23.7 C
Hyderabad
Friday, April 24, 2026

RBI ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు

ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు

యదార్ధవాది ప్రతినిది సిద్దిపేట

RBI ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు 2023 సంబందించిన పోస్టర్లను జిల్లా లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ ముజమీల్ ఖాన్ అడిషనల్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్డ్ శ్రీనివాస్ రెడ్డి రెవిన్యూ వారిచే సోమవారం విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ మేనేజర్ సత్యజిత్ మాట్లాడుతూ సరైన ఆర్ధిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది అనే అంశం మీద తేదీ 13.02.2023 నుండి 17.02.2023 వరకు జిల్లా లోని అన్ని బ్యాంకుల ద్వారా ఆర్థిక అక్షరాస్యత క్యాంపులు వివిధ గ్రామ పంచాయతీ మరియు మునిసిపల్ ప్రాంతాలలో నిర్వహించ బడుతాయి బ్యాంకు ద్వారా రుణాలను నిముషాల వ్యవధిలో పొందవచ్చు వృధా ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేసుకోవాలి అని సూచించారు, సైబర్ నేరగాళ్ళనుండి కపడు కోవాలంటే బ్యాంకు నుండి వచ్చే ఓటిపి లుకానీ ఇతర లింక్లు కానీ ఫ్రీగా వచ్చే డబ్బులకు ఆశ పడకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు టోల్ ఫ్రీ నెంబర్ వాడాలని అందరిని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా లోని వివిధ బ్యాంకు మేనేజర్లు SBI, ICICI,Canara Bank and UBI , బ్యాంకు కస్టమర్లు , జిల్లా అధికారులు ,దయాకర్ ఆర్థిక అక్షరాస్యత జిల్లా కోఆర్డినేటర్ , CFL కోఆర్డినేటర్స్ శ్రీనివాస్, సాయి పాల్గొన్నారు

అర్జీదరులకు న్యాయం చేయడం మన కర్తవ్యం

అర్జీదరులకు న్యాయం చేయడం మన కర్తవ్యం

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు నేరుగా ప్రజల సమస్యలను విని పరిష్కరించడానికి మొదలుపెట్టిన కార్యక్రమం ప్రజావాణి అని జిల్లా అదనపు పాలనాధికారి ముజమ్మీల్ ఖాన్ అన్నారు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా రెవెన్యూ అదనపు పాలనాధికారి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి అర్జిదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు పాలనాధికారి మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి తమ సమస్యలు నేరుగా విన్నవించి పరిష్కరించుకోవడానికి అర్జిదారులు ఎంతో ఆశతో కార్యలయంకి వస్తారని వారందరికీ న్యాయం చేయడం అధికారులుగా మన కర్తవ్యం అని జిల్లా అధికారులకు తెలిపారు. అర్జిదారుల నుండి తీసుకున్న ఫిర్యాదులు త్వరగా పరిష్కరించి నివేదిక అందించాలి. అర్జిదారులకు ప్రజావాణి కార్యక్రమం పైన నమ్మకం పెరిగిందని క్రమక్రమంగా అర్జిదారుల సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు ఎంతో ఉత్సాహంతో పనిచేయ్యాలన్నారు. భూ సంబంధిత రెండు పడక గదుల ఇండ్లు ఆసరా పింఛన్లు మరియు ఇతరత్రా మొత్తం కలపి 81 దరఖాస్తులు అందాయని అన్నారు అనంతరం రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా జారీచేసిన ఫైనాన్సియల్ లిటరసీ వీక్-2023 ప్లేక్సి పోస్టర్ లను ఆవిష్కరించారు ఇట్టి కార్యక్రమంలో కలెక్టరేట్ ఎఓ అబ్దుల్ రహమాన్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో విద్యుత్ షాక్.!

తెలంగాణలో విద్యుత్ షాక్.!

యదార్థవాది ప్రతినిధి హైదరాబాద్

రాష్ట్రంలో ప్రస్తుతం కడుతున్న కరంట్ బిల్లులో అడ్వాన్స్ డిపాజిట్ చార్జీలతో పాటు ఫ్యూయల్ కాస్ట్ పేరిట కొత్త ఛార్జిలు ఏప్రిల్ నెలలో పెరగనున్నాయా అంటే అవుననే అనిపిస్తుంది.. తెలంగాణలో కొత్త రెగ్యులేషన్ తీసుకు వచ్చినట్లు తెలుసుతోంది.. ప్రతి మూడు నెలలకోసారి తెలంగాణ ప్రభుత్యం కరెంట్ ధరలు ప్రతి యూనిట్కు 30 పైసల చొప్పున వసూలు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఆయిల్ ఫామ్ తోటలపై సమీక్షించిన: కలెక్టర్

ఆయిల్ ఫామ్ తోటలపై సమీక్షించిన: కలెక్టర్

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

సిద్దిపేట జిల్లా మండలాల వారిగా ఫిబ్రవరి మాసానికి నిర్దేశించిన విధంగా ఆయిల్ ఫామ్ మొక్కలను నాటేలా చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వ్యవసాయ అధికారులను టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు.. సోమవారం జిల్లా కలెక్టర్ జిల్లాలోని అన్ని మండలాల వ్యవసాయ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో ఆయిల్ ఫామ్ తోటల పెంపకం పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్ ఫామ్ విస్తరణ ఇప్పటివరకు జిల్లాలో 8000 ఎకరాలలో సాగు జరుగుతోందని అదేవిధంగా ఫిబ్రవరి నెలలో జిల్లాకు 2217 ఎకరాల లక్ష్యాన్ని 23 మండలాల వ్యవసాయ అధికారులకు మండలాల వారిగా టార్గెట్ ఇవ్వడం జరిగిందని, ఇప్పటివరకు 410 ఎకరాలకు రైతులను గుర్తించమని క్లస్టర్ల వారీగా వ్యవసాయ విస్తరణ అధికారులతో సమీక్షలు నిర్వహించి కొత్త రైతులను గుర్తించలని, ఫిబ్రవరి నెలలో లక్ష్యాన్ని చేదించాలని జిల్లా కలెక్టర్ మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రామలక్ష్మి, వ్యవసాయ సహాయ సంచాలకులు, ఉద్యాన అధికారులు, టీఎస్ ఆయిల్ పేడ్ అధికారులు పాల్గొన్నారు..

కేసీఆర్ పర్యటన రద్దు

14న కొండగట్టు రద్దు చేసుకున్న కేసీఆర్

యదార్థవాది ప్రతినిది హైదరాబాదు

కొండగట్టు పర్యటనలో రద్దు చేసుకున్న కేసీఆర్.. కొండగట్టు అంజన్న దర్శనానికి మంగళవారం పెద్ద ఎత్తున భక్తులు వస్తారని, అందులో బాగంగా కేసీఆర్ పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది..ఇటీవలే కొండగట్టు ఆలయాభివృద్ధికి రూ.100 కోట్ల కేటాయించిన విషయం తెలిసిందే.. 15 బుదవారం కేసీఆర్ పర్యటన జరగనుందాని విశాసనియ వర్గాల సమాచారం…

ఆన్వల్ స్పోర్ట్స్, గేమ్స్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్

ఆన్వల్ స్పోర్ట్స్, గేమ్స్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్

యదార్థవాది ప్రతినిది నిజామాబాద్

నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆన్వల్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్ 2023 కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్, పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు తో కలసి ప్రారంభించరు.. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్ పరేడ్ గౌరవ వందనం స్వీకరించి పతాకావిష్కరణ చేసి ఒలంపిక్ కాగడ చేత భూని క్రీడాజ్యోతిని పరేడ్ గ్రౌండ్ చుట్టు రన్ చేసి, ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రం శాంతి భద్రతతో ఉందంటే అది పోలీసుల విధి నిర్వాహన అని, యునిఫామ్ సర్వీస్ లో ఉన్నటువంటి వారు 24 X 7 విధినిర్వహణలో ఉంటారని, ఇతర శాఖల వారికి సెలవు దినాలు ఉంటాయని, కానీ పోలీస్ సిబ్బందికి ఎలాంటి సెలవులు, పండుగలు ఉండవని, వారు ఎల్ల ప్పుడు విధినిర్వహణలో ఉంటారని, అలాంటి నిర్విరామ విధులలో ఉన్న పోలీసులకు ఈ ఆన్వాల్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్-2023 అనేది ఉత్సాహాంతో పాటు ఉల్లాసాన్ని కలిగిస్తుందని తెలిపారు. ఎల్లప్పుడు పని వత్తిడితో తట్టుకోవడానికి, ఈ క్రీడలు ఎంతో ఉపయోగపడుతాయని, క్రీడల వల్ల వ్యక్తులకు వ్యక్తులకు మధ్య ఒక చక్కని బంధం ఏర్పడుతుందని అయన అన్నారు. క్రీడలు స్నేహపూర్వక వాతావరణంలో నిర్వహించడం ఎంతో అభినందనీయమని, గెలుపోటములను ఏదైనా స్పూర్తిగా తీసుకోవాలని, క్రీడా కారులు జిల్లాస్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో రాణించాలని కలెక్టర్ తెలిపారు. పోలీస్ కమీషనర్ నాగరాజు మాట్లాడుతూ గతకొన్ని సంవత్సరాలుగా కోవిడ్ వలన క్రీడలు నిర్వహించలేదాని, ఇప్పుడు సాధారణ వాతావరణం ఉన్నందున క్రీడలు మళ్లీ నిర్వహిస్తున్నామని, మన పోలీస్ విభాగంలో విధినిర్వహణలో క్రీడలు అనేవి ఎంతో అవసరమైనవని, మనం అందరం ఎంతో కఠినమైన పరిస్థితి ఎదుర్కొన వలసి వస్తుంది అని, శారీరకంగాకాని, క్రీడలు అంటేనే ఒక పండుగ వాతావరణం అని సిబ్బంది తెలిపారు. పోటీలు మూడు రోజుల పాటు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ సబ్ డివిజన్ లలో ఆర్ముడ్ రిజర్వు, హోమ్ గార్డ్సు విభాగం, అలైడ్ బ్రాంచ్లు, పోలీస్ కార్యాలయం సిబ్బంది జట్ల మధ్య వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడీ, హై జంప్, లాంగ్ జంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో, జవలిన్ మరియు అథెలిటిక్స్ క్రీడలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమీషనర్ గిరిరాజు, ఎ.సి.పిలు కిరణ్ కుమార్, ప్రభాకర్రావ్, నారాయణ, సంతోష్ కుమార్, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్స్ శ్రీశైలం, రిజర్వు ఇన్స్పెక్టర్స్ అనిల్ కుమార్, శెలేందర్, శేఖర్, పెద్దన్న కుమార్, ఆర్.ఎస్.ఐ లు, పి.ఇ.టి లు పాల్గొన్నారు..

గంజాయి మత్తులో యువతిపై దాడి

గంజాయి మత్తులో యువతిపై దాడి

యదార్థవాది ప్రతిదిని తాడేపల్లి

కంటి చూపు లేని ఎస్తేరు రాణి అనే 17 ఏళ్ల యువతిని గంజాయి మత్తులో అతి కిరాతకంగా నరికి చంపిన రాజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై అసభ్యంగా ప్రవర్తించిన రాజు ప్రవర్తనపై అమ్మకి పెద్దమ్మకి తెలియచేసిన యువతి రాజుని నిలదీసిన తల్లి నాకే పాపం తెలీదు రాణి నా చెల్లి లాంటిది అని నమ్మ పలికిన ఐదు నిమిషాల్లోనే విచక్షణ కోల్పోయి గంజాయి మత్తులో టెడ్డీబేర్ తో ఆడుకుంటున్న రాణిని అతి దారుణంగా తలపై అనేకమార్లు నరకటంతో హుటా హుటిన ఆసుపత్రి తరలించిన దక్కని ప్రాణం..గతంలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు అనే పోలీసు తో పాటు, ఇంటి సమీపంలో వివాహిత మీద గొడ్డలితో దాడి చేసిన ఘటనలు వున్నాయి.. రాజుకు పోలీసులతో ఉన్న స్నేహం వల్ల ఇలాంటి దారుణాలు తెగబడుతున్నాడని, ఆవేదన వేక్తం చేస్తున్న స్థానిక వాసులు.. కళ్ళు కానరాని నా కూతుర్ని అతి దారుణంగా నరికి చంపిన కఠినంగా శిక్షించాలని కన్నీటి పర్వతమైన కుటుంబ సభ్యులు.. పోలీసుని కొట్టినప్పుడే రాజుపై కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఇలాంటి దుర్ఘటన జరిగే కాదని ఇతని వల్ల మాకు ఎప్పటికైనా ప్రమాదమే అని తమ ఆవేదన తెలుపుతున్న సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా నివసిస్తున్న బాధిత కుటుంభం ఘటనా స్థలంలో మారణాయుధాన్ని స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టిన తాడేపల్లి పోలీసులు..

గ్రామ అభివృద్ధికి తోడ్పడతా

గ్రామ అభివృద్ధికి తోడ్పడతా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

యదార్థవాది ప్రతినిది హైదరాబాద్

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ని హైదరాబాదులో మినిస్టర్ క్వార్టర్స్ లో సోమవారం నందిపేట గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కలిశారు.. నందిపేట గ్రామ అభివృద్ధి కమిటీ భవనానికి 50 లక్షలు, ఐదున్నర కోట్లతో సిసి రోడ్లు, డ్రైనేజీ, వారం సంతకు స్థలం కేటాయించాలని, 12 కోట్లతో నందిపేట రోడ్డు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, నందిపేట గ్రామాన్ని మున్సిపాలిటీగా చేయాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వం ద్రుష్టికి తిసుకేల్తానని, నందిపేట గ్రామాభివృద్ధికి అన్ని విదల అభివృద్ధి చేస్తానని తెలిపారు. కమిటీ అడిగిన అన్ని కోరికలను తీరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అడగగానే స్పందించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నందిపేట్ గ్రామాభివృద్ధి కమిటీ ధన్యవాదాలు తెలిపి అండగా ఉంటామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందిపేట గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, పండరి రాజు, కుమ్మరి సాగర్, గ్రామంలోని బిఅరేస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సైబర్ నేరాలపై ప్రజలకు అవగాన

సైబర్ నేరాలపై గ్రామ ప్రజలకు అవగాన కల్పించిన: డి.ఎస్.పి.సైదులు

యదార్థవాది ప్రతినిది మెదక్

మెదక్ రూరల్ సర్కిల్ హవేలీ ఘనపూర్ పోలీస్ స్టేషన్ లింగసాన్ పల్లి తాండాలో మెదక్ డి.ఎస్.పి.సైదులు ఆద్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. ఈ కార్యక్రమలో భాగంగా సి‌సి కెమెరాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ సైబర్ నేరాలపై గ్రామ ప్రజలకు అవగాన కల్పించి సైబర్ నేరగాల వలలో పడవద్దని అప్రమత్తంగా ఉండాలని డయల్ 100 ప్రాముఖ్యత రోడ్డు ప్రమాదాల నివారణ అంశాలపై అవగాహన కలిగించారు. నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని, ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం కల్పించడం గురించి, ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని పోలిస్ అధికారులు తెలిపారు. పెండింగ్ చాలాన్, నంబర్ ప్లేట్ సరిగా లేని, పత్రాలు సరిగాలేని 29 ద్విచక్ర వాహనాలు, 01 ఆటో వాహనాలను అదుపులోకి తీసుకొని హవేలీ ఘనపూర్ పోలీస్టేషన్ తరలించారు.

ఎక్రలిక్ చిత్రాన్ని చిత్రించి ఆవిష్కరించిన రుస్తుం

ఎక్రలిక్ చిత్రాన్ని చిత్రించి ఆవిష్కరించిన రుస్తుం

యదార్థవాది ప్రతినిది సిద్దిపేట

ప్రేమికుల రోజు 14 ఫిబ్రవరి ని పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ గ్యాలరీ సిద్దిపేట లో ప్రకృతి వరం ప్రేమ ఎక్రలిక్ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం సోమవారం చిత్రించి ఆవిష్కరించారు ప్రకృతి వరప్రసాదం ప్రేమ చేయకెన్నడూ దానికి నమ్మక ద్రోహం, విశ్వానికి ప్రేమే మూలం చరాచర సృష్టికి ఆధారం.మానవ మనుగడకు ప్రాణం. సహజసిద్ధమైన స్వచ్ఛమైన ప్రేమికులు అపోహలకు అతీతంగా తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో పెండ్లిరోజే ప్రేమికులరోజు గా ఒక్కటవ్వాలని,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే సి ఆర్ బీదలకు పెండ్లీలు చేయిస్తున్న కళ్యాణలక్ష్మీ షాదీముబారక్ యువ జంటల స్వర్ణ తెలంగాణ ను ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రేమికులరోజు ప్రపంచంలో అందరికి స్వచ్ఛమైన ప్రేమను శాంతిని ఐక్యతను అందించాలని మానవతా చిత్రకారులు రుస్తుం ఆకాక్షించారు. ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం నైరూప్య చిత్రకారుడు నహీంరుస్తుం తదితరులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...