24.7 C
Hyderabad
Friday, April 24, 2026

బిజెపిలో చేరిన..విజయ భారతి

బారతీయ జనత పార్టీలో చేరిన బిఅరేస్ నాయకురాలు విజయ భారతి

యదార్థవాది ప్రతినిది ఆర్మూర్

ఆలూర్ మండలం నుండి 100 మంది యువకులు భారీ బైక్ ర్యాలీతో ఆర్మూర్ పట్టణం ఎమ్మార్ చేరుకొని ఎంపీ ధర్మపురి అరవింద్ సమక్షంలో సీనియర్ నాయకులు ఆలూర్ గంగారెడ్డి కూతురు బీఆర్ఎస్ నాయకురాలు విజయభారతి బుదవారం వందమందితో కలిసి బిజెపి పార్టీలో చేరారు. ఆమెకు ఎంపీ కండువకప్పి పార్టి లోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిజెపి పాలనలో జరిగిన అభివృదిని చూసి పార్టీలో చేరానని అన్నారు. మా నియోజకవర్గంలో వచ్చే ఎన్నికలలో బిజెపి గెలుపు కోసం పనిచేస్థానాని అన్నారు.

సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి

సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి

యదార్థవాది ప్రతినిది ఆర్మూర్

భారతీయ జనతా గిరిజన మోర్ఛ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ ఆశయాల, ఆదర్శాల కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలని, సేవాలాల్ మహారాజ్ ఆశయాలను మనమందరం పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, గిరిజన మోర్ఛ నాయకులు గూగులోత్ తిరుపతి నాయక్ పట్టణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


రైల్వే బ్రిడ్జి ప్రారంభించిన:ఎంపీ ధర్మపురి

రైల్వే బ్రిడ్జి ప్రారంభించిన:ఎంపీ ధర్మపురి

యదార్థవాది ప్రతినిది ఆర్మూర్

ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి, గోవింద్ పెట్ గ్రామాలకు వెళ్లే మార్గం లో బ్రిడ్జి ప్రారంభించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్..ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ హయాంలో 8 వందల కోట్ల నిధులతో రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడితే ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 వేల కోట్లతో ప్రతి జిల్లాలో రైల్వే బ్రిడ్జి పని చేయడం జరిగిందని, ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో 67 కోట్ల వ్యాయామంతో శరవేగంగా రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను కేంద్ర ప్రభుత్వం పూర్తి చేస్తుందని, ప్రజల సౌకర్యార్థం అనతి కాలంలోనే పెండింగ్లో ఉన్న మరో మూడు బ్రిడ్జిలు కూడా త్వరితగతిన పూర్తి చేసి మరో రెండు నెలలో ప్రారంభిస్తామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో కొనసాగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనుల విషయంలో కూడా కేంద్రం చూపుతున్న చొరవ రాష్ట్ర ప్రభుత్వం కూడా చూపించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, సిబ్బంది, జిల్లా బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు అందుబాటులో వుండాలి:కమిషనర్

ప్రజలకు అందుబాటులో వుండాలి:కమిషనర్

యదార్థవాది ప్రతినిది రామగుండం

ప్రజలలో మమేకమై ప్రజల మన్నలు పొందేవిధంగా పనిచేయాలి.కమిషనర్ రెమా రాజేశ్వరి (డిఐజీ).. నూతనంగా బెల్లంపల్లి ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన పి. సదయ్య రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి (డిఐజీ) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ అధికారులను సమన్వయ పరుస్తూ ప్రజలతో మంచి సత్ససంబంధలు కలిగి, 24*7 ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలలో మమేకమై ప్రజల మన్నలు పొందేవిధంగా పనిచేయాలని ఏసీపీ కి సూచించారు..

జిల్లా సమగ్ర అభివృద్ధికి దోహదపడదాం..

జిల్లా సమగ్ర అభివృద్ధికి దోహదపడదాం..

యదార్థవాది ప్రతినిది సిద్దిపేట

సిద్దిపేట జిల్లా ఫోరం కార్యాలయంలో వార్షకోత్సవ సన్నాహక సమావేశం బుదవారం జరిగింది. ఈ సన్నాహక సమావేశంలో అధ్యక్షులు వంగ రామచంద్రారెడ్డి, జిల్లాకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఫోరం వార్షికోత్సవం సందర్భంగా జిల్లాకు చెందిన వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారి సేవలను గుర్తించి సన్మానం చేయలని, జిల్లా సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే అంశాలను, సమస్యల పరిష్కారానికి ఒక నివేదిక రూపొందించి ప్రభుత్వం ముందు ఉంచాలని సమావేశం తీర్మానించనైనది. త్వరలో వార్షికోత్సవ నిర్వహణ తేదీని ప్రకటించనున్నట్లు సమావేశం తెల్పింది. ఈ సమావేశంలో జిల్లా సమన్వయ కర్త తుమ్మనపల్లి శ్రీనివాసు, కార్యదర్శులు అమ్మన చంద్రారెడ్డి, కాజీపేట సత్యనారాయణ, భైరవ రెడ్డి, పి. వీరారెడ్డి, ప్రభుదాస్, దబ్బెట యాదగిరి, చొప్పదండి సుధాకర్ తదితరులు పాల్గొనరు..

అనర్షులకే రెండు పడకల ఇండ్లు

అనర్షులను తోలగించాకే డ్రా తీయాలి. ఫిర్యాదులను 10రోజులపాటు స్వీకరించాలి..

పేదలకు న్యాయం చేయని మున్సిపల్ పాలకవర్గం వెంటనే రాజీనామా చేయాలి…

యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్

టిఆర్ఎస్ ప్రభుత్వం పేదలందరికీ రెండు పడకల ఇండ్లు కట్టి ఇస్తామని చెప్పి అనర్షులకు ఇండ్ల మంజూరి చేసి పేదలకు తీవ్ర న్యాయం చేస్తుందని అందుకు హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ కు పాలకవర్గం వంత పడుతుందని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయం వద్ద డబుల్ బెడ్ రూం ల జాబితాలో జరిగిన అవకతవకలపైన సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో అయన మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు గత నెలలో రెండు పడకల ఇండ్లు జాబితా ప్రకటించగా చాలా వరకు అనర్హులకే ఇండ్లు వచ్చాయని, జిల్లా మంత్రి హరీష్ రావు, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే చోరవతీసుకోని 16న లబ్దిదారుల డ్రా ను వెంటనే నిలిపివేసి మళ్లీ రీసర్వే
చేసి అసలైన పేదలకు అందించాలని అన్నారు. రీ సర్వేలో మొదటి జాబితాలో ఉన్న లబ్ధిదారులు రెండవ జాబితాలో కూడా వున్నారని, సర్వే అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పనితీరు వల్లే ఇండ్ల సర్వే తప్పుల తడకతో ఉన్న జాబితాలోని పేర్లను డ్రా లో వేయడం ద్వారా అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కొహెడ కొమురయ్య, అయిలేని సంజివరెడ్డి,ఎగ్గొజు సుదర్శన్ చారి, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, ఎఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జనగాం రాజు కుమార్, జంగ విజయ, అర్షలైన ఇండ్లు మంజూరి కాని పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు, యువతి, యువకులు పాల్గొన్నారు.

మహిళలకు క్లాత్ పెయింటింగ్ పై శిక్షణ

మహిళలకు క్లాత్ పెయింటింగ్ పై శిక్షణ

యదార్థవాది ప్రతినిధి తెనాలి

తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలొ మహిళలకు యువతులకు బాలికలకు క్లాత్ పై పైయింటింగ్ వర్క్ ఉచిత శిక్షణాతరగతులను పట్టణ ఆర్యవైశ్య సంఘముల సమన్వయకర్త మద్దాళి శేషాచలం బుధవారం ప్రారంభించారు స్ధానిక బోసు రోడ్డు లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణ కల్యాణమండపంలొ ఏర్పాటు చేసిన ఈ శిక్షణా శిబిర ప్రారంభ కార్యక్రమానికి పట్టణ ఆర్యవైశ్యసంఘం అధ్యక్షులు భాస్కరుని శ్రీనివాసరావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఆర్యవైశ్యసంఘం లోని మధ్యతరగతి కుటుంబ మహిళల, బాలికల ఆర్ధిక స్వావలంబనకు తోడ్పడే విధంగా పెయింటింగ్ శిక్షణ కేంద్రం ప్రారంభించా మని అన్నారు ఆర్యవైశ్య సంఘాల కోఆర్డినేటర్ మద్దాలిశేషాచలం మా ట్లాడుతు మహిళలకు ప్రయోజనకరమైన పైయింటింగ్ శిక్షణనను సద్వినియోగం చేసుకోవాలని త్వరలొ ఆర్యవైశ్యసంఘం ద్వారా లీగల్ సెల్ ఉచితంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు కూరపాటి శ్రీ లక్ష్మీ ఆర్యవైశ్య మహిళలకు ఉచితంగా క్లాత్ పెయింటింగ్ లొ శిక్షణ ఇవ్వనున్నారు ఈ కార్యక్రమంలో కొల్లా గురునాథ గుప్తా కౌన్సిలరు గడవర్తి శాయిహరేరామ్ ఆతుకూరి పూర్ణచంద్రరావు తూనుగుంట్ల సుబ్బారావు, కర్పూరపు రఘునాథ గుప్తా,మహిళా సంఘం అధ్యక్షురాలు కొండవీటి లక్ష్మీ పద్మావతి కార్యదర్శి ఆలమూరి పూజా కోశాధికారి ఆకి గోవర్ధన లక్ష్మి తదితర ఆర్యవైశ్య నాయకులు మహిళా సభ్యులు పాల్గొన్నా రు

కొండగట్టు ఆలయ అభివృద్ధికి మరో రూ.500 కోట్లు: సీఎం కేసీఆర్‌

కొండగట్టు ఆలయ అభివృద్ధికి మరో రూ.500 కోట్లు: సీఎం కేసీఆర్‌

యదార్థవాది ప్రతినిధి జగిత్యాల

దేశంలో అతిపెద్ద హనుమాన్‌ క్షేత్రం ఎక్కడుందంటే కొండగట్టు పేరే చెప్పుకోవాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇవాళ ఆయన కొండగట్టులో ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అధికారులతో ఆలయ అభివృద్ధిపై రెండు గంటలకుపైగా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశం అనంతరం మాట్లాడుతూ.. ప్రపంచాన్నే ఆకర్షించేలా అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని అన్నారు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి ఒక బృహత్తర ప్రాజెక్టని, భక్తులకు సకల వసతులు, అన్ని హంగులతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సీఎం చెప్పారు. కొండగట్టులో ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఘాట్ రోడ్డులను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. హనుమాన్ జయంతిని దేశంలోనే అత్యంత గొప్పగా కొండగట్టులో జరుపుకోవాలన్నారు వేల మంది ఒకేసారి హనుమాన్ దీక్ష ధారణ, విరమణ చేస్తుంటారని, అలాంటి సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. హనుమాన్ దీక్ష దివ్యంగా, గొప్పగా జరిగేలా కృషిచేయాలని సూచించారు. సుమారు 850 ఎకరాల్లో ఆలయ అభివృద్ధి , విస్తరణ పనులు చేయాలని, పెద్ద గోడ, పార్కింగ్, పుష్కరిణి, అన్నదాన సత్రం, కళ్యాణ కట్ట, కోనేరును అభివృద్ధిపర్చాలన్నారు అంతేగాక కొండగట్టు ఆలయ అభివృద్ధికి మరో రూ.500 కోట్ల నిధులను కేటాయించనున్నట్లు సీఎం ప్రకటించారు. ఆలయం పరిసరాల్లో 86 ఎకరాల స్థలంలో సువిశాల పార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. వసతులు గొప్పగా ఉంటే దర్శనానికి వచ్చే భక్తులు పెరుగుతారని చెప్పారు. తాను మళ్ళీ కొండగట్టుకు వస్తానని, ఆలయ అభివృద్ధి, విస్తరణపై సమీక్ష నిర్వహిస్తానని అన్నారు.

శివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించిన: డిసీపీ

శివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించిన: డిసీపీ

యదార్థవాది ప్రతినిది మంచిర్యాల

బుగ్గ రాజరాజేశ్వర స్వామి శివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించిన డిసీపీ సుధీర్ రాంనాథ్.. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ తాళ్ళగురిజాల పోలీస్ స్టేషన్ పరిధిలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే బుగ్గ రాజరాజేశ్వర స్వామి జాతర ఏర్పాట్లను మంచిర్యాల డీసీపీ కేకన్ సుధీర్ రాంనాథ్, తాళ్ళగురిజాల ఎస్ఐ రాజశేఖర్ లతో టెంపుల్ పరిసరాలు క్యూ లైన్స్ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్స్ పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించరు. ఈ సందర్భంగా డిసీపీ మాట్లాడుతూ ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా మరమ్మతులు చేయించాలని, జాతర సమయం లో ట్రాఫిక్ సమస్య లేకుండా జాతరకు భక్తులు దేవుడి దర్శనం చేసుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. తాళ్ళగురిజాల రాజశేఖర్ఆ, అలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కొండగట్టు అంజన్నకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

కొండగట్టు అంజన్నకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

యదార్థవాది ప్రతినిధి జగిత్యాల

జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేరుకున్నారు. ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కొండగట్టు సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూకు చేరుకున్నారు. అక్కడ మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ సీఎం కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. అటునుంచి రోడ్డుమార్గంలో అంజన్న క్షేత్రానికి చేరుకున్నారు ఆలయం వద్ద సీఎం కేసీఆర్‌కు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంత్రులు, ప్రజాప్రతినిథులు, అధికారులతో కలిసి కొండగట్టుపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలించారు అనంతరం జేఎన్టీయూ సమావేశ మందిరంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు-చేర్పులపై సమాలోచనలు భక్తుల సౌకర్యార్థం చేపట్టే అభివృద్ధి పనులపై ఓ నిర్ణయానికి రానున్నారు. ఇప్పటికే కొండగట్టు అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ రూ.100 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే..

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...