33.2 C
Hyderabad
Friday, April 24, 2026

ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకోండి

ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకోండి

యదార్థవాది ప్రతినిధి ఆర్మూర్

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్మూర్ డిపో పెండ్లిలసీజన్ నేపథ్యంలో టి ఎస్ ఆర్ టి సి శుభకార్యాలకు అద్దె బస్సులపై ప్రత్యేక రాయితీని కల్పిస్తుందని ఆర్మూర్ డిపోమేనేజర్. శ్రీమతి కె కవిత. శనివారం ఒక ప్రకటనలో తెలిపారు అన్ని రకాల బస్ సర్వీస్ లపై 10 శాతం రాయితీ కల్పిస్తుందని సంస్థ ఎండి తెలియజేశారు ఏడాది జూన్ 30 వరకు. అద్దె బస్సుల పై 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని. తెలిపారు అద్దె బస్సు బుకింగ్ కోసం తమ అధికారిక వెబ్. సైట్. www.tsrtc online. in ను సందర్శించాలని కోరుతున్నారు. పూర్తి వివరాలు ఆర్మూర్ డిపో పరిధిలోని గ్రామాలు ఆర్మూర్ డిపోను సంప్రదించాలని. శుభకార్యాలకు పెండ్లిలకు తమ అద్దె బస్సు లను వినియోగించుకొని టీఎస్ ఆర్టీసీ ని ప్రోత్సహించాలని ఆర్మూర్ డిపో మేనేజర్ కవిత తెలిపారు

పసుపు రైతులను ఆదుకోవాలి

పసుపు రైతులను ఆదుకోవాలి

యదార్థవాది ప్రతినిధి నిజామాబాద్

తెలంగాణ పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు జిల్లా నాయకులు తిరుపతిరెడ్డి నవీన్ రెడ్డి చిన్నారెడ్డి లతో కలిసి నిజామాబాద్ మార్కెట్ యార్డ్ ను శనివారం సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 40వేల మంది రైతులు 50వేల ఎకరాలలో పసుపు పంటను చేశారని సరియైన ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని పసుపు కు మద్దతు ధర పసుపు బోర్డు తేవడంలో విఫలం అయిన నిజామాబాద్ MP అరవింద్ వెంటనే స్పందించి, రైతులకు న్యాయం చేయాలని గతంలో రెండు సంవత్సరాల క్రితం కొద్దిగా ధర వచ్చినప్పుడు, MP అరవింద్ వలనే ధర వచ్చింది. స్పెషల్ వ్యాగన్ లు పెట్టి పసుపులకు బంగ్లాదేశ్ కు ఎక్స్ పోర్టు చేయడం వల్లనే ధర వచ్చింది. అని ఆరోజు ప్రకటనలు ఇచ్చుకొన్నారు. మరి ఈరోజు 4000 వేలు 5000 కంటే ఎక్కువ ధర రావడం లేదు. ఇప్పుడు ఎక్స్ పోర్టు చేయడానికి వ్యాగన్ దొరకడం లేదా? అని ప్రశ్నించారు.
రాష్ట్రప్రభుత్వం కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా, ఆంధ్రప్రదేశ్ లో మార్క్ ఫెడ్ ద్వారా 6800/- ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నది . అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా మార్క్ ఫెడ్ కు ఆదేశాలు ఇచ్చి 10.000/- మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తే రైతులకు ఊరట కలుగుతుంది, కేంద్రానికి MIS క్రింద కొనుగోలుకు డిమాండ్ చేస్తూ లేఖ పంపాలి. తద్వారా మార్క్ ఫెడ్ కు జరిగె నష్టాన్ని కేంద్రం, రాష్ట్రం చేరి సగం పంచుకొనే వీలు ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలని అన్నారు రైతులకు న్యాయం చేయాలన్నారు

సీఎస్సీ కేంద్రాలతో యువతకు ఉపాధి

సీఎస్సీ కేంద్రాలతో యువతకు ఉపాధి

యదార్థవాది ప్రతినిది పెద్దపల్లి

ఉన్నత చదువులు చదివిన యువత నిరుద్యోగ సమస్య నిర్మూలన వైపు మొగ్గు చూపాలని బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ,పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్ అన్నారు.. పలిమెల మండలం బూర్గుగూడెంలో మినిస్ట్రీ ఆఫ్‌ ఐటీ ఆధ్వర్యంలో డిజిటల్‌ విలేజ్‌లో బాగంగా ఏర్పాటు చేసిన కామన్ సర్వీస్ సెంటర్ (CSC) కేంద్రాన్ని ప్రారంభించిన మంథని నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్. ఈ సందర్బంగా జడ్పీ ఛైర్మన్ మారుమూల గ్రామాలను డిజిటల్‌ విలేజ్‌గా ఏర్పాటు చేయడం ద్వారా పేద ప్రజలకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుతుందని, గ్రామాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఎస్సీ కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని, ఇంటి దగ్గరే ఆర్థిక లావాదేవిలు, రెవెన్యూ పరమైన అంశాలు, బ్యాంకు అకౌంట్‌లు, ఇతరత్రా సేవలను ఈ కేంద్రాల ద్వారా వినియోగించుకోవలన్నారు. గ్రామాల్లోని ప్రజలకు ఇబ్బందులు లేకుండా వంద డిజిటల్‌ విలేజ్‌లుగా మార్చేందుకు మినిస్ట్రీ ఆఫ్‌ ఐటీ శ్రీకారం చుట్టిందని, అందులో నియోజకవర్గంలోని బూర్గుగూడెం ఎంపిక అయిందన్నారు. మన ఊరికి చెందిన సర్వేష్‌ అనే యువకుడు వివిధ సేవలు అందిస్తాడని తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో వంద డిజిటల్‌ విలేజ్‌లను త్వరగా ఏర్పాటు చేసి దేశంలో ఆదర్శంగా నిలుపాలని ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్‌ను కోరారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలోని పేదవర్గాలకు పెద్ద ఎత్తున ఎక్కడ అవకాశం వస్తే అక్కడ అందిపుచ్చుకునే అంశంలో తమవంతు పూర్తి సహకారం ఉంటుందని, సీఎస్సీ కేంద్రం ఏర్పాటు చేసిన సర్వేష్‌ ఈ ప్రాంతంలోని నిరుపేదలకు పూర్తి స్థాయిలో సేవలు అందిస్తూ ఆర్థికంగా అభివృద్ది చెందాలని ఆయన ఆకాంక్షించారు..

విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. పేలిన లాడిల్

విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. పేలిన లాడిల్

‌యదార్థవాది ప్రతినిధి విశాఖపట్నం

విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం జరిగింది. ఎస్‌ఎంఎస్‌-2లో ద్రవ ఉక్కు తీసుకెళ్తున్న లాడిల్‌ ఒక్కసారిగా పేలిపోయింది..ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆరుగురు ఒప్పంద కార్మికులు, ఇద్దరు శాశ్వత ఉద్యోగులు, ఒక డీజీఎం స్థాయి అధికారి ఉన్నారు. లాడిల్‌లో ద్రవ ఉక్కు తరలిస్తుండగా అకస్మాత్తుగా పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. వీరిని తొలుత స్టీల్‌ ప్లాంట్‌లోని జనరల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు..

నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం..

యదార్థవాది ప్రతినిధి నెల్లూరు

నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు వాహనాలతో మంటలు ఆర్పుతున్నారు.ఇవాళ రెండో శనివారం సెలవు కావడంతో సిబ్బంది ఎవరూ విధుల్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కలెక్టరేట్‌లో భద్రపరిచిన ఎన్నికల సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

బడ్జెట్ ప్రతుల దగ్ధం

బడ్జెట్ ప్రతుల దగ్ధం

యదార్థవాది ప్రతినిధి నిజామాబాద్

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద శనివారం బడ్జెట్ ప్రతుల దగ్ధం కార్యక్రమం, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్, ఎస్ఎఫ్ఐ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి సిద్దాల నాగరాజుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది అన్నారు. రైతు సంఘం, కెవిపిఎస్, ఎస్ఎఫ్ఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కేంద్ర బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశాం అన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆచరణలో వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో కోతలు విధించడం దుర్మార్గం అని అన్నారు. బడ్జెట్‌ ప్రవేశ పెట్టే సందర్భంలో 2023-24 సంవత్సరానికి పంట రుణాల కింద 18 లక్షల కోట్లు రుణాలు ఇస్తామని ప్రకటించారు. గతంలో 16 లక్షలు ప్రకటించిన ఆర్థికమంత్రి ప్రకటన పత్రికలకే పరిమితం అయిందన్నారు. రుణమాఫీ పథకం అమలు కాకపోవడం వల్ల బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడంలేదన్నారు. మార్కెట్‌లలో కనీస మద్దతు ధరలు అమలు జరగడం లేదని ఏటా రైతులు వేల కోట్లలో నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వ కొనుగోలు సంస్థలు, ప్రైవేట్‌ వ్యాపారులతో కుమ్మక్కై రైతులను దివాళా తీయిస్తున్నాయని మండి పడ్డారు. బడ్జెట్‌లో మార్కెట్‌ జోక్యం పథకం కింద 500 కోట్లు మాత్రమే కేటాయించారు. కనీసం రైతులు ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి అనుగుణంగా నిధులు కేటాయించినప్పటికీ తిరిగి అమ్మిన తరువాత ప్రభుత్వానికి వ్యయం చేసిన నిధులు వస్తాయి. రైతులకు ప్రయోజనం ఉంటుందన్నారు. ఉపాధి హామీ పథకానికి 2.25 లక్షల కోట్లు కేటాయించమని డిమాండ్ చేసినా తగ్గిస్తూ పోతున్నారు. ప్రజలకు సరఫరా చేస్తున్న సబ్సిడీ బియ్యానికి కోతలు విధించారు.ఈ పరిస్థితులను గమనించి వ్యవసాయం, ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ ను పున:పరిశీలించాలని వారు డిమాండ్‌ చేశారు. లేని యెడల దేశశ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కెవిపిఎస్ ఆర్మూర్ మండల అధ్యక్ష కార్యదర్శులు జాదవ్ రాజు, భామండ్ల రవి, రాము, బాలే రావు తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి విగ్రహం మోదీ ఆవిష్కరించడం ఎంతో సంతోషం..

యదార్థవాది ప్రతినిధి ప.గో. జిల్లా

మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శనివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటిస్తున్నారు.వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్బంగా అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అల్లూరి విగ్రహం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించడం తన మనసుకి ఎంతో సంతోషం కలిగించిందన్నారు. స్వాతంత్య్రయం కోసం కృషి చేసిన అనేకమంది మహానుభావుల్లో మొట్టమొదటి వరుసలో ఉండే వ్యక్తి అల్లూరి సీతారామరాజుని కొనియాడారు. సీతారామరాజు స్ఫూర్తిని యువతరానికి తెలియజేయాలన్నారు..రాష్ట్రంలో ఉండే యువత ఎప్పటికప్పుడు భీమవరం వచ్చి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని సందర్శించాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నానని వెంకయ్య నాయుడు అన్నారు. స్వార్థం, అవకాశవాదం, అవినీతి, అరాచకం, పెరిగిపోతున్న ఈ రోజుల్లో యువత ముందుకు వచ్చి నడుంబిగించవలసిన సమయం ఆసన్నమైందని, ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూస్తున్నాయన్నారు. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర పాఠ్యాంశాలలో భాగంగా ఉండాలని, అది చాలా అవసరం.. దీన్ని ప్రభుత్వాలు గుర్తించాలని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.

రేషన్ షాపుల్లో మోధి చిత్రపటం

రేషన్ షాపుల్లో మోధి చిత్రపటం

యదార్థవాది ప్రతినిధి బైంసా

భైంసా పట్టణంలో బీజేపీ శాఖ అద్వర్యంలో ఆయా రేషన్ షాపుల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అద్యక్ష్యురాలు డాక్టర్.పడగంటి.రమాదేవి పాల్గొన్నారు.ఈ సంద్భంగా అమే మాట్లాడుతూ రేషన్లో కేంద్రప్రభుత్వం వాటా ఎక్కువ వున్నందున దుకాణంలో మోదీ చిత్రపటాన్ని ఏర్పాటు చేశామని కేంద్ర ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు

ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ పై అవగాహన కల్పించాలి

ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ పై అవగాహన కల్పించాలి

యదార్థవాది ప్రతినిధి ఆర్మూర్

ఆర్మూర్ పట్టణంలోని స్టార్ హెల్త్ అండ్ అల్లైడ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో శనివారం ఆర్మూర్ డివిజన్ ఏజెంట్లతో బ్రాంచ్ మేనేజర్ వేంపల్లి మహేష్ గౌడ్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిర్మల్ క్లస్టర్ టీం లీడర్ రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ పై అవగాహన కల్పించాలి అన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల ఉపయోగాలు ప్రజలకు తెలిసేలా చేయాలన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై పలు సలహాలు సూచనలు చేశారు. 2022 -23 వ సంవత్సరంలో అత్యధిక పాలసీలు చేయించి సంస్థకు పాలసీదారులకు ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రశంస పత్రాలు ప్రధానం చేశారు. అనంతరం ఉత్తమ ఏజెంట్లను శాలువ, మెడల్స్ తో సత్కరించారు. ఏజెంట్లు అందరూ తమ తమ టార్గెట్లను అధిగమించి ఆర్మూర్ బ్రాంచ్ ను ముందంజలో ఉంచాలని ఆకాంక్షించారు. సంస్థ అధినేత సీఎం డి జగనాదం కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సేల్స్ మేనేజర్లు రాకేష్ గౌడ్, లక్ష్మీపతి, శ్రీనివాస్, డివిజన్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.

రికార్డుస్థాయికి చేరిన విద్యుత్తు డిమాండ్‌

రికార్డుస్థాయికి చేరిన విద్యుత్తు డిమాండ్‌

యదార్థవాది బ్యూరో హైదరాబాద్

వేసవి కాలం రాకముందే విద్యుత్తు వాడకం చుక్కలను తాకుతోంది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా శుక్రవారం సాయంత్రం 4.08 గంటలకు 14,169 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్‌ నమోదైంది. గతేడాది ఫిబ్రవరి 10న డిమాండ్‌ 11,822 మెగావాట్లు మాత్రమే. గతంలో అత్యధిక రోజువారీ వినియోగం 2022 మార్చి 29న 14,167 మెగావాట్లు నమోదు కాగా తాజాగా ఆ రికార్డు చెరిగిపోయింది. యాసంగి పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతున్నందున వ్యవసాయబోర్ల వినియోగం ఎక్కువై డిమాండ్‌ చుక్కలను తాకుతున్నట్లు విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కం)లు తెలిపాయి. వ్యవసాయ బోర్లకు కొద్దిరోజులుగా త్రీఫేజ్‌ కరెంటు 10 గంటలలోపే ఇస్తున్నారు. శుక్రవారం నుంచి 12 గంటలకు సరఫరా పెంచడంతో డిమాండ్‌ కూడా పెరుగుతోంది. శనివారం నుంచి 24 గంటలూ త్రీఫేజ్‌ సరఫరా వ్యవసాయ బోర్లకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గరిష్ఠ డిమాండ్‌ 15 వేల మెగావాట్లను దాటిపోవచ్చని డిస్కంల అంచనా.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...