159 మందికి కంటి పరీక్షలు
యదార్థవాది ప్రతినిది గజ్వేల్
అందమైన ప్రపంచాన్ని చూడటానికి కారణం కళ్లేనని అలాంటి కన్నులను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వర్గల్ మండలంలోని అనంతగిరిపల్లి గ్రామంలో కంటివెలుగు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏ జీవి అయిన ఈ ప్రకృతిని చూడాలన్నా చూసి ఆ అందాలను ఆస్వాదించాలన్నా నేత్రాలతోనే సాధ్యం అని ఆలాంటి కళ్లకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దని కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగును ప్రారంభించిందన్నారు. గ్రామాలలో ప్రతి ఒక్కరు కంటి వెలుగులో పాల్గొని తమ కళ్ళను పరీక్షించుకోవాలని చెప్పారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో గడ ఆఫీసర్ ముత్యం రెడ్డి సర్పంచి అప్పిడి సునిత, ఉపసర్పంచి కనకరాజు, ఎంపీటీసి వెంకటేశ్ గౌడ్, జడ్పీటిసి బాలమల్లు యాదవ్, ఎంపీడీవో స్వర్ణకుమారి, మండల వైద్యాధికారిణి డాక్టర్ హరిత ఎంపిపి లత రమేష్ గౌడ్, పి ఎ సి ఎస్ రామకృష్ణారెడ్డి
డీ పి ఓ దేవికా దేవి, డి ఎల్ పి ఓ వేదవతి,
పి ఎ సి ఎస్ డైరెక్టర్ బుచ్చమ్మ, వార్డు సభ్యులు, గ్రామ సెక్రెటరీ నరేందర్, టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు తుమ్మల నరసింహులు మరియు గ్రామస్తులు అందరూ పాల్గొన్నారు.
అనంతగిరిపల్లి లో కంటి వెలుగు కార్యక్రమం
జాతీయ బాలికల దినోత్సవం
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ మెదక్ ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం.
యదార్థవాది ప్రతినిది మెదక్
మెదక్ కోర్టు అవరణలో మంగళవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ వారి అధ్వర్యంలో శ్రీ సరస్వతీ కాన్వెంట్ హై స్కూలు విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా న్యాయ సేవాధికార చైర్మన్ జిల్లా జడ్జి P.లక్ష్మి శారద, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ,సీనియర్ సివిల్ జడ్జి Ch.జితేందర్,మెదక్ బార్ అసోసిేషన్ ప్రెసిడెంట్ M.బాలయ్య,నామినేటెడ్ సభ్యులు S.కరుణాకర్,జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫజల్ అహ్మద్, ప్యానల్ న్యాయవాదులు,సీనియర్ అడ్వకేట్ లు,జూనియర్ అడ్వకేట్ లు పాల్గొన్నారు. పాఠశాల యాజాన్యం వారు ఇట్టి కార్యక్రమం నిర్వహించమని న్యాయ సేవా అధికార సంస్ధ వారిని కోరగా వెంటనే అనుమతి ఇచ్చి, విద్యార్ధులకు కావలసిన అన్ని వసతులు కల్పించి,రోజు వారీ కోర్టు పనులు కర్యవాహి ఎలా జరుగుతున్నాయో విద్యార్థులు కొర్టు అవరణలో ఉండి గమనించే లా అనుమతి ఇచ్చిన సెక్రటరీకీ పాఠశాల ప్రిన్సిపాల్ సుమిత్ర కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ మూర్తి మాట్లాడుతూ మహిళా సాధికారతే ధ్యేయంగా న్యాయవ్యవస్థ పని చేస్తోందని అందుకు అనుగుణంగా అన్ని శాఖలు పని చేయడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు పాఠశాల విద్యార్థులలో మాట్లాడి వారికి స్ఫూర్తిని ఇచ్చే విషయాలు చెప్పి,బాలికల దినోత్సవం సందర్భంగా శుభాభినందనల తెలిపారు. విద్యార్థులకు పలు అంశాల మీద అవగాహన కలిగిస్తూ న్యాయ సేవ అధికార సంస్థ చేసే పనులు,సేవలు, భాద్యతల గురించి సవివరంగా జిల్లా కార్యదర్శి విద్యార్థులకు వివరించి,వారిలో ఉత్సాహం నింపి,విద్యార్థుల సందేహాలు నివృత్తి చేసి వారికి ఆనందాన్ని కలిగించారు.ఈ కార్యక్రమంలో సెక్రటరీ విద్యార్థుల ప్రవర్తన,దైర్యం, సమయ పాలన,విలువలు వాటి ప్రాముఖ్యత,నిబద్దత,కృషి లాంటి పలు అంశాల గురించి మాట్లాడి విద్యార్థులకు దిశా నిర్దేశనం చేశారు. ఈ అవగాహన సదస్సులో శ్రీ సరస్వతీ కాన్వెంట్ హై స్కూలు విద్యార్థులలో పాటు ఉపాధ్యాయులు కుడా పాల్గొన్నారు చివరిగా బార్ ప్రెసిడెంట్ బాలయ్య,మెంబర్ కరుణాకర్, మాట్లాడుతు అడ్వకేట్ అవ్వడానికి ఎంచుకోవలసిన కోర్సులు, సమాజంలో న్యాయవాది ఒక్క ప్రాముఖ్యత,జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చేస్తున్న పనుల గురించి వివరించారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ -2023 పై సమీక్ష: జిల్లా కలెక్టర్
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ -2023 పై గ్రామాల్లో వాల్ పెయింటింగ్స్ వేయించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ -2023 పై జిల్లాలో అన్ని గ్రామాల్లో వాల్ పెయింటింగ్స్ వేయాలని, ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.. మంగళవారం కలెక్టర్ జిల్లా సమీకృత కార్యాలయాల సమావేశ మందిరంలో సర్వేక్షణ్ గ్రామీణ్ -2023, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్ మెంట్, మన ఊరు – మన బడి, తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు, తదితర అంశాలపై ఎంపీడీఓ లతో సమీక్ష నిర్వహించారు. సర్వేక్షణ్ గ్రామీణ్ -2023 లో భాగంగా ప్రతీ గ్రామంలో డ్రైనేజీ ఎండ్ పాయింట్ ను గుర్తించాలని, ఇంకుడు గుంతలను నిర్మించాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో ఉన్న టాస్క్ ఫోర్స్ బృందాలు తమ గ్రామంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎవరైనా వాడినా, డంప్ చేసినా గుర్తించి, బాధ్యులపై జరిమానా విధించాలని అన్నారు. అన్ని మండలాల్లో ఏర్పాటు చేస్తున్న ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్ మెంట్ యూనిట్ల నిర్మాణం పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో నిర్మిస్తున్న టాయిలెట్ల నిర్మాణాల పురోగతిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో వేగం పెంచాలని ఆదేశించారు. గ్రామాలలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు అసంపూర్తిగా ఉన్నాయని, పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడంపై మండల ఎంపీడీఓ లు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లోని సెప్టిక్ ట్యాంకుల నుండి సేకరించిన వ్యర్థాలను రగుడు లోని ఫికల్ స్లడ్జ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ కు మాత్రమే పంపించేలా చూడాలని తెలిపారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్, జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి, డీపీఓ రవీందర్, అదనపు డీఆర్డీఓ మదన్ మోహన్, ఎంపీడీఓ లు, తదితరుల పాల్గొన్నారు.

నాయి బ్రాహ్మణులను ఆదుకోవాలి
నాయి బ్రాహ్మణులను ఆదుకోవాలి
యదార్థవాది ప్రతినిది యదాద్రి
యాదగిరిగుట్ట మండలంలో ఉన్న అన్ని గ్రామాల నాయి బ్రాహ్మణ సోదరులకు షేవింగ్-కటింగ్ కీట్స్ అందజేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బీర్ల అయిలయ్య యాదగిరిగుట్ట మండలంలో తాళ్లగూడెం గ్రామంలో నాయి బ్రాహ్మణులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. మీరు రాజకీయాల్లో ముందు ఉండాలని, పని చేసే నాయకుడికి పట్టం కట్టాలన్నారు, మనమంతా ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. నాయి బ్రాహ్మణులు ఉదయం నుండి రాత్రి వరకు నిలబడి కష్టపడతరని, ప్రభుత్వం వెంటనే 50 ఏళ్లకు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మండల ఎంపీపీ చీర శ్రీశైలం, మండల పార్టీ అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్, నాయి బ్రాహ్మణుల సంఘం అధ్యక్షుడు ప్రకాష్, ప్రధానకార్యదర్శి సోన్నాయిల రమేష్, బండి నర్సింహులు, జంపాల రాము, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు..
చక్ర స్థానం తో ముగిసిన పుల్లురు జాతర
పుల్లూరు బండపై సంప్రదాయ బద్దంగా చక్ర స్నానం
ముగిసిన జాతర
యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట
స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం పుల్లూరు బండ పై ఐదు రోజుల పాటు వైభవంగా జరిగిన జాతర చివరి రోజైన మంగళవారం దేవాలయ వంశపారంపర్య అర్చకులు సంప్రదాయ బద్దంగా నిర్వహించిన చక్ర స్నానం(చక్ర తీర్థం) కార్యక్రమంతో ముగిసింది.. చివరి రోజు సుదర్శన నారసింహ హోమం,పూర్ణాహుతి నిర్వహించారు..దేవాలయ కమిటీ చైర్మన్, వంశ పారంపర్య అర్చకులు కలకుంట్ల రంగాచార్య, పుల్లూరు గ్రామ సర్పంచ్ పల్లె నరేష్ గౌడ్,కమిటీ డైరెక్టర్లు ఎక్స్ ఆఫీషియో సభ్యులు కలకుంట్ల వెంకట నరసింహా చారి, డైరెక్టర్లు కోడూరి శ్రీనివాస్, మొలుగు లక్ష్మీ మల్లేశం, కార్యక్రమాలను నిర్వహించారు.
దేవాలయ వంశపారంపర్య అర్చకులు కలకుంట్ల కృష్ణమాచారి, గోవర్ధనం నవీన్ కుమార్, కలకుంట్ల వీణా చారి, చిలకమర్రి నరసింహా చారి,చిలకమర్రి రమణా చారి,శేషం శ్రీవాస్తవ ఆధ్వర్యంలో మధ్యాహ్నం సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. హోమం పూర్ణాహుతి అనంతరం సుదర్శన చక్ర పెరుమాళ్ ఉత్సవమూర్తిని,యాగ జలాన్ని తీసుకు వెళ్లి బండపై ఉన్న పవిత్ర పాలగుండం,లక్ష్మీ నరసింహస్వామి గుండాల్లో జలానికి శుద్ధి పూజలు నిర్వహించారు. అనంతరం హోమ జలాన్ని గుండం జలాల్లో కలిపిన అనంతరం సుదర్శన చక్ర పెరుమాళ్ ఉత్సవ మూర్తికి గుండం లో స్నానం చేయించారు. సంప్రదాయ బద్దంగా వేద మంత్రాలతో అర్చకులు కార్యక్రమాన్ని నిర్వహించారు.. అనంతరం చక్ర పెరుమాళ్ ఉత్సవ మూర్తిని తిరిగి దేవాలయం లోని స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి కోవెల లో ఉంచారు.. దీంతో 5 రోజుల పాటు జరిగిన పుల్లూరు స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి స్వామి బండ జాతర ఘనంగా ముగిసింది..
యువ గళం పాదయాత్రకు లైన్ క్లియర్.. అనుమతి అధికారికంగా ప్రకటించిన చిత్తూరు జిల్లా ఎస్పీ..
చిత్తూరు : నారా లోకేశ్ ‘యువగళం’పేరుతో చేపట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇస్తారా? లేదా? అనే ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు అనుమతి లభించింది..
ఈ విషయాన్ని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. దీంతో ముందుగానే నిర్ణయించిన జనవరి 27న ఫిక్స్ చేసినముహూర్తానికే కుప్పం నియోజకవర్గం నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభంకానుంది. పోలీసుల నుంచి అనుమతి కోసం టీడీపీ నేతలు ఎన్నో విధాలుగా యత్నించారు. కానీ పోలీసుల నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. దీంతో టీడీపీ కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుని అయినా పాదయాత్రను కొనసాగించాలని నిర్ణయించింది. మరోపక్క నిబంధనల ప్రకారం పోలీసులకు పలు లేఖలు రాసింది అనుమతి కోరుతూ.ఈక్రమంలో చిత్తూరు జిల్లా ఎస్పీనుంచి ఎట్టకేలకు అనుమతి లభించింది. దీంతో లోకేశ్ పాదయాత్రకు లైన్ క్లియర్ అయ్యింది. ఇక నిర్ణయించిన ముహూర్తానికే పాదయాత్ర ప్రారంభకానుంది..
పాదయాత్రకు షరతులు..
– బహిరంగ సభలను నిర్ణీత సమయాలకే నిర్వహించాలి..
– రోడ్లపై సభలు,సమావేశాలు నిర్వహించకూడదు..
– రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు..
– పాదయాత్రలో మార్పులు చేర్పులు ఉంటే ముందుగానే తెలియజేయాలి..
– శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలుగకుండా పాదయాత్ర కొనసాగించాలి..
– సభా ప్రాంగణంలో ప్రాథమిక చికిత్స్ శిభిరాలు ఉండేలా చూసుకోవాలి..
– అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచుకోవాలి..
అగ్నిమాపక వాహనాలను కూడా అందుబాటు ఉంచుకోవాలి..
తెగని భూమి పంచాయితీలు
సిద్దిపేట జిల్లాలో తెగని భూ పంచాయతీలు,తీవ్ర ఇబ్బందుల్లో బాధితులు
యధార్థవాది ప్రతినిధి సిద్దిపేట
సిద్దిపేట జిల్లా కేంద్రం సిద్దిపేట పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక బక్క చిక్కిన నిరుపేద రైతు కుటుంబానికి చెందిన ఎక్కలదేవి లింగం తన భూమి తనకు ఇప్పించాలంటూ చెప్పులు అరిగేలా తిరుగుతున్న సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. భాదితుడు ఎక్కలదేవి లింగం తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా అర్బన్ ప్రాంతంలోని స్థానిక ఎల్లమ్మ గుడి నుండి నాగదేవత గుడికి వెళ్ళే మార్గంలో సర్వే నెంబర్ 185/అ లో ఒక ఎకరం ఇరవై గుంటల భూమి తనకు తన వంశపారంపర్యంగా వస్తుందని అటువంటి భూమిపై కొందరు గద్దల వలే వాలి తన భూమిని తన్నుకు పోదామని చూస్తున్నారని న్యాయపోరాటం చేస్తూ అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ తిరిగి తిరిగి వేసారి మంగళవారం మంత్రి హరీష్ రావును క్యాంపు కార్యాలయంలో కలిసి తన మొర విన్నవించుకున్న సమయంలో మంత్రి హరీష్ రావు స్థానిక ప్రజాప్రతినిధిని పిలిచి నకిలీ పత్రాలు సృష్టిస్తూ దౌర్జన్యంగా ఎక్కలదేవి లింగం భూమిలో కబ్జాలకు పాల్పడుతున్న ఐలయ్య వారి కుటుంబ సభ్యులను పిలిచి విచారించి లింగం భూ పంచాయతీ సంగతి ఏంటో చూడు సమస్యతో పిల్లగాడు మళ్ళీ కనిపించవద్దు అని చెప్పినట్టు లింగం తెలిపారు.ఇక లింగం కల ఎప్పుడు నెరవేరుతుందో తనభూమి తన హద్దులోకి తన చేతుల్లోకి అధికారికంగా ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి
కొత్తగా నోరో వైరస్…19 మంది విద్యార్థులకు పాజిటివ్
యదార్థవాది ప్రతినిధి
కొచ్చి(కేరళ): కేరళ రాష్ట్రంలో కొత్తగా నోరో వైరస్ వెలుగుచూసింది.కక్కనాడ్ పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూలుకు చెందిన 62 మంది విద్యార్థుల్లో వాంతులు, డయేరియా లక్షణాలు బయటపడ్డాయి..పాఠశాలలో 1,2వతరగతులు చదువుతున్న విద్యార్థుల నుంచి శాంపిళ్లను సేకరించి పరీక్ష కోసం లాబోరేటరీకి పంపించామని జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి చెప్పారు. పాఠశాల తరగతి గదులతోపాటు టాయ్ లెట్లలో ఇన్ఫెక్షన్ వెలుగుచూసింది.పాఠశాల విద్యార్థులకు నోరో వైరస్ సోకడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నోరో వైరస్ నివారణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు రక్షిత మంచినీటిని అందించాలని నిర్ణయించారు..నోరో వైరస్ లక్షణాలు డయేరియా, వాంతులు, స్వల్ప జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులతో పిల్లలు బాధపడుతున్నారు.కలుషితమైన నీరు, ఆహారం వల్ల నోరో వైరస్ వ్యాప్తి చెందుతుందని వైద్యాధికారులు చెప్పారు. కేరళ రాష్ట్రంలో 19 మంది పిల్లలకు నోరో వైరస్ పాజిటివ్ అని తేలడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముందుజాగ్రత్తలు తీసుకున్నారు. మరుగుదొడ్డికి వెళ్లి వచ్చాక, భోజనం చేసేముందు సబ్బుతో చేతులు కడుక్కోవాలని వైద్యాధికారులు సూచించారు. క్లోరినేట్ చేసి, కాచిన నీటిని తాగాలని వైద్యులు కోరారు. పండ్లు, కూరగాయలను బాగా కడిగి తినాలని వైద్యాధికారులు సలహా ఇచ్చారు..
ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వు..
యదార్థ వాది ప్రతినిధి
అమరావతి: జీవో నెంబరు1పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వు చేసింది. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాదనలు కొనసాగాయి.సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ..నిన్నటి వరకు జీవో నెంబరు 1ని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. జీవో నెంబరు 1పై కాంగ్రెస్, తెదేపా, భాజపా నుంచి కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ముగ్గురు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రతిపక్షాల గొంత నొక్కేందుకే ప్రభుత్వం జీవో నెంబరు 1 తెచ్చిందని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.
రెండు పడకల ఇండ్ల ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే..
రెండు పడకల ఇండ్ల ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే..
యదార్థవాది ప్రతినిది వరంగల్
దుపకుంటలోని రెండు పడకల ఇండ్ల నిర్మాణం క్షేత్ర స్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..
రెండు పడకల ఇండ్ల నిర్మాణ పనులను హౌసింగ్, ఆర్&బి, విద్యుత్,కాంట్రాక్టర్లు సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలు గౌరవ ప్రదమైన సౌకర్యవంతమైన నివాసము ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణం పథకం క్రింద వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2200వందల ఇండ్ల మంజూరు చేయడం జరిగిందని, నిర్మిస్తున్న గృహా నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి ఇండ్లు లేని పేద ప్రజల కల సాకారం చేయాలని, గృహ నిర్మాణంలోని నీటి, విద్యుత్ సమస్యలు, పార్కుల ఏర్పాటు తదితర సమస్యలపై కూలంకషంగా చర్చించి సంబంధిత మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులకు నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో ఫణి, కార్పొరేటర్ భోగి సువర్ణ సురేష్,13వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ జోషి, తదితరులు పాల్గొన్నారు.
















