37.2 C
Hyderabad
Friday, April 24, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 117

ప్రజల రక్షణ ముక్యం: జిల్లా ఎస్.పి పి.రోహిణి

ప్రజల రక్షణ ముక్యం: జిల్లా ఎస్.పి పి.రోహిణి

పాపన్నపేట పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని..

పాపన్నపేట్ పోలీస్ స్టేషన్ బుదవారం తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను సబ్ ఇన్స్పెక్టర్ ఎస్పీ వివరించారు. ఎస్పీ పి.రోహిణి అక్కడి అధికారులకు పలు సూచనలు చేస్తూ ప్రతిరోజు పోలీస్ స్టేషను పరిశుభ్రంగా ఉంచాలని, పోలీస్ స్టేషన్ లోని వర్టికల్స్ నిర్వహణ, HRMS. ఆన్ లైన్ వినియోగించు విధానము, TS COPs ఆన్లైన్లో కేసుల వివరాలు నమోదు చేయలని, స్టేషన్కు వచ్చే ప్రతి పిటిషన్ ను ఆన్లైన్లో నమోదు చేయాలని, సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. బ్లూ కోట్స్, పెట్రో కార్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, డయల్100 కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఏర్పాటు చేయాలని, ప్రతిరోజు వారిని తనిఖీ, పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితుల నుండి వచ్చే ఫిర్యాదులు పెండింగ్లో ఉంచరాదని, వాహనాల సంబందించిన ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ కలిగి ఉండాలి, ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా తమ గమ్యాన్ని చేరాలని వాహనదారులకు అవగాహనా కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సి.ఐ. శ్రీ.విజయ్, పాపన్నపేట్ ఎస్.ఐ.శ్రీ.విజయ్ నారాయణ్ సిబ్బంది పాల్గొన్నారు

వైకాపా ఎంపీకి మళ్లీ సీబీఐ నోటీసులు..

వైకాపా ఎంపీకి మళ్లీ సీబీఐ నోటీసులు..

యదార్థవాది ప్రతినిది కడప 

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. అవినాష్‌రెడ్డికి మూడు రోజుల క్రితమే మొదటిసారి సీబీఐ నోటీసులు అందజేసింది. మంగళవారం (24వ తేదీ) విచారణకు రావాలని ఆదేశించింది. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటం వల్ల ఆరోజు తాను రాలేననని చెప్పారు. ‘నిన్న నోటీసులు ఇచ్చి.. నేడు విచారణకు రమ్మంటే ఎలా?’ అని మంగళవారం ఆయన వ్యాఖ్యానించారు. విచారణకు హాజరయ్యేందుకు ఐదు రోజుల సమయం కావాలని అవినాష్‌రెడ్డి కోరారు..ఈ నేపథ్యంలో రెండోసారి సీబీఐ నోటీసులు జారీ చేస్తూ 28న విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. దాదాపు రెండున్నరేళ్లుగా కేసును దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు సంస్థ.. ఇప్పటివరకూ ఒక్కసారీ ఆయనను ప్రశ్నించలేదు. కడప నుంచి హైదరాబాద్‌కు కేసు బదిలీ అయిన తర్వాత తాజాగా విచారణ మొదలుపెట్టిన సీబీఐ.. అవినాష్‌కు నోటీసులిచ్చింది.

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన నారా లోకేశ్‌..

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన నారా లోకేశ్‌..

యదార్థవాది ప్రతినిది హైదరాబాద్

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈనెల 27 నుంచి ఏపీలో ‘యువగళం’ పాదయాత్రకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే..ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన నివాళులర్పించారు. తెలంగాణకు చెందిన ముఖ్యనేతలతో కలిసి అక్కడిని చేరుకుని తాత ఎన్టీఆర్‌కు పుష్పాంజలి ఘటించారు. ఎన్టీఆర్‌ ఘాట్‌కు లోకేశ్‌ వెళ్లే సమయంలో పెద్ద ఎత్తున యువత ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఆయన వాహన శ్రేణిని అనుసరిస్తూ ఘాట్‌ వద్దకు చేరుకున్నారు..తొలుత ఇంటి వద్ద లోకేశ్‌ తన తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరి, అత్తమామలు బాలకృష్ణ, వసుంధర కాళ్లకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆయన సతీమణి నారా బ్రహ్మణి హారతిచ్చారు. ఆ తర్వాత లోకేశ్‌ ఎన్టీఆర్‌ ఘాట్‌కు వెళ్లారు. మామ బాలకృష్ణ దగ్గరుండి ఆయనకు కారు ఎక్కించారు. లోకేశ్‌ రాకతో ఎన్టీఆర్‌ ఘాట్‌కు వద్దకు పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలు, నేతలు చేరుకున్నారు. దీంతో అక్కడ కోలాహలం నెలకొంది.

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: తమిళిసై..

యదార్థవాది ప్రతినిధి

హైదరాబాద్: రాజ్‌భవన్‌లోనే గణతంత్ర వేడుకలు నిర్వహించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అసహనం వ్యక్తం చేశారు..పరేడ్‌ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు జరపకపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్‌ పేరుతో వేడుకలు జరపకపోవడం సరికాదన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని తమిళిసై తెలిపారు. రాజ్‌భవన్‌లోనే గవర్నర్‌ జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్నారు. అనంతరం సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి వెళ్లి.. అక్కడ జరిగే గణతంత్ర వేడుకల్లో ఆమె పాల్గొననున్నారు..

మానసికోల్లాసానికి క్రీడలు దోహదం : డీసీపీ

మానసికోల్లాసానికి క్రీడలు దోహదం : డీసీపీ

క్రీడలతో ఉద్యోగుల్లో స్నేహ సంబంధాల మెరుగు పడతాయి..డీసీపీ అఖిల్ మహాజన్

యదార్థవాది ప్రతినిది మంచిర్యాల

మానసికోల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయని మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ అన్నారు.. బెల్లంపల్లి లెవల్ -2 క్రీడా మైదానంలో నిర్వహించిన మంచిర్యాల జోన్ పోలీస్ అధికారుల, సిబ్బంది *మంచిర్యాల ప్రీమియర్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్* ప్రారంభోత్సవానికి డీసీపీ అఖిల్ మహాజన్, బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరయ్యారు.. క్రీడాకారులతో పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. మొదట డీసీపీ-XI టీమ్, ఎమ్మెల్యే -XI టీమ్ లు ఫ్రెండ్లి మ్యాచ్ ఆడడం జరిగింది. అందులో స్కోర్ సమానం అయి టై కాగా సూపర్ ఓవర్ ద్వారా డీసీపీ-XI టీమ్ గెలుపొందడం జరిగింది. డీసీపీ మాట్లాడుతూ బెల్లంపల్లి, బెల్లంపల్లి రూరల్, తాండూర్, లక్షేట్టిపేట, మంచిర్యాల, మంచిర్యాల రూరల్, శ్రీరాంపూర్, చెన్నూర్, చెన్నూర్ రూరల్ సర్కిళ్ల నుండి అధికారులు, కానిస్టేబుల్ పాల్గొన్నారు. పోలీసు అధికారులు, కానిస్టేబుళ్ల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించేందుకు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిత్యం పని ఒత్తిడితో ఉండే పోలీస్ లకు మానసిక ఉల్లాసం కలిగిస్తాయన్నారు. బుధవరం మొదటి మ్యాచ్ తాండూర్ టైగర్స్, మంచిర్యాల మాన్స్టర్స్ టీమ్ మధ్య 12 ఓవర్ ల మ్యాచ్ జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసిపి ఎడ్ల మహేష్, జైపూర్ ఎసిపి నరేందర్, మంచిర్యాల తిరుపతి రెడ్డి, మంచిర్యాల్ జోన్ పరిధిలో పనిచేస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.

ప్రతి గ్రామంలో కంటి వెలుగు

ప్రతి గ్రామంలో కంటి వెలుగు

యదార్థవాది ప్రతినిధి సంగారెడ్డి

కల్హేర్ మండలంలో అలీ ఖాన్ పల్లి గ్రామపంచాయతీలో కంటి వెలుగు ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి భూపాల్ రెడ్డి.. వైద్య సిబ్బంది నిర్వహిస్తున్న కంటి పరీక్ష విధానాన్ని పరిశీలించి, కంటి పరీక్ష చేసుకున్న వారికి అద్దాలను అందించారు.. గ్రామంలో సిసి రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు డాక్టర్ అలీ, ఆత్మ కమిటీ చైర్మన్ రమా రమావత్ రామ్ సింగ్, కృష్ణ పూర్ సర్పంచ్ కృష్ణారెడ్డి టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఓటు హక్కు మన ఆయుధం

ఓటు హక్కు మన ఆయుధం

యదార్థవాది ప్రతినిధి మెదక్

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కు ఆయుధం లాంటిదని ప్రతి ఒక్కరు నైతిక బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు.. 13వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా బుధవారం శ్రీ ఆధ్వర్యంలో ర్యాలీని ప్రారంభించారు.. ర్యాలీలో సుమారు రెండు వేల మంది విద్యార్థిని, విద్యార్థులతో పాటు ఉద్యోగ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని ఓటర్ ఫర్ బెటర్ ఇండియా మై ఓట్ మై ఫ్యూచర్ మైండ్ ఓట్ మై ఫ్యూచర్ నినాదంతో ర్యాలీ రాందాస్ చౌరస్తా నుండి ఐబి అది ది గృహం వరకు సాగింది.. ఈ సందర్భంగా ప్రతిమ సింగ్ మాట్లాడుతూ మీ ఓటే మీ సర్వం మీ భవిష్యత్తు కు నాంది అని, ఏటువంటి ప్రలోభాలకు లొంగక ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలని సూచించారు . కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు ప్రతి ఏడాదికి నాలుగు సార్లు నమోదు కార్యక్రమం చేస్తుందని, 18 ఏళ్లు నిండిన యువతి, యువకులు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించడంతోపాటు 17 సంవత్సరాలు నిండిన యువత కూడా ముందుకు రావాలని అన్నారు. ఫారం 6 ద్వారా ఓటరుగా నమోదు తో పాటు 6బి ద్వారా ఓటర్ గుర్తింపు కార్డు కొరకు ఆధార్ లింక్ చేసుకోవాల్సిందిగా ప్రీతం సింగ్ సూచించారు.. ఈ ర్యాలీలో స్వీట్ నోడల్ అధికారి రాజిరెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సత్యనారాయణ, మైన్స్ సలహా సహాయకులు జయరాజ్, నేటి పార్లర్ శాఖ ఈఈ శ్రీనివాసరావు, డిఎస్పి సైదులు, తాసిల్దార్ శ్రీనివాస్, ఎలక్షన్ సిబ్బంది నరేష్, తదితరులు పాల్గొన్నారు..

ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం

అగ్ని ప్రమాద నివారణ పై సమీక్ష సమావేశం
యదార్థవాది ప్రతినిధి హైదరాబాద్
సికింద్రాబాద్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో జీహెచ్ ఎంసీ పరిధిలో అగ్ని ప్రమాద నివారణ అనుమతులు లేని భారీ భవనాలపై చేపట్టాల్సిన చర్యలపై బిఆర్ కె ఆర్ భవన్ లోని సి.ఎస్ కార్యాలయంలో బుధవారం ప్రారంభమైన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి రామ రావు, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ. హైదరాబాద్ ఉప మేయర్ , సి.ఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, ఇంధన, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, జీహెచ్ ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండి దాన కిషోర్, ఫైర్ సర్వీసుల డీజీ నాగిరెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సి.వీ ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర , రాచకొండ కమీషనర్ డీ.ఎస్. చౌహాన్, హైదరాబాడ్ కలెక్టర్ అమయ్ కుమార్ తదితర ఉన్నతాధికారులు.

సచివాలయం నిర్మాణ పనితీరును పరిశీలించిన సీఎం కేసీఆర్

నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీ ఎం కెసిఆర్
అధికారులకు పలు సూచనలు
యదార్థవాది ప్రతినిధి హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం పరిశీలించారు. తుదిమెరుగులు దిద్దుకుంటున్న సచివాలయ ముఖద్వారం మొదలుకొని నలు దిక్కులా కలియతిరిగి అణువణువునూ సి ఎం కేసీఆర్ పరిశీలించారు. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన సచివాలయ పనుల పురోగతి పరిశీలనలో, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహా ఇంజనీర్లకు వర్క్ ఏజెన్సీలకు పలు సూచనలు చేశారు.
సచివాలయ ప్రధాన ద్వారం గుండా పరిశీలన ప్రారంభించి. రక్షణ వ్యవస్థలను అమరుస్తూ తుది దశకు చేరుకున్న కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని పరిశీలిస్తూ ముందుకు సాగారు. ప్రధాన కట్టడానికి బయటి దిశగా నిర్మితమౌతున్న రోడ్లను పరిశీలించారు. అక్కడనుంచి నేరుగా నైరుతి దిక్కుగా నడుచుకుంటూ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్, అక్కడ బ్యాంకులు, క్యాంటీన్, ఏటీఎంలు, మీడియా సెంటర్ కోసం చేపట్టిన నిర్మాణాలను, సందర్శకుల కోసం నిర్మిస్తున్న వెయిటింగ్ గదులను కలియ తిరిగారు. అక్కడి సౌకర్యాలను తదితర వివరాలను, ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు తెలియజేశారు. సచివాలయ ఉద్యోగుల కోసం నైరుతి దిక్కున నిర్మితమౌతున్న ప్రార్థనా మందిరాన్ని సిఎం పరిశీలించారు. ఆ తర్వాత పడమటి దిక్కున ఉన్న అంతర్గత రోడ్లు, వాటి వైశాల్యం, తుది నిర్మాణాలకు వాడుతున్న సిమెంటు తదితర నాణ్యతా అంశాల గురించి ముఖ్యమంత్రి ఆరా తీశారు. సచివాలయం పడమటి భాగంలో సెక్రటేరియట్ ఉద్యోగుల ఉపయోగార్థం నిర్మితమవుతున్న భవనాన్ని కూడా సీఎం పరిశీలించారు. దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న వసతులను పరిశీలించారు. వెహికల్ పార్కింగులను కూడా సీఎం కేసీఆర్ సందర్శించారు అక్కడనుంచి తిరిగి నేరుగా సచివాలయ ప్రధాన ద్వారం గుండా మెట్లెక్కి మొదటి ఫ్లోరుకు చేరుకున్నారు. మెట్లకు కుడి ఎడమ పక్కన ఏర్పాటు చేయాల్సిన అంశాల గురించి ఇంజనీర్లకు సూచించారు. మొదటి ఫ్లోరు కలియదిరిగిన సి ఎం కేసీఆర్ లిఫ్టు ద్వారా 6వ ఫ్లోరులోని సీ ఎం చాంబర్ కు చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న ఫాల్స్ సీలింగ్, వుడ్ పానెలింగ్, ఎసీ ఫిట్టింగ్స్, తదితర తుది మెరుగుల పనులను సీఎం కేసీఆర్ క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం , చీఫ్ సెక్రటరీ ఛాంబర్ ను, సి ఎం వో కార్యదర్శులు, పీఆర్వోలు, తదితర సి ఎం వో సిబ్బంది సహా ప్రభుత్వ సలహాదారుల కోసం నిర్మించిన కార్యాలయాలను సి ఎం పరిశీలించారు సిఎం చాంబర్ లో మార్పులు చేపట్టాలని సూచనలు చేశారు. అదే ఫ్లోర్ మీద ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ హాల్లను వాటిల్లో చేపట్టిన ఫాల్స్ సీలింగ్ పనులను పరిశీలించారు. కారిడార్లలో తుది దశకు చేరుకున్న మార్బుల్ పాలిషింగ్, పెయింటింగ్ పనులను, ఎలివేషన్ లో భాగంగా జిఆర్సీ తో చేసే కళాకృతులను, చివరిదశ పనులను మరింత సృజనాత్మకంగా నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. సచివాలయంలో నిరంతరం ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే దిశగా ఏర్పాటు చేసిన సిగ్నల్ బూస్టింగ్ సిస్టమ్ ను సిఎం పరిశీలించారు. ఆరవ అంతస్తు నుండి అటు హుస్సేన్ సాగర్ తీరం వైపు నిర్మితమౌతున్న కట్టడాలను కిటికీ నుండి బయటికి వంగి క్షుణ్ణంగా పరిశీలించి చూసారు.
ఇంటీరియర్ డిజైన్లు, కరెంటు పనులు, ఏసీల ఫిటింగ్, పిల్లర్లకు, స్థంభాలకు జరుగుతున్న కళాత్మక ఆర్ట్ వర్కు పనులు, పెయింటింగ్ పనులను పరిశీలించిన సీఎం నిర్మాణ సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ప్రీమియం మార్బుల్ స్టోనింగ్ పనులను, వుడ్ వర్క్స్ లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రానైట్ ఫ్లోరింగ్, మార్బుల్ ఫ్లోరింగ్, ఫాల్స్ సీలింగ్, జీఆర్సి పనులు, లిఫ్టుల పనులతీరును సిఎం అడిగి తెలుసుకున్నారు.
ఆరవ ఫ్లోర్ నుంచి లిఫ్టు ద్వారా కిందికి దిగిన సిఎం మొదటి అంతస్తు కు చేరుకున్నారు. అక్కడనుంచి మెట్లు దిగి ప్రధాన ద్వారానికి ఎదరుగా రెండు వైపుల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫౌంటేన్లను పరిశీలించారు. ఉత్తర తూర్పు ఈశాన్య దిశగా నిర్మితమౌతున్న లాన్ లను, రోడ్లు, పార్కింగ్, తో పాటు గార్డెనింగ్ పనులను పరిశీలించారు. మ్యాపు ద్వారా అన్ని నిర్మాణాల తీరును పరిశీలిస్తూ, వర్క్ ఏజెన్సీలను, మంత్రిని అడిగి తెల్సుకున్నారు. అక్కడి నుంచి కాలి నడకన కలియదిరుగుతూ రాళ్లమీద నడుస్తూ, నిర్మాణానానికి ఉపయోగించే కర్రలు, ఇనుప సామాగ్రిని దాటుతూ ముందుకు సాగారు.
వీఆర్వీ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఏసీ ప్లాంట్లను, జనరేటర్లను, అత్యున్నతస్థాయి రక్షణ కోసం నెలకొల్పిన ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ను సిఎం పరిశీలించారు. సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్లను పరిశీలించారు. ల్యాండ్ స్కేప్ పనులు, సివరేజ్ వర్క్స్,రెడ్ సాండ్ స్టోన్, ఫైర్ వర్క్స్,ఎలక్ట్రికల్ వర్క్ ఫ్లోర్ పనులపై ఇంజనీర్లకు, మంత్రి ప్రశాంత్ రెడ్డికి సూచనలు చేశారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వెంట రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూధనా చారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, ఆరూరి రమేశ్, దివాకర్ రావు బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, షాపూర్ జీ పల్లోంజీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో సైబర్ ఆర్మీ సిద్ధం

తెలంగాణలో విద్యార్థులు టీచర్లతో సైబర్‌ ఆర్మీ సిద్ధం
సీఏపీ ద్వారా సైబర్‌ నేరాల నివారణపై శిక్షణ
యదార్థవాది ప్రతినిధి హైదరాబాద్
రాష్ట్రంలో సైబర్‌ నేరాలను క్షేత్రస్థాయి నుంచి నివారించేందుకు సైబర్‌ ఆర్మీ సిద్ధమైంది. తెలంగాణలోని ప్రతి పల్లెలోనూ సైబర్‌ నేరాలపై విస్తృతంగా చర్చించేందుకు, ప్రతి ఇంటిలోనూ సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా సైబర్‌ ఆర్మీని సిద్ధం చేసింది. తెలంగాణ పోలీస్‌, ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌, విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో సైబర్‌ ఆర్మీకి అంకురార్పణ చేశారు. సైబర్‌ అంబాసిడర్‌ ప్లాట్‌ఫామ్‌ (సీఏపీ) కింద రాష్ట్రవ్యాప్తంగా 9,524 మంది విద్యార్థులు, 4,762 మంది టీచర్లకు సైబర్‌ నేరాల నివారణపై శిక్షణ కల్పించనున్నారు. ఇందుకోసం 33 జిల్లాల్లోని ప్రభుత్వ విద్యాసంస్థల్లోంచి స్కూలుకు నలుగురు చొప్పున చురుకైన విద్యార్థులను, ఇద్దరు ఉపాధ్యాయులను ఎంపిక చేశారు సైబర్‌ నేరాల నివారణకు విద్యార్థులనే ఆయుధాలుగా ఎంచుకున్నది పోలీస్‌ శాఖ. ఈ కార్యక్రమం మొత్తాన్ని పర్యవేక్షిస్తూ విద్యార్థులకు సైబర్‌ నేరాల నివారణపై శిక్షణ ఇచ్చేందుకు పెద్ద ప్రణాళికను సిద్ధం చేసింది

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...