26.7 C
Hyderabad
Friday, April 24, 2026

మరో సారి హత్యకు ప్రయత్నం

మరో సారి హత్యకు ప్రయత్నం

యదార్థవాది ప్రతినిది నిజామాబాద్

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై మరోసారి హత్యకు జరుగుతున్న కుట్రను నిజామాబాద్ పోలీసులు భగ్నం చేశారు. జీవన్ రెడ్డిని మట్టుబెట్టేందుకు జిలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లు సేకరించి నిలవుంచిన వ్యవహారాన్ని బట్టబయలు చేసిన పోలీసులు.. కుట్రకు సూత్రధారి గతంలో జీవన్ రెడ్డి పై హత్యాయత్నం చేసిన కేసులు జైలులో ఉండడం గమనార్హం. తన ఇంట్లో పేలుడు పదార్థాలు నిలువ ఉంచిన మహిళను పోలీసులు పట్టుకోవడంతో కుట్ర వ్యవహారం వెలుగు చూసింది. నిజామాబాద్ నగరం లోని కంటేశ్వర్ న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో రూరల్ పోలీసుల తనిఖీలు నిర్వహించారు. ఎంఐజి-122 ఇంటిలో 95 జిలెటిన్ స్టిక్స్, 10 డిటొనేటర్స్ స్వాధీనం చేసుకుని ఇంటి యజమాని బొంత సుగుణను అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతున్నట్టు నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ జగడం నరేష్ తెలిపారు. పోలీసుల విచారణలో సుగుణ తన ఇంట్లో డిటెొనేటర్లను, జిల్టిన్ స్టిక్ లను మాక్లూర్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన ప్రసాద్ గౌడ్ దాచుకున్నట్లు వెల్లడించిందని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు.

స్వామి వారికీ పట్టు వస్త్రాలు సమర్పించిన : మాజీ ఎంపీ

స్వామి వారికీ పట్టు వస్త్రాలు సమర్పించిన : మాజీ ఎంపీ

యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్

శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మాజీ ఎంపీ పొన్నం
హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలోని శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలకు శటగోపం పెట్టిన సీఎం కేసీఆర్, దేవుళ్లకు శటగోపం పెడితే దేవుడు క్షమించడని, దేవాలయాల అభివృద్ధికి ఇచ్చిన హామీలను నెరవేర్చేల కేసీఆర్ కు సద్భుద్దిని కలగజేయాలని స్వామివారిని వేడుకుంటున్నట్లు తెలిపారు.

నూతన బస్సులను ప్రారంభించిన: ఎమ్మెల్యే

నూతన బస్సులను ప్రారంభించిన: ఎమ్మెల్యే

యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్

నూతన సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీష్ కుమార్.. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ హుస్నాబాద్ లో బస్ డిపో లేకుండా చేస్తున్నారని రాద్దాంతం చేసిన ప్రతిపక్ష నాయకులు, ఇప్పుడు డిపోకు కొత్తగా బస్సులు ఎలా వచ్చాయో సమాధానం చెప్పాలన్నారు. హుస్నాబాద్ డిపోకు రెండు సూపర్ లగ్జరీ బస్సులు కావాలని అడగగానే వారం రోజుల్లో డిపోకు రెండు సూపర్ లగ్జరీ బస్సులను ఇప్పించిన మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు..రెండు బస్సుల్లో ఒక బస్సు హుస్నాబాద్ వయా సిద్దిపేట మీదుగా సికింద్రాబాద్ వెళ్తుందని, మరొక బస్సును హుస్నాబాద్ వయా జనగాం, యాదగిరిగుట్ట మీదుగా హైదరాబాద్ కు నడుస్తాయని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని బస్సు సర్వీస్ లో పెంచి డిపోను అభివృద్ధి చేస్తామన్నారు. హుస్నాబాద్ బస్టాండ్ నుండి వివిధ రూట్లలో నడుస్తున్న ఆర్టీసీ బస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, ప్రజలందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యకమములో హుస్నాబాద్ చైర్పర్సన్, ప్రజా ప్రతినిధులు, బిఅరేస్ నాయకులు పాల్గొన్నారు.

శివాలయాలకు పోటెత్తిన భక్తజనం

శివాలయాలకు పోటెత్తిన భక్తజనం

యదార్థవాది ప్రతినిది శ్రీశైలం

మహా శివరాత్రి సందర్భంగా సుప్రసిద్ధ శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. వేకువ జామునుంచి భక్తజనం దేవాలయాలకు పోటెత్తారు. ప్రత్యేక పూజా కర్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీగిరి క్షేత్రం శ్రీశైలం, శ్రీకాళహస్తి, శ్రీముఖలింగం, రావివలస, మహేంద్రగిరి, రామతీర్థం, నర్సీపట్నం, వేములవాడ, కీసర తదితర ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది. హరహర మహాదేవ శంభోశంకర, శివోహం అంటూ భక్తులు పరమశివున్ని స్మరిస్తున్నారు. శివునికి మహాప్రీతిపాత్రమైన మహాశివరాత్రి రోజున బిల్వార్చకం, రుద్రాభిషేకాలతో ఆ ముక్కంటి సేవలో తరిస్తున్న భక్తులు..

రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన: పట్టు వస్త్రాలు

రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన: పట్టు వస్త్రాలు

యదార్థవాది ప్రతినిది వేములవాడ

వేములవాడ శ్రీరాజ రాజేశ్వర స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. పాల్గొన్న జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ , ఆర్డీఓ టి శ్రీనివాస్ రావు

శివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సులు

శివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సులు

యదార్థవాది ప్రతినిది ఆర్మూర్

మహా శివరాత్రి సందర్భంగా ఆర్మూర్ నుండి వేములవాడ కు జాతర స్పెషల్ క్యాంపును శుక్రవారం ప్రారంభించిన ఆర్మూర్ డిపో మేనేజర్ కవిత, ఆర్మూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు.. ఈ సందర్భంగా మేనేజర్ కవిత మాట్లాడుతూ గత సంవత్సరం శివరాత్రి జాతరకు 80 బస్సులు నడిపామని, ఈ సంవత్సరం మహా శివరాత్రికి ఆర్మూర్ నుండి వేములవాడకు 130 నుండి 150 బస్సులను నడపాలని లక్షంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ రాష్ట రోడ్డు రవాణసంస్థలో అనుభవగ్యులైన డ్రైవర్ల ఉంటారని, నిర్ణీత వేగంతో బస్సుల నడుపుతూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారని, అందువల్ల సురక్షితంగా వారి గమ్యస్థానాలు చేరుస్తారని తెలిపారు.

ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

యదార్థవాది ప్రతినిది సిద్దిపేట

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో కెసిఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ కారణజన్ముడిగా, చిరస్మరణీయుడుగా, ప్రజల తల రాతలు మార్చే మహానియుడుగా, మహా నాయకునిగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, పార్టీ కార్యకర్తలు, ఉద్యమ కారుల మధ్య శుక్రవారం జన్మదిన వేడుకలు నివహిస్తునమని, కెసిఆర్ ఈ మట్టి బిడ్డా కావడం గర్వకారణంగా వుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజుల, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు..

ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు..

యదార్థవాది ప్రతినిది ఆర్మూర్

జాతీయ రహదారి‌ 44లో ఆగి ఉన్న లారీని ప్రైవేట్ బస్సు శుక్రవారం ఢీ కొద్ది… ఆర్మూరు నియోజకవర్గంలో పెర్కిట్ వద్ద ఆగిఉన్న లారీని ప్రైవేట్ బస్సు ఢీ కొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి, ప్రమాదంలో గాయాలపాలైన వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్మూర్ సీఐ సురేష్ బాబు తెలిపారు.

ముస్తాబయిన శివాలయం

ముస్తాబయిన శివాలయం

యదార్థవాది ప్రతినిది ఆర్మూర్

ఆర్మూర్ పట్టణం ప్రఖ్యాతిగాంచిన నవనాద సిద్ధుల గుట్టపై శివాలయం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా శివపార్వతుల కళ్యాణం, శనివారం శివరాత్రి దర్శనం, ఆదివారం లక్ష మందికి అన్నదాన కార్యకమఏర్పాట్లను చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు ఏనుగు శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ శివరాత్రి పర్వదినం రోజు దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా మూడు క్యూలైన్లను ఏర్పాట్లు చేశామని, నవనాథ సిద్దుల గుట్టను అభివృద్ధి చేయడం జరిగిందని, సిద్దుల గుట్ట ఘాట్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ ఇదివరకే పూర్తి అయిందని, సిద్ధుల గుట్ట పైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ సహకారంతో ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నక్కల లక్ష్మణ్, కొడిగేల మల్లయ్య, కిషన్, బిఅరేస్ నాయకులు పవన్, అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రేమ జంట మృతి

ప్రేమ జంట మృతి

యదార్థవాది ప్రతినిది మెదక్

ప్రేమ జంట మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలో చోటుచేసుకుంది గురువారం నార్సింగ్ గ్రామం పెద్ద చెరువులో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను వెలికి తీసి కల్పన అఖిల్ గా గుర్తించారు మీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు వీరి పెండ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడం మతాలు వేరు కావడమే కారణం కావడంతో కల్పన తల్లిదండ్రులు రెండు నెలల క్రితం వేరే వ్యక్తి తో పెళ్లి చేశారు అయినా వారి ఇరువురులో ప్రేమ మారలేదు కాబోలు ఆ ప్రేమే వారిని ఆత్మహత్య వైపు నడిపించిందా లేక కావాలని చంపేశారా ఏమైందో కానీ నార్సింగ్ చెరువులో ఇద్దరి మృత దేహాలు లభ్యమయ్యాయి పోలీసులు హత్య ఆత్మహత్యామ్మ కోణంలో విచారణ చేపట్టారు..

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...