38.2 C
Hyderabad
Friday, April 24, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 114

రేగుపండు ఆరోగ్యానికి చాలా మంచిది

రేగుపండు ఆరోగ్యానికి చాలా మంచిది

యదార్థవాది

రేగుపండు రుచికే కాదు, అందం.. ఆరోగ్యాన్ని అందించడంలోనూ ముందుంటుంది. శరీరానికి కావాల్సిన పోషకాలు ఈ పండులో పుష్కలంగా ఉంటాయి. రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయులను పెంచి హృద్రోగాలను దరికి చేరనివ్వకుండా ఇది కాపాడుతుంది. మెనోపాజ్‌లోకి అడుగుపెట్టేటప్పుడు డి విటమిన్‌ తగ్గి ఎదురయ్యే కండరాల సమస్యలకు రేగుపండుతో చెక్‌ పెట్టొచ్చు. నెలసరిలో అధికస్రావాన్ని ఈ పండు తీసుకోవడం ద్వారా తగ్గించొచ్చు. రక్తహీనత సమస్యనూ దూరం చేస్తుంది. ఆర్థరైటిస్‌ ఉన్నవారు ఈ పండ్లను తీసుకొంటే, వీటిలోని కాల్షియం ఫాస్పరస్‌ ఎముకలను దృఢంగా ఉంచి సమస్యకు దూరంగా ఉంచుతాయి. కీళ్లకు సంబంధించిన పలురకాల అనారోగ్యాలకు ఈ పండు ఔషధంలా పనిచేస్తుంది. గర్భిణిలకెదురయ్యే వికారం, వాంతులు వంటి సమస్యలకు ఇది ఉపశమనాన్నిస్తుంది. సంకరజాతి రేగిపళ్ళు కాకుండా స్వదేశీ రకంలో ఈ అద్భుతమైన గుణాలు అన్నీ లభిస్తాయి.

మేమే దొరికామా అంటూ చిందులు

మేమే దొరికామా అంటూ చిందులు

యదార్థవాది ప్రతినిది ప్రకాశం 

ప్రకాశం జిల్లా గిద్దలూరు రైల్వేస్టేషన్లో అక్రమంగా తరలిస్తున్న వెదురు బొంగులను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ అధికారులపై మహిళా విశ్వరూపం కూలినాలి చేసుకునేటోల్లము మేమే దొరికామా అంటూ ఫారెస్ట్ అధికారిపై చిందులు వేసింది

పిల్లలపై ఒత్తిడి చేయొద్దు. పరీక్ష పై చర్చలో ప్రధాని మోదీ..

పిల్లలపై ఒత్తిడి చేయొద్దు. పరీక్ష పే చర్చలో ప్రధాని మోదీ..

పిల్లలపై ఒత్తిడి చేయొద్దు. పరీక్ష పై చర్చలో ప్రధాని మోదీ..

యదార్థవాది ప్రతినిధి ఢిల్లీ:

‘పరీక్ష పై చర్చ’ తనకు కూడా పరీక్ష అని, దేశంలోని కోట్లాదిమందివిద్యార్థులు తనపరీక్షకు హాజరవుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అన్నారు.’పరీక్ష పే చర్చ’ నాకు పరీక్ష..దేశంలోని కోట్లాది మంది విద్యార్థులు నా పరీక్షకు హాజరవుతున్నారు.. ఈ పరీక్షను ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది’ అని ఢిల్లీ నుంచి ‘పరీక్ష పే చర్చ’ 6వ ఎడిషన్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సంభాషిస్తూ ప్రధాని మోదీ అన్నారు..తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి ఆశించడం సహజమేనని.. అది కేవలం సోషల్ స్టేషస్ కాపాడుకోవడం కోసమే అయితే అది ప్రమాదకరమని మోదీ అన్నారు. సామాజిక ఒత్తిడి కారణంగా తమ పిల్లలను బాగా చదవాలంటూ ఒత్తిడి చేస్తే అది సమస్యగా మారుతుందన్నారు. తాము రాజకీయాల్లో ఉన్నామని.. ఇక్కడ విజయం కోసం భారీ ఒత్తిడి ఏర్పడుతుందన్నారు. మీరు సామర్థ్యంతో అంచనాలను సరిపోల్చాలని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రధాని మోడీ సూచించారు. పిల్లలు ఆందోళన చెందవద్దని, పరీక్షల రోజుల్లో ఒత్తిడికి గురికాకుండా, ఉల్లాసంగా ఉండడంతో పాటు ఉత్తమమైన వాటిని వారికి అందించడానికి కృషి చేయాలని ఆయన కోరారు..

ఢిల్లీకి సీఎం జగన్.?

ఢిల్లీకి సీఎం జగన్.?

యదార్థవాది ప్రతినిధి అమరావతి

శుక్రవారం సీఎం జగన్ హస్తినకు వెళ్లే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఢిల్లీలో అపాయింట్మెంట్స్‌ను బట్టి ఆయన పర్యటన ఉండే అవకాశం ఉందని తాడేపల్లి వర్గాలుచెబుతున్నాయి.. ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసుల నేపథ్యంలో సీఎం పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజానికి షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30న జగన్ ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. తాజా పరిణామాలతో ముందుగానే ఢిల్లీకి వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో జగన్ నేడు జరగాల్సిన హైదరాబాద్, గుంటూరు జిల్లా పొన్నూరు పర్యటనను రద్దు చేసుకున్నారు..

మాజీ ఎంపీ జమున మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన: కెసిఆర్

మాజీ ఎంపీ జమున మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన: కెసిఆర్

యదార్థవాది ప్రతినిది హైదరాబాద్

ప్రముఖ సినీ నటి, ఫిలింఫేర్ అవార్డు గ్రహీత, మాజీ ఎంపీ జమున మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని, తొలితరం నటిగా వందలాది చిత్రాల్లో నటించి, తెలుగువారి అభిమాన తారగా వెలుగొందిన జమున జ్జాపకాలను సిఎం కేసీఆర్ స్మరించుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడం లోనే కాకుండా హిందీ సినిమాలలోనూ నటించి ప్రేక్షకుల అభిమానాన్నిపొందిన జమున గారు, నటిగా కళాసేవనే కాకుండా పార్లమెంటు సభ్యురాలిగా ప్రజాసేవ చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా జమున కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

పెళ్లి బృందంపైకి టిప్పర్..

పెళ్లి బృందం కారును ఢీకొన్న టిప్పర్..

యదార్థవాది ప్రతినిది పల్నాడు

పల్నాడు జిల్లాలో‌‌ ఘోర రోడ్డు ప్రమాదం పెళ్లి బృందం కారు‌ను ఢీకొన్న టిప్పర్ వెల్దుర్తి మండలం ఉప్పలపాడు గ్రామం సమీపంలో కారును ఢీకొన్న టిప్పర్ ఇద్దరు మృతి, మృతులలో‌ కారుడ్రైవర్, ఒక మహిళా, ఇద్దరు చిన్నారులు కారులో ప్రయాణిస్తున్న పది మంది, ఆరుగురికి గాయలు వారిని మాచర్ల ప్రభుత్వ హాస్పటల్ కు తరలింపు తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వం హాస్పటల్ తరలింపు..

వార్డు ప్రజలందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

వార్డు ప్రజలందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కంటి సమస్యలు తొలగించాలని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం సిద్దిపేట మున్సిపల్ పరిధిలో 8వ వార్డు కౌన్సిలర్ వారాల కవిత సురేష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ అందత్వ రహిత తెలంగాణ ద్యేయoగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు ఇట్టి కార్యక్రమాన్ని మన గల్లీలో నిర్వహించడం శుభదాయకమని ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని ఇట్టి అవకాశాన్ని 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు ప్రజలు పాల్గొన్నారు..

 

జమున మృతిపట్ల ప్రముఖుల సంతాపం

జమున మృతిపట్ల ప్రముఖుల సంతాపం

యదార్థవాది ప్రతినిది హైదరాబాద్

సీనియర్ నటి జమున మృతిపట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. సత్య భామగా అందరి హృదయాల్లో పదిలమైన సీనియర్ నటీమణి, రాజకీయ నాయకురాలు శ్రీమతి జమున(86) మృతి పట్ల రాష్ట్ర మంత్రులు, రాజకీయ, సిని పరిశ్రమ సంతాపం తెలియజేశారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించి, తనదైన ముద్ర వేసుకుని, సినీ అభిమానులను మెప్పించిన నటిగా ఆమె తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిచారని, 1980లో రాజమండ్రి నుంచి కాంగ్రెస్ ఎంపీగా పనిచేసి విలక్షణమైన వ్యక్తిగా, రాజకీయ నేతగా ప్రజాభిమానం పొందారని, సీనియర్ నటులు వరుసగా చనిపోతుండడం సినీ పరిశ్రమకు తీరని లోటుగా అభివర్ణించిన వ్యక్తిఅని, స్వర్గీయ జమున కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తు ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్థించారు..

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలపై: సిఎం కేసిఆర్

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలపై బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

యదార్థవాది ప్రతినిది హైదరాబాద్

ప్రగతి భవన్ లో సిఎం కేసిఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 29 ఆదివారం 1 గంటకు జరుగనుంది..పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్లమెంటులో చర్చించ బోయే అంశాలపై, బిఆర్ఎస్ అనుసరించ వలసిన వ్యూహం పై, పార్టి అధినేత, సిఎం కేసీఆర్ ఎంపీల కు దిశా నిర్దేశం చేయనున్నారు.

టైర్ పేలి టాటా ఏ సి వాహనం బోల్తా..

..

టైర్ పేలి టాటా ఏ సి వాహనం బోల్తా..

యదార్థవాది ప్రతినిది బాపట్ల

బాపట్ల జిల్లాలో నేషనల్ హైవే నెంబర్ 16 పై ఘోర రోడ్డులో జాగర్లమూడి ప్రమాదం జరిగింది..ఓక మహిళ అక్కడి కక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది..25 మంది వ్యవసాయ కూలీలను తీసుకు వెళ్తున్న టాటా ఏ సి వాహనం టైర్ పేలి బోల్తా పడింది. అందులో ఒకరు మృతి చెందినట్లు, ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు.. కూలీలు అంతా జాగర్లమూడి వారి పాలెం వాసులు అని తెలుస్తోంది.108 అంబులెన్స్ ల్లో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు…

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...