37.2 C
Hyderabad
Friday, April 24, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 116

యువకుల్ని సేవ్ చేసిన బీచ్ లైఫ్ గార్డులు

కెరటాల్లో చిక్కుకుని యువకుడ్ని సేవ్ చేసిన బ్లూఫ్లాగ్‌ బీచ్‌ లైఫ్‌ గార్డులు
యదార్థవాది ప్రతినిధి విశాఖపట్నం
విశాఖపట్నం రుషికొండ బీచ్‌ వద్ద సముద్రం లో మునిగిపోబోతున్న ఓ యువకుడిని టూరిజం బ్లూఫ్లాగ్‌ బీచ్‌ లైఫ్‌ గార్డులు రక్షించారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెంది న ఎనిమిది మంది విహార యాత్రలో భాగంగా తీరానికి వచ్చారు. వీరంతా స్నానాలు చేస్తుండగా అమిత్‌ అనే యువకుడు కెరటాల్లో చిక్కుకుని కేకలు వేస్తున్న విషయాన్ని లైఫ్‌గార్డులు ఎస్‌.నూకరాజు, శ్రీనివాస్‌ గుర్తించారు. సకాలంలో ఒడ్డుకు చేర్చి ప్రాథమిక చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. తర్వాత వారికి కౌన్సిలింగ్‌ నిర్వహించి పంపివేశారు. యువకుడి ప్రాణాలు కాపాడిన గార్డులను టూరిజం అధికారులు, పోలీసులు, పర్యాటకులు అభినందించారు.

రాష్ట్రపతి పోలీస్ పథకాలకు 901 మంది ఎంపిక

విశిష్ట సేవలకు రాష్ట్రపతి పథకాలు బహుకరణ
యదార్థవాది ప్రతినిధి ఢిల్లీ
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా 901 మంది పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పతకాలు ప్రకటించింది. 140 మందికి పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ (PMG), 93 మందికి విశిష్ట సేవకు రాష్ట్రపతి పోలీస్‌ మెడల్ (PPM) తో పాటు 668 మందికి పోలీస్‌ మెడల్ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌ పతకాలకు ఎంపికయ్యారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. తెలంగాణ నుంచి 13 మందికి పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ పతకం, ఇద్దరికి రాష్ట్రపతి పోలీసు పతకాలకు ఎంపికయ్యారు. ఇందులో ఇంటిలిజెన్స్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ అనిల్‌కుమార్, 12వ బెటాలియన్‌ అడిషనల్‌ కమాండెంట్‌ రామకృష్ణ రాష్ట్రపతి మెడల్‌కు ఎంపికయ్యారు.

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

దేశ, రాష్ట్ర ప్రజలకు 74వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

యదార్థవాది ప్రతినిధి హైదరాబాద్

సమానత్వంతో కూడిన సమర్థవంతమైన ప్రజాస్వామిక పాలన ద్వారానే దేశ రాజ్యాంగం ఆశించిన లక్ష్యం పరిపూర్ణంగా సిద్ధిస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 74వ గణతంత్ర దినోత్సవాన్ని (జనవరి 26) పురస్కరించుకొని సీఎం కేసీఆర్ రాష్ట్ర, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక దేశంగా భారతదేశంలో రాజ్యాంగబద్ధ పాలనకు అంకురార్పణ జరిగిన 26 జనవరి రోజు భారత పౌరులందరికీ పండుగ రోజని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన మహోన్నత రాజ్యాంగాన్ని రూపొందించిన భారత రాజ్యాంగ నిర్మాతల కృషిని ఈ దేశ ప్రజలు సదా స్మరించుకుంటారని సీఎం తెలిపారు. గుల్ దస్తా మాదిరి విభిన్న సామాజిక సంస్కృతులు సాంప్రదాయాలు భాషలు ఆచారాలతో భిన్నత్వంలో ఏకత్వాన్ని పొదిగివుండడమే భారత దేశ ప్రధాన లక్షణమన్నారు. రాష్ట్రాల సమాఖ్యగా వర్థిల్లుతున్న భారత దేశంలో ఫెడరల్ స్ఫూర్తి పరిఢవిల్లుతూ, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం మూలస్తంభాలుగా పాలన సాగినప్పుడు మాత్రమే దేశంలో సంక్షేమం పరిఢవిల్లి, దేశం మరింతగా ప్రగతి పథంలో పయనిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంటూ మనకు మనం సగర్వంగా సమర్పించుకున్న పవిత్ర రాజ్యాంగాన్ని ప్రతీ పౌరుడు క్షుణ్ణంగా అవగాహన చేసుకొని, ఆశయాలను సాధించేందుకు మరింతగా కృషి చేయాలని సీఎం కేసీఆర్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

గణతంత్ర పర్వం భారత జాతికి గర్వం

గణతంత్ర పండుగ ఆనందాల వెల్లువ అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

భారతజాతి అస్తిత్వం, గణతంత్ర దినోత్సవ జంఢా పండుగను పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ గ్యాలరీ సిద్దిపేట లో బుధవారం ఇండియన్ యూనిటీ, గణతంత్ర దినోత్సవ చిత్రాలను ప్రఖ్యాత అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించి. ఆయన మాట్లాడుతూ ‘భారత దేశ, గణతంత్ర పర్వం’ భారత జాతికి గర్వం’ ఆనందాలే సర్వం. భారత జాతి దాస్య శృంఖలాలను  ఎందరో త్యాగదనుల పుణ్యఫలం మనం అనుభవించే భారత స్వాతంత్య్రం. కల్పించిన లౌకిక భారత రాజ్యాంగం, ప్రతి పౌరుడు కాపాడుకోవాల్సిన అస్తిత్వ భాధ్యత. బీ ఆర్ అంబేడ్కర్ రచించిన భారతదేశ రాజ్యాంగం, మానవజాతి కే గర్వకారణం ప్రపంచానికి మార్గదర్శనం. మానవీయ పరిరక్షణ మహా రక్షణకవచం మన రాజ్యాంగం. అందరికి శాంతి భద్రతలు సుఖ సంతోషాలు సహజీవనం సౌభాతృత్వం ఆచరణలో సఫలీకృతం కావాలని, ఇంకా స్వతంత్ర ఫలాలు అందని అభాగ్యులకు హక్కులు అందాలని, మత విద్వేషాలను, నిరుద్యోగాన్ని అధిగమించి అందరూ ఆనందంగా వుండాలని, అంబరం చుంబినా మువ్వన్నెల జెండా సంబురం భారతజాతి గుండెల్లోపదిలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మానవతా చిత్రకారులు రుస్తుం అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం నైరూప్య చిత్రకారుడు నహీంరుస్తుం,ఎండి రహీం, గ్రైట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రుబీనారుస్తుం, మహ్మద్ సాధిక్, అబ్దుల్ ముస్తఫా, తదితరులు పాల్గొన్నారు.

యువగళం పాదయాత్రకు: నారా లోకేష్

“యువగళం” పాదయాత్రకు బయలుదేరిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

యదార్థవాది ప్రతినిది మెదక్

యువగళం పేరుతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టబోయే పాదయాత్ర విజయవంతం అవుతుందని తెలంగాణ తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏకే .రమేష్ చందర్ రావ్, రాష్ట్ర అధికార ప్రతినిధి కిరణ్ లు ధీమా వ్యక్తంచేశారు. బుధవారం హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్ద కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ఈ నెల 27 నుంచి నారా లోకేష్ పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. 403 రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుందన్నారు.కడప దర్గా లో ప్రార్థనలు చేసి, తిరుపతి లో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కుప్పం నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారని వారు తెలిపారు. ఆంద్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి ఆంధ్రలో అధికారంలో వచ్చేలా నారా లోకేష్ పాదయాత్ర సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు..

భారత దేశ భవిష్యత్తు ఓటరు చేతిలో వుంది

భారత దేశ భవిష్యత్తు ఓటరు చేతిలో వుంది

ప్రతి భారతీయ పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు సద్వినియోగం చేసుకున్నప్పుడే ఓటుకు విలువ: ప్రిన్సిపల్ గణపతి

మెదక్ జిల్లా: జనవరి 25

మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని బుదవారం ప్రిన్సిపల్ గణపతి ఓటర్స్ డే కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతు ప్రజాస్వామ్య పద్ధతిలో స్వేచ్ఛ వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే హక్కు ప్రతి భరతీయ పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు హక్కు అని ప్రిన్సిపల్ అన్నారు, నిర్భయంగా తప్పకుండా ఓటు హక్కును, వినియోగించుకుంటానని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు, ఈ కార్యక్రమంలో లెక్చరర్లు దినకర్, సరిత రాణి, సమీరా, ఎన్ సి సి అధికారులు సుధాకర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు విశ్వనాథం, రాజా గౌడ్, అన్నపూర్ణ , విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

కూరగాయలతో భారత దేశ చిత్రం

కూరగాయలతో 11అడుగుల భారతదేశ భారీ చిత్ర పటాన్ని చిత్రించిన రామకోటి రామరాజు

యదార్థవాది ప్రతినిధి గజ్వేల్

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన కళారత్న రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీత రామకోటి రామరాజు వివిధ రకాల కూరగాయలను ఉపయోగించి వినూతనగా భారతదేశ చిత్ర పటాన్ని అద్భుతంగా చిత్రించి బుధవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3రోజులు శ్రమించి తయారు చేశానని 11అడుగుల పొడుగుతో 8అడుగుల వెడల్పుతో చిత్రించానని తెలిపారు. గత సంవత్సరం న్యానాలతో బియ్యంతోను చిత్రించానన్నారు. ఇలా ఎన్నో రకాలుగా చిత్రాలను చిత్రించి దేశభక్తిని చాటుకున్నాడు రామకోటి రామరాజు ను ప్రతి ఒక్కరు అభినందించారు.

దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది

దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది

యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల

జాతీయ ఓటర్ల దినోత్సవం సిరిసిల్ల పట్టణంలోని నర్సింగ్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భారతీయ ఎన్నికల సంఘం ప్రత్యేకంగా సిద్ధం చేసిన వీడియోను విద్యార్థిని లతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ ప్రతిజ్ఞ చేశారు.. దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంటుందని, దీనిని అందరు గుర్తుంచుకొని ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు హక్కు సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్.. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటు చేసుకొని, ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహింస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇటీవలే ఓటరు జాబితా సవరణ పూర్తి చేసి , 18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఓటు హక్కు కల్పించనున్నట్లు తెలియచేశారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రూపోందించిన పాట మనమంతా చుసామని, భారత దేశ భవిష్యత్తు ఖచ్చితంగా ఓటరు చేతిలో ఉంటుందని, ఎన్నికల సమయంలో సక్రమంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు. ఓటరుగా మనమంతా బాధ్యతగా వ్యవహరించాలని, ఓటు హక్కు వినియోగించుకోవటంలో గర్వపడాలని , సినియర్ ఓటర్లు ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కు వేస్తూ మనకు ఆదర్శంగా ఉన్నారని, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే స్లోగన్ తో 2011 నుండి జాతీయ ఓటర్ దినోత్సవాన్ని జరుపు కుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ బి గంగయ్య , ఎలక్షన్ డి.టి. రెహమాన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు..

రాష్ట్ర సర్కార్ కు భారీ షాక్

గణతంత్ర దినోత్సవ వేడుకలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

యదార్థవాది ప్రతినిది హైదరాబాద్

కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలని హైకోర్టు స్పష్టం చేసింది. రిపబ్లిక్‌ డే వేళ పరేడ్‌ నిర్వహించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఉన్నందున గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపడం లేదన్న వాదనలు విన్న న్యాయస్థానం.. ప్రభుత్వం చెబుతున్నట్లు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉన్నట్లయితే.. కొవిడ్‌ ఆంక్షలు ఎక్కడున్నాయో చెప్పాలని ప్రశ్నించింది. కాబట్టి వీటన్నింటిని తాము పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. గణతంత్ర దినోత్సవం అనేది చాలా ముఖ్యమైన జాతీయ పండగ అని.. దేశభక్తిని చాటిచెప్పే పండగ అని వ్యాఖ్యానించింది. ఈ వేడుకలకు ప్రజలను అనుమతించాలని సూచించింది.

మున్సిపల్ ఛైర్ పర్సన్: రాజీనామా

బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఇబ్బదులు భరించలేకే ఛైర్ పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్ పదవికి రాజీనామా

యదార్థవాది ప్రతినిది జగిత్యాల

జగిత్యాల జిల్లా పట్టణ మున్సిపాల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్ అనూహ్యంగా బుదవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బుదవారం ఎమ్మెల్యే వర్గం కౌన్సిలర్లనే అవిశ్వాసం పెడతామని బెదిరిస్తున్నారని. ఈ మేరకు ఎమ్మెల్యేకు 23 మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన లేఖను ఇచ్చారు.. త్వరలో శాసనసభ ఎన్నికలు రాబౌతున్న తరుణంలో ఈ అవిశ్వాసాలు వద్దని అధిష్టానం వారిందాని, ఇదంతా టీ కప్పులో తూఫానులా సమసిపోయిందని అనుకున్నారు. కానీ అందరినీ ఆశ్చర్య పరుస్తూ, బోగ శ్రావణి రాజీనామా చేస్తున్నట్లు పత్రికా సమావేశంలో ప్రకటించారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...