్ర ప్రముఖ చిత్రకారులు రుస్తుం
యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట
సినీ జగత్తులో అలనాటి మేటి హీరోయిన్ జమున మరణం సినిమా ప్రపంచంలో తీరనిలోటు. పుట్టిల్లు, గుండమ్మకథ మొదలు రెండువందల చిత్రాల్లో నటించి సత్యభామగా మరపురాని పాత్రలతో తెలుగు ప్రజల గుండెల్లో అభినయనం తో చెదరని ముద్రలు వేసి స్థిరస్థాయిగా నిలిచిన తార జమున.
ఆమె ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె చిత్రాన్ని చిత్రించి నివాళి అర్పించారు. ప్రఖ్యాత చిత్రకారులు రుస్తుం, ఆర్ ఏ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం, నైరూప్య చిత్రకారుడు నహీం రుస్తుం తదితరులు పాల్గొన్నారు .

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...