23.7 C
Hyderabad
Friday, April 24, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 120

హైదరాబాద్ లో కాల్పుల కలకలం..

హైదరాబాద్ లో కాల్పుల కలకలం.. మూడు రౌండ్లు కాల్పులు చేసి మరి !

యధార్థవాది ప్రతినిధి హైదరాబాద్:
హైదరాబాద్ మహానగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లాలో అర్ధరాత్రి కాపుల కలకలం రేగింది. మూడు చింతలపల్లి మండలం ఉద్దెమర్రిలోని వైన్ షాప్ వద్ద గుర్తు తెలియని దుండగులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు..అనంతరం వైన్స్ సిబ్బందిని బెదిరించి రూ. రెండు లక్షలు ఎత్తుకెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటనకు కారణమైన నిందితులను గాలించే పనిలో పడ్డారు పోలీసులు. కాగా ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌..

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌..

యధార్థ వాది ప్రతినిధి హైదరాబాద్‌:

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగులకు ఒక డీఏ (2.73 శాతం) మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..జనవరి పింఛన్‌తో కలిపి ఫిబ్రవరిలో పింఛన్‌దారులకు డీఏచెల్లించనుంది. 2021 జులై నుంచి 2022 డిసెంబర్‌ నెలాఖరు వరకు 8 విడతల్లో డీఏ బకాయిలను జీపీఎఫ్‌లో జమ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరవు భత్యం (DA) 2.73 శాతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల డీఏను 17.29 నుంచి 20.02 శాతానికి పెంచినట్లు తెలిపారు. డీఏ పెంపుతో 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంచలన వ్యాఖ్యలు చేశాన. మాజీ మంత్రి బాలినేని

సంచలన వ్యాఖ్యలు చేశాన. మాజీ మంత్రి బాలినేని

సీఎం జగన్‌ అలా అంటే.. నేనైనా వైదొలగాల్సిందే: మాజీ మంత్రి బాలినేని

యదార్థవాది ప్రతినిధి సింగరాయకొండ:

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్‌ ఇవ్వకపోవచ్చని అన్నారు.. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మార్కెట్ యార్డు ఛైర్మన్‌ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన… ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.’ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్‌ రాకపోవచ్చు. నా భార్య సచీదేవికి టికెట్‌ ఇస్తారేమో? నీకు సీటు లేదు. నీ భార్యకు ఇస్తామని సీఎం జగన్‌ అంటే నేనైనా చేసేదేమీ లేదు. ఈసారి మహిళలే.. అని తేల్చి చెబితే నేనైనా పోటీ నుంచి వైదొలగాల్సిందే. నియోజకవర్గ స్థాయి నేతలు విభేదాలు పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పని చేయాలి. జిల్లాలోని కొండేపి వైకాపా సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు.. పార్టీ కార్యకర్తలు, నాయకులను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.ఈ వేదిక మీదుగా చెబుతున్నా.. పార్టీ గెలుపు కోసం అందరితో నడవాలి. 2019లో కొండేపి నియోజకవర్గంలో వైకాపా ఓటమిని చవిచూసింది. ఈ సారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లో గెలిచి తీరాలి. వైకాపా జెండా ఎగురవేయాలి” అని బాలినేని శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు.

అండమాన్‌ దీవులకు..నామకరణం చేసిన ప్రధాని

అండమాన్‌ దీవులకు..నామకరణం చేసిన ప్రధాని

అండమాన్‌ దీవులకు పరమ్‌ వీర్‌ చక్ర గ్రహీతల పేర్లు.. నామకరణం చేసిన ప్రధాని

యదార్థవాది ప్రతినిధి దిల్లీ:

ప్రధాని నరేంద్రమోదీ సోమవారం అండమాన్‌ నికోబార్‌లోని 21 దీవులకు పేర్లు పెట్టారు. 21 మంది పరమ్‌వీర్‌ చక్ర గ్రహీతల పేర్లు వీటికి పెట్టారు..పరాక్రమ్‌ దివస్‌ను పురస్కరించుకొని.. పేర్లు లేని వాటికి తాజాగా పేర్లు పెట్టారు. అలాగే నేతాజీ గౌరవార్థం ఒక జాతీయ స్మారకం నమూనాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా పాల్గొన్నారు.’ఈ అండమాన్‌ గడ్డ మీదే మొదటిసారి మన త్రివర్ణపతాకం రెపరెపలాడింది. స్వతంత్ర భారత్‌కు చెందిన ప్రభుత్వం మొదట ఇక్కడే ఏర్పాటైంది. ఈ రోజు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి. ఈ రోజును దేశం పరాక్రమ్‌ దివస్‌గా నిర్వహిస్తోంది. ఈ 21 మందికి దేశమే అన్నింటికంటే ముఖ్యం. ఈ పేర్లు పెట్టడం ద్వారా వారి తీర్మానం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అలాగే అండమాన్‌ అభివృద్ధి దిశగా ఎనిమిదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది’ అని ప్రధాని వెల్లడించారు.అండమాన్ దీవుల్లో పేరులేని పెద్ద దీవికి మొదటి పరమ్‌ వీర్ చక్ర గ్రహీత మేజర్ సోమ్‌నాథ్‌ శర్మ పేరుతో నామకరణం చేశారు. ఆయన నవంబర్ 3, 1947లో శ్రీనగర్ విమానాశ్రయం వద్ద పాక్‌ చొరబాటుదారులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇలా మొత్తం 21 దీవులకు పేర్లు పెట్టారు. ‘రియల్ లైఫ్ హీరోలకు సముచిత గౌరవం ఇవ్వడానికి ప్రధాని అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. దానికి అనుగుణంగానే పేర్లు లేని 21 దీవులకు పరమ్‌ వీర్‌ చక్ర గ్రహీతల పేర్లు పెట్టాలని నిర్ణయించారు’ అని ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది.2018లో మోదీ.. రోజ్‌ ఐలాండ్స్‌కు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ద్వీప్‌గా పేరుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక్కడే ఇప్పుడు జాతీయ స్మారకాన్ని నిర్మించేది. అలాగే నీల్ ఐలాండ్‌, హేవ్‌లాక్‌ ఐలాండ్‌కు షాహీద్‌ ద్వీప్‌, స్వరాజ్‌ ద్వీప్‌గా పేరు మార్చిన సంగతి తెలిసిందే.

యువత క్రీడల్లో రాణించాలి

యువత క్రీడల్లో రాణించాలి

క్రికెట్ పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతి ప్రధానం

యదార్థవాది ప్రతినిధి గజ్వేల్ జనవరి 

గ్రామీణ ప్రాంత క్రీడాకారులను వెలికి తీసి జాతీయస్థాయిలో రాణించడానికి ఏర్పడ్డది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అని టిసిఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సోమవారం క్రికెట్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం చేశారు ఆజాదీక అమృత్ మహోత్సవంలో భాగంగా గత నెల రోజులుగా ప్రైమ్ మినిస్టర్ క్రికెట్ కప్ పోటీలు నిర్వహించడం జరిగింది దాదాపు 22 జట్లు పాల్గొన్న జట్లలో ఈరోజు ఫైనల్లో ఆర్ అండ్ ఆర్ కాలనీ కి చెందిన క్రికెట్ జట్టుకు మొదటి ప్రైస్ 20000 రూపాయల నగదు తో పాటు టోపీ, సెకండ్ ప్రైస్ గజ్వేల్ హెల్ రాకర్స్ జట్టుకు 10000 రూపాయలతో పాటు ట్రోఫీ అందజేశారు మాన్ అఫ్ ది మ్యాచ్ తోపాటు నైపుణ్యం ప్రదర్శించిన వారికి క్రీడాకారులకు బహుమతి ప్రధానం చేశారు ఈసందర్భంగా ధరం గురువారెడ్డి మాట్లాడుతూ యువత చదువుతూపాటు క్రీడల్లో రాణించాలని క్రికెట్ క్రీడాకారులకు టిసిఏ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గజ్వేల్ టీసీఏ అధ్యక్షుడు హరిచంద్ర ప్రసాద్, నాగేందర్, బిజెపి నాయకులు నలగామ శ్రీనివాస్, యేళ్లు రాంరెడ్డి, కుడిక్యాల రాములు,మనోహర్ యాదవ్, ఉప్పల మధుసూదన్, క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు.

మంత్రి హరీష్ ట్వీట్..

మంత్రి హరీష్ ట్వీట్..

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త..!

సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనర్లకు కరువు భత్యం (DA/DR) 2.73% పెంచుతూ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ప్రస్తుతం ఉన్న 17.29 శాతాన్ని, 20.02 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ. దీనివల్ల 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.ఈ పెంపు గతేడాది జూలై 1వ తేదీ నుండి వర్తిస్తుంది.

యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

మహాపాదయాత్రకు జిల్లా కేంద్రంలో ఘన స్వాగతం

యదార్థవాది ప్రతినిధి సూర్యాపేట

యాదవుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములు అన్నారు కొండగట్టు వద్ద చేపట్టిన యాదవ మహాపాదయాత్ర సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రీ లింగమంతుల స్వామి దేవాలయం కు చేరుకోగా పొల్ల నరసింహారావు యాదవ్ స్వాగతం పలికారు అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడుతూ జనాభాలో 20 శాతం ఉన్న యాదవులకు రాజకీయంలో విద్యలో సరైన అవకాశాలు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1970 వ సంవత్సరంలో యాదవుల కోసం ఏర్పాటుచేసిన రిజర్వేషన్ రద్దు చేయడం జరిగిందని తిరిగి రిజర్వేషన్ల పునరుద్ధరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో యాదవుల సంక్షేమానికి 5,000 కోట్లను నిధులు కేటాయించాలని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో యాదవుల కోసం నిధులు కేటాయించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు అన్ని రాజకీయ పార్టీలు యాదవులను ఓటు బ్యాంకుగా చూస్తూ ఎన్నికల సమయంలో మాత్రమే వాడుకొని తర్వాత వదిలేస్తున్నాయన్నారు. ఏ రాజకీయ పార్టీ అయితే తమ మేనిఫెస్టోలో యాదవుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలుపుతాయో ఆ పార్టీకి యాదవుల పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో చిలకల శ్రీనివాస యాదవ్, తిరుగుడు రవి యాదవ్, వీరబోయిన గురుస్వామి యాదవ్, మరల శ్రీనివాస్ యాదవ్, ఎల్లావుల రాము యాదవ్, వంగూరి అంజి యాదవ్, లలిత, భారీ అశోక్ ,వీరబోయిన లింగయ్య తదితరులు పాల్గొన్నారు

నేతాజీ 126 వ జన్మదిన వేడుకలు

నేతాజీ 126 వ జన్మదిన వేడుకలు

సిద్ధిపేట: యదార్థవాది ప్రతినిది

సిద్ధిపేట జిల్లా పట్టణంలో స్థానిక నేతాజీ పబ్లిక్ స్కూల్ లో నేతాజీ జన్మ దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధనోపాధ్యాయులు సుభాష్ చిత్ర పటానికి పూలమాల వేసి జ్యోతి వెలిగించి మాట్లాడుతూ నేతాజీ కణకణ మండే నిప్పుకణం.. భారతజాతి వేకువ కిరణం.. స్వాతంత్య్ర కాంక్షను రగిలించిన సూర్యుడు… జయంతే కాని వర్ధంతి లేని అమరుడు..!! ఆజాద్ హింద్ పౌజ్ ను స్థాపించి తెల్లవారి గుండెల్లో నిద్రించిన వీరుడు.. అణువణువునా దేశభక్తిని నింపుకున్న శూరుడు.. జైహింద్ అంటూ నినదించిన ధీరుడు.. స్వాతంత్య్ర సాధనే తన జీవిత ధ్యేయంగా తపించిన భరతమాత ముద్దు బిడ్డ, ఆజాద్ హింద్ ఫౌజ్ జీవగడ్డ,*నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి జరుపుకోవడం వారిని మనం ఆదర్శంగా తీసుకోవడం దేశ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్య ప్రదర్శన నిర్వహించారు విద్యార్థులు, పేరెంట్స్ నీఎంతగానో అలరించింది నేతాజీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పద్మ, జ్యోతి, లావణ్య, ప్రత్యు శా నరేష్ తదితరులు పాల్గొన్నారు.

హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేటీఆర్ అభిమానులు

హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేటీఆర్ అభిమానులు

వరంగల్: యదార్థవాది ప్రతినిది
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో మంత్రి కేటీఆర్ కార్యనిర్వాహణ అధ్యక్షుడిగా 1500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 1500 కొబ్బరికాయలను కొట్టిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరి.. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ రాబోయే రోజులలో కేటీఆర్ నాయకత్వంలో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, ఉన్నత స్థాయి పదవులను అధిరోహించాలని, రాష్ట్రానికి మరిన్ని ఐటి పరిశ్రమలను తీసుకురవాలని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ ఆ దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలేపాక ప్రసాద్, కుంభం శివపటేల్, రవి, సతీష్, జశ్వ, అమర్నాథ్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు..

పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి

పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి

మెదక్ యదార్థవాది ప్రతినిది 

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి రోహిణి ప్రియదర్శిని ఫ్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలుసూచనలు చేశారు ఈ కార్యక్రమంలో రేగోడ్ గ్రామానికి చెందిన సంగమేశ్వర్ రెడ్డి తన కుమారుడు కాంట్రాక్టర్ గా పని చేయుటకు తన పేరు మీద ఏదైనా ఆస్తి ఉంటేనే జాబ్ ఇస్తారని నన్ను నమ్మించి నేను కొనుగోలు చేసిన 7 ఎకరాల భూమిని నా కొడుకు భవిష్యత్తు కొరకు ఆలోచించి వారి పేరుపై చేయించినానని అంతేకాక కొంత నగదు కూడా ఇచ్చినానని, నేను ఇచ్చినటువంటి భూమిలో నుండి నాకు తెలియకుండా 2 ఎకరాల భూమిని అమ్మివేసినాడని నాకు ఏవిదమైన బ్రతుకు తెరువు లేక నా భార్యా పక్షవాతంతో, నేను గుండె నొప్పితో బాదపడుతూ కుటుంబ పోషణకు కొరకు ఆదారం లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నామని కావున తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని రేగోడ్ ఎస్.ఐ. గారికి సూచనలు చేయటం జరిగింది. అలాగే మాసాయిపేట గ్రామానికి చెందిన రేణుక తన గ్రామానికే చెందిన పాపని సత్యనారాయణకు తేదీ:12.09.2018 లో 2,50,000/- రెండు లక్షల యాభై వేల రూపాలను అప్పుగా ఇచ్చామని ఇట్టి అప్పు వారం రోజుల్లో తిరిగి ఇస్తానని అనడంతో ఇచ్చామని ఆ తర్వాత డబ్బులు ఇవ్వమని అడిగితే రేపు మాపు అంటూ డబ్బులు ఇవ్వడం లేదని ప్రతుత్తం తన భర్త ఆరోగ్యం బాగా లేదని ఆస్పత్రి ఖర్చులకి కూడా డబ్బులు లేవని కావున పైన తెలిపిన వ్యక్తి పై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని రామాయంపేట సి ఐ కి గారికి ఆదేశించారు

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...