38.2 C
Hyderabad
Friday, April 24, 2026

తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యం

తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యం

యదార్థవాది ప్రతినిధి ఆర్మూర్

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ లో పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గృహంలో బుదవారం భారతీయ జనతా పార్టీ పట్టణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ లు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఈ నెల10 తేదీ నుండి 25 వ తారీకు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శక్తి కేంద్ర పరిధిలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించడానికి పిలుపునిచ్చిన సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో ఉన్నటువంటి శక్తి కేంద్ర పరిధిలో స్ట్రీట్ మీటింగ్ ప్రణాళికను రూపొందించుకొని, కార్యక్రమ విజయవంతనికై ప్రతి కార్యకర్త ప్రధానంగా శక్తి కేంద్ర ఇంచార్జులే పూర్తి బాధ్యతని తెలియజేశారు. ఈ సమావేశంలో బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజు, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు, పట్టణ ఉపాధ్యక్షులు పాన్ శీను, భూసం ప్రతాప్, కార్యదర్శి ఖాంధేశ్ ప్రశాంత్, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా గోస బిజెపి భరోసా

ప్రజా గోస బిజెపి భరోసా

యదార్థవాది ప్రతినిధి కామారెడ్డి

బిజెపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఫిబ్రవరి 10 నుండి 25 వరకు జిల్లాలోని అన్ని నియోజకర్గాల్లోనీ గ్రామాలలో ప్రజా గోస బీజేపీ భరోసా లో భాగంగా స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నిర్వహించనున్నమని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణా తార ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన ను ప్రజల్లోకి తీసుకెళ్లి, కేంద్రం లోని నరేంద్రమోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లే ఉద్దేశ్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని పిలపునిచ్చారు

మున్నూరుకాపు సంఘ కార్యవర్గ సమావేశం

మున్నూరుకాపు సంఘ కార్యవర్గ సమావేశం

యదార్థవాది ప్రతినిధి బాసర

నిర్మల్ జిల్లా బాసర మండలంలో మున్నూరుకాపు సంఘ భవనం లో బుధవారం మండల అధ్యక్షులు అంతగిరి రాజన్న ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశనికి ముఖ్య అతిథిగా ముధోల్ తాలూకా మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు రోల్ల రమేశ్ పాల్గొన్నారు అధ్యక్షులు రోల్ల రమేశ్ మాట్లాడుతూ మనం సంఘ సమావేశాలు ఏర్పాటు చేస్తూ, అందరిని కలుస్తూ మన సంఘాలను అభివృద్ధి దిశగా తీసుకొని వెలుతూ మన ఆశయాన్ని సాధిద్దామని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల సంఘం ప్రధాన కార్యదర్శి జంగం రమేశ్ ఉపాధ్యక్షులు రావుల భోజన్న కోశాధికారి భైరశెట్టి సంజీవ్ తాలూకా సంఘం సహా కార్యదర్శి నానం నర్సయ్య సలహాదారులు బలగం దేవేందర్ సభ్యులు శ్రీనివాస్ బాసర సంఘం అధ్యక్షులు నాగరాజు కోశాధికారి కొట్టె చిన్న ఎల్లప్ప ,సభ్యులు మల్కన్న కాకా బలగం కిషోర్ ఎతలా సాయన్న R విట్టల్ బాసర మండలంలోని అన్ని గ్రామాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఫార్మా పరిశ్రమలో ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

ఫార్మా పరిశ్రమలో ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

యదార్థవాది ప్రతినిధి సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం పారిశ్రామికవాడలోని లీ ఫార్మా పరిశ్రమలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవాశాత్తు అగ్ని ప్రమాదం జరిగి పరిశ్రమలో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఫార్మా కంపెనీల్లో పెద్ద ఎత్తు కెమికల్స్‌ నిలువ ఉండడంతో మంటల దాటికి కెమికల్స్‌ డ్రమ్స్‌ పేలిపోతున్నాయి కార్మికులు మంటలు అర్పడానికి ప్రయత్నం చేసినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో పరిశ్రమ అధికారులు వెంటనే ఫైర్ సిబ్బందికి మాచారం అందించడంతో నాలుగు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నారు.

రైతుల ధర్నా

రైతుల ధర్నా

స్వరాష్ట్రంలో రైతులకు కరెంటు కష్టాలు..

యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్

ఎండకాలం రాకముందే రైతులకు కష్టాలు మొదలయ్యాయని బుదవారం కోహెడలో రైతులు రాస్తారోకో చేశారు.. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లి గ్రామ రైతులు కరెంటు కోతల వల్ల పంటలు ఎండిపోతున్నాయని వేలాపాలలేని కరెంటు కోత వల్ల పంట నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు వాపోయారు, స్థానిక ఎమ్మెల్యే ఓడితల సతీష్ కుమార్ తక్షణమే కరెంటు తిప్పలు తీర్చాలని, ప్రభుత్వం ఇచ్చిన 24 గంటల కరెంటు వాగ్దానాన్ని నెరవేర్చాలని కోహెడ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్ద తీగలకుంటపల్లె, వివిధ గ్రామాల రైతులు రెండు గంటల పాటు ధర్నా, రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు పై అధికారులతో చర్చించి విద్యుత్ కోత లేకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ధర్నాలో తీగలకుంటపల్లి గ్రామ సర్పంచ్ మేకల చంద్రశేఖర్ రెడ్డి, కోహెడ బిజెపి నాయకులు వెంకటేశం, గుగ్గిళ్ళ శ్రీనివాస్ వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

కొండగట్టు ఆలయ అభివృద్ధికి నిధులను విడుదల

కొండగట్టు ఆలయ అభివృద్ధికి నిధులను విడుదల

యదార్థవాది ప్రతినిది హైదరాబాద్

కొండగట్టు ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రణాళిక శాఖ బుధవారం 100కోట్ల నిధుల ఉత్తర్వులు జారీ చేసింది… జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ ఆలయ అభివృద్ధికి నిధులను విడుదల చేసిన ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్‌లో జిల్లా పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొండగట్టు అభివృద్ధికి రూ.100కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆంజనేయస్వామి సన్నిధికి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారని, ఆలయాన్ని అద్భుతంగా నిర్మించేదుకు 100కోట్ల నిధులు దోహత పడతాయని తెలిపారు. త్వరలోనే వచ్చి ఆగమశాస్త్రం ప్రకారం భారతదేశంలోనే సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా నిర్మిస్తామిన హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఇచ్చిన మాట ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆర్ఎంపి పి.ఎం.పి నూతన కార్యవర్గం ఎన్నిక

ఆర్ఎంపి పి.ఎం.పి నూతన కార్యవర్గం ఎన్నిక

యదార్థవాది ప్రతినిధి హుజురాబాద్

హుజురాబాద్ మండలం టిఆర్ఎస్ ఆఫీసులో విఘ్నేశ్వర ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎలక్షన్ జరిగింది ఈ ఎలక్షన్లో ఆర్ఎంపీలు 45 మంది పాల్గొన్నారు ఈ ఎలక్షన్లలో గౌరవ అధ్యక్షులుగా సంగెం ఐలయ్య అధ్యక్షుడుగా కందగట్ల శ్రీనివాస్ ఉపాధ్యక్షులుగా ఎర్రోళ్ల సదానందం కన్నబోయిన తిరుపతి ప్రధాన కార్యదర్శిగా చిలకమారి శ్రీనివాస్ సంయుక్త కార్యదర్శిగా చిందం రామరాజు కోశాధికారిగా చింద్యాల కమల్ సింగ్ గౌరవ సలహాదారులుగా అడ్డగట్ల కృష్ణమూర్తి శ్రీపతి ధనుంజయ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా శనిగరపు పరమేష్ కార్యవర్గ సభ్యులుగా గొల్లపల్లి రమణ చారి మామిడి రమేష్ కుసుమ రాజు కొలిపాక జగదీష్ సబ్బని జగదీష్ అల్లి జగదీష్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది

హృదయాలను కదిలించే వీడియో..

హృదయాలను కదిలించే వీడియో..

భూకంప శిథిలాల కింద బిడ్డకు జన్మనిచ్చిన తల్లి సిరియాలోని అలెప్పోలో భూకంపం వల్ల కూలిన భవనంలో చిక్కుకుపోయిన గర్భవతి.. శిథిలాల కిందే ప్రసవించి కన్నుమూత.. పసికందును తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్..

రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ.. నిరసన

రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ.. నిరసన

యదార్థవాది బ్యూరో ములుగు

ములుగు పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ను పేల్చేయాలని బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్దేశించి పరుష పదజాలంతో చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ములుగు జడ్పీ చైర్మన్ జిల్లా అధ్యక్షులు మరియు నియోజకవర్గ ఇన్చార్జ్ కుసుమ జగదీష్. పిలువు మేరకు ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ఆధ్వర్యంలో నేడు ములుగు మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి. దిష్టిబొమ్మను దగ్ధం చేసి, నిరసన వ్యక్తం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల యొక్క పరిపాలనా భవనమైనట్టి ప్రగతి భవన్ ను నక్సలైట్లు పేల్చేయాలని బహిరంగంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, డిమాండ్ చేశారు. ఒక ఎంపీ హోదాలో ఉండి ఇలా మాట్లాడాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా జవాబు చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి ములుగు ఎమ్మెల్యే సీతక్క నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చేసిన ప్రసంగాన్ని సుమోటోగా తీసుకుని పీడీ యాక్ట్ నమోదు చేసి వారిరువురుని ఎమ్మెల్యే ఎంపీ పదవుల నుండి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమాల్లో జిల్లా నాయకులు ఎంపీపీలు, జడ్పిటీసీలు, పలు మండలాల మండల అధ్యక్షులు PACs చైర్మన్లు, రైతు సేవా సమితి అధ్యక్షులు, ముఖ్య నాయకులు, అన్ని గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కంటి వెలుగు కు విద్యార్థులను తరలింపు

ఎన్ ఫోర్స్ మెంట్ వాహనంలో చిన్నారుల తరలింపు

కంటి వెలుగుకు విద్యార్థులు

అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు

యదార్థవాది బ్యూరో సిద్దిపేట

సిద్దిపేట మున్సిపల్ కు చెందిన ఎన్ ఫోర్స్ మెంట్ వాహనంలో చిన్నారుల తరలింపుతో, ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మేజహర్ మాలిక్ మండిపడ్డారు. బుధవారం సిద్దిపేట పట్టణంలో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన విద్యార్థులను మున్సిపల్ వాహనంలో ఎలా తరలిస్తారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ అధికారుల పిల్లల్ని కూడా ఇలాగే తరలిస్తారా అని ప్రశ్నించారు మున్సిపల్ ఎన్ ఫోర్స్ మెంట్ వాహనాన్ని ప్లాస్టిక్ విక్రయిస్తున్న దుకాణాలపై, పుట్ పాత్ లపై ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగించేందుకు ఉపయోగిస్తారని అలాంటి వాహనంలో విద్యార్థులను తరలించడం బాధాకరమని తెలిపారు. విద్యార్థులను ఎక్కడికి తీసుకెళ్తున్నారని సంబంధిత ఉపాధ్యాయురాలిని అడగగా కంటి వెలుగు కార్యక్రమానికి తీసుకెళ్తున్నట్లు చెప్పారని అన్నారు. 18 ఏళ్లకు పైబడినవారు కంటి వెలుగుకు అర్హులని ప్రభుత్వం చెబుతుందని అధికారులు మాత్రం ఎనిమిది, తొమ్మిది తరగతుల విద్యార్థినీలను కంటి వెలుగుకు ఎలా తరలిస్తారని మండిపడ్డారు. కంటి వెలుగుకు తరలిస్తున్న విషయాన్ని విద్యార్థినీల తల్లిదండ్రులకు సమాచారం అందించారా అని ప్రశ్నించారు. కంటి వెలుగు కార్యక్రమం 100% సక్సెస్ చేయాలని ఉద్దేశంతో అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటు అన్నారు. దీనిపై సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి విద్యార్థినీల తల్లిదండ్రులకు పట్టణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారని మండిపడ్డారు. విద్యార్థినీలకు అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట మైనార్టీ పట్టణ అధ్యక్షులు సయ్యద్ అతిక్. ఎన్ ఎస్ ఏ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రషద్. యూత్ కాంగ్రెస్ నాయకులు గయాజుద్దీన్ తదితరులు నాయకులు పాల్గొన్నారు

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...