33.2 C
Hyderabad
Friday, April 24, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 119

రక్తదానాన్ని మించిన దానం మరొకటి లేదు

రక్తదానాన్ని మించిన దానం లేదు
కళాశాల ప్రిన్సిపల్ విపి రాజు

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట
మనిషి ప్రాణాన్ని కాపాడేందుకు రక్తదానం ఎంతో దోహదపడుతుంది రక్తదానాన్ని మించిన ధనం మరొకటి లేదని ఇందుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విపి రాజు అన్నారు. మంగళవారం లయన్స్ క్లబ్ సిద్దిపేట, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ స్వర్గధామ ఆధ్వర్యంలో ఇందూర్ సంయుక్త కళాశాలలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ రక్తదానాన్ని మించిన దానం మరొకటి లేదని ఒక మనిషి ప్రాణం కాపాడేది రక్తదానమే రక్తదానం చేయడానికి అందరూ ముందుకు రావాలని. విద్యార్థి దశనుండి సేవ, దాన గుణాన్ని అలవర్చుకోవాలన్నారు. లయన్స్ క్లబ్ సిద్దిపేట అధ్యక్షులు గంప రమేష్ మాట్లాడుతూ ప్రతి ఆరోగ్యవంతుడు మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు విద్యార్థి చదువుతోపాటు సమసమాజ స్థాపనకు తన వంతు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా 30 మంది విద్యార్థుల నుండి రక్తం ను సేకరించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, రవీందర్ జోజి రామచంద్రం రఘు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో పాటు ఆరాధ్య రక్తనిధి కూకట్ పల్లి సిబ్బంది పాల్గొన్నారు.

ప్రాంతీయ ఆసుపత్రిలో డీఈఐసీ సేవలు

ప్రాంతీయ ఆసుపత్రిలో డీఈఐసీ సేవలు.. 5 పడకల సామర్థ్యంతో డయాలసిస్ యూనిట్ మంజూరు

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి..

యదార్థవాది ప్రతినిది వేములవాడ

వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి డీఈఐసీ, 5 పడకల సామర్థ్యంతో డయాలసిస్ యూనిట్ మంజూరు అయ్యాయని, త్వరలోనే ఈ సదుపాయాలను ప్రజలకు (రోగుల) సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకువస్తామని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు..మంగళవారం ఆయన వేములవాడ పట్టణం తిప్పాపూర్ లోని వంద పడకల ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని క్షేత్ర స్థాయిలో సందర్శించారు. డీఈఐసీ (డిస్ట్రిక్ట్ అర్లీ ఇంటర్ వెన్షన్ సెంటర్) ద్వారా అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే పిడియాట్రిక్ డాక్టర్ పర్యవేక్షణలో వైద్య సేవలు అందించడం జరుగుతుందని, ఈ కేంద్రంలో ఇద్దరు వైద్యులతో, పది మంది సిబ్బంది వైద్యసేవలు అందిస్తారని తెలిపారు. ప్రసూతి విభాగాన్ని సందర్శించి డెలివరీ, మహిళలతో మాట్లాడి వైద్య సేవల తీరుపై కలెక్టర్ ఆరా తీశారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ఆసుపత్రిలో టాయిలెట్ నిర్మాణ పనులను చేపట్టి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమీషనర్ అన్వేష్ ను ఆదేశించారు. మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థం మాధవి, జిల్లా వైద్యాధికారి డా.సుమన్ మోహన్ రావు, మున్సిపల్ కమీషనర్ అన్వేష్, ఆసుపత్రి పర్యవేక్షకులు డా.మహేష్ రావు, తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీలో భూకంపం

ఢిల్లీలో భూకంపం..రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదు


యదార్థవాది ప్రతినిధి ఢిల్లీ

దేశంలో అక్కడక్కడ భూ ప్రకంపనలు సంభవించాయి. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఢిల్లీ – ఎన్సీఆర్,ఉత్తర, భారతదేశంలోని పలు ప్రాంతాల్లో బలమైన భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) ప్రాథమిక సమాచారం ప్రకారం.. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. భూకంప కేంద్రం నేపాల్‌లో ఉన్నట్లు 30 సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు రావటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.పలు ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే,ఈ భూ ప్రకంపనల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు..

వారాహి ప్రచార రథానికి శాస్త్రోక్తంగా పూజలు..

వారాహి ప్రచార రథానికి శాస్త్రోక్తంగా పూజలు..

అంజన్న సన్నిధిలో వారాహికి పూజలు..

యదార్థవాది ప్రతినిది జగిత్యాల

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ కి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం పార్టీ ప్రచార రథం వారాహికి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జనసేనాని శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు జరిపించారు..

‘రీ సర్వే’ చేస్తున్న అధికారులు..

‘రీ సర్వే’ చేస్తున్న సందర్భంలో అస్సలైన నిరు పేదలకు రెండు పడకల ఇండ్లు కేటాయించాలి

యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఇచ్చే పధకం పాలకులకు పట్టింపు లేదు, అధికారుల అలసత్వం, నిరుపేద కుటుంబాలకు రెండు పడకల ఇండ్లు దక్కలేదని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ అన్నారు.. మంగళవారం నాడు హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డి అమరుల భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గడిపె మల్లేశ్ మాట్లాడుతూ గత నెల రోజుల క్రితం పేదలకు రెండు పడకల ఇండ్లు దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారిని గుర్తించేందుకు సంబంధిత అధికారులు చేసిన సర్వేలో అనేక లోపాలు జరిగాయని సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ధర్నా చేసిందని, మల్లి ‘రీసర్వే’ చేయాలని, మల్లి దరకాస్తు చేసుకోవడానికి పది రోజుల గడువు పొడిగించాలని మున్సిపల్ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఇంచార్జీ ఆర్డీవోను ప్రజలు వినతి పత్రం సమర్పించిన విషయం తెలిసిందే.. అధికార యంత్రాంగం మల్లి ‘రీ సర్వే’ చేస్తున్న సందర్భంలో అస్సలైన ఏ భూమి లేని నిరు పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలనే కచ్చిత అభిప్రాయంతో ఆ కేటాయింపుల ఫలితాలు కోసం హుస్నాబాద్ ప్రాంతంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎదిరి చూస్తున్నాయని గడిపె మల్లేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి, సిపిఐ మండల నాయకులు అయిలేని మల్లారెడ్డి, ఎండి అక్బర్, కొంగర కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేట కమిషనరేట్ ను సందర్శించిన: డీఐజీ రమేష్ నాయుడు

సిద్దిపేట కమిషనరేట్ ను సందర్శించిన రాజన్న సిరిసిల్ల జోన్ డీఐజీ కె. రమేష్ నాయుడు..

యదార్థవాది ప్రతినిది సిద్దిపేట

రాజన్న సిరిసిల్ల జోన్ డీఐజీ కె. రమేష్ నాయుడు మంగళవారం సిద్దిపేట కమిషనరేట్ కార్యాలయాన్ని సందర్శించారు.. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత మొక్కను డీఐజీ కె. రమేష్ నాయుడు అందచేసి సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధి సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ డివిజన్స్ మరియు జిల్లాలో ఉన్న సర్కిల్స్, పోలీస్ స్టేషన్ ల గురించి శాసన సభ్యుల నియోజకవర్గాల పరిధి గురించి, మరియు జిల్లా భౌగోళిక పరిధి, గురించి వివరించారు.. డిఐజి రమేష్ నాయుడు అధికారులతో సమావేశమై జిల్లాలో ఏ తరపు నేరాలు జరుగుతున్నాయని, మరియు అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుల గురించి పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిఐజి మాట్లాడుతూ ఎలక్షన్ ఇయర్స్ ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని ఏదైనా బందోబస్తు నిర్వహించేటప్పుడు పోలీస్ అధికారులకు సిబ్బందికి బ్రీఫింగ్ ఇవ్వాలని, బందోబస్తు ముగిసిన తర్వాత డీ బ్రీఫింగ్ ఇవ్వాలని తెలిపారు. దొంగతనాల కేసులను ఛేదించి ప్రాపర్టీ రికవరీ శాతం పెంచాలని, కేసుల్లో శిక్షల శాతం పెంచి ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేయాలని. గ్రేవ్ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులలో పరిశోధన సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్ వేయాలని తెలిపారు. శాంతిభద్రతలను పరిరక్షించడానికి సిద్దిపేట కమిషనర్ పర్యవేక్షణలో పోలీసులు విజయవంతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు, కమిషనరేట్ కార్యాలయం పచ్చదనం పరిశుభ్రతతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నదని, పోలీసుల పనితీరు బాగుందని పోలీస్ అధికారులను అభినందించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఏఆర్ అడిషనల్ డీసీపీలు రామచంద్రరావు సుభాష్ చంద్రబోస్, గజ్వేల్ ఏసిపి రమేష్, ట్రాఫిక్ ఏసిపి ఫణిందర్, హుస్నాబాద్ ఏసిపి సతీష్, ఎస్బిఎసిపి రవీందర్ రాజు, ఎస్బి ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ కుమార్, సీఐలు, ఆర్ఐలు, ఏఓ యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.

మెరుగైన ఫలితాలు రావాలి: జిల్లా కలెక్టర్

మెరుగైన ఫలితాలు రావాలి: జిల్లా కలెక్టర్

ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలలో రాష్ట్రంలో నే జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్..

యదార్థవాది ప్రతినిది సిద్దిపేట

ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలలో రాష్ట్రంలో నే జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్..
సిద్దిపేట జిల్లా సమీకృత సముదాయం సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా బిసి, ఎస్సీ, ట్రైబల్ వెల్పేర్, మోడల్ స్కూల్, కేజీబీవీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కు ఇంటర్ మెరుగైన పరీక్షా ఫలితాలు రావడనికి కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లా ఇంటర్ ఫలితాలలో గత సంవత్సరం 68% తో 6 వ స్థానంలో నిలిమని, ఈ సంవత్సరం మొదటి స్థానంలో నిలపాలనే దృడ సంకల్పంతో అధికారులు పని చెయ్యాలని, కళాశాలల్లో వివిధ గ్రూప్ ల వారిగా ఎంపిక చేసి చదువులో వెనక బడిన విద్యార్థును ఎ సబ్జెక్ట్ లో వెనకబడి ఉన్నారో గ్రహించి ఆ సబ్జెక్ట్ లెక్చరర్ వారిపై దృష్టి పెట్టాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో తక్కువ రిజల్ట్ వచ్చిన కళాశాలల ఎక్కువ కేర్ తీసుకుని రిజల్ట్ ని మెరుగైన విదంగా తెచ్చుకునేలా చర్యలు చేపట్టాలని, గురుకులాల్లో ఎ ఓక్క విద్యార్థి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఇవ్వకుడదని, 24/7 విద్యార్థులు కళాశాల హస్టల్ లో ఉంటు లెక్చరర్ ఆదినంలోనే ఉంటారు కాబట్టి ఎక్కువ కేర్ తీసుకుని చదివించలని, ఎ ఒక్కరు ఫెయిల్ అయున మొత్తం గురుకులాలె ఫెయిల్ అన్నట్టుగా భావించలాని, అందరు ఆర్సిఓలు మీ పరిధిలోని కళాశాల ను ప్రతి రోజు పర్యవేక్షణ చెయ్యాలని తెలిపారు. మన అందరూ లక్ష్యం 100% లో 90% పాస్ అవుతారు కాని 10% వెనక బడిన పిల్లలని పాస్ అయ్యేలా చూడడమే మన అందరి బాధ్యత అని గుర్తుంచుకోవాలి..మన అందరూ లక్ష్యం 100% లో 90% పాస్ అవుతారు కాని 10% వెనక బడిన పిల్లలని పాస్ అయ్యేలా చూడడమే మన అందరి బాధ్యత అని గుర్తుంచుకోవాలి.. ప్రిన్సిపల్, లెక్చరర్లు కళాశాల వెనకబడిన విద్యార్థి పేర్లను, దత్తత తీసుకున్న లెక్చరర్ పేర్లతో కూడిన పైల్ ను తనకు అందించాలని, మళ్ళీ ఫిబ్రవరి ఆఖరు వారంలో సమీక్ష జరుపుతామని రిజల్ట్ పెంచేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారు విద్యార్థి ఎ దశలో ఉన్నాడో అన్ని వివరాలతో సమావేశానికి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి సూర్య ప్రకాశ్, జిల్లా ఎడ్యుకేషన్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఆర్సిఓ లు, ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.

పల్లెల్లో అభివృద్ధి..ఎమ్మెల్యే గండ్ర

పల్లెల్లో అభివృద్ధి జరుగుతుంది. ఎమ్మెల్యే గండ్ర

యదార్థవాది ప్రతినిది భూపాలపల్లి

గతంలో ఎన్నడూ లేని విధంగా పల్లెల్లో అభివృద్ధి జరుగుతుంది భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి..టేకుమాట్ల మండలంలోని రాఘవపూర్, గర్మిళపల్లి, బుర్ణపల్లి, వెంకట్రావ్ పల్లి గ్రామాలలో రూ.80లక్షలతో అంతర్గత (CC) రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంజూరైన నిధులతో పాటు మరిన్ని నిధులు మంజూరు చేస్తున్నామని, గతంలో ఎన్నడూ లేని విధంగా పల్లెల్లో జరుగుతున్నయని, అభివృద్ధి పనులకు స్థానిక ప్రజలు బిఆర్ఎస్ పార్టికి అండగా ఉండాలని ఎమ్మెల్యే గండ్ర అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పులు…

కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పులు…ఏడుగురి మృతి..వరుస కాల్పుల ఘటనలతో దద్దరిల్లిన అమెరికా..

యధార్థవాది కాలిఫోర్నియా (యూఎస్):

అమెరికాలోని కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పుల ఘటన కలకలం రేపింది. అమెరికాలోని కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బే నగరంలో మంగళవారం ఓ దుండగుడు ఏడుగురిని కాల్చిచంపాడు.నిన్న చికాగోలో జరిగిన కాల్పుల్లో ఓ తెలుగు విద్యార్థి మృత్యువాత పడ్డారు…అమెరికాలో వరుస కాల్పులు
అమెరికాలో వరుసగా మూడు కాల్పుల ఘటనలు జరిగాయి. కాల్పులు జరిపిన నిందితుడు తమ కస్టడీలో ఉన్నాడని శాన్ మాటియో కౌంటీ ఒక ట్వీట్‌లో పేర్కొంది.కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్‌లో జరిగిన చైనీస్ న్యూ ఇయర్ ఈవెంట్‌లో 72 ఏళ్ల వ్యక్తి 10 మందిని చంపిన ఘటన మరవక ముందే మరో ఘటన జరిగింది. పోలీసులు నిందితుడు ఉన్న వ్యాన్‌ వద్దకు వెళ్లేసరికి తుపాకీ శబ్దం వినిపించింది. 

నేడు కొండగట్టుకు జన సేనాని ‌

జనసేన పార్టీ ప్రచార రథం వారాహి వాహనానికి జగిత్యాల జిల్లా కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు

యధార్థవాది ప్రతినిధి హైదరాబాద్ :

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇవాళ కొండగట్టుకు వెళ్లనున్నారు.. జనసేన పార్టీ ప్రచార రథం వారాహి వాహనానికి జగిత్యాల జిల్లా కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు..ఆంజనేయస్వామి ఆలయంలో అక్కడ శాస్త్రోక్తంగా పూజలు జరిపించనున్నారు పవన్‌… వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వారాహికి పూజలు నిర్వహించి పవన్ ప్రచార రథాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ ముఖ్యనాయకులతోసమావేశమవుతారు. సమావేశం అనంతరం ధర్మపురి చేరుకుని లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడి నుంచే అనుష్టుప్ నారసింహ యాత్రకు శ్రీకారం చుడతారు. ఇందులో భాగంగా మరో 31 నారసింహ క్షేత్రాలను దశలవారీగా సందర్శిస్తారు. ధర్మపురిలో దర్శన అనంతరం సాయంత్రం తిరిగి హైదరాబాద్‌ ప్రయాణం కానున్నారు జనసేనాని.. ఇక, పవన్‌ కల్యాణ్‌ కొండగట్టు, ధర్మపురి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుండి కొండగట్టుకు బయల్దేరనున్నారు పవన్‌.. ఉదయం 11 గంటలకి కొండగట్టు అంజన్న ఆలయానికి చేరుకుంటారు.. జన సేనాని పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన బందో బస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.. పవన్ కల్యాణ్‌కు కొండగట్టు అంజన్న అంటే సెంటిమెంట్ అనే విషయం తెలిసిందే.. పలు సందర్భాల్లో ఆయన ఆ విషయాన్ని ప్రస్తావించారు.. దీంతో, వారాహికి కొండగట్టులోనే వాహన పూజ నిర్వహించాలని నిర్ణయించారు.. ఉదయం 11 గంటలకు మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంకు చేరుకోనున్న పవన్‌.. అంజన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వారాహి ప్రచార రథానికి పూజలు చేయిస్తారు.. ఇక, మధ్యాహ్నం ఒంటి గంటకు కోడీమ్యాల మండలం పరిధిలోని బృందావన్ రిసార్ట్‌లో తెలంగాణ జనసేన 32 నియోజకవర్గ కార్యానిర్వహక సభ్యులతో సమావేశం అవుతారు.. తెలంగాణలో జనసేన పార్టీ కార్యాచరణపై ముఖ్య నాయకులకు పవన్ కల్యాణ్‌ దిశా నిర్దేశం చేస్తారు.. ఆ తర్వాత సాయంత్రం 3.30 నిమిషాలకు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న ఆయన.. ధర్మపురి నుండి అనుష్టుస్ నారసింగ యాత్రగా 32 క్షేత్రాల సందర్శన యాత్ర ప్రారంభిస్తారు.. ఇక, సాయంత్రం 5.30 నిమిషాలకు తిరిగి హైదరాబాద్ ప్రయాణం కానున్న పవన్‌ కల్యాన్‌.. రాత్రికి హైదరాబాద్‌ చేరుకుంటారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...