38.2 C
Hyderabad
Friday, April 24, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 115

జిల్లా కొత్త పోలీస్ బాస్ గా బాధ్యతలు స్వీకరించిన: అఖిల్ మహాజన్

జిల్లా కొత్త పోలీస్ బాస్ గా బాధ్యతలు స్వీకరించిన: అఖిల్ మహాజన్

యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల

తెలంగణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన సూపర్ డెంట్ ఆఫ్ పోలీస్ అఖిల్ మహాజన్ గురువారం ప్రస్తుత ఎస్పీ రాహుల్ హెగ్డే నుండి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎస్పీగా రాహుల్ హెగ్డే హైదరాబాద్ ట్రాఫిక్-1డిసిపి గా బదిలీ అయారు.. బాధ్యతలు స్వీకరించిన అఖిల్ మహాజన్ ను అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు, సి.ఐ లు, ఎస్ ఐ లు, పోలీస్ అధికారులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు..

22 భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు

22 భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు

ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులను

యదార్థవాది ప్రతినిది న్యుడిల్లి

సుప్రీంకోర్టు ఇకనుండి ప్రాంతీయ భాషల్లో తీర్పులు వెలువర్చన ఉంది రాజ్యాంగంలో ఉన్న 22 భాషల్లో ఎలక్ట్రానిక్స్ సుప్రీంకోర్టు రిపోర్ట్స్ (E-SCR) ప్రాజెక్టులో భాగంగా 22 భాషల్లోనూ తీర్పులను అందుబాటులో ఉంచనుంది ఈ ప్రాజెక్టు ద్వారా 34,000 తీర్పులు పొందవచ్చు. వీటిలో 1,268 తీర్పులు సుప్రీంకోర్టు వెబ్ సైట్, యాప్ లో ప్రాంతీయ భాషల్లో నేటి నుండి అందుబాటులోకి వస్తాయి.

గణతంత్ర దినోత్సవ ప్రశంసా పత్రాలు అందచేసిన: జిల్లా ఎస్.పి

గణతంత్ర దినోత్సవ ప్రశంసా పత్రాలు అందచేసిన: జిల్లా ఎస్.పి

యదార్థవాది ప్రతినిది మెదక్

74 గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని మెదక్ జిల్లా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని, అదనపు ఎస్.పి డా. బి.బాలస్వామి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ డి.ఎస్.పి. సైదులు, ఏ.ఆర్ డి.ఎస్.పి. శ్రీనివాస్, ఆర్.ఐ అచ్యుత రావ్, ఎస్.బి.సి.ఐ.నవీన్ బాబు, డి.సి.ఆర్.బి. సి.ఐ. శ్రీ. దిలీప్ కుమార్, సి.ఐ.శ్రీ.శ్రీధర్, సి.సి.ఎస్. సి.ఐ. శ్రీ.గోపినాథ్, ఐ.టి. కోరే ఎస్.ఐ. రాజు గౌడ్, డి.పి.ఓ సిబ్బంది పాల్గొన్నారు.

అవినీతి నిర్ములనే సీసీర్ ప్రథమ లక్ష్యం…

అవినీతి నిర్ములనే సీసీర్ ప్రథమ లక్ష్యం…

సిద్దిపేట జిల్లా నూతన కార్యాలయం ప్రారంభం

యదార్థవాది ప్రతినిది సిద్దిపేట

అవినీతి నిర్మూలనే సీసీర్ సంస్థ ప్రథమ లక్ష్యమని కౌన్సిల్ ఫర్ సిటీజేన్ రైట్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంచకట్ల అనిల్ కుమార్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీసీర్ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యాలయం వద్ద ఘనంగా జాతీయ జెండానూ ఆవిష్కరించారు. అనంతరం సంస్థ కార్యాలయాన్ని కో ఫౌండర్స్ మారుతి, ప్రశాంత్, సీసీర్ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ ప్రభు, సెంట్రల్ కమిటీ మెంబర్స్ శ్రీనివాస్,స్టేట్ మీడియా కోఆర్డినేటర్ సాజిద్. స్టేట్ జైంట్ సెక్రెటరీ & జిల్లా అధ్యక్షుడు గుండ్ల శివ చంద్రంతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో జవాబుదారీతనాన్ని పెంచేలా సీసీర్ పనిచేస్తుందని అన్నారు.అవినీతి రవిత ప్రజస్వామ్యాన్ని నిర్మించడం ప్రతి ఒక్క పౌరుని బాధ్యత అని గుర్తు చేశారు. రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులపై అవగాహన ఉండలని ప్రశ్నించడం అలవాటుగా మారినప్పుడే సామాన్యుల జీవితాలు బాగుపడతాయన్నారు. ఇప్పటివరకు సంస్థ ఆధ్వర్యంలో అనేక విజయాలు సాధించామని తెలిపారు.ఆర్ టి ఐ చట్టాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం నూతన సభ్యులకు డి ఐడీ కార్డులు, నియామక పత్రాలను అందేశారు. సిద్దిపేట సీసీర్ సంస్థ సభ్యులు నిర్వహించిన అనేక కార్యమాలపై ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీసీర్ సిద్దిపేట జిల్లా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మన రాజ్యాంగాన్ని గౌరవిద్దాం

మన రాజ్యాంగాన్ని గౌరవిద్దాం

శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

యదార్థవాది ప్రతినిధి శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కార్యదర్శి బి.కుమార్ రాజు జాతీయ పతాకావిష్కరణ చేసి ఆయన మాట్లాడుతూ దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజుని గణతంత్ర దేశంగా ప్రకటించుకుని జరుపుకునే “జాతీయ పండుగ”. భారతదేశంలో గణతంత్ర దినోత్సవం రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 రోజున గౌరవంగా జరుపు కుంటారు. స్వేచ్ఛ సమానత్వం న్యాయం సౌబ్రతత్వం అందించిన మన రాజ్యాంగాన్ని మనమందరం కాపాడుకుందాం గౌరవిద్దాం అన్నారు ఈ కార్యక్రమంలో శంకరరావు రమణ మూర్తి, చిరంజీవులు, యోగానంద్, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

భారత రాజ్యాంగం ఏర్పాటే 26 జనవరి

భారత రాజ్యాంగం ఏర్పాటే 26 జనవరి

యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్

హుస్నాబాద్ పట్టణంలోని మంజులక్క యువసేన కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో పాల్గొని జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి.. యువసేన కార్యాలయం నుండి అక్కన్నపేట చౌరస్తా వరకు ర్యాలీ గా వెళ్లి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ర్ అంబేద్కర్ పూలమాల వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ దేశాలల్లో భారత రాజ్యాంగం చాలా గొప్పదని, ప్రతి ఒక్కరు రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా, మన దేశ ప్రజలందరూ ఆత్మ గౌరవంతో, సమానత్వంతో జీవిస్తూ, దేశ ఉన్నతకి పాటుపడుతూ, ప్రజాస్వామ్యం పరిరక్షణ కూ ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమం లో మహిళాలు, యువకులు,యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు..

ఎందరో త్యాగదనుల ఫలితమే గణతంత్ర దినోత్సవం

ఎందరో త్యాగదనుల ఫలితమే గణతంత్ర దినోత్సవం


యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

74 వ భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా గురువారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ ఎన్ శ్వేత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా ప్రజలకు కార్యాలయ అధికారులకు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు పోలీస్ అధికారులు సిబ్బంది. ప్రజలతో మమేకమై విధులు నిర్వహించినప్పుడే ప్రజల ఆదరభిమానాలు మనపై ఉంటాయని. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి దిశా నిర్దేశం చేశారు, రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు విధులు నిర్వహిస్తున్నారు. ఎందరో త్యాగధనుల ఫలితం గణతంత్ర దినోత్సవం వారిని ఎప్పుడూ మనం స్మరిస్తూ ఉండాలి, వారి త్యాగఫలం ద్వారా మనం ఈరోజు స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నామని తెలిపారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను గౌరవిస్తూ నీతి నిజాయితీతో పారదర్శకతతో ధనిక పేద తేడా తారతమ్యాలు లేకుండా విధులు నిర్వహిస్తూ ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించినప్పుడే జన్మకు సార్థకత ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ మహేందర్, ఏఆర్ అడిషనల్ డిసిపిలు రామ్ చందర్ రావు, సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసిపి దేవారెడ్డి, ట్రాఫిక్ ఏసిపి ఫణిందర్, సిసిఆర్బి ఏసిపి చంద్రశేఖర్, ఏఓ యాదమ్మ, ఎస్బి ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్ రెడ్డి, ధరణి కుమార్, రాజశేఖరరెడ్డి, రామకృష్ణ, సూపరిండెంట్ జమాల్ అలీ. మరియు పోలీస్ అధికారులు పోలీస్ కమిషనర్ కార్యాలయ సిబ్బంది సిఎఆర్ హెడ్ క్వార్టర్ సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు

పద్మ అవార్డుల గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపిన..రేవంత్

పద్మ అవార్డుల గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపిన..రేవంత్

యదార్థవాది ప్రతినిది హైదరాబాద్

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పద్మ భూషణ్, పద్మ విభూషన్, పద్మ శ్రీ అవార్డులు పొందిన ప్రముఖులకు టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రం ప్రకటించిన మొత్తం 106 పద్మ అవార్డులలో తెలుగు వారికి 12 పద్మ అవార్డులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పద్మ అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు..

ప్రగతి భవన్ లో జాతీయ పతాకావిష్కరణ

ప్రగతి భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలు


యదార్థవాది ప్రతినిధి హైదరాబాద్

74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం ప్రగతి భవన్ లో జాతీయ పతావిష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి సీఎం పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్ రావు, శంభీపూర్ రాజు, మధుసూధనా చారి, సీఎస్ శాంత కుమారి, డీజీపీ అంజనీ కుమార్, సీఎంఓ ఉన్నతాధికారులు, సిబ్బంది, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

హరీష్ రావు కృషితో ఖమ్మం సభ సక్సెస్

హరీశ్ రావు అవిశ్రాంత కృషితోనే ఖమ్మం సభ సక్సెస్. నామ నాగేశ్వరరావు

యదార్థవాది ప్రతినిధి హైదరాబాద్
అందరి సమన్వయం, సహకారంతో చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మహాద్భుతంగా అందర్నీ అబ్బురపర్చేలా ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను అత్యంత ఘనంగా నిర్వహించిన రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్ రావును బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు అభినందించారు. పార్లమెంటరీ స్థాయి సంఘం అధ్యయన పర్యటన ముగించుకుని, బుధవారం హైదరాబాద్ చేరుకున్న ఎంపీ నామ వెంటనే వెళ్ళి హరీశ్ రావును కలసి, పుష్పగుచ్చం అందజేసి, ప్రత్యేకించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ నామ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలతో హరీశ్ రావు ఖమ్మం చేరుకుని ఉమ్మడి జిల్లా ప్రజల మధ్యలోనే ఉంటూ నభ ఏర్పాట్లు చూస్తూనే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పర్యటించి, నాయకులందర్నీ ఏక తాటి పైకి తీసుకొచ్చి, జన సమీకరణ చేయించి, ఊహించిన దానికంటే మిన్నగా సభను సక్సెస్ చేయించిన ఘనత హరీశ్ రావుకే దక్కుతుందని నామ అన్నారు. రేయింబవళ్లు నాయకులందరితో మాట్లాడుతూ సభ గురించి, వారిలో ఉత్సాహం, చైతన్యం నింపి, ప్రధాన భూమిక వహించారని నామ కొనియాడారు ఆయన చేసిన కృషి, పట్టుదల, శ్రమ ఫలితంగానే యావత్ దేశం అబ్బురపడేలా సభ సక్సెస్ చేసుకోగలిగామని నామ అన్నారు

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...