నాకు గుర్తింపు వచ్చింది మీడియాతోనే
HUJ డైరీ ఆవిష్కరణ సభలో
సీపీ సి.వి.ఆనంద్
యదార్థవాది ప్రతినిధి హైదరాబాద్
యూనియన్ సభ్యులకతో కలసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బాల్యంలో ఓ క్రీడాకారుడిగా, ఆతర్వాతా సివిల్స్ లో ర్యాంకు సాధించిన విద్యార్థిగా, పోలీసు అధికారిగా మీడియాతోనే సమాజంలో తనకు గుర్తింపు లభించిందని దాదాపు 40యేండ్ల అనుబంధం ఉందన్నారు. విధి నిర్వహణలో కొన్ని సందర్భాల్లో తమ నుండి దొర్లే తప్పులను తాము గ్రహించకపోవచ్చని, మీడియా ద్వారానే వాటిని గుర్తించి సరిచేసుకుంటామన్నారు. ఇదే క్రమంలో పోలీసుల పనితీరుపై పనిగట్టుకొని చేసే అసత్య ప్రచారాల్ని తాము అస్సలు పట్టించుకోమని, వాస్తవాలు ఉండే కథనాలనే పరిగణలోకి తీసుకుంటామని సీపీ ఆనంద్ స్పష్టం చేశారు. ఒకప్పుడు మీడియా సమాజానికి దిక్చూసిగా నిలబడేదని, ప్రస్తుతం దాని స్వరూపం మారిపోవడమే కాకుండా లక్ష్మణరేఖ దాటి పనిచేస్తున్నదన్నారు. ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లకుండా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యతా అవసరమన్నారు
నాకు గుర్తింపు వచ్చినది మీడియాతోనే సిపి ఆనంద్
ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ అరాచకాలు
ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ అరాచకాలు
యదార్థవాది ప్రతినిది తాడేపల్లి
తాడేపల్లిగూడెంలో రుణం ఒక వాయిదా కట్టడం లేటయ్యిందనే సాకుతో ఇంటికి వచ్చి దౌర్జన్యానికి దిగి ఇంటికి తాళాలు వెయ్యబోయిన ఫైవ్ స్టార్ ఫైనాన్స్ సిబ్బంది.. ఒక నెల బాకీ కట్టలేనని ముందే చెప్పినా ఇంటికి వెళ్ళి దౌర్జన్యానికి దిగి బాకీ దారు తల్లి కాలేపు వీరమ్మ(65) పై దాడికి పాల్పడినట్లు బాకీదారు మిరియాల అన్నపూర్ణ.. ఫైనాన్స్ కంపెనీ దాడిలో కిందపడిపోయిన వీరమ్మను 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు, చికిత్స పొందుతున్న వీరమ్మ వద్ద స్టేట్ మెంట్ రికార్డ్ చేసి ఫిర్యాదు స్వీకరించిన తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు తనకు ఇంటిపై 2.50 లక్షలు లోను తీసుకుంటే బ్యాంకు సిబ్బంది 50వేలు లంచం తీసుకుని కేవలం 2లక్షలు మాత్రమే తనకు లోను ఇచ్చారని తెలిపిన బాకీదారు అన్నపూర్ణ తన ఇంటికి వచ్చి దౌర్జన్యానికి దిగి తన తల్లిపై దాడికి పాల్పడిన ఫైవ్ స్టార్ సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్న బాధితురాలు..
విద్యార్థి లక్ష్యంతో చదవాలి..
విద్యార్థి లక్ష్యంతో చదవాలి..
యదార్థవాది ప్రతినిది దుబ్బాక
ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎన్నుకోవాలి తమ నాలెడ్జి వేలికితియాలని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం దుబ్బాక పట్టణంలోని పాఠశాల విద్యార్థులకు పరీక్ష పే చర్చ అనే కార్యక్రమాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడారు… విద్యార్థులు ఉన్నత ర్యాంకులు సాధించాలని అన్నారు. లక్ష్యంతో చదివినట్లయితే దేశానికి, తమ తల్లిదండ్రులకు గొప్ప పేరు వస్తుందని అన్నారు. పురాతమైన భాష హిందీ అని, హిందీ భాషా ప్రతి ఒక్క విద్యార్థికి వచ్చేలా భాషా పండితులు బోధించాలని ఉపాధ్యాయులకు తెలిపారు. నేటి విద్యర్దులే రేపటి భావి భారత పౌరులని, పరీక్షలు అంటే భయాందోళన చెందకుండా ఉండేందుకే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నారని అన్నారు. వివిధ పాఠశాల ఉపాధ్యాయులు కూడ పరీక్ష పే చర్చ సంబంధించిన వివరాలను తమ తమ పాఠశాలలో విద్యార్థులకు తెలుగులో వర్ణించి చెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చింత సంతోష్ గుప్తా, బాలేష్ గౌడ్, సుంకు ప్రవీణ్, ఎస్ ఎన్ చారి, అనిల్ రెడ్డి, దూలం వెంకటేష్, నిహాల్ గౌడ్, రమేష్ రెడ్డి, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు.

యువత కోసం ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటిస్తాం: నారా లోకేశ్
యువత కోసం ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటిస్తాం: నారా లోకేశ్
యదార్ధవాది ప్రతినిధి కుప్పం
యువగళం పేరు ప్రకటించగానే వైకాపా నాయకులకు వణుకు పుట్టిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. వేల కిలోమీటర్లు చేపట్టనున్నయువగళంపాదయాత్రను ఇవాళ ఉదయం కుప్పం నుంచి లోకేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ”యువగళం పాదయాత్ర ప్రకటించగానే 10మంది మంత్రులు నాపై మాటల దాడికి దిగారు. ఏ అర్హతతో పాదయాత్ర చేస్తున్నావని ప్రశ్నించారు. గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా అభివృద్ధి చేశాను. ఐటీ మంత్రిగా.. వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాను. ఆ అర్హతతోనే పాదయాత్ర చేస్తున్నా. నన్ను విమర్శించే మంత్రులను ప్రశ్నిస్తున్నా.. ఈ మూడేళ్లలో మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారు. . వీధుల్లో డ్యాన్సులు వేస్తే, క్యాసినో ఆడిస్తేనో పరిశ్రమలురావు””పొట్టి శ్రీరాములు త్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దేశంలోనే తెలుగు జాతి గర్వ పడేవిధంగా ఎన్టీఆర్‌కృషి చేశారు. ఆంధ్రుల సత్తా ఏంటో చంద్రబాబు చేసి చూపించారు. కానీ, ఒక్క ఛాన్స్ ఇస్తే జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఈ మూడేళ్లలో వైకాపా చేసిందేమిటి? జగన్‌రెడ్డి అంటే జాదూరెడ్డి గుర్తొస్తున్నాడు. మైసూర్ బోండాలో మైసూర్ ఉండదు.. జాదూరెడ్డి జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాలు ఉండవు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఇస్తామన్నారు.. ఏమయ్యాయి ఉద్యోగాలన్నీ? ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు ఏమైంది? మెగా డీఎస్సీ ఏమైందని జాదూరెడ్డిని ప్రశ్నిస్తున్నా. దిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన జాదూరెడ్డి.. దిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. దానికి కారణం నీపైన ఉన్న కేసులే.యువత, రైతులు.. ఇలా అన్ని వర్గాలు ఈ ప్రభుత్వం బాధితులే. ఈ మూడేళ్లలో రాష్ట్రాన్ని 67ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. 3 రాజధానుల్లో ఎక్కడైనా ఒక్క ఇటుకైనా వేశారా జాదూరెడ్డి? పారిశ్రామిక వేత్తలు పక్క రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి. జే ట్యాక్స్ కట్టలేదని పక్క రాష్ట్రానికి పంపించేశారు. మహిళలపై దాడులు జరిగితే గన్ కంటే ముందు జగన్ వస్తాడని ప్రగల్భాలు పలికారు. కానీ, అది బుల్లెట్లు లేని గన్ అని ప్రజలకు అర్థమైంది” అని లోకేశ్ విమర్శించారు. ”యువతకు హామీ ఇస్తున్నా.. త్వరలోనే యువతకు ప్రత్యేకంగా మేనిఫెస్టో తీసుకు రాబోతున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని? ప్రైవేటు రంగం నుంచి ఎన్ని? స్వయం ఉపాధి ద్వారా ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామో స్పష్టంగా అందులో ప్రకటిస్తాం. ఏటా డీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం. కౌలు రైతులకు ప్రత్యేక కార్యాచరణ తీసుకొచ్చి ఆదుకుంటాం. ప్రభుత్వ వైఫ్యలాలను విమర్శిస్తే.. నాకు చీరలు, గాజులు పంపుతామని ఓ మహిళా మంత్రి అన్నారు. పంపించండి చీర, గాజులు.. మా అక్కలు, చెళ్లెల్లకు ఇస్తా. చీర కట్టుకుని గాజులు వేసుకునే వాళ్లు చేతగానివాళ్లా? అని అడుగుతున్నా. మీ జగన్ మాదిరిగా తల్లీ, చెల్లిని బయటకు గెంటలేదు. మంత్రి పదవిలో ఉన్న వాళ్లు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. ఏ1 తెచ్చిన జీవో1తో అడ్డుకోవాలని చూస్తారా? పవన్ కల్యాణ్ పోరాటాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. పవన్ వారాహి వాహనానికి ఆంక్షలు పెడుతున్నారు. యువగళం ఆగదు, వారాహి ఆగదు. భయం నా బయోడేటాలోనే లేదు. అడ్డొస్తే తొక్కుకుని వెళ్లి పోతాం. మంచి కోసం పోరాడే ధైర్యం ఉంది. సైకో పాలనలో అప్పులు.. ఆత్మహత్యలు. సైకిల్ పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి. 400 రోజుల పాదయాత్రలో ఇది తొలిరోజు. నిరుద్యోగ యువతకు పిలుపినిస్తున్నా.. కలిసికట్టుగా ఉద్యమించి జాదూరెడ్డిని ఇంటికి పంపిద్దాం” అని లోకేశ్ అన్నారు.
నార్కోటిక్స్ డ్రగ్స్ సైకోట్రోపిక్ పదార్థాలపై చట్టం దర్యాప్తు ప్రక్రియపై ఒక రోజు శిక్షణ
నార్కోటిక్స్ డ్రగ్స్ సైకోట్రోపిక్ పదార్థాలపై చట్టం దర్యాప్తు ప్రక్రియపై ఒక రోజు శిక్షణ
యదార్థవాది ప్రతినిది హైదరాబాద్
తెలంగాణలోని అన్ని యూనిట్లకు శుక్రవారం ADGP, CID, హైదరాబాద్ ద్వారా NDPS చట్టం దర్యాప్తు ప్రక్రియపై ఒక రోజు శిక్షణ నిర్వహించబడింది. అంజనీ కుమార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, తెలంగాణ రాష్ట్రం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, NDPS కేసులలో శిక్షను పొందడం యొక్క ప్రాముఖ్యత గురించి పాల్గొనేవారికి వివరించారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు మోహన్‌లాల్ కేసు తీర్పుపై డీజీపీ, టీఎస్ ప్రత్యేకంగా ప్రస్తావించగా, ఒకరోజు శిక్షణను నిర్వహించడంలో సీఐడీ చొరవను అభినందించారు. మహేష్ M. భగవత్ ADGP, CID, వివిధ రకాల డ్రగ్స్, వాటి మూలాలు, గమ్యస్థానాల ప్రదేశాల గురించి మరియు తెలంగాణ డ్రగ్స్ సరఫరా చేసే మూలం కాదని, రవాణా & గమ్యస్థానమని వివరించారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలో 2022లో 214 నేరస్థులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయబడ్డాయి. ఎన్‌డిపిఎస్ కేసులలో సరైన దర్యాప్తు యొక్క ప్రాముఖ్యతను పాల్గొన్న వారందరికీ ఆయన వివరించారు. శిక్షణా కార్యక్రమాల నిర్వహణకు సబ్జెక్టు నిపుణులు, రిసోర్స్ పర్సన్లను ఆహ్వానించారు. మిస్టర్ ఎ. రాంఘధన్, సూపరింటెండెంట్, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విచారణ ప్రక్రియ మరియు ప్రాసిక్యూషన్ గురించి వివరాలపై ఉదాహరణలతో వివరించారు. హైదరాబాద్‌లోని ఎఫ్‌ఎస్‌ఎల్‌లోని హెచ్‌ఓడీ క్లూస్ టీమ్ డైరెక్టర్ డాక్టర్ వెంకన్న, హైదరాబాద్‌లోని సీజర్ విధానం మరియు పరికరాలు మరియు విశ్లేషణ గురించి వివరించారు. శిక్షణలో రాష్ట్రవ్యాప్తంగా 220 మంది అధికారులు పాల్గొన్నారు. సి.అనసూయ, SP నార్కోటిక్స్ సెల్, CID, ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.

ఘనంగా మున్సిపల్ పాలకవర్గం తృతీయ వార్షికోత్సవ వేడుకలు
ఘనంగా మున్సిపల్ పాలక వర్గం తృతీయ వార్షికోత్సవ వేడుకలు
యదార్థవాది ప్రతినిధి గజ్వేల్
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేసి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా తృతీయ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మున్సిపల్ పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ దశలవారీగా అభివృద్ధి చెందుతుందని సీఎం కేసీఆర్ నేతృత్వంలో గణనీయమైన అభివృద్ధి కొనసాగుతుంది అని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాధించడానికి పాలకవర్గం కంకణ బత్తులై ఉండాలని అన్నారు ఈకార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విద్యాధర్,వైస్ చైర్మన్ జకిఉద్ధిన్,కౌన్సిలర్స్, కో ఆప్షన్ సభ్యులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
కుప్పం నుంచి బెంగుళూరుకు గ్రీన్ ఛానల్..
కుప్పం నుంచి బెంగుళూరుకు గ్రీన్ ఛానల్.. తారకరత్నను బెంగుళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు..
యదార్థవాది ప్రతినిధి కుప్పం
నటుడు నందమూరి తారకరత్నకు మెరుగైన వైద్యంఅందించేందుకుబెంగుళూరుకుతరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు..ఎయిర్ లిప్టింగ్ చేసే అవకాశం లేనందున గ్రీన్ ఛానల్ ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కుప్పం నుంచి బెంగుళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమవుతున్నారు. కర్ణాటక ప్రభుత్వంతో ఎమ్మెల్యే బాలకృష్ణ చర్చించారని టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి తెలిపారు. అంబులెన్స్కు ఎలాంటి ఆటంకాలు రాకుండా గ్రీన్ ఛానల్ తరహాలో.. తారకరత్నను తరలించడానికి కర్ణాటక సర్కార్ సహకరిస్తోందని చెప్పారు.
నారా లోకేష్ కు పాదయాత్ర చేసే అర్హత లేదు..
నారా లోకేష్ కు పాదయాత్ర చేసే అర్హత లేదు..
యదార్థవాది ప్రతినిది శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా వైసిపి కార్యాలయంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాన్ శుక్రవారం పత్రిక సమవేశంలో మాట్లాడుతూ నారా లోకేష్ కు పాదయాత్ర చేసే అర్హత లేదని, ఎవరిని మోసం చేయడానికి ఈ పాదయాత్ర ప్రారంభించారో చెప్పాలని తెలిపారు. పాదయాత్ర చేయడం ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, ఆయనలాగే పాదయాత్ర చేసి సీఎం కావాలనుకోవడం చంద్రబాబు, లోకేష్ లు పగటి కలలు కనడమేనని, రాజధాని పేరుతో 33 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు మీ నాన్న చంద్రబాబు పన్నాగం పన్నారన్నారు. ఐదేళ్లలో ఐదు కళ్యాణ మండపాలు మాత్రమే నిర్మించి ఇదే రాజధాని నిర్మాణాలు అంటూ చెప్పిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. టిడిపికి దశా,దిశా లేదన్నారు. పాదయాత్ర చేయడానికి మీకున్న అర్హత ఏంటి అని ప్రశ్నించారు. లోకేష్ సీఎం అభ్యర్థినా మీ నాన్న దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థ.. లేక చంద్రబాబు నాయుడు అభ్యర్ధ.. అసలు ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రజలు గందరగోళానికి గురవుతున్నారని మండి పడ్డారు. ఐటీ మంత్రిగా ఉన్న లోకేష్ ఒక్క ఉద్యోగం వేసావా ఒక్క పరిశ్రమనైనా తెచ్చావా అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల క్షేత్రంలో ఎదుర్కోలేక గుంపులుగా జోడీలు కట్టి వస్తున్నారని, ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా సీఎం జగన్మోహన్ రెడ్డి వైపే ప్రజాభిమానం ఉందని ఈ సందర్భంగా తెలిపారు. టిడిపి 175 స్థానాల్లో పోటీ చేస్తుందా లేక ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ కి 50 స్థానాలకి అవకాశం ఇస్తారా అన్నది చెప్పాలన్నారు. నాలుగేళ్లలో టెక్కలి నియోజకవర్గ సమస్యలపై ఎంత మేర దృష్టి సారించారో అచ్చెన్నాయుడు చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు అచ్చెన్నాయుడు ఎక్కడున్నారు అంటూ దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు..
మార్చి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్: సీఎం జగన్..
మార్చి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్: సీఎం జగన్..
యదార్థవాది ప్రతినిది తాడేపల్లి
వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో మంత్రి విడదల రజిని, ఎపి సి ఎస్ జవహార్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఏపీలో మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్పెప్ట్ అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే.. అదే రోజు నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆస్పత్రుల సందర్శన ప్రారంభించాలన్నారు. మార్చి 1వ తేదీ నుంచే.. గోరుముద్దలో భాగంగా వారానికి మూడుసార్లు పిల్లలకు రాగిమాల్ట్ పంపిణీ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.అప్పటికే ఉన్న, కొత్తగా నిర్మిస్తున్న అన్ని బోధనాసుపత్రుల్లో క్యాన్సర్ నివారణా పరికరాలు, చికిత్సలతోపాటు, కాథ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
సిని నటిమణి జెమున మరణం సిని కళా రంగానికి తీరని లోటు.
సిని నటిమణి జెమున మరణం సిని కళా రంగానికి తీరని లోటు.
యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్
అలనాటి సిని నటి మణి జమున చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతునమ శుక్రవారం మరణించారని టివి, రేడియో జానపద గాయకులు గడిపె మల్లేశ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జమున హుస్నాబాద్ బాలుర ఉన్నత పాఠశాల లొ జరిగిన బహిరంగ సభకు వచ్చిన సందర్భంగా జ్ఞాపకాలను స్మరించుకున్నారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు అత్యంత తీరని లోటన్నారు. వందల చిత్రాల్లో నటించి తెలుగువారి అభిమాన తారగా వెలుగొందారని తెలుగుతోపాటు కన్నడ,తమిళ, హిందీ భాషల్లో ఎన్నో వైవిధ్య భరితమైన చిత్రాల్లో నటించి అశేష ప్రేక్షకాభిమానాన్ని జెమున పొందారన్నారు. జెమున ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి కళాకారిణిగా అభ్యుదయ భావాలు కలిగిన జెమున సినీ నటిగా కళా సేవకే పరిమితం కాకుండా ఎంపి గా ప్రజాసేవ చేయడం గొప్ప విషయమన్నారు ప్రేక్షకుల హృదయాల్లో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న జమున ఆత్మకు శాంతి కలగాలని గడిపె మల్లేశ్ అన్నారు. సంతాపం తెలిపిన వారిలొ హుస్నాబాద్ ప్రాంత కళాకారులు వరుకొలు కళా చందర్, నన్నే అజయ్ కుమార్, పిట్టల తిరుపతి, గజ్జేల కనకయ్య, కునుసోత్ భద్రు నాయక్, తిప్తర్తి శ్రీనివాస్, జాల ఆగయ్య, ఖాత ఏలీష్, కర్కాల శంకర్, కె.యస్ చారి,నారోజు చంద్రమౌళి,
వలువోజు జగదీశ్వరా చారి,దుడ్డేల సమ్మయ్య, గుగులొతు స్వామి నాయక్, బత్తుల బాబు,
చెంచెల తిరుపతి, చింతకింది కుమార్, తదితరులు సంతాపం తెలిపారు.
















