23.7 C
Hyderabad
Friday, April 24, 2026

కేసీఆర్ పై మండిపడ్డ కేంద్ర మంత్రి

కేసీఆర్ పై మండిపడ్డ కేంద్ర మంత్రి

యదార్థవాది ప్రతినిధి న్యుదిల్లి

భారతదేశం జిడిపిలో 11వ స్థానంలో ఉంటే మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రిటన్ ను కూడా దాటి మనదేశం 5వ స్థానంలోకి వచ్చామని, పేద ప్రజల కష్టాలను, దేశ ప్రజల కష్టాలను అవమానించే విధంగా కేసిఆర్ మాట్లాడటం తగదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థిక పరిస్థితి పై చర్చకు సిద్ధం ప్రగతిభవన్ లేదా ఫామ్ హౌస్ లో చర్చకు రమ్మంటారా మాట్లాడే భాష పద్ధతిగా ఉండాలి కల్వకుంట భాష కాదు తెలంగాణ భాష మాట్లాడాలి ఈ కండిషన్ పై చర్చకు సిద్ధం కిషన్ రెడ్డి దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా కేసీఆర్ మాట్లాడారు 2014 తెలంగాణ అప్పు 60 వేల కోట్లు ప్రస్తుతం ఐదు లక్షల కోట్లు పెరిగిందని, ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల అవినీతి జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ బిజెపినీ విమర్శించేదుకే తెలంగాణ అసెంబ్లీ వాడుతున్నారనీ, మండలిలో కాంగ్రెస్ లేకుండా చేసింది ఎవరు? 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాకున్నది ఎవరు? ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు కోరుతున్నట్లు కనిపిస్తోందాని, వారితోనే జత కడుతరని, మజ్లిస్ పార్టీని పొగడని రోజంటూ ఉండదాని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థపై అవగాహన లేకుండా, అంతర్జాతీయ విశ్లేషణ చేసిన కేసీఆర్ తెలంగాణ ఆర్థిక పరిస్థితి పై మాత్రం మాట్లాడటం లేదాని, తెలంగాణ అసెంబ్లీ సమావేశాల లేక ప్రధానిని తిట్టే సమావేశాల కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల తర్వాత కెసిఆర్ రాజనమా చేయాల్సిందేనని కిషన్ రెడ్డి అన్నారు..

ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన

ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన

యదార్థవాది ప్రతినిది బెంగళూరు

వైమానిక శిక్షణ క్షేత్రంలో 14వ ‘ఏరో ఇండియా 2023’ షోను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. సోమవారం ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన, విమానాల విన్యాసాలను తిలకించిన నరేంద్రమోదీ, కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై.. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ ప్రదర్శనతో ఎన్నో అవకాశాలకు రన్‌వేగా నిలుస్తుందాని, ‘ద రన్‌ వే టు ఏ బిలియన్‌ ఆపర్చునిటీస్‌’ పేరిట నిర్వహిస్తున్న ప్రదర్శన నేటి నుంచి ఐదు రోజుల పాటు జరగనుందాని, ఈ ఏడాది రికార్డు స్థాయిలో 98 దేశాలు ప్రదర్శనలో పాల్గొంటునయని తెలిపారు. భారతీయ, విదేశీ రక్షణ రంగ సంస్థలు ప్రదర్శనలో భారీ ప్రదర్శనకారుల విభాగంలో తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. వీటిల్లో ఎయిర్‌బస్‌, బోయింగ్‌, లాక్హీడ్‌ మార్టిన్‌, ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌, బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌, ఆర్మీ ఏవియేషన్‌, హెచ్‌సీ రోబోటిక్స్‌, సాబ్‌, సఫ్రాన్‌, రోల్స్‌ రాయీస్‌, ఎల్‌అండ్‌టీ, భారత్‌ ఫోర్జ్‌ లిమిటెడ్‌, హెచ్‌ఏఎల్‌, బీఈఎల్‌, బీడీఎల్‌, బీఈఎంఎల్‌ వంటి సంస్థలున్నాయి. ఈ ఎయిర్‌షోలో భాగంగా భారత్‌, విదేశీ రక్షణ కంపెనీల మధ్య రూ.75వేల కోట్ల విలువైన 251 ఒప్పందాలు జరగనున్నట్లు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ వెల్లడించారు. ఈ ఎయిర్‌షోలో భారత వైమానిక దళ అధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరీ, స్వయంగా యుద్ధ విమానాన్ని నడిపి ‘గురుకుల్‌’ విన్యాసానికి నాయకత్వం వహించారు.

హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన దుబ్బాక ఎమ్మెల్యే

హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన దుబ్బాక ఎమ్మెల్యే

యదార్థవాది ప్రతినిది హైదరాబాద్

హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (SDF), అసెంబ్లీ డెవలప్మెంట్ ఫండ్ (ACDF) నిధుల కేటాయింపు లో వివక్ష పై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన దుబ్బాక ఎమ్మెల్యే, విచారణకు స్వీకరించిన కోర్టు, 4 వారాల లోపు కౌంటర్ దాఖలు చెయ్యాలని అసెంబ్లీ వ్యవహారాలు, GAD, ఆర్ధిక శాఖ అధికారులకు ఆదేశాలు జారి..

డిప్యూటీ చైర్మన్ పదవికి మరింత వన్నె తేవాలి: మంత్రి ఎర్రబెల్లి

డిప్యూటీ చైర్మన్ పదవికి మరింత వన్నె తేవాలి: మంత్రి ఎర్రబెల్లి

యదార్థవాది ప్రతినిధి హైదరాబాద్

వరంగల్ ముద్దు బిడ్డ, మేధావి, బడుగు, బలహీన వర్గాల నాయకుడు బండ ప్రకాష్ తనకున్న రాజకీయ అనుభవం, పరిజ్ఞానంతో డిప్యూటీ చైర్మన్ పదవికి మరింత వన్నె తేవాలని, తెలంగాణ శాసన మండలి ప్రతిష్టను పెంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. టి.ఆర్.ఎస్ పార్టీ ఎంపీగా, ఎమ్మెల్సీగా విశేషమైన సేవలు అందించి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో డిప్యూటీ చైర్మన్ గా ఎన్నిక కావడం గొప్ప అవకాశం అన్నారు. వరంగల్ ముద్దుబిడ్డ శ్రీ బండ ప్రకాష్ డిప్యూటీ చైర్మన్ గా ఉన్నతమైన సేవలు అందించి ఆ పదవికి, తెలంగాణ శాసన మండలికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అభినందించిన వారిలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి, అరురీ రమేష్, యాదగిరి రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, మండలి మాజీ చీఫ్ విప్ బొడేకుంటి వెంకటేశ్వర్లు, బి.ఆర్.ఎస్ నాయకులు సమ్మారావు, వరంగల్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

నన్ను డ్యామేజ్‌ చేసేందుకే కేసీఆర్‌ అలా మాట్లాడారు, ఈటల రాజేందర్

నన్ను డ్యామేజ్‌ చేసేందుకే కేసీఆర్‌ అలా మాట్లాడారు, ఈటల రాజేందర్

యదార్ధ వ్యాధి బ్యూరో హైదరాబాద్

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పదే పదే తన పేరు ప్రస్తావించడంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు తనను డ్యామేజ్‌ చేసే వ్యూహంతోనే కేసీఆర్‌ అలా మాట్లాడారని ఈటల అన్నారు ఒక అబద్దాన్ని కెసిఆర్ అటూ చెప్పగలరు ఇటూ చెప్పగలరని ఈటల మండిపడ్డారు బీఆర్ఎస్.లో తిరిగి చేరేది లేదని స్పష్టం చేశారు. తనది పార్టీ మారే చరిత్ర కాదని, గెంటేసినవాళ్లు పిలిచినా పోను అని ఈటల స్పష్టం చేశారు. వైఎస్ హయాంలో కూడా ఇలానే ప్రచారం చేశారని, తన ప్రశ్నలకు జవాబు చెప్పినంత మాత్రాన పొంగిపోను అని ఈటల తెలిపారు. టీఆర్ఎస్‌లో సైనికుడిగా పనిచేశా.. ఇప్పుడు బీజేపీలో కూడా అలానే పనిచేస్తానని ఎమ్మెల్యే ఈటల వెల్లడించారు..

ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన: జిల్లా కలెక్టర్

ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన: జిల్లా కలెక్టర్

యదార్థవాది ప్రతినిధి కామారెడ్డి

ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు అన్ని బ్యాంకులలో ఆర్థిక అక్షరాస్యత పై పోస్టర్ల ప్రదర్శన, అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆదివారం కామారెడ్డి పట్టణంలో బస్టాండ్ సమీపంలోని చర్చి వద్ద ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా వాకత ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలందరూ బ్యాంకు సేవలను అధికారికంగా వినియోగించుకోవాలని తెలిపారు. ఎలాంటి మోసపూరిత, సైబర్ క్రైమ్ వంటి మోసాలకు లోను కాకుండా బ్యాంక్ సేవలు నిర్వహించుకునే పద్ధతులను బ్యాంక్ అధికారులు ఆర్థిక అక్షరాస్యత ద్వారా అవగాహన కల్పిస్తారని చెప్పారు. పోలీస్ కళాజాత ప్రదర్శన ద్వారా గ్రామాల్లో సైబర్ క్రైమ్ జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిస్తారని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ స్టేడియం ఆవరణలో ఈ సందర్భంగా పోలీస్ కళాజాత కళాకారులు సైబర్ మోసం జరిగే తీరును నాటిక ద్వారా వివరించారు. ఈ వాకత ర్యాలీ చర్చి నుంచి ఇంద్ర గాంధీ స్టేడియం వరకు కొనసాగింది. ర్యాలీలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి, కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ శ్రీనివాసరావు, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఇందుప్రియ ఎల్డిఎం చిందం రమేష్ మైనార్టీ కళాశాల ప్రిన్సిపల్ ఇంతియాజ్ అలీ ఆర్ కె కళాశాల విద్యార్థులు సిబ్బంది లింగంపేట బిసి మహిళా గురుకుల పాఠశాల విద్యార్థినిలు రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు జిల్లా అధికారులు పోలీసులు ఎన్ సి సి విద్యార్థులు పాల్గొన్నారు.

క్రీడలతో మానసిక పరికపక్వత ఏర్పడుతుంది

క్రీడలతో మానసిక పరికపక్వత ఏర్పడుతుంది
.
యదార్థవాది ప్రతినిధి నిజామాబాద్

నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ మండల కేంద్రంలోని విజయ్ హై స్కూల్లో, ఆదివారం తెలంగాణ రాష్ట్ర స్థాయి 41వ సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ బాల బాలికల క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి తెలంగాణ బాల్ బ్యాడ్మింటన్ సంఘం చైర్మన్ ఎం. శ్రీనివాస్ రావు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సికింద్రాబాద్, ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడల ద్వారా మానసిక పరిపక్వత ఏర్పడుతుంది అని శారీరకంగా ఎదుగుదల ఉంటుందని, క్రీడల ద్వారా ఎంతో మంది క్రీడాకారులు ఉన్నత స్థానంలో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ బాల్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షులు మానస గణేష్ అధ్యక్షత వహించారు. తెలంగాణ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణ రావు, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్టు ఎంపిక చేసిన క్రీడాకారుల వివరాలు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. బాలుర విభాగంలో ప్రథమ స్తానం పొందిన నల్గొండ జిల్లా జట్టు, ద్వితీయస్థానం కరీంనగర్ జిల్లా జట్టు, తృతీయస్థానం నిజామాబాద్ జిల్లా జట్టు , రంగారెడ్డి జిల్లా జట్టు నాలుగవ స్థానంలో నిలిచిందన్నారు. బాలికల విభాగంలో ప్రథమ స్థానం ఖమ్మం జిల్లా జట్టు, ద్వితీయ స్థానం మెదక్ జిల్లా జట్టు, తృతీయ స్థానం వరంగల్ జిల్లా జట్టు, నిజామాబాద్ జిల్లా జట్టు నాలుగో స్థానం లో నిలిచాయి అన్నారు. ఈ సందర్భంగా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి ఏం.రవీందర్ గౌడ్ మాట్లాడుతూ జాతీయస్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు ఫిబ్రవరి16 తేదీ నుండి 20 వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల్ జిల్లా, శ్రీరాంపూర్ లో నిర్వహించడం జరుగుతుందని అందులో మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయ స్థాయికి ఎంపిక చేసి పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ ముగింపు కార్యక్రమంలో విజయ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కవిత దివాకర్, నిజామాబాద్ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ముత్తేన్న, తెలంగాణ బాల్ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షులు వీరభద్ర రావు, వీవీ శ్రీనివాసరావు, దుర్గయ్య, బైయన్న, కోశాధికారి రాజేశ్వర్, కృష్ణమూర్తి, సభ్యులు రాజేందర్, నాగేష్, మాధురీ, రమణ, భాగ్య, అనీల్, వ్యాయామ ఉపాధ్యాయులు రాజేందర్, గంగ మోహన్, నరేంద్ర చారి, సంతోష్, టాగూర్, చిన్నయ్య , నాగేశ్, సురేష్, రాజ్ కుమార్, నిఖిత, ధర్మ, సురేష్, కార్తీక్, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.

సామూహిక వివాహ మహోత్సవంలో పాల్గొన్న తెలంగాణ తలైవ

సామూహిక వివాహ మహోత్సవంలో పాల్గొన్న తెలంగాణ తలైవ

యదార్థవాది ప్రతినిధి కామారెడ్డి

నాగర్ కర్నూల్ ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాహ మహోత్సవాలు ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. 202 జంటలకు ఒకే వేదికపై వివాహాలు జరిపించడం ఇది ఐదవ సారి. ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానం మేరకు జిల్లా ప్రముఖ వ్యాపారవేత్త, మన ఊరు- మన బడి ఆద్యుడు జిల్లా ప్రముఖ సామాజిక సేవకుడు తెలంగాణ తలైవగా పిలుచుకునే తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి హాజరయ్యారు. వివాహమైన నూతన వధూవరులను అక్షంతలు వేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సుభాష్ రెడ్డి మాట్లాడారు. ఎంజెఆర్ ట్రస్ట్ వారు నిర్వహించే సామూహిక వివాహ మహోత్సవాలు సాక్షాత్తు తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలను తలపిస్తున్నాయని ఉదహరించారు. సత్యం పవిత్రత స్వార్థరహితమైనటువంటి ప్రేమ దేనినైనా జయించేలా చేస్తాయని తెలుపుతూ, మానవసేవయే మాధవ సేవ అని తన నిరాడంబరత్వాన్ని చాటారు.

జాతీయ మహాసభలను జయప్రదం చెయ్యండి

జాతీయ మహాసభలను జయప్రదం చెయ్యండి

యదార్థవాది బ్యూరో

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్-AIFB పార్టీ 19వ జాతీయ మహాసభల ను హైదరాబాద్ నగరంలోని సుందరయ్య కళా నిలయంలో ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు జరగనున్న సందర్బంగా జాతీయ మహాసభల వాల్ పోస్టర్లను చేర్యాల మండల పార్టీ కార్యాలయంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా బృందం ఆధ్వర్యంలో విడుదల చేశారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నేతాజీ శుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో 1940 జూన్ 18 నుండి 22 వరకు నాగపూర్ లో జాతీయ మహాసభలు నిర్వహించి భారత ప్రజలకే సర్వధికారాలు అనే నినాదంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ను రాజకీయ పార్టీగా ప్రకటించారని అన్నారు.ఈ జాతీయ మహాసభలను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేఖ విధానాలను తిప్పికొట్టడంలో ఈ మహాసభలు ఉపయోగపడతాయాని అన్నారు.ప్రజలు, ప్రజాసంఘాలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు ఈకార్యక్రమంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ చేర్యాల మండల పట్టణ కార్యదర్శి ఒగ్గు తిరుపతి,జిల్లా నాయకులు ఆత్మకూరి హరికృష్ణ,నంగి తిరుపతి తదితరులు పాల్గొన్నారు

ఈ నెల 14న కొండగట్టుకు కేసీఆర్

ఈ నెల 14న కొండగట్టుకు కేసీఆర్

యదార్థవాది ప్రతినిది సిద్దిపేట

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆలయ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఇటీవలే కొండగట్టు ఆలయాభివృద్ధికి రూ.100 కోట్ల కేటాయించిన కేసీఆర్, ఈనెల 14న కొండగట్టులో పర్యటించనున్నారు. మరోవైపు యాదగిరిగుట్టకు ప్లాన్ ఇచ్చిన ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, కొండగట్టు అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...