37.2 C
Hyderabad
Friday, April 24, 2026

భర్తను చంపిన భార్య అక్రమ సంబంధమే కారణం

భర్తను చంపిన భార్య అక్రమ సంబంధమే కారణం

యదార్థవాది బ్యూరో

ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం , ఔషపూర్ గ్రామంలో వృత్తిరీత్యా కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తున్న మౌలాన్-శాంతి కుటుంబం.. శాంతి తన ప్రియుడు బాబు తో అక్రమ సంబంధం పెట్టుకొని గత కొన్ని రోజులుగా పలుమార్లు ఇంట్లో గొడవలు జరగడంతో విసిగెత్తిన భార్య శాంతి , తన భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది , భర్త సేవించే మందులో విషం కలిపిన భార్య శాంతి- ప్రియుడు బాబు ,శాంతి విషయం బయటకు రాకుండా తన భర్త కడునొప్పితో చనిపోయారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది…రంగంలోకి దిగిన పోలీసులు , మృతి చెందిన మౌలాన్ మృతదేహాని పోస్టుమార్టం నిమ్మిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.. పోస్టుమార్టం రిపోర్ట్ చూసి ఆచార్య పోయిన పోలీసులు . మొదట విచారణ నిమ్మిత్తం భార్య శాంతి అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు బయటకు వచ్చాయి..పోలీసుల అదుపులో భార్య శాంతి తన ప్రియుడు బాబు.తమ అక్రమ సంబంధంకు అడ్డు వస్తున్నాడని అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడు బాబు తో కలిసి భర్తను చంపినట్లు ఒప్పుకున్న భార్య శాంతి.

పి ఆర్ టి యు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పి ఆర్ టి యు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

యదార్థవాది బ్యూరో

కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం పి ఆర్ టి యు భవనంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొని పలువురు ఉపాధ్యాయ, ఉపాధ్యాయురాళ్ళను సన్మానించి అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు చేసిన సేవలను కొనియాడారు.నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు అవుతారని ఆయన అన్నారు. ఉపాధ్యాయ వృత్తి చేపట్టి ఉన్నత స్థానాల్లో ఉన్న పలువురిని గుర్తుచేశారు.కలెక్టర్ సన్మానించినన వారిలో సీనియర్ ఉపాధ్యాయురాళ్లలో ఎన్. గంగమణి, ఈశ్వర్ మనోహర్ తదితర ఉపాధ్యాయులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, యం ఈ ఓ ఎల్లయ్య, పి ఆర్ టీయూ అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి కార్యదర్శి కుషాల్ పట్టణ అధ్యక్షుడు సంతోష్ మిగతా పి ఆర్ టి యు నాయకులు పాల్గొన్నారు

రైతును రాజుగా చేయడమే కేసీఆర్ లక్ష్యం

రైతును రాజుగా చేయడమే కేసీఆర్ లక్ష్యం

యదార్థవాది బ్యూరో

బీబీపేట్ మండలంలోని మాందాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ అవరణలో రైతుబంధు సమితి కాలమనినీ మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడారు. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం రైతులని రాజుగా చేసే వినూత్న ప్రక్రియ తమ భుజాలపై ఎత్తుకొని రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం రైతుబంధు పథకం, రైతు కుటుంబాలకు అండగా ఉండేందుకు రైతుభీమా పధకం వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతు భుజంపై చేయివేసి వెన్నుతడుతున్నది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. దేశంలోనే రైతుల కోసం రాష్ర్ట ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తోందనీ, రైతులు సమావేశాలు నిర్వహించుకోవడానికి వీలుగా రైతువేదికలు నిర్మించారని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణే అని, ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నర్సింలు,సర్పంచ్ రేవతీ శ్రీనివాస్,ఎంపిటిసి లక్ష్మారెడ్డి, ఆర్ఐ అజయ్,ఉపసర్పంచ్ బాపురెడ్డి,పంచాయతీ కార్యదర్శి నవీన్, ఏఈఓ సాగర్, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రాజిరెడ్డి, వార్డ్ సభ్యులు రాజమల్లయ్య, రాజిరెడ్డి, రైబస సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు గంగారాం,రవి, శ్రీధర్ రెడ్డి, దేవరాజ్,లింగరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

అప్పు తీర్చలేక ప్రాణ స్నేహితుడిని హతమార్చాడు

అప్పు తీర్చలేక ప్రాణ స్నేహితుడిని హతమార్చాడు

యదార్థవాది బ్యూరో నందిపేట్

తీసుకున్న అప్పు తీర్చలేక తనతోపాటు చదువుకున్న ప్రాణ స్నేహితుని హత్య చేసిన సంఘటన నందిపేట మండలంలోని ఉమ్మెడ గ్రామంలో జరిగింది. ఏసీపి.ప్రభాకర్ రావు పత్రికా విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం ఉమ్మడి గ్రామానికి చెందిన ఎర్రగట్ల.శ్రీకాంత్s/o బాలన్న(25) కనబడుటలేదని అతని అన్న ఎర్రగట్ల బాలరాజు 30/11 రోజున ఫిర్యాదు చేయడంతో ఎస్సై శ్రీకాంత్ మిస్సింగ్ కేసు 172 సెక్షన్ కిందనమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు తేదీ 3/12 రోజున అనుమానంతో గోదారి పరిసర ప్రాంతాల్లో వెతకగా మృతుడి బైక్ బ్రిడ్జి దగ్గర ఉండడంతో దీంతో గోదావరి తీరంలో వెతకడంతో సమీపంలో మృతదేహం లభించింది.దీంతో అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు దర్పంగా 8/2/2023 రోజు ఉదయం మృతుడి స్నేహితుడైన నాగం భోజేందర్ ను నందిపేట బస్టాండ్ లో పట్టుకొని విచారించరగా ఎరుగట్ల శ్రీకాంత్ దగ్గర ఎవరికి తెలియ కుండా 2 లక్షలు రూపాయలు అప్పుగా తీసుకున్నానని అతను దుబాయ్ నుండి తిరిగి రాగానే తన డబ్బులు తనకు ఇవ్వమని ఒత్తిడి చేయడంతో అతనిని హత్య చేస్తే డబ్బులు ఇవ్వాల్సిన పని ఉండదని పథకం ప్రకారం 3/2/2023 రోజున సాయంత్రం 6:30 గంటల సమయంలో ఫోన్ చేసి గోదావరి నది బ్రిడ్జి వద్దకు రమ్మని చెప్పడం జరిగిందని అతను వచ్చిన తర్వాత బ్రిడ్జి గోడపై కూర్చోండి మాట్లాడుతున్న సమయంలో అనుకున్న ప్రకారం నదిలోకి నెట్టివేసి చంపివేశానని. మృతుడి బైక్ అక్కడే వదిలేసి అందరూ ఆత్మహత్య అనుకోవాలని అక్కడి నుండి పారిపోయినట్లు నేరస్థుడు నాగంబోజేందర్ తెలిపినట్లు నేరస్తున్ని కోర్టుకు హాజరు పరుచుతున్నట్లు ఏసీపి.ప్రభాకర్ రావు తెలిపారు.హత్య కేసును చేదించిన సీఐ గోవర్ధన్ రెడ్డి,ఎస్సై శ్రీకాంత్,ఎస్ ఐ 2,అరిపోద్దిన్,ఏఎస్ఐ రాజేందర్,పిసి.ముత్యం,విట్టల్,గంగ నరసయ్యలను అభినందించారు..

విద్యార్థులను సన్మానించిన జిల్లా కలెక్టర్

విద్యార్థులను సన్మానించిన జిల్లా కలెక్టర్

యదార్థవాది బ్యూరో

కామారెడ్డి లోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎన్.సి. సి. విద్యార్థులు ఆర్. చందు, ఎం. అరుణ గత నెలలో ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల సందర్భంగా రిపబ్లిక్ డే పెరేడ్ లో పాల్గొని కామారెడ్డి చేరుకున్న విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు.
స్థానిక రైల్వే స్టేషన్ నుంచి దేశభక్తి పాటలతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు ప్రధాన రహదారి గుండా భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. కిష్టయ్య మాట్లాడుతూ “ఈ విద్యా సంవత్సరం లో ఆర్ చందు, ఎం అరుణ లు రిపబ్లిక్ డే పేరేడ్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి ప్రధానమంత్రి, రక్షణ శాఖ మంత్రి ప్రశంసలు అందుకోవడం కళాశాలకు గర్వకారణం. కామారెడ్డి కీర్తి ప్రతిష్టలను ఢిల్లీలో ఎగురవేయడం అభినందనీయం” అని అన్నారు.ఎన్. సి సి అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ ఎం. రామస్వామి మాట్లాడుతూ “ఇప్పటివరకు కళాశాల నుంచి 38 మంది కాడెట్లు రిపబ్లిక్ డే పెరేడ్ లో పాల్గొన్నారు. తమ క్యాడేట్స్ ఎంతో మంది భారత సైన్యం త్రివిధ దళాలలో పనిచేస్తున్నార”ని తెలిపారు.
అనంతరం కళాశాలలోని చింతల బాలరాజ్ గౌడ్ మెమోరియల్ ఆడిటోరియంలో విద్యార్థులను ఘనంగా సన్మానించారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకడమిక్ కోఆర్డినేటర్ ఈ. రాజ్ కుమార్, ఐక్యూ ఏ సి సమన్వయకర్త డాక్టర్ పి. రామకృష్ణ, అధ్యాపకులు కే. రాణి డాక్టర్ వి. శంకర్, ఎన్ .రాములు డాక్టర్ కే. కృష్ణమోహన్ , డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ పి. రాజగంభీర్ రావ్, మల్సూర్, సుచరణ్ , స్వాతి, శ్రీలత, శ్రీవేణి, అనిల్ కృష్ణ ,లక్ష్మణ్, వినోద్, అనిల్ కుమార్, రమేశ్ , సూపరింటండెంట్ ఆంజనేయులు, నవీన్, హరీశ్, దేవేందర్, మారుతి, గోవర్ధన్, వసంత, లత తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల షెడ్యూల్‌ విడుదల..

ఎన్నికల షెడ్యూల్‌ విడుదల..

యదార్థవాది న్యుడిల్లి

నోటిఫికేషన్‌- ఫిబ్రవరి 16

నామినేషన్లకు చివరి తేదీ- ఫిబ్రవరి 23

నామినేషన్ల పరిశీలన- ఫిబ్రవరి 24

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ- ఫిబ్రవరి 27

ఎన్నికల పోలింగ్‌ -మార్చి 13

ఓట్ల లెక్కింపు- మార్చి 16

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) (ECI) షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలోని ఉపాధ్యాయ, పట్టభద్రులు, స్థానిక సంస్థల్లో ఖాళీ అవనున్న స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ, 8 స్థానిక సంస్థల స్థానాలు (మొత్తం 13), తెలంగాణలో ఒక్కో ఉపాధ్యాయ, స్థానిక సంస్థల స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది.. ఏపీలోని ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం పట్టభద్రుల స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీనితో పాటు ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ స్థానాల్లో ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ స్థానంతో పాటు హైదరాబాద్‌ స్థానిక సంస్థల స్థానంలో ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది.

మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధం! రోదసీలోకి దూసుకెళ్లనున్న మూడు ఉపగ్రహాలు..

యదార్థవాది ప్రతినిధి, శ్రీహరికోట

ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రేపు స్మాల్‌శాటిలైట్‌లాంచింగ్‌వెహికల్‌నుప్రయోగించేందుకు ఇస్రో సైంటిస్టులు రెడీ అయ్యారు..రేపు ఉదయం 9.18 గంటలకు ఎస్ఎస్‌ఎల్‌వీ-డీ2 రాకెట్‌ మూడు ఉపగ్రహాలను మోసుకొని రోదసీలోకి దూసుకెళ్లనుంది. ఈ సిరీస్‌లో ఇది రెండో ప్రయోగం. గతేడాది ఆగస్టు 7న మొదటిసారిగా పంపిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ1 ప్రయోగం విఫలమవడంతో.. ఈసారి ఆ పొరపాట్లు జరగకుండా సైంటిస్టులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సారి ప్రయోగం 13.2 నిమిషాల్లో పూర్తి కానుంది. ప్రయోగవేదికపై సిద్ధంగాఉన్నరాకెట్‌కుఅన్నిపరీక్షలనుపూర్తిచేస్తున్నారు

నింగిలోకి దూసుకెళ్లనున్న మూడు ఉపగ్రహాలు:

సుమారు 34 టన్నుల బరువున్న 120 మీటర్ల పొడవైన ఈ రాకెట్ రేపు మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. దీనికి సంబంధించి రిహార్స్‌ల్స్‌ను, మధ్యాహ్నం 1 గంటలకు మిషన్‌ సంసిద్ధత సమావేశం నిర్వహించి ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. ఈఓఎస్-07, జానస్-1, అజాదీశాట్-2 అనే మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడమే ఈ సారి టార్గెట్‌.
ల్యాబ్‌ చైర్మన్‌ ఆర్ముగం రాజరాజన్‌ ఈ రాకెట్‌ను ఫైనల్‌గా టెస్ట్‌ చేస్తారు. తుది విడత తనిఖీలు తర్వాత ప్రయోగానికి 7 గంటల ముందు కౌంట్‌డౌన్‌ను స్టార్ట్ చేస్తారు. అంటే రేపు వేకువజామున 2.18 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభిస్తారు. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన 13 నిమిషాల్లోనే రాకెట్ తొలి ఉపగ్రహం ఈఓఎస్-07ను కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఆ తర్వాత మరో రెండింటిని నిమిషం వ్యవధిలో కక్ష్యలోకి ప్రవేశపెడతారు. వీటన్నింటినీ 450 కిలోమీటర్ల ఎత్తులో 15నిమిషాల ప్రయాణంలో భూమి చుట్టూ సర్క్యూలర్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. ఇక ఎస్ఎస్‌ఎల్‌వీ ప్రయోగంతో ప్రారంభమయ్యే ప్రయోగాల పరంపర ఈ ఏడాది షార్‌లో కొనసాగనుంది.

పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక భేటీ – ఆ ఎమ్మెల్యేలకు డేంజర్ బెల్స్..!?

పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక భేటీ – ఆ ఎమ్మెల్యేలకు డేంజర్ బెల్స్..!?

యదార్థవాది ప్రతినిధి అమరావతి 

ముఖ్యమంత్రి ఎన్నికల కసరత్తు వేగవంతం చేసారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి..పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలను గడప గడపకు ప్రభుత్వం పేరుతో ప్రజల వద్దకు పంపిన సీఎం..త్వరలో తాను ప్రజల మధ్యకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు..అందులో భాగంగా పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేసారు.
ఇప్పటికే ఎమ్మెల్యేల పని తీరు పైన సీఎం జగన్ క్షేత్ర స్థాయి సర్వే నివేదికలు తెప్పించుకున్నారు. కొంత మంది ఎమ్మెల్యేల పని తీరు పైన ఆగ్రహంగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో కఠిన నిర్ణయాలకు సీఎం సిద్దమయ్యారు. ఇదే సమయంలో ప్రజల్లో ఎమ్మెల్యేల గ్రాఫ్ పైన ఫోకస్ పెట్టారు. ఈ సమావేశంలో ఆ అంశమే కీలకం కానుంది.

మంత్రులు – ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక భేటీ…

ఈ నెల 13న మంత్రులు..ఎమ్మెల్యేలు..పార్టీ సమన్వయకర్తలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం ఏర్పాటు చేసారు. ఇప్పటికే పార్టీ రీజలన్ కో ఆర్డినేటర్లతో సమావేశమైన సీఎం..ఈ సారి మంత్రులు.. ఎమ్మెల్యేల తో మీటింగ్ కు నిర్ణయం తీసుకున్నారు. గత సమావేశంలో ప్రతీ సచివాలయ పరిధిలో కన్వీనర్లు..గృహ సారథుల నియమాకం పై నిర్ణయించినా..ఇప్పటికీ నియామకాలు పూర్తి కాలేదు.రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంలో వీరి నియామకం పైన సీఎం గట్టిగానే హెచ్చరించారు. ఇప్పుడు ఇదే అంశం పైన మరోసారి ఎమ్మెల్యేలకు స్పష్టత ఇవ్వనున్నారు. అదే సమయంలో గత సమావేశంలో దాదాపు 28 మంది ఎమ్మెల్యేల పని తీరుకు సంబంధించి ముఖ్యమంత్రి సర్వే వివరాలను వెల్లడించారు..ప్రజల్లో గ్రాఫ్ పెరగకపోతే సీట్లు ఇవ్వటం కష్టమని తేల్చి చెప్పారు. పని తీరు మెరుగు పర్చుకోవటానికి వారికి మరో అవకాశం ఇచ్చారు. దీంతో. ఈ సమావేశంలో సీఎం ఏం చెప్పబోతున్నారనేది ఉత్కంఠ పెంచుతోంది..

ఎమ్మెల్యే ప్రోగ్రస్ రిపోర్టులు సిద్దం……

వైసీపీ ఎమ్మెల్యేలు…నియోజకవర్గ ఇంఛార్జ్ లకు సంబంధించిన ప్రోగ్రస్ రిపోర్టులు ఐ పాక్ తో పాటుగా మరో రెండు సర్వే సంస్థలు ముఖ్యమంత్రికి నివేదికలు ఇచ్చినట్లు సమాచారం. అందులో ప్రధానంగా ఎమ్మెల్యేలు ప్రజలతో ..పార్టీ కేడర్ తో మమేకం అవుతున్న విధానం.. వారికి ప్రజల్లో ఉన్న ఆదరణ ఆధారంగా మార్కులు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఈ ప్రత్యక సమావేశంలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల పని తీరు పైన ఫైనల్ వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఎన్నికలకు ఆరు నెలల ముందే టికెట్లు ఖరారు చేస్తామని ఇప్పటికే సీఎం స్పష్టం చేసారు. ప్రతిపక్ష టీడీపీ సిట్టింగ్ లకు సీట్లు ఖరారు చేయటం తో పాటుగా కొత్తగా ఇంఛార్జ్ లను నియమిస్తోంది.దీంతో..ప్రత్యర్ది పార్టీల వ్యూహాలను గమనిస్తూ..గెలుపే ప్రామాణికంగా నియోజకవర్గాల్లో అభ్యర్దుల ఎంపిక..గెలుపు దిశగా నిర్ణయాలు ఉంటాయని ముఖ్యమంత్రి ఖరా ఖండిగా చెబుతున్నారు. గెలిచే వారికే టికెట్లు అనే సిద్దాంతం మాత్రమే అభ్యర్ధు ఎంపికకు కీలక సూత్రంగా చెబుతున్నారు. ఈ వ్యవహారం పై సీఎం స్పష్టత ఇవ్వనున్నారు..

సీఎంతో సహా నేతలంతా ప్రజల్లోనే….

ఇక..పార్టీ – ప్రభుత్వ వ్యవహారాలను సమన్వయం చేసుకుంటూ నేతలంతా ప్రజల్లోనే ఉండేలా సీఎం జగన్ కార్యాచరణ సిద్దం చేసినట్లు సమాచారం, అందులో భాగంగా ముఖ్యమంత్రి సైతం ఇక రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ పల్లెనిద్రకు నిర్ణయించారని సమాచారం.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తరువాత ఇక సీఎం తో పాటుగా ఎమ్మెల్యేలంతా ప్రజల్లోనే ఉండేలా కొత్త కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేలకు సీట్లు..ఇవ్వలేని వారికిప్రత్యామ్నాయంగా అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చే గుర్తింపు పైన సంకేతాలు ఇస్తున్నారు. దీంతో.. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఏం ప్రకటన చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది..

అధైర్య పడవద్దు ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం

అధైర్య పడవద్దు ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం

యదార్థవాది ప్రతినిధి కొమరంభీం

కొమరంభీం జిల్లా తిర్యాణి మండలంలోని పంగిడి మాదర గ్రామపంచాయతీ పరదిలోని సల్పలగూడ గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో ఆరు ఇళ్లులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ విషయం తెలుకున్న జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి బాధిత ఆదివాసి కుటుంబలను పరమర్శించి ఆధైర్య పడవద్దని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని బరోసా కల్పించారు మండల రేవిన్యూ సిబ్బంది తహస్దిర్ ర్ఐ లను పిలిపించి తక్షణం సహాయం భాధితకుటుంబలకు రేండురోజుల్లో ప్రభుత్వ ఆర్థిక సహయం అందేంచేందుకు కృషిచేయాలని సూచించారు తన వంతుగాభాధితకుటుంబలకు,దుప్పట్లు, బట్టలు, వంట సామగ్రి పాత్రలు,ప్రతి కుటుంబనికి ఆర్థికసాయం అందజేశారు .ఇలాంటి సంఘాటన జరగడం దురదృష్టకరం అని ,ఆధైర్య పడవద్దని,మీకు అన్నివిధల అండగా ఉంటామని బరోసాకల్పించారు,కన్నీటి పర్యంతమైన కుటుంబలను ఆమె ఓదర్చరు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కనక యాదవ రావ్ ఎం పీపీ
శ్రీదేవి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు హనుమండ్ల జగదేశ్ సర్పంచుల సంఘాం జిల్లా అధ్యక్షులు గుణవంతరావు,యంపిటిసి కేశవరావు సర్పంచ్ పర్చకి జంగు ,యంపిటిసి లపోరం సిర్పూర్ (యు) ,జైనూర్ ,లింగపూర్ మండలాల అధ్యక్షులు కుమ్రం భగవంతరావు, నేతకానీ సంఘాం రాష్ట్ర కన్వీనర్ ,జాడిరవింధర్ నాయకులు విషల్,పేందోర్ మోహన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు సర్పంచులు, ఎంపీటీసీలు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ కొత్తపేట రోడ్డు!

ఇదీ కొత్తపేట రోడ్డు!

యదార్థవాది ప్రతినిది శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం కొత్తపేట గ్రామానికి చేరుకునే రోడ్డు మార్గం అతలాకుతలంగా మారినరోడ్డు ఈ రోడ్డుకి నాటి నుంచి నేటి వరకు శిలాఫలకాలకే పరిమితం గా మారిందని చెప్పుకొస్తున్న స్థానిక ప్రజలు ఈ గ్రామం పైనుండి ఆరు గ్రామాల ప్రజలు ప్రయాణం చేయడం జరుగుతుంది అత్యవసర సందర్భంలో ఈ రోడ్డు మార్గాన ప్రయాణించే ఆటోలు తమ కిట్టుబాటు లేని వేల సుమారు గంటన్నర కాలం ప్రయాణికు లు నిలుచొని ఉండవలసిన సందర్భం జరుగుతుందని చెప్పుకొస్తున్నారు వీటికి గల కారణం పెరిగిన డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు రోడ్డు మార్గం సరిలేక పోవడమే ముఖ్య కారణం తరాలు మారిన తమ రోడ్డు తత్వం మారలేదని చెప్పుకొస్తున్నారు ప్రజలునాటి నుంచి నేటి వరకు ఎన్నో పార్టీలు జెండాలు ఎగిరే ఈ గాని తమ రోడ్డుకి మోక్షం కలిగే రోజే రాకపోయే 14 ఏళ్లుగా తమ గ్రామాలకు వెళ్ళే ఈ రహదారి పట్టించుకునే నాధుడు లేకపోయే అని కన్నీటి పర్వతం అవుతున్నారు ఏది ఏమైనా అధికారులు ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా ఈ రోడ్డు మార్గాన్ని దృష్టిలో పెట్టుకొని సకాలంలో పూర్తి చేసే బాధ్యత తీసుకుంటారని స్థానిక ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు ఈ రోడ్డు మార్గాన్ని ప్రయాణించే ఆరు గ్రామాల ప్రజలు కొత్తపేట సాకివాడిపేట గొల్లపేట గాడుపేట ముద్దాడ ప్రజలు చెప్పుకొస్తున్న మాటలు..

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...