33.2 C
Hyderabad
Friday, April 24, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 112

ముదిరాజ్ మహిళ కమిటీ నూతన కార్యవర్గం

ముదిరాజ్ మహిళ కమిటీ నూతన కార్యవర్గం
యదార్థవాది ప్రతినిధి నంగునూరు
మండల కేంద్రమైన నంగునూరులోని ముదిరాజ్ భవనంలో శనివారం ముదిరాజ్ మహిళా నూతన గ్రామ కమిటీ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అద్యక్షులుగా జంగిటి రాజమణి, ఉపాధ్యక్షులుగా కొండిల్ల వనజ, ప్రధాన కార్యదర్శిగా సొప్పరి మంజుల, కార్యవర్గ సభ్యులుగా బీమరి లలిత, గుండబోయిన కవిత,గొడుగు భూలక్మి, గౌరబోయిన మంజుల, బోనగిరి నరసవ్వ, కన్నారపు స్వప్న తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

850 ఏండ్ల నాటి దేవాలయం పునర్ ప్రతిష్ట

850 ఏండ్ల నాటి దేవాలయం పునర్ ప్రతిష్ట. మంత్రి హరీష్ రావు

యదార్ధ వాది ప్రతినిధి వరంగల్

ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరిలో నిర్వహిస్తున్న చారిత్రక పర్వతాల శివాలయం ప్రతిష్టాపన మహోత్సవంలో ఆర్థిక వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు పాల్గొని శివాలయములో పూజలు నిర్వహించారు అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ జీర్ణ వ్యవస్థలో ఉన్న దేవాలయాలను పునరుద్ధరించడం సంతోషించ తగిన విషయమని 850 ఏండ్ల చరిత్ర కలిగిన శివాలయం పునర్ ప్రారంభించడం 100 దేవాలయాలు నిర్మాణం కు సమానం ఇట్టి మహోత్తరమైన కార్యమును చేపట్టినందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు అభినందనలు తెలిపారు త్వరలో ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీలు గాయత్రి రవి, పసునూరి దయాకర్,ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఛీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, నన్నపనేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు

చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే కటిన చర్యలు తప్పవు.

చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే కటిన చర్యలు తప్పవు.

యదార్థవాది ప్రతినిది మెదక్

అల్లాదుర్గ్ సర్కిల్ టేక్మాల్ పోలీస్ స్టేషన్ పరిదిలో శనివారం సాలోజీపల్లి గ్రామంలో తనిఖీలు నిర్వహించిన సర్కిక్ ఇన్స్ పెక్టర్ జార్జ్.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సి‌సి కెమెరాల ప్రాముఖ్యత, సైబర్ నేరాలపై ఆవాహన కల్పించారు. వాహనాలకు సరి అయిన పత్రాలు ఉండాలని, ప్రతి ఒక్కరు రోడ్ భద్రత నియమాలను తప్పక పాటించాలని, సైబర్ నేరాలపై హవగాహన కలిగివుండాలని తెలిపారు. ఈ తనిఖీలలో సుమారు 200 ఇళ్లను సోదాలు చేశారు, పత్రాలు సరిగాలేని ద్విచక్ర వాహనాలు 16, ఒక ఆటో మొత్తం 17 వాహనాలను టేక్మాల్ పోలీస్టేషన్ తరలించారు. ఈ తనిఖీలో 43 మంది పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

క్రమశిక్షణతో ప్రజల మన్ననలు పొందగలం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

క్రమశిక్షణతో ప్రజల మన్ననలు పొందగలం

క్రమశిక్షణతో ప్రజల మన్ననలు పొందగలం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఆర్మూడ్ రిజర్వ్, సివిల్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించడం జరిగింది. ఈ పరేడ్ లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై గౌరవ వందనం స్వీకరించరు.. అనంతరం సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్, ట్రాఫిక్ డ్రిల్, సిబ్బంది ప్రదర్శనని పరిశీలించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ప్రతిరోజు ఉదయాన్నే కనీసం ఒక అరగంట యోగ, ధ్యానం, నడక ఏదో ఒకటి చేయాలని, రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేసుకోవాలని ఎస్పీ తెలిపారు. వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి క్రమశిక్షణ, యూనిటీగా ఉండడం, ఫిజికల్ ఫిట్నెస్ కి ఉపయోగపడుతుందని, క్రమశిక్షణ తో డ్యూటీలు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందేలాగా పనిచేస్తూ పోలీస్ శాఖకి, జిల్లాకు మంచి పేరు తెచ్చే లాగా పని చేయాలని తెలిపారు. ఈ పరేడ్ లో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ విశ్వప్రసాద్, ఆర్.ఐ లు కుమారస్వామి, రజినీకాంత్, యాదగిరి, సి.ఐ లు అనిల్ కుమార్, ఉపేంద్, ఎస్.ఐ లు ఆర్.ఎస్.ఐ లు, ఆర్ముడ్ సిబ్బంది, సివిల్ సిబ్బంది,హోమ్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.

ఏడుపాయల జాతరకు నిధులు మంజూరు

ఏడుపాయల జాతరకు నిధులు మంజూరు

యదార్థవాది ప్రతినిధి మెదక్
మహాశివరాత్రి సందర్భంగా ఏడుపాయల వన దుర్గ మాత జాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు కోట్లు రూ మంజూరు చేసినట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ పండుగలు, జాతరలు వైభవంగా జరుగుతున్నాయని అన్నారు ఏడుపాయల జాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయులే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని జాతరలో భక్తులకు మౌలిక వసతులు కల్పనకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి విజ్ఞప్తి చేయగా వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి రెండు కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి, సహకరించిన జిల్లా మంత్రి హరీష్ రావుకి ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

భద్రత రక్షణే ప్రధాన లక్ష్యం సిపి రామా రాజేశ్వరి

భద్రత, రక్షణే ప్రధాన లక్ష్యం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి

యదార్థవాది ప్రతినిధి పెద్దపల్లి
రామగుండం పోలీస్ నూతన కమిషనర్ గా రెమా రాజేశ్వరి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు రామగుండం పోలీస్ కమిషనరేట్ చేరుకున్న కమిషనర్ కు సాయుధ పోలీసులు గౌరవద్దనం సమర్పించారు పుష్పగుచ్చాలతో అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా సిపి మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత, రక్షణే ప్రధాన లక్ష్యమని న్యాయాన్ని ధర్మానికి లోబడి చట్టబద్దంగా సామన్య ప్రజలకు నాతో పాటు మా అధికారుల చేత కూడ సేవలందిచడంలో కృషి చేస్తానని తెలిపారు ఈ సందర్భంగా కమిషనర్ కలిసి పుష్పాగుచ్చాలను అందజేసిన వారు ఏసీపీలు ఇన్స్పెక్టర్లు, ఆర్.ఐలు, ఎస్.ఐలు, సీపీ సిసి శ్రావణ్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లకుంట పోచ లింగం, సభ్యులు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.

స్వామివారి సేవలో మంత్రి గంగుల

స్వామివారి సేవలో మంత్రి గంగుల కమలాకర్

యదార్థవాది ప్రతినిధి కరీంనగర్
శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి షష్ఠమ వార్షిక బ్రహ్మోత్సవాలు కరీంనగర్లో కన్నుల పండువగా సాగుతున్నాయి. ఐదో రోజు లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామిని శేష వాహనంపై ఊరేగించారు. ఈ శేష వాహన సేవ లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపా రాణీ హరి శంకర్ స్వామివారి శేష వాహనాన్ని భుజ స్కందాలపై మోస్తూ. స్వామి వారి సేవలో తరించారు. ఐదో రోజు శేష వాహన సేవ అంగరంగ వైభవంగా.అన్నమయ్య సంకీర్తనలు కోలాట ముత్యాలతో వైభవంగా సాగింది. శేష వాహన సేవలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

యువతను పరిరక్షించుకునే బాధ్యత చిరంజీవి పై ఉంది

యువతను పరిరక్షించుకునే బాధ్యత చిరంజీవి పై ఉంది
తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్
యదార్థవాది ప్రతినిధి విశాఖపట్నం
రాష్ట్రంలో యువతను పరిరక్షించుకునే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఏదో ఒక రాజకీయ పార్టీకి సంఘీభావం తెలపాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ అన్నారు. నగరంలోని పౌర గ్రంథాలయంలో నిర్వహించిన వాల్తేరు వీరయ్య విజయోత్సవ అభినందన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలను ముఖ్యంగా యువతను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మెగాస్టార్ చిరంజీవి పై ఉందన్నారు. చిరంజీవి అనేక దశాబ్దాల నుంచి సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చురగొన్నారన్నారు. ప్రేక్షకుల అభిమానులకి ప్రత్యక్ష నిదర్శనమే వాల్తేరు వీరయ్య చిత్రం దిగ్విజయం అని ప్రస్తావించారు కళాకారులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో చిరంజీవి కళా పరిషత్ అనే సాంస్కృతిక సంస్థను స్థాపించిన గెంబలి జగదీష్ ను బి.వి.రామ్ అభినందించారు. వాల్తేరు వీరయ్య విజయోత్సవ అభినందన సభ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు సురక్ష హాస్పిటల్ అధినేత బొడ్డేపల్లి రఘు, చిరంజీవి కళాపరిషత్తు కార్యదర్శి నూకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పోలీసులు ప్రజల మన్ననలు పొందే విధంగా పనిచేయాలి

ప్రజల మన్ననలు పొందే విధంగా సేవలందించే అధికారులు చిరస్థాయిగా నిలిచిపోతారు మంత్రి గంగుల కమలాకర్
యదార్థవాది ప్రతినిధి కరీంనగర్
ప్రజల మన్ననలు పొందుతూ సేవలందించే అధికారులు చిరస్థాయిగా నిలిచిపోతారని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ, బిసి సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు బదిలీపై వెళుతున్న పోలీస్ కమీషనర్ వి సత్యనారాయణకు వీడ్కోలు, నూతనంగాబాధ్యతలు చేపట్టిన పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు కు స్వాగతం పలుకుతూ శుక్రవారం కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంలో ఏర్పాటైన కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా, మాట్లాడుతూ బదిలీపై వెళ్ళిన పోలీస్ కమీషనర్ వి సత్యనారాయణ సమర్ధవంతంగా పనిచేశారన్నారు. దేశానికి ఎంతోమంది మహోన్నతులను అందించడంతోపాటు విభిన్న రకాల కార్యక్రమాలు కొనసాగే కరీంనగర్ లో పనిచేసే అవకాశం లభించడం అదృష్టంగా భావించాలని అన్నారు బదిలీపై వెళుతున్న పోలీస్ కమీషనర్ కు మంత్రి ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు వివిధశాఖలకు చెందిన అధికారులు జ్ఞాపికను అందజేసి, శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు, చొప్పదండి ఎమ్మేల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) గరిమ అగర్వాల్, ట్రైనీ కలెక్టర్ లెనిన్లతో పాటుగా డిసిపి ఎస్ శ్రీనివాస్, ఏసిపిలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్ రావు, వెంకటరెడ్డి, మదన్ లాల్, జె విజయసారధి, కె శ్రీనివాస్, సి.ప్రతాప్, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి వెంకన్న, ఎస్బిఐ జి వెంకటేశ్వర్లులతోపాటుగు పలువురు అధికారులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్

బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఒడిశా మాజీ సీఎం గిరిధ‌ర్ గ‌మాంగ్
యదార్థవాది ప్రతినిధి హైదరాబాద్
భార‌త్ రాష్ట్ర స‌మితికి దేశ వ్యాప్తంగా విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఒడిశా మాజీ ముఖ్య‌మంత్రి గిరిధ‌ర్ గ‌మాంగ్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో గిరిధ‌ర్‌కు సీఎం కేసీఆర్ పార్టీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. గిరిధ‌ర్‌తో పాటు 12 మంది మాజీ ఎమ్మెల్యేలు, న‌లుగురు మాజీ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్‌లో చేరిన వారిలో హేమ గమాంగ్, జ‌య‌రాం పాంగీ, రామ‌చంద్ర హ‌న్ష్‌డా, బృందావ‌న్ మ‌జ్హీ, న‌బీన్ నంద‌, రాథా దాస్, భ‌గీర‌థి సేతి, మ‌య‌దార్ జేనా ఉన్నారు

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...