33.2 C
Hyderabad
Friday, April 24, 2026

ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడటమే సీపీఐ పార్టీ ప్రధాన ఎజెండా

ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడటమే సీపీఐ పార్టీ ప్రధాన ఎజెండా

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

ప్రజల కోసం పనిచేయడం,ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడటమే సీపీఐ పార్టీ ప్రధాన ఎజెండా అని,గ్రామ గ్రామన సీపీఐ పార్టీగా ప్రజల వద్దకు వెళదామని,పార్టీ బలోపేతం,నిర్మాణం మీద దృష్టి సారిస్థామని సీపీఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు..శనివారం రోజున సీపీఐ సిద్దిపేట నియోజకవర్గ స్థాయి జనరల్ బాడీ సమావేశం సిద్దిపేట పట్టణంలో సీపీఐ పట్టణ కార్యదర్శి గజాభీంకార్ బన్సీలాల్ అధ్యక్షతన జరగగా ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 8 సంవత్సరాల కాలంలో సామాన్య,పేద ప్రజల జీవన స్థితిగతులు అద్వాన్నంగా తయారు అయ్యిందని,బీజేపీ ప్రభుత్వం పూర్తిగా బడా పెట్టుబడి దారులకు ఊడిగం చేస్తూ దేశ సంపదంతా వారికి కట్టబెడుతుందని,ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్మేస్తూ,దేశాన్ని అమ్మేస్తుందని మండి పడ్డారు.. కులాల మధ్య,మతాల మధ్య చిచ్చులు పెడుతూ,మత విద్వేషాలు రెచ్చగొడుతూ,లౌకిక దేశాన్ని హిందూ దేశాంగ మార్చాలని కుట్రలు చేస్తున్నారని,బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత సీపీఐ పార్టీగా మనదేనని,బిజెపి విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు..సీపీఐ పార్టీ జిల్లాలో అన్ని గ్రామాల్లో తిరగాలని ప్రజల స్థితిగతులను తెలుసుకోవాలని,పార్టీ నిర్మాణం,బలోపేతం దిశగా అడుగులు వేయాలని,పేద ప్రజలకు కూడు,గూడు కోసం సీపీఐ పార్టీగా పోరాడాలని పిలుపునిచ్చారు.. సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ మాట్లాడుతూ బీజేపీ పరిపాలన పూర్తిగా ప్రజా వ్యతిరేక పాలన అని,ప్రజలకిచ్చిన హామీలను పక్కన పెట్టి దేవుళ్ళ పేరుతో రాజకీయాలు చేస్తూ,ప్రజాస్వామ్యాన్ని ఖుని చేస్తుందని ఆయన అన్నారు.. బీజేపీ ని ఓడించడానికి ప్రజాస్వామ్య, లౌకిక,ప్రజాతంత్ర,వామపక్ష శక్తులను ఏకం చేస్తామని,బీజేపీని గద్దె దించుతామని,ప్రజల బాగోగుల కోసం నిరంతరం ఉద్యమిస్తామని ఆయన తెలిపారు…అనంతరం సీపీఐ సిద్దిపేట నియోజకవర్గ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది..ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కిష్టపురం లక్ష్మణ్,కనుకుంట్ల శంకర్,సిద్దిపేట రూరల్ కార్యదర్శి మిట్టపల్లి సుధాకర్,ఎస్కె హరిఫ్,యాదగిరి,కళావతి,బంక రాజయ్య,ఏఐటీయూసీ నాయకులు కర్ణాల చంద్రం,పిట్ల మల్లేశం,బెక్కంటి సంపత్,ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జేరిపోతుల జనార్థన్, వర్కింగ్ ప్రెసిడెంట్ రామగళ్ల నరేష్,నవీన్,ప్రవీణ్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు..

పండిత్ దీన్ దయాల్ వర్ధంతి..

పండిత్ దీన్ దయాల్ వర్ధంతి..

యదార్థవాది ప్రతినిది ఆర్మూర్

భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 55వ వర్ధంతిని పురస్కరించుకొని ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పండిత్ దీన్ దయాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మాతృక అయిన భారతీయ జనసంఘ్ ను స్థాపించిన వారిలో పండిత్ దిన్ దయాల్ ఒకరిని. వీరు “ఏకాత్మతా మానవతావాదం” సిద్ధాంతాన్ని రూపొందించారని, వ్యక్తినిర్మాణంతో పాటు, వ్యక్తి అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధిని ధర్మ మార్గంలో నడిపిస్తూ దేశ నిర్మాణంతో పాటు దేశ అభివృద్ధి జరుగుతుందని, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 1968 ఫిబ్రవరి 11న వద్ద మొగల్ సరాయి రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫారం వద్ద అనుమానస్పదంగా చనిపోయి ఉన్నారని, వీరి మరణం గురించి ఇప్పటికీ అసలు నిజాలు తెలియకపోవడం అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దాచిపెట్టడం జరిగింది.. ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధాంతమైన మానవతా ఏకాత్మతా వాదం అదేవిధంగా అంత్యోదయ భావాలతో వీరిని ఆదర్శంగా తీసుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతో, ప్రతీ పేద వారు ఆర్థికంగా స్వాలంబన సాధించాలన్న కాంక్షతో ఉజ్వల యోజన, జన్ ధన్ ఖాతాలు, ప్రధాని ఆవాస్ యోజన, స్వచ్ఛభారత్ మిషన్, సుకన్య సమృద్ధి యోజన, భేటీ బచావో బేటి పడావో లాంటి పథకాలతో, సబ్ కా సాత్- సబ్ కా విశ్వాస్- సబ్ కా వికాస్” అనే నినాదంతో అందరికీ ప్రభుత్వ ఫలాలు, ప్రభుత్వ లక్ష్యాలు అందించాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారని తెలిపారు. సాంకేతికతను అన్ని రంగాల్లో కృషి చేయడం నరేంద్ర మోడీకే దక్కిందని, మరెన్నో కొత్త పథకాలు మోడీ తీసుకొచ్చి భారతదేశాన్ని 2047 నాటికి ఆత్మ నిర్భర్, స్వదేశీ, స్వశక్తి, సాభిమానం, స్వావలంబనలతో సంమృద్ద భారత్, సమర్థ్ భారత్, సంపన్న భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సైతం కాషాయ జెండా ఎగిరే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు, బిజెపి సీనియర్ నాయకులు డీకే శ్రీనివాస్, మందుల వీరభద్రి, కర్తన్ భూషణ్, బిజెపి ఆర్మూర్ పట్టణ నాయకులు భూసం ప్రతాప్, భవాని నవీన్, బట్టు రాము, గటడి నితిన్ తదితరులు పాల్గొన్నారు.

నకిలీ పత్తి విత్తనాలు పట్టుకొన్న పోలీసులు

నకిలీ పత్తి విత్తనాలు పట్టుకొన్న పోలీసులు

యదార్థవాది ప్రతినిది మంచిర్యాల

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు రవాణా చేస్తున్న ముగ్గురుని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. బారత ప్రభుత్వ ఉత్తర్వు NO.6-2/2017-SD.IV(pt) నిబందనలను ఉల్లంఘిస్తూ నిషేధిత (బిటి-3) నకిలీ పత్తి విత్తనాలు రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు సిపి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, ఎస్సై లచ్చన్న, సిబ్బంది లతో కలిసి, బోయపల్లి బోర్డు వద్ద మంచిర్యాల వైపు వస్తున్న కారు, బొలెరో ట్రాలి వాహనం ఆపి వారిని తనిఖి చేయగా బొలెరో వాహనం లో పైన వడ్ల బస్తాలు వేసుకొని వాటి క్రింద సుమారు 10,00000/- విలువైన 5 క్వింటాళ్ల ప్రభుత్వ నిషేధిత (బిటి-3) నకిలీ విత్తనాలు గుర్తించిన పోలీసులు. నకిలీ పత్తి విత్తనాలు రవాణా చేస్తున్నా శ్రీరాముల నవీన్, ఒడ్నాల రాకేష్, మోర్ల వెంకట స్వామి పట్టుబడగా ఇద్దరు పారిపోయారు.. కేసునమోదు విచారణ నిమిత్తం నకిలీ పత్తి గింజలను సరఫరా చేయడానికి ఉపయోగించిన బోలోరే ట్రాలి, ఎస్కార్ట్ ఉపయోగించిన కారు, నకిలీ (BT) పత్తి విత్తనాలను స్వాదిన పర్చుకున్న వాటిని, నిందితులను తాండూర్ పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది..

ఎన్నికల సమయంలో కాపుల చుట్టూ పార్టీలు

ఎన్నికల సమయంలో కాపుల చుట్టూ పార్టీలు: బీజేపీ నేత కన్నా కీలక వ్యాఖ్యలు..

యదార్థవాది ప్రతినిధి గుంటూరు

:ఎన్నికల సమయంలో కాపుల చుట్టూ పార్టీలు తిరుగుతున్నాయని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.శుక్రవారం నాడు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో 22 శాతం ఓటు బ్యాంకు కాపు సామాజిక వర్గానికి ఉందని ఆయన చెప్పారు1989 నుండి కాపులు మద్దతు ఇచ్చిన పార్టీలు రాష్ట్రంలో విజయం సాధిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో కాపులను పార్టీలు వాడుకుంటున్నాయన్నారు. ఓబీసీ కోటా కింద కాపులను చేర్చాలని ఆయన కోరారు. జీవీఎల్ నరసింహరావు ఏం సాధించారని కాపులు ఆయన కు సన్మానం చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. కాపులను ఏకతాటిపైకి తీసుకు రావడం తన వల్ల కాదన్నారు. జనసేనను అధికారంలోకి తీసుకురావాలనే నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ కే వదిలేయాలన్నారు. జనసేనను ఏర్పాటు చేసి 9 ఏళ్లు అవుతుందన్నారు. పార్టీ ఎలా నడపాలో పవన్ కళ్యాణ్ కు తెలుసునని ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో ఏదో ఒక కామెంట్స్ చేస్తూ కన్నా లక్ష్మీనారాయణ వార్తల్లో నిలుస్తున్నారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై మీడియా వేదికగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే . బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా ఆయన దూరంగా ఉన్నార. రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కూడా కన్నా లక్ష్మీనారాయణ హజరు కాలేదు. వ్యక్తిగత కారణాలతో ఈ రెండు సమావేశాలకు దూరంగా ఉన్నారు. జనసేనలో కన్నాలక్ష్మీనారాయణ చేరుతారనే ప్రచారం కూడా సాగింది. అయితే ఈ ప్రచారాన్ని కన్నా లక్ష్మీనారాయణ ఖండించారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్రలో సరికొత్త అధ్యాయం

ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్రలో సరికొత్త అధ్యాయం

యదార్థవాది ప్రతినిధి కామారెడ్డి

ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల కామారెడ్డి నందు నేడు ఐక్యుఏసి, టీఎస్ కేసి-టాస్క్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ బహుళజాతి సంస్థ ” జెన్పాక్ట్ ” సంస్థలో ఉద్యోగాల కొరకు నిర్వహించిన ప్రాంగణ నియామకాలకు భారీ స్థాయిలో స్పందన లభించిందని సుమారు 400 మంది విద్యార్థులు హాజరవగా 112 మంది విద్యార్థులు ఎంపికవడం కళాశాలకు గర్వకారణమని కళాశాల ప్రిన్సిపాల్ డా.కె కిష్టయ్య తెలిపారు.ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పట్టణ ప్రాంత విద్యార్థులతో పోటీ పడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రముఖ సంస్ధలలో ఉద్యోగాలు పొందడం కళాశాలకు గర్వకారణమని అన్నారు.
ఈ సందర్బంగా కంపెనీ ప్రతినిధులు నవాజ్ ,కోమల్ సువెష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లో ఇంతమంది విద్యార్థులను ఎంపిక చేయడం చాల ఆనందం కలిగించిందని అన్నారు.టాస్క్ ప్రతినిధులు శ్రీనాథ్, లక్ష్మణ్ మాట్లడుతూ అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడం ద్వారా విద్యార్థులు అన్నీ రంగాల్లో ముందుంటున్నారు అని తెలిపారు. ఈ సందర్బంగా ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ అధ్యాపక సిబ్బంది అభినందించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ చంద్రకాంత్ అకాడమిక్ కో ఆర్డినేటర్ రాజ్ కుమార్ టి ఎస్ కే సి సమన్వయకర్త ఫర్హీన్ ఫాతిమా మెంటర్ అజహారోద్దిన్ అధ్యాపకులు డా.శంకర్ పాల్గొన్నారు.

రెచ్చిపోతున్న చైన్స్ స్నాచర్స్

ఆర్మూర్ లో రెచ్చిపోతున్న చైన్స్ స్నాచర్స్

యదార్థవాది ప్రతినిది ఆర్మూర్

బుకసాదుల మాధవి భర్త నవీన్ కుమార్ ఆర్మూర్ శుక్రవారం వెంకటేశ్వర కాలనీలో స్కూటీపై వెంకటేశ్వర కాలనీలోని రేషన్ బియ్యం తీసుకొని తమ ఇంటికి వెళుతుండగా. వెంకటేశ్వర టెంట్ హౌస్ దగ్గర చేరుకోగానే ఆమె వెనుకాలే స్కూటీపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని సుమారు రెండున్నర తులాల పుస్తెలతాడును దొంగలించి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

ఉచిత కరంట్ ఇచ్చుడు ఉత్తమటే

ఉచిత కరంట్ ఇచ్చుడు ఉత్తమటే

యదార్థవాది ప్రతినిధి నంగునూర్

24 గంటల ఉచిత కరంట్ ఇచ్చుడు ఉత్తమటే అని నంగునూర్ రైతుల ధర్నాలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి అన్నారు.. 5 రోజుల నుండి వ్యవసాయనికి అప్రకటిత కొతల మూలాన వరి పొలాలకు పశువుల కు నీళ్లు లేక ఇబంధు ఎదుర్కొంటున్నారు సంభంధిత అధికారులు సరైన సమాధానం చెప్పక పోగా రైతులను దురుభాషాలాడినందుకు నిరసనగా శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ముందుగల వివేకానంద విగ్రహం ముందు సిద్దిపేట రోడ్డు పైన ధర్నా చేస్తున్న రైతులకు మద్దతుగా పాల్గొన్న యాదగిరి రాష్ట్ర ప్రభుత్వం విధించే విధ్యుత్ కోతలను తీవ్రంగా వ్యతిరేకించారు సీఎం కెసిఆర్ 24 గంటల కరెంటును నిరంతరాయంగా అందిస్తున్నమని స్థానిక ఎమ్మెల్యే ఆర్థిక మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ నిద్దేశించి హేళనగా పవర్ ఇస్తున్నాం మళ్ళీ పావర్ లో ఉంటామని అసెంబ్లీ సాక్షిగా చెప్పినప్పటి గత ఐదు రోజులుగా ఎక్కడ కూడ సరైన విధ్యుత్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. కెసిఆర్ ప్రభుత్వం అబద్ధలతో పాలన చేస్తున్నారు తప్ప ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలించడం లేదని విమర్శించారు తక్షణమే నిరంతరాయ విద్యుత్ ను అందిచలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో గౌరబోయిన సంపత్ చింతల రాజ్ వెంకట్ రెడ్డి రజినీకార్ రెడ్డి అనరాజు రాజు చింతల సత్తయ్య, లు పాల్గొన్నారు.

ఆరోగ్యంగా ఉంటేనే సమర్థవంతంగా విధులు నిర్వహించగలుగుతాము

ఆరోగ్యంగా ఉంటేనే సమర్థవంతంగా విధులు నిర్వహించగలుగుతాము

యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల

నిత్యం యోగా సాధనతో తమ ఆరోగ్యంపై పట్టుసాధించవచ్చు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. నిరంతరం విధులు నిర్వహించే పోలీసులు నిత్యం యోగా సాధనతో తమ ఆరోగ్యంపై పట్టుసాధించవచ్చని, నిత్యజీవితంలో యోగ ఒక అలవాటుగా మార్చుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిబ్బందికి తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో యోగా కార్యాక్రమాన్ని నిర్వహించి యోగా నిపుణులచే పోలీస్ సిబ్బందికి యోగాలో శిక్షణ నిచ్చారు.. నిరంతరం విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద వహించవద్దని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవతో ఆర్.కె డయాగ్నోస్టిక్స్ వారు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది..

జాతీయ లోక్ అదాలత్

జాతీయ లోక్ అదాలత్

యదార్థవాది ప్రతినిధి మెదక్

జాతీయ రాష్ట్ర న్యాయ సేవధికార సంస్థల ఆదేశానుసరము ఫిబ్రవరి11శనివారం రోజున మెదక్ జిల్లా కోర్ట్ ప్రాంగణము జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించబడును.. జిల్లా ప్రధాన న్యాయమూర్తి P. లక్ష్మి సరదా సీనియర్రు సివిల్ జడ్జ్ జితేందర్ తో కలిసి గురువారం పత్రిక విలేకరులతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ లో ప్రజలు కాక్షిదారులు తమ కేసులను రాజిమర్గం ద్వారా పరిష్కరించుకోవాలని, సమయము, డబ్బులు వృధాకకుండా త్వరతాగాతినా కేసులను పరిస్కారం చేసుకోవాలని తెలిపారు

వైకాపా తీరును తప్పు పట్టిన కేంద్రం

వైకాపా తీరును తప్పు పట్టిన కేంద్రం

యదార్థవాది ప్రతినిధి అమరావతి

సీఎం జగన్‌, ఆ పార్టీ నేతల తీరు చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుధ్వజమెత్తారు.. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి రెండుకళ్లు లాంటి అమరావతి, పోలవరంను దెబ్బతీశారని మండిపడ్డారు. ”రాష్ట్ర రాజధానిపై నిన్న కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ వేసింది. శివరామకృష్ణ కమిటీ నివేదికను కేంద్రం సుప్రీంకోర్టులో ప్రస్తావించింది. శివరామకృష్ణ కమిటీ నివేదికను రాష్ట్రానికి పంపామని, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిందని కేంద్రం తెలిపింది. ఆ నిర్ణయాన్ని తాము ఆమోదించామని కేంద్రం చెప్పింది. ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం తమను సంప్రదించకుండానే 3 రాజధానుల చట్టం తెచ్చిందని కేంద్రం అఫిడవిట్‌లో స్పష్టంగా తెలిపింది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు సమాధానంగానే కేంద్రం ఈ విషయాలు చెప్పింది. అధికారంలోకి రాకముందు తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని జగన్‌ ఏం చెప్పారు. అమరావతే రాజధానిగా ఉంటుంది. అమరావతిని తెలుగుదేశం పార్టీ కంటే మిన్నగా అభివృద్ధి చేస్తామని చెప్పారా? లేదా? ప్రజా జీవితం అంటే మీ దృష్టిలో చులకనైపోయింది. మీ తీరు చూస్తూ ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. ఓట్ల కోసం ఎన్నో అబద్దాలు చెప్పారు. చట్టానికి ఎన్ని తూట్లు పెట్టాలో అన్ని పెట్టి మీ ఇష్ట ప్రకారం చేశారు. అధికారం లేదని తెలిసినా? రాజధానిపై చట్టం చేసే హక్కు శాసనసభకు లేదా? అని మాట్లాడారు. రాజధానిపై చట్టం చేయడానికి వీల్లేదని హైకోర్టు కూడా స్పష్టం చేసింది. ఏపీ పునర్విభజన చట్టం పార్లమెంట్‌ చేసింది. అందులో రాజధాని ఏ విధంగా చేయాలో స్పష్టంగా పేర్కొన్నారు. దాని ప్రకారం అమరావతి రాజధాని వచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని చట్టం చేసే హక్కులేదని న్యాయస్థానం చెప్పింది.దాన్ని వక్రీకరించి.. శాసనసభకు చట్టాలు చేసే అధికారం లేదా? అని ఇష్టానుసారం మాట్లాడారు. విభజన చట్టం సెక్షన్‌5లో రాజధానిపై స్పష్టంగా ఉన్నా 3 రాజధానులపై శాసనసభలో బిల్లు పాస్‌ చేశారు. కౌన్సిల్‌లో నానా దుర్భాషలాడారు. 3 రాజధానుల బిల్లును కౌన్సిల్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తే.. కౌన్సిల్‌ రద్దుకు తీర్మానం చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి కౌన్సిల్‌ రద్దు తీర్మానాన్ని ఉపసంహరించుకున్నారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ఇచ్చారు. అమరావతి రాజధానిపై రూ.11,395 కోట్లు ఖర్చు పెడితే.. జగన్‌ ప్రభుత్వం అమరావతిపై విషం చిమ్మింది. రాజధాని రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర చేస్తే ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారు. లేని అధికారం ఆపాదించుకుని జగన్‌ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు” అని చంద్రబాబు విమర్శించారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...