జగనన్న గోరుముద్ద మెనూలో మరో న్యూట్రియెంట్ ‘రాగిజావ’
యదార్థవాది ప్రతినిధి అమరావతి
జగనన్న గోరుముద్దలో మరో న్యూట్రియెంట్ రాగిజావ చేరింది. మధ్యాహ్న భోజన పథకంలో మార్చి 2 నుంచి రాగిజావ ఇవ్వనున్నారు.. పిల్లలకు ఐరన్, కాల్షియం లోపాలు లేకుండా నివారించడానికి రాగిజావను చేరుస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి ఛారిటబుల్ ట్రస్టు భాగస్వామ్యం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో విద్యాశాఖ అధికారులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టు ప్రతినిధులు ఎంఓయూ చేసుకున్నారు.
ప్రభుత్వంపై విపక్షాలు ఎంతగా బురదచల్లినా ‘కమలం’ మరింతగా వికసిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అదానీ వ్యవహారంపై రాజ్యసభలో విపక్ష పార్టీల ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేస్తూ తన ప్రసంగానికి అడ్డు తగలడంపై ప్రధాని తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. కొందరు ఎంపీల భాష, ప్రవర్తిస్తున్న తీరు, చేస్తోన్న వ్యాఖ్యలు బాధాకరమన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన ప్రధాని.. గత కాంగ్రెస్ పాలనను ఎండగడుతూనే విపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ”విపక్షాల తీరు చూస్తుంటే బాధేస్తోంది. ఇలాంటి ముఖ్యమైన సభలో నినాదాలు చేయడం దురదృష్టకరం. ప్రజా సమస్యలపై చర్చించాలన్న ఆలోచన వారికి లేదు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన కీలక సభలో ఇలా ప్రవర్తిస్తారా? మీరు విసిరే బురదలో కూడా ‘కమలం’ (భాజపా ఎన్నికల గుర్తు) వికసిస్తుంది. యూపీఏ ప్రభుత్వం ఏ సమస్యకూ పరిష్కారం చూపలేదు. దేశ ప్రగతిని నాశనం చేసింది. చిన్న చిన్న దేశాలు పురోగమిస్తున్న సమయంలో ఆరు దశాబ్దాల కాలాన్ని మన దేశం కోల్పోయింది. పరిష్కారం చూపేవాళ్లను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. ఎంత అడ్డుకున్నా ప్రజా సమస్యల పరిష్కారంలో మేం ఏమాత్రం వెనకడుగు వేయం. మా విధానాలతో దేశంలో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపగలుగుతున్నాం” అని ప్రధాని అన్నారు..
వెల్దుర్తి పోలీస్ స్టేషన్ తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ
యదార్థవాది ప్రతినిధి మెదక్
మెదక్ జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ సందర్శించి తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి తనిఖీలు చేయడం జరుగుతుందని జిల్లాలో జరుగుతున్నటువంటి నేరాలపై రోడ్డు ప్రమాదాల విషయంలో పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది ఎలా పనిచేస్తున్నారని పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అధికారి న్యాయ రక్షణ కోసం పనిచేస్తున్నారా లేదా అని తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగానే గురువారం రోజున వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ను తనిఖీలు నిర్వహించామని వెల్దుర్తి పోలీసులు సరియైన సమయాలలో విధులను నిర్వహిస్తూ వారి యొక్క విధులు కూడా సక్రమంగానే నిర్వహిస్తున్నారని వెల్దుర్తి పోలీస్ స్టేషన్కు వస్తున్నటువంటి కేసులను కూడా సరియైన సమయాలోనే పరిష్కారం చేస్తున్నటువంటి ఎస్సై మధుసూదన్ గౌడ్ వారి యొక్క సిబ్బందిని అభినందించారు గతంలో జరిగినటువంటి కేసులలో కూడా వెల్దుర్తి పోలీస్ శాఖ సరైన నేరస్తులను పట్టుకొని వారి యొక్క విధులను సరైన క్రమంలో నిర్వహించారని సిబ్బందిని అభినందించారు ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్న పోలీస్ శాఖను ఆశ్రయిస్తారని వారి యొక్క సమస్యలను తక్షణం తీర్చే బాధ్యత పోలీస్ శాఖ సిబ్బందికి ఉందని ఆమె గుర్తు చేశారు ముఖ్యంగా వాహనదారులు వారి యొక్క వాహనాలకు సంబంధించినటువంటి పత్రాలను వారి వద్ద ఉండాలని వారు వాహనంపై ప్రయాణం చేసే సమయంలో కచ్చితంగా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ ధరించడంతో ప్రమాదాలకు గురైన సమయంలో వారి యొక్క ప్రాణానికి ఎటువంటి హాని జరగకుండా ఉంటుందని మద్యం సేవించి వాహనాన్ని నడపవద్దని అలా నడిపిన వాహనదాన్నిపై కేసులు నమోదు చేస్తామని ఆమె అన్నారు ఈ తనిఖీలలో భాగంగా తూప్రాన్ సీఐ శ్రీధర్ వెల్దుర్తి ఎస్ఐ మధుసూదన్ గౌడ్ పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు
హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బీర్ల అయిలయ్య కు, కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు మంగళారతులు, కోలాటాల డప్పు సప్పుళ్ల, మధ్య ఘన స్వాగతం పలికారు.. ఆలేరు నియోజకవర్గం గుండాల మండలంలో నాల్గవ రోజు బ్రాహ్మణపళ్లి, సుద్దాల, భాగంగా బూర్జుబావి, అనంతరం గ్రామల్లో అయిలయ్య పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మన బ్రతుకులు మారుతాయనకున్నాం కానీ మన బ్రతుకులు మారలేదని, గ్రామ అభివృద్ధి చేయలేదని, కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కనపడుతుందన్నారు. ఎలక్షన్ వస్తున్నాయని కారు గుర్తు గుర్తుపట్టలని ఈ కంటి వెలుగు కార్యక్రమం తీసుకున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల్లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప ప్రజల, రైతుల కష్టాలు తిరవని అన్నారు. కౌలు రైతులకు ఎకరాకు 15 వేలు పెట్టుబడి సహాయం అందజేస్తామని, ధరణి పోర్టల్ రద్దు చేసి కొత్త రెవెన్యూ వ్యవస్థ తీసుకొస్తామని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు.
బిసి స్టడీ సర్కిల్ సిద్దిపేటలో ఉచిత శిక్షణ పొందుతున్న గ్రూప్ 2, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ శిక్షణ తరగతులను జిల్లా అదనపు కలెక్టర్ ముజముల్లా ఖాన్ పరిశీలించారు..జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న వారితో మాట్లాడి స్టడీ సర్కిల్ లో శిక్షణ తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మీరు ఉద్యోగాలలో స్థిరపడడానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి నాణ్యమైన ఉచిత శిక్షణను అందిస్తుందని, క్రమశిక్షణతో కష్టపడి చదివి మీరు ఎంచుకున్న లక్ష్యాన్ని ధైర్యంతో సాధించి కన్నవారి కలలను, ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చాలని, శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు సూచించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సరోజ మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ద్వారా అందిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానంలో ఉద్యోగం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వక్త ఆజాద్ అహ్మద్ కూడా పాల్గొని విద్యార్థులకు వ్యాసరచనలో మెలకువలను నేర్పించారు. ఇట్టి కార్యక్రమంలో స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా.కృష్ణ దయాసాగర్ మరియు అధ్యాపకులు స్టడీ సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రఖ్యాత కవి పండితుడు అష్టకాల నరసింహరామశర్మ మరణం ఆధ్యాత్మిక లోకానికి తీరనిలోటు. అని ప్రఖ్యాత చిత్రకారులు రుస్తుం అన్నారు గురువారం చిత్రపటాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు పండితునిగా జీవితాన్ని కొనసాగిస్తూ విద్యార్థుల కు జీవిత పాఠాలు నేర్పిస్తూ, పండిత లోకానికి అష్టావధానం, ప్రజలకు ఆధ్యాత్మిక రహస్యాలతో పాటు కవిగా రచనలు గావిస్తూ మానసిక రుగ్మతలను ప్రక్షాళనగావిస్తూ ఐదువందలకు పైగా యజ్ఞాలు యాగాలు చేస్తూ చేపిస్తూ ఆధ్యాత్మికంగా ప్రజలతో మమేకం అయి తరించారు. వారురాసిన తుకా రామ స్వామి చరిత్రము, పుస్తకానికి ముఖచిత్రం నాతో గీయించి గొప్పగా సన్మానించారు. అతని సేవలు మరువలేనివి మారుపురనివి అష్టకాల నర్సింహరామశర్మ ఆత్మకు శాంతి కలగాలని వారి చిత్రాన్ని చిత్రించి నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు
తెలంగాణ పరిశ్రమలు నెలకొల్పులకు పెట్టుకున్న దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు… గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటుచేసిన జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ, ప్రధాన మంత్రి ఉపాధి హామీ పధకాలను అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టి.ఎస్. ఐపాస్ క్రింద జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని, పరిశ్రమల నెలకొల్పనకు ఒక నెలలో అనుమతులు మంజూరు చేయాల్సి ఉండగా 9 దరఖాస్తులు వివిధ శాఖలలో ఉన్నాయని, ప్రధానంగా కాలుష్య నియంత్రణ మండలి, టి.ఎస్.ఐ.ఐ.సి., విద్యుత్, హెమ్.ఏం.డి.ఏ. డి.టి.సి.పి శాఖలలో క్లియరెన్స్, ఆమోదం పొందాల్సి ఉందని తెలిపారు. ఆయా శాఖల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని దరఖాస్తులను కుణ్ణంగా పరిశీలించి పెండింగు లేకుండా క్లియరెన్స్ చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా టి-ఫ్రైడ్ క్రింద 8 మంది ఎస్సి, 14 మంది ఎస్టీ, లబ్దిదారులకు 35 శాతం సబ్సిడీతో 60 లక్షల 73 వేల రూపాయల విలువ గల వాణిజ్య వాహనాలు లబ్ధిదారులకు అందించుటకు కమిటీ ఆమోదం తెలిపిందని కలెక్టర్ అన్నారు.జిల్లా పరిశ్రమల కేంద్రం, ఖాదీ బోర్డు, ఖాదీ కమీషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఉపాధి హామీ పధకం క్రింద 75 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు స్వయం ఉపాధి పధకం క్రింద యూనిట్లు నెలకొల్పాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 51 యూనిట్లు మంజూరు చేశామని అన్నారు. మిగతే యూనిట్లు కూడా మార్చి లోగా గ్రౌండింగ్ అయ్యేలా బ్యాంకు అధికారులతో సమన్వయము చేసుకోవలని సూచించారు. ఈవిషయం లో బ్యాంకర్లు అర్హులైన లబ్దిదారులకు రుణాలు మంజూరు చేయాలని అన్నారు. స్వయం ఉపాధి పధకాల ద్వారా ఆర్థికంగా బలోపేతానికి ఉత్సాహవంతులైన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి అధికంగా గుర్తించి పంపాలని అధికారులకు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ కృష్ణ మూర్తి, ఖాదీ బోర్డు రీజినల్ అధికారి సంతోష్, ఖాదీ కమీషన్ నోడల్ అధికారి విష్ణుమూర్తి, జిల్లా రవాణాధికారి శ్రీనివాస్ గౌడ్, బిసి అభివృద్ధి అధికారి కేశూరం, హెచ్ .ఏం.డి.ఏ. ప్లానింగ్ అధికారి నీలిమ, టీఎస్ ఐ ఐ సి లయజం అధికారి నజీబ్ అహ్మద్, కాలుష్య నియంత్రణ మండలి గౌతమి, గ్రౌండ్ వాటర్ శాఖ లావణ్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్. పాఠశాల ప్రిన్సిపల్ లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు
యదార్థవాది బ్యూరో
అభం శుభం తెలియని చిన్నారులను మున్సిపల్ కు చెందిన వాహనంలో తరలిస్తున్న విషయం ప్రశ్నించినందుకు సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టారని అక్రమ కేసులు పెట్టిన భయపడే ప్రసక్తే లేదని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు గురువారం సిద్దిపేట పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మున్సిపల్ కు చెందిన ఎన్ ఫోర్స్ మెంట్ వాహనంలో 18 ఏళ్ల లోపు విద్యార్థులను కంటి వెలుగుకు కిక్కిరిసిన వాహనంలో తరలించినందుకు సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి బాలికల రెసిడెన్షియల్ ప్రిన్సిపల్ సుప్రియ లపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మల యాదగిరి, దరిపల్లి చంద్రం, సూర్య వర్మలు మాట్లాడుతూ 18 ఏళ్లు పైబడిన వారు కంటి వెలుగు అర్హులని ప్రభుత్వం చెబుతుందని దీనిపై ప్రశ్నించినందుకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమామ్ తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులపై కేసులు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కేసులకు అరెస్టులకు ఎప్పుడు భయపడదని తెలిపారు. వాహనంలో తరలించే క్రమంలో విద్యార్థులకు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహించే వారిని అప్పుడు ఎవరిపై కేసులు నమోదు చేసే వారని ప్రశ్నించారు. విధుల దుర్వినియోగానికి పాల్పడిన మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి, బాలికల రెసిడెన్షియల్ ప్రిన్సిపల్ సుప్రియ లపై నాన్ బేయిలేబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వారిపై కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రెండు మూడు రోజుల్లో వారి కార్యాలయం వద్ద, అరెస్టు చేయకుంటే స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర మరియు జిల్లా నాయకులతో పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. బిఆర్ఎస్ పాలనలో అధికారులు ఆ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులుగా తప్పు చేసిన దానిని తప్పు అని చెప్తే కూడా ఇలాంటి కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ప్రజల పక్షాన వారి సమస్యలపై ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలిముద్దీన్ మజర్ మాలిక్ మార్క సతీష్ గౌడ్ బిక్షపతి బైరి సాయి గయాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు
మనది జనసేన కుటుంబం అని గర్వంగా చెప్పుకొందామని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.గురువారం కేంద్ర కార్యాలయంలో సభ్యత్వ నమోదు ప్రక్రియ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. క్రియాశీలక సభ్యత్వం ఓ భావోద్వేగ ప్రయాణమన్నారు. ఆపదలో ఉన్న తోటి కార్యకర్తకు సాయంగా నిలవాలన్నదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంకల్పమని స్పష్టం చేశారు. మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు.మొదట్లో 90 వేల మంది క్రియాశీలక సభ్యులను జాయిన్ చేశామని… కోవిడ్ సమయంలోనూ రూ.500 కట్టి పార్టీ సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. రెండో విడతలో ఏకంగా 3 లక్షల 30వేల మంది క్రియాశీల సభ్యులుగా చేరారన్నారు. ఈసారి ఈ కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.బాధితులకు బీమా క్లైయిమ్ కూడా 60 రోజుల్లో అందేలా పార్టీ లీగల్ విభాగం ప్రయత్నిస్తోందని తెలిపారు. సభ్యత్వ నమోదు కోసం కేవలం పార్టీ కార్యకర్తలే కాదు.. సగటు కూలీలు, పేదలు కూడా ఎదురుచూడటం గొప్ప విషయమని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
పంచాయతీ కార్యదర్శి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి సిపిఎం పార్టీ డిమాండ్..
యదార్థవాది ప్రతినిది చేర్యాల
చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యుడు కత్తుల భాస్కర్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి వీధి దీపాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఉదయం 8 నుంచి 10 గంటల వరకు గ్రామంలో వీధి దీపాలు వెలుగుతున్నాయని అన్నారు అంతేగాక ఇప్పటికి నేను 12 సార్లు ఫోన్ చేసి చెప్పడం జరిగింది అయినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పంచాయతీ కార్యదర్శి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కత్తుల భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు అంతేగాక ఒక నెల జీతం గ్రామపంచాయతీకి కరెంట్ బిల్లు ఖాతాలో జమ చేయాలని అన్నారు. ఆన్ ఆప్ ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ భారం గ్రామ ప్రజలపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టి పంచాయతీ కార్యదర్శి పై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఒక నెల జీతం గ్రామపంచాయతీలో కరెంటు బిల్లులకు జమ చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యుడు పోనుగంటి శ్రీనివాస్ రెడ్డి శాఖ కార్యదర్శి గర్నపల్లి చంద్రం కత్తుల నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు