24.7 C
Hyderabad
Friday, April 24, 2026

కల సాకారం.. కడప స్టీల్‌ప్లాంట్‌కు సీఎం జగన్‌ భూమిపూజ

కల సాకారం.. కడప స్టీల్‌ప్లాంట్‌కు సీఎం జగన్‌ భూమిపూజ

యదార్థవాది ప్రతినిధి అమరావతి

వైఎస్సార్‌ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం స్టీల్‌ప్లాంట్‌ నమూనాను సీఎం పరిశీలించారు. స్టీల్‌ ప్లాంట్‌ మౌలిక సదుపాయాలపై జరిగే సమావేశంలో పాల్గొన్నారు

రైతుల వ్యతిరేకి బీఆర్ఎస్ ప్రభుత్వం

రైతుల వ్యతిరేకి బీఆర్ఎస్ ప్రభుత్వం

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందజేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట విద్యుత్ ఎస్ ఈ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.. ఈ సందర్భంగా కాంగ్రెస్ పిసిసి సభ్యులు దరిపల్లి చంద్రం మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నోటికొచ్చినట్లు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగిస్తున్నారని, రైతులకు 24 గంటల విద్యుత్ ను అందిస్తున్నట్లు మాయమాటలు చెబుతున్నారని, కానీ రైతులకు విద్యుత్ ను అందచేయడం లేదని, రైతులు వేసిన పంటలకు నీరందకపోవడంతో ఎండిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నాణ్యమైన త్రీఫేస్ విద్యుత్ ను సరఫరా చేయాలంటూ రైతులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారని తెలిపారు.అధికారంలో ఉందనే అహంకారంతో రైతుల పట్ల చిన్నచూపు చూస్తుందని మండపడ్డారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ కు అన్ని వర్గాల ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ప్రజలు ఎవరు కూడా ఆందోళన పడోద్దని సూచించారు. ఈ దర్నలో బొమ్మల యాదగిరి, అత్తు ఇమామ్, సూర్య వర్మ, ముద్దం లక్ష్మి, దేవులపల్లి యాదగిరి, కలిముద్దీన్, మార్క సతీష్, తప్పేట శంకర్, బిక్షపతి, వంగరి నాగరాజు అనిల్ మున్నా అజ్జు యాదవ్ గయాజుద్దీన్ హస్నుద్దీన్ తదితరులు పాల్గొన్నారు

గజ్వేల్ రింగ్ రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయ్యాలి: జిల్లా కలెక్టర్

గజ్వేల్ రింగ్ రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయ్యాలి: జిల్లా కలెక్టర్

యధార్ధవాది ప్రతినిధి సిద్దిపేట

గజ్వేల్ రింగ్ రోడ్డు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.. గజ్వేల్ పట్టణం చుట్టూ జరుగుతున్న నాలుగు వరుసల రింగ్ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించారు. 22కి.మి రింగ్ రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనుల్లో వేగం పెంచి నిర్ణీత గడువు లోపు పనులు పూర్తి చేయాలనీ, నిర్మాణ ఏజెన్సీ ఆర్ఎన్ కన్ స్ట్రక్షన్ అధికారులకు తెలిపారు. చౌరస్తా మద్యలో సెంట్రల్ లైటింగ్, కాటిల్ బోర్డు, ఐమాక్స్ లైట్లు, చౌరస్తాలు, రింగ్ రోడ్డు డివైడర్ మద్యలో, రెండు పక్కల చెట్లు, గ్రీనరి ఓక వరుసలో పూల మొక్కలు, అందంగా కనిపించేలా తిర్చిదిద్దాలని ప్లాంటేషన్ కాంట్రాక్టర్ కి తెలిపారు. ప్లాంటేషన్ పనులను గజ్వేల్ గడా స్పెషల్ అధికారి ముత్యంరెడ్డి రోజు పర్యవేక్షణ చేయ్యాలనీ ఆదేశించారు. రోడ్డు భవనాలు, ఆర్ఎన్ కన్స్ట్రక్షన్ అధికారులు సమన్వయంతో పనిచేయలని తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్&బి ఈఈ సుదర్శన్ రెడ్డి, డిఈ రామక్రిష్ణ, గజ్వేల్ మునిసిపల్ చైర్మన్ రాజమౌళి, ఎజెన్సీ బృందం బీఅర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు..

ప్రజల వద్దకే ఆర్టీసీ బస్

ప్రజల వద్దకే ఆర్టీసీ బస్

యదార్థవాది ప్రతినిధి ఆర్మూర్

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నూతనంగా ప్రవేశపెట్టిన ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమాన్ని మంగళవారం ధర్పల్లి మండలం దుబ్బాక్ గ్రామంలో ఆర్మూర్ డిపో ఎస్ టి ఐ పారు. నిర్వహించినారు.. ఈ సందర్భంగా ఎస్ టి ఐ మాట్లాడుతూ ఆర్టీసీ ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తుందని స్కూల్ మరియు కాలేజీ పిల్లలకు బస్ పాస్ రాయితీలు కల్పిస్తుంది దివ్యాంగులకు 50 శాతం రాయితీ కల్పిస్తుందని, తిరుపతి ప్రయాణికులకు తిరుమల దర్శనం టోకెన్స్ అందుబాటులోకి తెచ్చిందని,
వేములవాడ శివరాత్రి జాతరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని, ఆర్మూర్ నియోజకవర్గంలో గ్రామాల భక్తులు ఎక్కువ గా ఉంటే, ఆ గ్రామం నుండి వేములవాడ రాజన్న దర్శనానికి బస్ సర్వీసులు నడిపిస్తామని తెలిపారు. భక్తులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగంకోవాలని, తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రజలకు మరింత చేరువ కావడానికి బస్ ట్రాకింగ్ సిస్టం పెట్టిందని, పెండ్లిలకు శుభకార్యాలకు ఎటువంటి డిపాజిట్ లేకుండా 10% రాయితీతోని అద్దె బస్సులను బుకింగ్ చేసుకోవచ్చుని, సీజన్ టికెట్ లో 20 రోజుల ప్రయాణం చార్జీలు చెల్లించి 30 రోజులు ప్రయాణించవచ్చని, ప్రతి పల్లె, పట్టణం అనే తేడా లేకుండా 24 గంటలు కార్గో సేవలను అందిస్తుంది తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గంగాధర్, గ్రామ సర్పంచ్ వెంకటేష్, బీఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజలకు అందుబాటులో సర్కారు వైద్యం

ప్రజలకు అందుబాటులో సర్కారు వైద్యం

యదార్థవాది ప్రతినిధి వరంగల్

పేదలకు మెరుగైన వైద్యం అందించడమే కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు 15వ తేదీన గిరిప్రసాద్ నగర్,క్రిస్టియన్ కాలనీ నూతనంగా ఏర్పాటు చేసుకున్న బస్తి దవాఖానలను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరిశ్ రావు, పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రు ఎర్రబెల్లి దయాకరరావు హాజరై ప్రారంభించనున్న నేపధ్యంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కలెక్టర్ గోపి, మేయర్ గుండు సుధారాణి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వస్కుల బాబు,చింతాకుల అనిల్,భోగి సువర్ణ సురేష్ ఇతర కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు,ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు

హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు

యదార్థవాది ప్రతినిది మంచిర్యాల

మంచిర్యాల జోన్ రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త తిమ్మాపూర్ శివారు రాళ్ల వాగులో ఇటివల గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యమైంది.. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితులైన మధ్యప్రదేశ్ చెందిన మిళింద్ రామ్టేకి, వికాస్ రంటేకి, విశ్వాస్ కృష్ణ కుమార్ భగాడి గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే నిందితులు మిళింద్, వికాస్ రంటేకె, విశ్వాస్ లు వారి స్వగ్రామంలో పనులు దొరకందున, తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల, హాజీపూర్, వరంగల్, గోదావరిఖని, కరీంనగర్ లలో మేసిన్ పని చేయడం కొరకు తెలంగాణకు వచ్చి పోతుంటారు. గత ఏడాది క్రితం పని చేస్తుండగా మృతుడు రాకేశ్ బిల్డర్, మరి కొందరి దగ్గర డబ్బులు తిసుకోనివేల్లడు. ఈ డబ్బులు మిళింద్, వికాస్ రంటేకె, విశ్వాస్ తీర్చారు. డబ్బులను మోసం చేసి తీసుకొని, అడిగినందుకు తన నాన్న ని కొట్టడంతో రాకేశ్ ని ఎప్పటికైనా చంపేయాలి అని నిర్ణయించుకొని సరైన సమయం కోసం ఎదురు చూసారు. ఇంటి వద్దనే రాకేశ్ ని చంపితే పోలీస్ కేసులు అవుతాయి అని భయపడి, తెలంగాణ లో చంపితే ఎవరీ తెలియకుండా ఉంటుందని, గతం లో పనిచేసిన ఏదో ఒక ప్రదేశంలో చంపుదామని నిర్ణయించుకొన్నారు. ఇట్టి విషయం వీరి గ్రామస్థుడు ఐన విశ్వాస్ కి చెప్తే అందుకు అతను సరే అని సహాయం చేస్తా అన్నాడు. వారి పథకం లో భాగంగా తేదీ 30. 01.2023 రోజున వికాస్ మిలింద్ కి ఫోన్ చేసి రాకేశ్ కి పని ఉన్నది అని చెప్పి, మిలింద్ రాకేశ్ ని రామగుండం కి పని నిమిత్తం అని తీసుకువచ్చిడు. 04.02.2023 నాడు రాకేశ్ ని రామగుండం నుండి పని నిమిత్తం అని నిజామాబాద్ మంచిర్యాల, హైదరాబాద్ లలో తిప్పిరు 05.02.2023 మిలింద్ కి వికాస్ ఫోన్ చేసి రాకేశ్ ని తీసుకొని మంచిర్యాలకి రా, నేను విశ్వాస్ లము కూడా అక్కడికే వస్తున్నమని చెప్పగా హైదరాబాద్ నుండి బయలుదేరి 06.02.2023 రోజున ఉదయం అందజ 5 గంటల సమయంలో మంచిర్యాలకురాగా, వికాస్ మరియు విశ్వాస్ లు అప్పటికే మంచిర్యాల కి వచ్చిఉన్న పథకం ప్రకారం మిలింద్ రాకేశ్ తో కావాలనే గొడవ పడుతుండగా వెనక నుండి వికాస్ మరియు విశ్వాస్ లు ఇద్దరు అక్కడే ఉన్న కట్టెలతో రాకేశ్ వీపు లో కొట్టినరు. మిలింద్ చేతి కడియం తో రాకేశ్ నుదుటి పైన ముఖం పైన గట్టిగా గుద్దడం వల్ల రాకేశ్ కింద పడిపోయడు. ఎవరికి అనుమానం రాకుండా నీళ్ళలో ముంచి, మిలింద్ దొంగతనం చేసిన మోటార్ సైకిల్ ని రాకేష్ మీద పడేసి ప్రమాదం లాగా క్రియేట్ చేయాలని అనుకోని, రాకేశ్ ప్రతిగటిస్తుండగా ముగ్గురు రాకేశ్ ను బలవంతంగా ఒడ్డు మీద నుండి గుంజుకొని వెళ్ళి వాగులోని నీళ్ళ లో పడేసి మిలింద్ వికాస్ లు మృతుడు రాకేశ్ గొంతు పట్టుకొని పిసుకుతూ నీటిలో ముంచగా, విశ్వాస్ రాకేశ్ ని కదలకుండా అతని రెండు కాళ్ళు పట్టుకున్నాడు. నీటిలో ముంచడం వల్ల మృతుడు రాకేశ్ నీళ్ళు మింగి ఊపిరి ఆడక చనిపోయినాడు. టెక్నాలజీ సాయంతో పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి మూడు మొబైల్ ఫోన్లు, రక్తపు మరకలు గల నేరస్తుల దుస్తులు,
ఒక చేతి కడెం, మూడు కత్తులు స్వాదినం చేసుకున్నారు. ఈ కేసును పరిష్కరించడంలో కృషి చేసినటువంటి మందమర్రి సిఐ ప్రమోద్ రావు, సర్కిల్ ఎస్ఐలను, సిసిఎస్ సిబ్బంది, మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది అందరిని మంచిర్యాల డిసిపి సుధీర్ రామ్నాథ్ కెకాన్ అభినందించడం జరిగింది.

కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన: మంత్రి

కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన: మంత్రి

యదార్థవాది ప్రతినిది జగిత్యాల

జగిత్యాల జిల్లా కొండగట్టులో ఈ నెల 15 బుధవారం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్బంగా రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం జిల్లా అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాలు, హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లకు వివరాలను జిల్లా కలెక్టర్ యాసిన్ బాష మంత్రి కొప్పుల ఈశ్వర్ కు వివరించారు. మంగళవారం మధ్యాహాన్నం నుంచి బుధవారం మధ్యాహ్నం సీఎం పర్యటన ముగిసే వరకు భక్తులను ఆలయ సందర్శన నిలిపి వేస్తున్నట్లు చెప్పారు. మంత్రి వెంట చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, జిల్లా ఎస్పీ భాస్కర్, గ్రామ సర్పంచ్ తిరుపతి, కొండగట్టు ఆలయ ఈ.ఓ వెంకటేష్ తో పాటు ఇతర అధికారులు ఉన్నారు.

మెరుగైన సేవలు అందించడమే పోలీసుల లక్ష్యం

మెరుగైన సేవలు అందించడమే పోలీసుల లక్ష్యం

యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల

వీర్నపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులను,5S అమలు తీరు,ఫంక్షనల్ వర్టికల్స్ ను కోర్ట్ డ్యూటీ,రిసెప్షన్,బ్లూ కోల్ట్ పెట్రోల్ మొబైల్, టెక్ టీమ్స్ పనితీరును పరిశీలించి, పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న నేరాల వివరాలను ఎస్పీ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసుల లక్ష్యం అని పోలీసులు విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సమర్ధవంతమైన సేవలను అందించాలని, నేరాల నియంత్రణకి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్లపుడు పెట్రొలింగ్, బీట్లు నిర్వహించాలని, బ్లూకోర్ట్స్, పెట్రో మొబైల్ పోలీసు సిబ్బంది అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ డయల్ 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారిని తక్షణమే ఆదుకొవాలని అన్నారు. పోలీస్ స్టేషన్ వచ్చిన బాధితులకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని, విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ కేటాయించిన గ్రామలలో వెళ్లి ప్రజలతో మమేకమవుతూ పై అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. పోలీసు స్టేషన్ సిబ్బందికి ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావలన్నారు.

మహా శివరాత్రికి ప్రత్యేక బస్సులు

మహా శివరాత్రికి 2427 ప్రత్యేక బస్సులు

యదార్థవాది ప్రతినిది హైదరాబాద్

శ్రీశైలానికి 578, ఏడుపాయలకు 497, వేములవాడకు 481 బస్సుల ఏర్పాటు

రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవక్షేత్రాలకు సర్వీసులు

భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు

ఈ నెల 18న మహా శివరాత్రిని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం 2427 ప్రత్యేక బస్సులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) నిర్ణయించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవక్షేత్రాలకు ఈ నెల 17 నుండి 19 వరకు మూడు రోజుల పాటు ఈ ప్రత్యేక సర్వీసులను తిప్పనుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలానికి 578, వేములవాడకు 481, కీసరగుట్టకు 239, ఏడుపాయలకు 497, వేలాలకు 108, కాళేశ్వరానికి 51, కొమురవెల్లికి 52, కొండగట్టుకు 37, అలంపూర్‌కు 16, రామప్పకు 15, ఉమా మహేశ్వరానికి 14 ప్రత్యేక బస్సులను నడపనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. రద్దీకి అనుగుణంగా మరిన్ని సర్వీస్‌లను నడిపేలా టీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది.శ్రీశైలం పుణ్యక్షేత్రానికి హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఐఎస్‌ సదన్‌, కేపీహెచ్‌బీ, బీహెచ్‌ఈఎల్‌ నుంచి పత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఈ బస్సు సర్వీస్‌లకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యాన్ని టీఎస్‌ఆర్టీసీ కల్పించింది.“మహారాత్రి శివరాత్రి సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని 40 ప్రముఖ శైవాలయాలకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించాం. రద్దీకి అనుగుణంగా మరిన్ని పత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. భక్తులు ఈ ప్రత్యేక సర్వీస్‌లను ఉపయోగించుకుని క్షేమంగా శైవాలయాలకు చేరుకొని.. మొక్కులు చెల్లించుకోవాలి.” అని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ గారు, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ గారు కోరారు. అద్దె బస్సులపై 10 శాతం రాయితీని టీఎస్ఆర్టీసీ కల్పిస్తోందని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహాశివరాత్రికి ఈ అద్దె బస్సు సౌకర్యాన్ని భక్తులు ఉపయోగించుకోవాలని సూచించారు.

యువకుడి ఆత్మ హత్య యత్నం

యువకుడి ఆత్మ హత్య యత్నం

యదార్థవాది ప్రతినిది కామారెడ్డి

కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం మద్నూర్ మండలానికి చెందిన పెండపల్లి సిద్దప్ప అనే యువకుడు ఒంటి పై పెట్రోల్ పోసుకొని ఆత్మ హత్య యతనానికి ప్రయత్నం చేయగా వెంటనే ప్రక్కనే గల పోలీస్ సిబ్బంది.అడ్డుకొని సముదాయించి ఆత్మ హత్య చేసుకోవడానికి గల కారణాలు తెలుసుకొని ధైర్యం చెప్పారు బాధితుడు తెలిపినవివరాలు మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటి లోజరిగిన అవినీతి కుంభకోణం పై విచారణ జరపాలని సమాచార హక్కు చట్టం ప్రకారం వివరణ ఇవ్వక పోవడం వల్ల సిద్దప్ప అనే యువకుడు కలెక్టర్ కార్యాలయం ముందు ఆత్మ హత్య ప్రయత్నం చేసినట్లు బాధితుడు తెలిపాడు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...