24.7 C
Hyderabad
Friday, April 24, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 122

రాజన్న భక్తులకు అందుబాటులో అబులేన్స్

రాజన్న భక్తులకు అందుబాటులో అంబులెన్స్

దక్షిణ కాశీగా ప్రతిధ్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానానికి వేలాది భక్తులు నిత్యం దర్శించుకోవడానికి వస్తుంటారు..ఇటీవల క్యూ లైన్ లో భక్తులకు జరిగిన కొన్ని అసౌకర్యాలను తెలుసుకున్న శ్రీ మతి రాజమణి దేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవాలయ భక్తుల సౌకర్యార్థం అత్యవసర సమయాల్లో భక్తులకు అందుబాటులో ఉండేందుకు సోమవారం ట్రస్ట్ సభ్యులు దేవాలయంలో అంబులెన్స్ ను అందుబాటులో ఉంచామని మీడియా తో తెలిపారు. అత్యవసర సమయాల్లో భక్తులు అంబులెన్స్ ను ఉపయోగించుకోవాలనీ అన్నారు..

కంటి వెలుగు కార్యక్రమం పర్యవేక్షణ

దుబ్బాక మున్సిపల్ 16వ వార్డు పాత గ్లోబల్ స్కూల్ లో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేసిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి వనితా భూమి రెడ్డి డిఎంహెచ్ ఓ కాశీనాథ్ కమిషనర్ గణేష్ రెడ్డి తిమ్మాపూర్ phc డాక్టర్ భార్గవి వార్డు కౌన్సిలర్ దేవుని లలిత మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

గడప గడపకు మన ప్రభుత్వంపై సజ్జల సమీక్ష..

గడప గడపకు మన ప్రభుత్వంపై సజ్జల సమీక్ష..

యధార్థవాది ప్రతినిధి తాడేపల్లి:

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.ఆదివారం తాడేపల్లిలో పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఆయన టెలికాన్ఫరెన్స్‌ ద్వారా పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. గృహసారధుల నియామకాలపై ప్రధానంగా చర్చించారాయన. వాస్తవానికి నిన్నటితో(శనివారం) గృహసారధుల నియామక సమయం ముగిసింది. అయితే.. అన్ని నియోజకవర్గాల్లో నియామకాలు పూర్తి కాలేదు. ఈ క్రమంలో.. ఈనెలాఖరు వరకు ఆ సమయం పెంచుతూ సజ్జల ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. ఫిబ్రవరి 1వ తేదీ నుండి గృహసారధులతో మండలాల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.

ఆదివాసీల అతి పెద్ద జాతర నాగోబా:అర్జున్ ముండా..

ఆదివాసీల అతి పెద్ద జాతర నాగోబా:అర్జున్ ముండా..

ఆదిలాబాద్: యదార్థవాది ప్రతినిది

రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతర ఆదివాసీల నాగోబా జాతర అని కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్ ముండా అన్నారు.. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర శనివారం ప్రారంభంమైంది..జాతరను సందర్శించిన మంత్రి నాగోబా ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తామని అన్నారు.. మెస్రం వంశీయులు వారి ఆచారం ప్రకారం మహాపూజలు నిర్వహించి జాతర ఉత్సవాలు ప్రారంభించారు. ఈ నెల 25 వరకు కొనసాగనున్న జాతరకు ఏర్పాట్ల ఘనంగా నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి బేటింగ్‌ (కొత్త కోడళ్ల పరిచయం), 22న జాతర, భక్తుల దర్శనం, ప్రత్యేక పూజలు, 23న ఆదివాసీ దేవుళ్లు పెర్సాపేన్‌, బాన్‌పేన్‌లకు పూజలు, 24న దర్బార్‌ నిర్వహించనున్నారు. 25న బేతాల్‌పూజ, మండగాజలింగ్‌ (ముగింపు కార్యక్రమం)తో జాతర ముగుస్తుంది.

24న “వారాహి”కి కొండగట్టులో పవన్ పూజలు

24న “వారాహి”కి కొండగట్టులో పవన్ పూజలు

హైదరాబాద్: యదార్థవాది ప్రతినిది

కొండగట్టులో ఈ నెల 24న పవన్ కల్యాణ్ తన ఎన్నికల వాహనమైన వారాహికి ప్రత్యేక పూజ చేయించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటన రూట్ మ్యాప్ విడుదల అయింది. పవన్ కళ్యాణ్ ఉ.11 గంటలకు చేరుకొని, ఆలయంలో ప్రత్యేక పూజ తర్వాత వారాహికి పూజలు చేస్తారు..మ.2 గంటలకు కొడిమ్యాల(మం) నాచుపల్లిలో ముఖ్యనేతలతో భేటీ అవుతారు. అనంతరం సా.4 గంటలకు ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. సా.5 గంటలకు పార్టీ కార్యకర్తలతో సమావేశం ఉంటుంది. జగిత్యాల జిల్లాలో పవన్ కళ్యణ్ పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్ విడుదల చేశారు జనసేన నేతలు..ఈనెల 24న హైదరాబాద్ నుండి బయలుదేరి 11 గంటలకు కొండగట్టుకు చేరుకుంటారు పవన్ కళ్యాణ్. కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం వారాహి వాహన పూజ జరుపుతారు. నాచుపల్లి శివారులోని బృందావన్ రిసార్ట్ లో పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పవన్ పాల్గొంటారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం చేపట్టబోయే కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ చర్చించి దిశానిర్దేశం చేస్తారు. ఇదే రోజున అనుష్టుప్ నారసింహయాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శన) ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ సంకల్పించారు. ఈ యాత్రలో భాగంగా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో పూజలు జరిపి శ్రీకారం చుడతారు. అనంతరం మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను పవన్ కళ్యాణ్ సందర్శిస్తారని జనసేన వర్గాలు వెల్లడించాయి.

రోడ్లు ఎలా ఉన్నాయో.. రాష్ట్రం పరిస్థితి కూడా అలాగే ఉంది: నాగబాబు.

యదార్థవాది జనవరి 22 అనంతపురం:

జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు ఆదివారం అనంతపురంలో పర్యటిస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం ఎదురుగా తాడిపత్రి రహదారిని పరిశీలించారు.ధ్వంసమైన చెరువు కట్ట రోడ్డులో శ్రమదానం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్డు మరమ్మత్తు శ్రమదానం కోసం నాగబాబు పిలుపు ఇవ్వడంతో… ప్రభుత్వ అధికారులు నిన్నటి నుంచి హడావిడిగా ధ్వంసమైన చెరువు కట్ట రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. ఈ సందర్భంగా నాగబాబు మీడియాతో మాట్లాడుతూ రోడ్లు ఎలా ఉన్నాయో.. రాష్ట్ర పరిస్థితి అలాగే ఉందని ఎద్దేవా చేశారు. జనసైనికులు రోడ్డు వేస్తారని వైసీపీ ప్రభుత్వం వెంటనే పనులను మొదలుపెట్టిందన్నారు.వారాహి యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభిస్తారో.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని నాగబాబు తెలిపారు. డెమోక్రసీలో ఇల్లీగల్, చట్ట వ్యతిరేక పనులు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు ఎవరైనా.. ఎప్పుడైనా చేయవచ్చునన్నారు. పోత్తుల గురించి మాట్లాడే సమయం ఇప్పుడు కాదన్నారు. సభలు, సమావేశాలు జరగకుండా ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ ఒకటిపై హైకోర్టు మట్టికాయలు వేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం, పోలీసులు ఇబ్బందులు పెట్టినంతమాత్రాన తమ కార్యక్రమాలు ఆగవని నాగబాబు స్పష్టం చేశారు.

టీచర్ల సమస్యలన్ని పరిష్కరించాలి..

టీచర్ల సమస్యలన్ని పరిష్కరించాలి..

హుస్నాబాద్:యదార్థవాది ప్రతినిది

317 జివొ లోపాల వల్ల స్థానికత, సర్వీసు కోల్పోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలి.

సిపిఏస్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి.

టిచర్లను ఆవమానించిన రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన వెంటనే క్షమాపణ చెప్పాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ తెలిపారు. ఏడ్లతరబడి కొట్లాడి సాదించుకున్న ఉద్యోగులకు న్యాయం చేయాలని 13 జిల్లాల స్పౌజ్ బాధిత ఉపాద్యయులు శనివారం హైదరాబాద్ లొ తలపెట్టిన నిరసన సంధర్భంగా ఉపాద్యయులపై అనుచిత వాక్యలు చేస్తు “మీరు టీచర్లా… రౌడీల!” అని అవమానకరంగ మాట్లాడి, బెదిరింపులకు పాల్పడిన రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన ఒక గౌరవ ప్రదమైన హోదాలో ఉండి ఇలా మాట్లాడడం సరైంది కాదని, ఉన్నత మైన స్దాయిలొ ఉన్నతధికారి తమ హోదను మరిచి ఇలా మాట్లాడడం తెలంగాణలో పరిపాటిగ మారిందని మల్లెశ్ తెలిపారు. టీచర్లకు విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన వెంటనే క్షమాపన చెప్పి చదువు ద్వార ఎదిగిన తమ సంస్కారాన్ని నిరూపించుకోవాలని, గత ఏడాది ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవొ ఉన్న అనేక లోపాల వల్ల ఉద్యోగులు తమ స్థానికత,సర్వీసును కోల్పోయిన వారికి న్యాయం చేయాలని, తక్షణమే పరిష్కరించి వెంటనే సిపియస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం తలపెట్టిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించాలని గడిపె మల్లేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఖాత కొమురయ్య మరణం హుస్నాబాద్ ప్రజలకు తీరనిలోటు.

ఖాత కొమురయ్య మరణం హుస్నాబాద్ ప్రజలకు తీరనిలోటు.

హుస్నాబాద్: యదార్థవాది ప్రతినిది

పట్టణం కస్తూరిబా కాలనికి చెందిన ఖాత కొమురయ్య అనారొగ్యంతో బాధపడుతు శనివారం సాయంత్రం మరణించారు కొమురయ్య ఆనాడు నిజాం నవాబు రజాకార్లు దొరల దొపిడి పెత్తందార్ల ఆగడాలను అరికట్టడానికి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బద్దం ఎల్లారెడ్డి, అనభేరి ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతి, రెడ్డి,గట్టెపెల్లి మురళి,గుండి దామొదర్ రావు,ముస్కు ఎల్లారెడ్డి,పిట్టల వెంకన్న,వంగపెల్లి సోమరాజం నాయకత్వంలొ సాగిన అనేక ప్రజా పోరాటాలకు ఆకర్షితుడై కమ్యూనిస్టు సావుల ఎల్లయ్య, పార్నంది రాజయ్య,గూల్ల ఆశయ్య, గడిపె పోచయ్య,లతొ కలిసి ఖాత కొమురయ్య పేదల రాజ్యం స్దాపన, సమసమాజం నిర్మాణం దున్నేవాడికి భూమి ఇవ్వలని,హుస్నాబాద్ ఏనే భూమిని పేదలందరికి పంచాలని వెట్టి చాకిరీ బానిసత్వాన్ని అంతం చేయడానికి అనేక సార్లు ప్రజా పోరాటాలు చేసి కరీంనగర్ కొర్టుల చుట్టూ తిరిగి భూములు పంచేందుకు అభ్యుదయ భావాలు కలిగిన ఆనాటి నవ యువకుడు హుస్నాబాద్ లొ వార్డు సభ్యులుగా ఎన్నికైన ఖాత కొమురయ్య పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎనలేని సేవలు చేశారని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ గుర్తు చేశారు. సిపిఐ నాయకులతొ కలిసి ఖాత కొమురయ్య భౌతికకాయాన్ని ఆదివారం సందర్శించి ఎర్ర జెండా కప్పి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి,ఎఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జనగాం రాజు కుమార్,పెట్టుగడి గణేష్, సిపిఐ నాయకులు ఎండి అక్బర్,వడ్లూరి మల్లయ్య కస్తూరిబా కాలనికి వాసులు మహిళలు,విద్యార్థులు, యువకులు,రైతులు కూలీలు,అసంఘటిత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

మావి గొంతెమ్మ కోర్కెలు కాదు.. బకాయిలనే అడుగుతున్నాం: బొప్పరాజు వెంకటేశ్వర్లు..

మావి గొంతెమ్మ కోర్కెలు కాదు.. బకాయిలనే అడుగుతున్నాం: బొప్పరాజు వెంకటేశ్వర్లు..

యధార్థ వాది 22 జనవరి అనంతపురం:

ఫిబ్రవరి 5 తర్వాత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.కర్నూలులో నిర్వహించనున్న ఏపీ జేఏసీ అమరావతి మూడో రాష్ట్ర మహా సభల సన్నాహక సమావేశంలో భాగంగా అనంతపురంలో నిర్వహించిన భేటీలో ఆయన పాల్గొన్నారు. తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని.. తమకు రావాల్సిన బకాయిలనే గౌరవంగా అడుగుతున్నామని చెప్పారు. ఉద్యోగ సంఘాల్లో ఐక్యత లేదన్న దాంట్లో నిజంలేదని.. ఉద్యమం వస్తే అందరం కలిసి పోరాడతామని చెప్పారు. ”మాకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి. మా డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకుంటోంది. గతంలో పండగ సమయాల్లో ముందే జీతాలిచ్చేవారు. ఒకటో తేదీకల్లా జీతాలు ఇవ్వండని అడిగే పరిస్థితి వచ్చింది. చట్టప్రకారం మాకు రావాల్సినవి కూడా ఇవ్వట్లేదు. కొత్త జీవోలఊసే లేకుండా పోయింది. సీపీఎస్‌ రద్దు చేస్తామన్నారు. ఇప్పటివరకు పట్టించుకోలేదు. ఎవరికీ మినిమం టైమ్‌ స్కేల్‌ ఇవ్వట్లేదు. ఆర్టీసీ ఉద్యోగులకు ఇప్పటికీ అలవెన్సులేమీ ఇవ్వలేదు. ఒప్పంద ఉద్యోగులను ఎందుకు క్రమబద్ధీకరించలేదు. ఎన్ని కమిటీలకు చెప్పినా ఫలితం ఇంతవరకూ లేదు. కరోనా బారినపడి వందల మంది చనిపోతే ఒక్క రూపాయి ఇవ్వలేదు. రిటైర్‌మెంట్‌ బెన్‌ఫిట్‌లు చెల్లించట్లేదు” అని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీ మూడు రాజధానులపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

ఏపీ మూడు రాజధానులపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

యదార్థవాది 22 జనవరి వైజాగ్:

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ప్రచారంలో పాల్గొన్న ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఒకే రాజధానికి కట్టుబడి వున్నామని.. అది అమరావతేనని స్పష్టం చేశారు. రాజధాని కోసం వేల కోట్లు నిధులు కేంద్రం ఇచ్చిందని, డబ్బు ఖర్చు పెట్టకుండా ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజధాని లేకుండా సీఎం జగన్ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామన్న వారినిప్రశ్నించకుండా.. అమరావతికే కట్టుబడి ఉన్నామన్న తమను ఎందుకు ప్రశ్నిస్తారని మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రి జగన్ ఆరేళ్లు రోడ్డు మీద నడిచారని, ఇప్పుడు ప్రతిపక్షాలను రోడ్డు ఎక్కనివ్వకుండా జీవో ఇచ్చారని సోము వీర్రాజు మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలతో రాష్ట్రం నష్టపోయిందని.. మేము అభివృద్ధి చేస్తుంటే ఇతర పార్టీలు రాజకీయాలు మాట్లాడుతున్నాయన్నారు. ఆయుష్ డిపార్ట్‌మెంట్‌లో పెడింగ్‌లో పెట్టిన అంశాలను భీమవరం సభలో తీర్మానం చేస్తామన్నారు. మేము చేస్తున్న అభివృద్ధి చెపుతున్నామని… ఇతర రాజకీయపార్టీలు కేవలం హడావిడి చేస్తున్నాయని సోము వీర్రాజు విమర్శించారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...