23.7 C
Hyderabad
Friday, April 24, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 121

సమాజంలో బాలల హక్కులు వినియోగించు కోవాలి:జిల్లా కలెక్టర్

సమాజంలో బాలల హక్కులు వినియోగించు కోవాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

సిరసిల్ల: యదార్థవాది ప్రతినిది

మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో జనవరి 24 జాతీయ బాలికల దినోత్సవం పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి.. సమాజంలో బాలికలు ఎదుర్కొన్న సమస్యలు ప్రజలలో అవగాహన పెంచడానికి, విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, గౌరవం, బాలల హక్కులు, బాల కార్మిక వ్యవస్థ, బాల్యవివాహాలు, లైంగిక హింస, అక్రమ రవాణా మొదలగు వాటి గురించి బాల బాలికలకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక మహిళా, శిశు సంక్షేమ పథకాల వివరించడం జరిగిందని, చిన్నపిల్లలు ఆపదలలో ఉంటే 1098, సేవలు ఉపయోగించుకోవాలని తెలపడం జరిగిందని కలెక్టర్ వివరించారు..ఈ కార్యక్రమం లో జిల్లా సంక్షేమ అధికారి పి. లక్ష్మిరాజం, సంక్షేమ సమితి చైర్మన్ కమటం అంజయ్యల జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఆర్ స్వర్నలత పాల్గొన్నారు.

సత్వరమే పరిష్కరించాలి

సత్వరమే పరిష్కరించాలి

సిద్దిపేట: యదార్థవాది ప్రతినిది

సిద్దిపేట సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి లో భాగంగా సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చిన అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ ప్రజావాణి వినతులు ఆయా శాఖల అధికారులు అర్జి దారులు మళ్లీ అర్జి పెట్టుకోకుండా సత్వరమే పరిష్కరించి న్యాయం చేయ్యాలన్నారు.భూ సంబంధిత, రెండు పడక గదుల ఇండ్లు, ఆసరా పింఛన్లు తదితర మొత్తం దరఖాస్తులు 106 స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఎఓ అబ్దుల్ రహమాన్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి..

ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి..

నిజామాబాద్: యదార్థవాది ప్రతినిది

భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ 126వ జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ మున్సిపాలిటీ మామిడిపల్లిలోని సుభాష్ చంద్రబోస్ ఘనంగా నివాళు అర్పించిన బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్.. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ “జయంతి తప్ప వర్ధంతి ఎరుగునటువంటి” ఓ మహా నేత అని. శాంతియుతంగా ఈ దేశానికి స్వాతంత్య్రం రాదని మహాత్మా గాంధీతో విభేదించి “ఆజాద్ హింద్ ఫౌజ్” సైన్యాన్ని నిర్మాణం చేసి మహిళలను సైతం ఈ సైన్యంలో భాగస్వామ్యం చేయడమైనదని. “జైహింద్” అనే నినాదాన్ని ఇచ్చి “యువకులారా మీరు రక్తాన్ని ఇవ్వండి నేను ఈ దేశానికి స్వాతంత్ర్యం ను ఇస్తానని” చెప్పి నినదించినటువంటి గొప్ప నాయకుడు సుభాష్ చంద్రబోస్ అని. సుభాష్ చంద్రబోస్ అఖండ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రమాణ స్వీకారం చేయడమైందని. అందుకే భారతీయులందరూ సుభాష్ చంద్రబోస్ ను నేతాజీగా పిలుచుకుంటారని. ఇలాంటి నేతాజీని ఈ దేశ యువత ఆదర్శంగా తీసుకొని రాబోయే కాలంలో “ఈ దేశం కోసం–ధర్మం కోసం” పనిచేస్తున్నటువంటి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అన్ని విధాల మద్దతుగా నిలిచి మరోసారి మోడీని ఈ దేశానికి నేతగా, ప్రధానమంత్రిగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు బొట్ల విజయ్, కర్తన్ మధు, దళిత మోర్చ నిజామాబాద్ పార్లమెంట్ కన్వీనర్ నల్ల రాజారాం, బిజెపి ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు శ్యామ్ గౌడ్, దళిత మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి కొంతం మురళి, బిజెపి ఆర్మూర్ పట్టణ కార్యదర్శి చిక్కు గంగాధర్, దళిత మోర్ఛ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పులి యుగంధర్ మరియు అల్జాపూర్ రాజేష్,బారడ్ వినోద్, బొంత శ్రీనివాస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.!

ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.!

హైదరాబాద్: యదార్థవాది ప్రతినిది

హైదరాబాద్ నగర కమిషనర్‌కి.. ప్రత్యేకంగా ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి కత్తులతో దాడులు చేస్తున్నవారిని ఉక్కు పాదంతో అణిచివేయాలని విజ్ఞప్తి చేశారు. శాశ్వతంగా బెయిల్ రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భారతదేశంలో బీబీసీ ప్రోగ్రాంని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై నిషేధించలని అసదుద్దీన్ మాట్లాడుతూ.. ”గుజరాత్ అల్లర్లలో ముఖ్యమంత్రిగా మీరే ఉన్నారు కదా! గాడ్సే గాంధీ హంతకుడు. గాడ్స్‌పైన మీ అభిప్రాయం ఏంటి? గాడ్సేపై తీయబోతున్న సినిమాని మీరు భారతదేశంలో బ్యాన్ చేస్తారా.. లేదా? మీ గురించి బీబీసీ ప్రసారం చేసిన వార్తని బ్యాన్ చేశారు.. ఈ క్రమంలోనే గాడ్సేపైతీయబోతున్న సినిమాని భారతదేశంలో 30 జనవరికి ముందు బ్యాన్ చేస్తారా లేదా? భారతదేశ పార్లమెంట్‌లో అన్ని వర్గాల ఎంపీలు ఎన్నికై వస్తారు. భారతదేశంలో ముస్లింలు ఏకతాటిపై వచ్చి రాజకీయంగా ఓ లీడర్‌షిప్ కింద ఎదగడం రాజకీయ పార్టీలకి నచ్చదు. దేశంలో ముస్లింలు రాజకీయ పార్టీలకి బానిసలుగా ఉండాలని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. 70 సంవత్సరాల నుంచి మమ్మల్ని దోచుకున్నారు. ఈ దేశంలో అగ్రకులస్తులే రాజకీయాల్లో ఉండాలని భావిస్తున్నారు. మైనార్టీ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు దళితులు ఏకితాటిపై రావడం రాజకీయ పార్టీలకి నచ్చదు” అని ప్రశ్నించారు.

లోకేష్ పాదయాత్ర ఆగదు: అచ్చెన్నాయుడు

లోకేష్ పాదయాత్ర ఆగదు: అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం: యదార్థవాది ప్రతినిది 

అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయనా యువగళం పాదయాత్ర ఆగదు..

అనుమతి ఇచ్చిన ఇవ్వకపోయినా యువగళం పాదయాత్ర జరిగి తీరుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు స్పష్టం చేశారు.సోమవారం టెక్కలిలో నిర్వహించిన లోకేష్ జన్మదిన వేడుకల్లో అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్న మాట్లాడుతూ… రేపు అధికారంలోకి వచ్చేది టీడీపీ నే అని ధీమా వ్యక్తం చేశారు. కొంతమంది మంత్రులు సీఎం చంచాగాళ్లలా పనిచేస్తున్నారని విమర్శించారు. ”అసలు డీజీపీ ఐపీఎస్ చడివాడా?.. లేక దొంగ సర్టిఫికెట్లుతో వచ్చాడా” అంటూ మండిపడ్డారు. లోకేష్ పాదయాత్ర ప్రకటించినప్పటి నుంచి వైసీపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. రాష్ట్రంలో చాలా మంది సీఎంలు పనిచేశారని… జగన్ లాంటి సైకో ముఖ్యమంత్రిని చూడలేదని, పిచ్చి సైకో పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడితున్నారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు.

సమాజ సేవలో బాల వికాస ఆదర్శం: మంత్రి ఎర్రబెల్లి

సమాజ సేవలో బాల వికాస ఆదర్శం: మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్: యదార్థవాది ప్రతినిది

బాల వికాస సంస్థ స్పూర్తితో ప్రభుత్వం కూడా అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టిందాని గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.. బాల వికాస సమాజ అభివృద్ధి పథకాల నాయకుల జాతీయ స్థాయి మహాసభలో సోమవారం మంత్రి మాట్లాడుతూ సమాజ సేవలో బాల వికాస సంస్థ ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు ఆదర్శం అని, సామజిక సేవలో నంబర్ వన్ గా ఉందని అన్నారు. 40 ఏళ్ల నుంచి బాల వికాస సంస్థతో నాకు అనుబందం ఉందని మంత్గురి గుర్తుచేసుకున్నారు. బాల వికాస సంస్థ స్పూర్తితో ప్రభుత్వం కూడా అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టింది అన్నారు. సంస్థ వ్యవస్థాకురాలు బాల థెరీసా సింగారెడ్డి (బాలక్క) వర్ధన్నపేట, రెడ్డిపాలెంలో పుట్టి కెనడాకు వెళ్లి ఆండ్రే జింగ్రాస్ ను వివాహమాడి, ఆయన అక్కడి డబ్బులు తెచ్చి ఇక్కడ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. మహిళల్లో చైతన్యం కల్పించి , సంఘాలు పెట్టీ ఆర్థిక చేయూత నివ్వడం ద్వారా వారికి ఆత్మ విశ్వాసంతో నిపారని, వీరిని అప్పుడు ఎన్టీ రామారావు డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చారని, స్త్రీ నిధి, డ్వాక్రా వంటి సంస్థల ద్వారా మహిళలు ఆర్ధికంగా బల పడ్డారని, వీటికి స్ఫూర్తి బాల వికాస సంస్థ అని ఈ రోజు సాగర్వంగా తెలుపుతున్న అని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ది సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మీ, సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరెడ్డి సింగారెడ్డి, ఇతర ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

రాష్ట ప్రజలపై చల్లని దీవెనలు ఉండాలి: మంత్రి సత్యవతి

రాష్ట ప్రజలపై చల్లని దీవెనలు ఉండాలి: మంత్రి సత్యవతి

మేడారం: యదార్థవాది ప్రతినిది

సమ్మక్క- సారలమ్మ వనదేవతలను దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, సీఎం కేసీఆర్ పై నిరంతరం అమ్మవారి దీవెనలు ఉండాలని, ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించాలని సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్, ఇతర అధికారులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా నేతాజీ జన్మదిన వేడుకలు

భరతమాత ముద్దు బిడ్డ నేతాజీ జయంతి వేడుకలను తెనాలి మోటార్ సైకిల్ మెకానిక్స్ మరియు అనుబంధ ఫాండ్రి,పంచర్ వాటర్ వాష్,పెయింటింగ్,వెల్డింగ్,వైరింగ్ వర్క్స్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వించరు.. ఈ కార్యక్రమంలో అడపా సంపత్ రాయుడు పాల్గొని మాట్లాడుతూ దేశంకోసం ప్రజల కోసం ఎంతో ఉన్నత చదివినమంచి ఉపాధి ఉన్న మనకోసం భావితరాల భవిష్యత్తు కోసం తన జీవితాని అంకితం చేసిన గొప్ప త్యాగ మూర్తి అని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు సంస్థ సభ్యులు మెకానిక్స్ SK కరముల్లా,పి డేవిడ్,దీపాల వీరభద్రరావు,గోపీ, బ్రహ్మం,ఖాదర్,బాజి,కైరాతి,వలి, గౌస్,సారధి,హబీబ,ఖాసీం,విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నిరు.

బి.ఆర్.కె.ఆర్ భవన్ లో కంటి వెలుగు వైద్య శిభిరాన్ని ప్రారంభించిన: సి ఎస్

బి.ఆర్.కె.ఆర్ భవన్ లో కంటి వెలుగు వైద్య శిభిరాన్ని ప్రారంభించిన: సి ఎస్

హైదరాబాద్: యదార్థవాది ప్రతినిది

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సోమవారం ప్రారంభించారు.. కంటివెలుగు ప్రత్యేక వైద్య శిభిరాన్ని పది రోజుల పాటు నిర్వహించనున్నట్లు అధికారులు తెలియజేశారు. ప్రతి రోజు సుమారు వంద మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. సచివాలయ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఇతర అధికారులు పాల్గొన్నారు..

రాజన్నను దర్శించుకున్న: మాజీ డీజీపీ

రాజన్నను దర్శించుకున్న: మాజీ డీజీపీ

వేములవాడ: యదార్థవాది ప్రతినిది

రాజరాజేశ్వర స్వామి దర్శనానికై కుటుంబ సమేతంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిజిపి దినేష్ రెడ్డి..ఏ ఈ ఓ ప్రతాప నవీన్ శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం, స్వామి వారి చిత్రపటాన్నీ అందించారు. వీరితోపాటు స్థానిక డిఎస్పీ నాగేంద్ర చారి, సిఐ వెంకటేష్ ఎసై వెంకట్రాజం ఉన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...