26.7 C
Hyderabad
Friday, April 24, 2026

ఆప్త మిత్రుడు అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఆప్త మిత్రుడు అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే

యదార్థవాది ప్రతినిధి ఆర్మూర్

ఆప్తమిత్రుడు మృతితో దిగ్బ్రాంతికి లోనైనా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. విద్యుత్ ఘాతానికి గురై ఆర్మూర్ నవనాధ సిద్దలగుట్ట ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు శేఖర్ రెడ్డి దుర్మరణం చెందారు. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, స్థానిక ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆర్మూర్ పట్టణ నవనాథ సిద్దుల గుట్ట ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు శేఖర్ రెడ్డి బుధవారం తెల్లవారుజామున తన వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్ ఘాతానికి గురై దుర్మరణం చెందారు. శేఖర్ రెడ్డి మరణించిన వార్త తెలిసి ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. హైదరాబాద్ నుంచి హుటాహుటిన ఆర్మూర్ చేరుకుని ఎమ్మెల్యే దంపతులు జీవన్ రెడ్డి రజిత రెడ్డిలు తమ కుటుంబ సభ్యులతో కలిసి శేఖర్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్నారు. శోక తప్త హృదయంతో తన సన్నిహితుడు శేఖర్ రెడ్డి పాడేమోసి కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి కన్నీరు మున్నీరుగా విరపిస్తూ శేఖర్ రెడ్డి కుటుంబాన్ని ఓదార్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ శేఖర్ రెడ్డి మరణం బిఆర్ఎస్ పార్టీ తో పాటు వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని కంటనీరు పెట్టుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ శేఖర్ రెడ్డి కుటుంబానికి అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు.

విజయవంతంగా ముగిసిన రెండు రోజుల వర్క్ షాప్

విజయవంతంగా ముగిసిన రెండు రోజుల వర్క్ షాప్

యదార్థవాది ప్రతినిధి ఆర్మూర్

ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజుల వర్క్‌షాప్ రూబికాన్ స్కిల్ డెవలప్‌మెంట్ వారి ఆధ్వర్యం లో నిర్వహించారు. పూణే నుంచి వచ్చిన ముగ్గురు శిక్షకులు సునీల్, హరీష్, ఫయాజ్ విద్యార్థులకి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ స్కిల్స్, డిబేట్ తదితర విషయాలపై విద్యార్తులకి అవగాహన కల్పించారు. బుధవారం ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్ కళాశాలప్రిన్సిపల్ ప్రొఫెసర్ డా. రామ్ కింకర్ పాండేలు మాట్లాడుతూ, ఇంటర్వ్యూ స్కిల్స్ మల్టీ నేషనల్ కంపెనీస్ లలో ఉద్యోగాలు పొందటానికి ఎంతగానో ఉపయోగ పడతాయి అని అన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్కి ఉన్న ప్రత్యేకతా గురించి తెలియజేసారు. అలాగే వర్క్‌షాప్‌ నిర్వహించిన శిక్షకులని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, సాంకేతిక సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

అక్రిడేషన్ సమస్యను పరిష్కరించాలి

అక్రిడేషన్ సమస్యను పరిష్కరించాలి

యదార్థవాది ప్రతినిది విశాఖపట్నం

రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అక్రిడేషన్ సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస గోపాలకృష్ణను బుధవారం విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పోతుమహంతి నారాయణ్ కోరగా అందుకాయన సానుకూలంగా స్పందించారు. అక్రిడేషన్లు జారీ అంశం పరిశీలిస్తున్నామని ఈ ఏడాది అక్రిడేషన్లు జారీలో సరళతరమైన విధానాలు అమలు చేసి ఆలోచన ఉందని ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున దాని గురించి ఇప్పుడు మాట్లాడ్డం సబబుగా ఉండదని మంత్రి పేర్కొన్నారు.. కోడ్ ముగిశాక ఈ అంశమై ప్రధానంగా చర్చించి జర్నలిస్టులకు న్యాయం చేస్తామన్నారు.

పాఠశాల భవనానికి భూమి పూజ

పాఠశాల భవనానికి భూమి పూజ

యదార్థవాది ప్రతినిది వేములవాడ

వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో కార్పొరేట్ సామాజిక బాధ్యతల(CSR) నిధుల నుండి రు. 5 కోట్లతో నిర్మించే ప్రభుత్వ ఉన్నత పాఠశాల సముదాయాల భవనానికి భూమి పూజ చేసిన శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు, జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి..ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఖీమ్య నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, జిల్లా విద్యాధికారి రాధకిషన్, జడ్పీటిసి లు, ఎంపీపీలు, కౌన్సిలర్స్, సెస్ డైరెక్టర్లు, పాక్స్ చైర్మన్లు, నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి వేముల

బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి వేముల

యదార్థవాది ప్రతినిధి న్యూఢిల్లీ

దేశరాజధాని ఢిల్లీలో నిర్మిస్తున్న బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణ పనులను బుధవారం
రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్షేత్ర స్థాయిలో పనులను పర్యవేక్షించారు… పనుల పురోగతిపై ఆర్కిటెక్ట్,వర్క్ ఏజెన్సితో సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్టీ అధినేత విధించిన నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని, నిర్మాణ సంస్థ ప్రతినిధులను మంత్రి అదేశించారు. మంత్రి వెంట ఉర్దూ అకాడెమీ ఛైర్మన్ ముజీబుద్దిన్, ఆర్కిటెక్ట్ ఆస్కార్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, బీఅర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

దేవాలయ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం!

దేవాలయ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం!

యదార్థవాది ప్రతినిది వేములవాడ

దేవాలయ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అని శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు అన్నారు.. మున్సిపల్, వి.టి.డి.ఏ అధికారులతో కలెక్టర్ అనురాగ్ జయంతి, శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబుతో రివ్యూ మీటింగ్ బుధవారం నిర్వహించారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే 6మాసాల్లో 50కోట్ల పనులను పూర్తి చేస్తామని, మొదటిది బద్దీపోచమ్మ దేవాలయం విస్తరణలో భాగంగా 2 గుంటల్లో ఉన్న దేవాలయాన్ని 18కోట్లు నష్టపరిహారం ఇచ్చి 1 ఎకరం స్థలం దేవాలయం కొరకు తీసుకోవడం జరిగిందని, ఆ స్థలంలో బోనాలు తీసే మహిళలకు బోనాల మంటపం, మంచి క్యూ కాంప్లెక్స్ ఇలా మంచి సౌకర్యాలు ఏర్పాటు, రెండవది 10కోట్లతో గుడి చెరువు సుందరీకరణ తో పాటు 800 మీటర్ల పుష్కర ఘాట్లను ఏర్పాటు, మొదటి విడతగా తిప్పాపురం గుడివరకు రోడ్ల వెడల్పు, ఫుట్ పాత్ ల నిర్మాణం చేస్తామని తెలిపారు. శివార్చన లో అద్భుతమైన కళాఖండాలు ఆవిష్కృతమయ్యాయో అలాంటి వాటికోసం సాంసృతిక, వేద పాటశాలలు ఎలాగైతే ఉన్నాయో వాటితో పాటు నృత్యం గానం కళాశాలను ఏర్పాటు చేసుకొని వాటికి భవనాలు కూడా గొప్పగా నిర్మించబోతున్నామని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జెడ్.పి చైర్మన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్మన్ రామతీర్థం మాధవి, వి.టి.డి.ఏ ఆర్కిటెక్ట్ ముక్తేశ్వర్, వి.టి.డి.ఏ సెక్రెటరీ భుజంగరావు, ఎస్టేట్ ఆఫీసర్ గంప సత్యనారాయణ, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు అందుబాటులో పోలీసులు: జిల్లా ఎస్పీ

ప్రజలకు అందుబాటులో పోలీసులు: జిల్లా ఎస్పీ

యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల

వాట్సప్ మెసేజ్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్న జిల్లా ఎస్పీ… నేరుగా ఫిర్యాదు చేయలేనివారు, దూరప్రాంతాల్లో ఉన్న వారు వాట్సాప్ మెసేజ్ రూపంలో పిర్యాదు చేయడానికి ప్రజలకు వాట్సప్ నెంబర్ 6303922572 ప్రారంభించినజిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్… రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా, ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకంగా సేవలు అందించాలనే లక్ష్యంతో మెసేజ్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని ప్రారంభించామని బుధవారం ఆయన ఒక ప్రకటన తెలిపారు. మెసేజ్ యువర్ ఎస్పీ ద్వారా జిల్లా పరిధిలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా, ఎలాంటి సమచారాన్ని అయిన క్షణాల్లో పోలీసు అధికారులకు చేరవేయవచ్చని అన్నారు. ప్రధానంగా ఫిర్యాదులు, నేరాలు, ఉమెన్ హారస్మెంట్స్, ఈవ్ టీజింగ్, రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన సంఘటనలు, అక్రమ రవాణా, మొదలైన సమాచారం మెసేజ్ రూపంలో అందిస్తే వెంటనే స్పందించి ఆ పరిధిలోని డీఎస్పీ, ఇన్స్పెక్టర్లు, ఎస్సైల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమాచారం చేరవేసే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామనీ, ఎల్లవేళలా వాట్సాప్ సేవలు అందుబాటులో ఉండేవిధంగా ఈ నెంబర్స్ తన పర్యవేక్షణలోనే ఉంటుందని ఎస్పీ తెలిపారు.

కరంట్ షాక్‌తో రైతు మృతి

కరంట్ షాక్‌తో రైతు మృతి

కరంట్ షాక్‌తో బీఆర్ఎస్ నాయకుడు ఏనుగు చంద్రశేఖర్ రెడ్డి మృతి..

యదార్థవాది ప్రతినిది ఆర్మూర్

బీఆర్ఎస్ నాయకులు, సిద్దులగుట్ట ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు చంద్రశేఖర్ రెడ్డి కరంట్ షాక్‌తో బుధవారం ఉదయం మృతి చెందినట్లు రైతులు తెలిపారు..విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రభుత్వ మర్చురికి తరలించారు. అయన మరణ వార్త తెలిసి ఆర్మూర్‌ ఆర్మూర్ ఎమ్మెల్యే.జీవన్ రెడ్డి అంత్యక్రియలకు పాల్గోటారని తెలుస్తోంది..ఆలూరులో బీఆర్ఎస్ నాయకులు రోడ్డు ప్రాంతం జనసంద్రంగా మారింది..

సమిష్టి కృషితోనే శివరాత్రి జాతర సక్సెస్: కలెక్టర్ అనురాగ్

సమిష్టి కృషితోనే శివరాత్రి జాతర సక్సెస్: కలెక్టర్ అనురాగ్

యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల

దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడలో జరిగే మహా శివరాత్రి జాతర అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది కృషి, ప్రజా ప్రతినిధుల సహకారంతోనే విజయవంతం అయ్యిందనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. మంగళవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వేములవాడ మహా శివరాత్రి జాతర సందర్భంగా సమర్థవంతంగా విధులు నిర్వర్తిoచిన అధికారులకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్, ఆలయ అథారిటీ , రెవెన్యూ, పంచాయితీ రాజ్, మున్సిపల్, ఇంజనీరింగ్ విభాగాలు, ఐ అండ్ పి ఆర్ , ఇతర ప్రభుత్వ శాఖల క్షేత్ర స్థాయి కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించి అధికారులను అభినందించారు. అన్ని అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమిష్టి కృషితో మహా శివరాత్రి జాతరను సక్సెస్ అయ్యిందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ లు బి సత్య ప్రసాద్, ఎన్ ఖీమ్యా నాయక్ , శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయం కార్య నిర్వహణ అధికారి కృష్ణ ప్రసాద్, ఆర్డీఓ టి శ్రీనివాస్ రావు, DSP నాగేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.

అసాంఘిక శక్తులకు దూరంగా ఉండాలి: డిసిపి

అసాంఘిక శక్తులకు దూరంగా ఉండాలి: డిసిపి

యదార్థవాది ప్రతినిది మంచిర్యాల

తట్రపోష గూడెం, తాళ్లపెట్ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల డిసిపి కేకన్ సుదీర్ రాంనాథ్..ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని, ఎలాంటి సమస్య ఉన్న చట్టపరిధిలో పరిష్కరించడం జరుగుతుందని, ప్రజలకు రక్షణ, భద్రత కల్పించడమే పోలీసుల ధ్యేయమని తెలిపారు.ఎవరైనా ఆపదలో ఉంటే డయల్ 100కు సమాచారం అందించాలని, ప్రలోభాలకు లొంగకుండా గ్రామాల అభివృద్ధికి సహకరించాలని, యువత, ప్రజలు అసాంఘిక శక్తులకు సహకరించవద్దని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీసీపీ తెలిపారు. ఈ సందర్భంగా యువతకు వాలీబాల్ కిట్స్ ని డిసిపి కేకన్ సుదీర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ తిరుపతి రెడ్డి, మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్, ఎస్ఐ సాంబమూర్తి గ్రామస్తులు పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...