28.2 C
Hyderabad
Friday, April 24, 2026

రాజ‌న్న సిరిసిల్ల బిడ్డ‌లు రాష్ట్రంలో, దేశంలో అగ్ర‌భాగాన ఉండాలి మంత్రి కేటీఆర్

రాజ‌న్న సిరిసిల్ల బిడ్డ‌లు రాష్ట్రంలో, దేశంలో అగ్ర‌భాగాన ఉండాలి మంత్రి కేటీఆర్

యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల

రాజ‌న్న సిరిసిల్ల బిడ్డ‌లు రాష్ట్రంలో, దేశంలో అగ్ర‌భాగాన ఉన్నారంటే మీ త‌ల్లిదండ్రులు, అధ్యాప‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులైనా తామంతా గ‌ర్వ‌ప‌డుతాం అని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాబోయే మూడు నెల‌లు బాగా క‌ష్ట‌ప‌డి చ‌దివి మంచి ర్యాంకులు సాధించాల‌ని మ‌నస్ఫూర్తిగా ఆశీర్వ‌దిస్తున్నాన‌ని కేటీఆర్ తెలిపారు. గిఫ్ట్ఏ స్మైల్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఎల్లారెడ్డిపేట ప‌రిధిలో 2 వేల మంది ఇంట‌ర్ విద్యార్థుల‌కు కేటీఆర్ ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో ఆయన మాట్లాడుతూ ట్యాబ్‌ల‌ను చదువు కోసం ఉపయోగించుకోవాలి ఇందులో ఇంట‌ర్నెట్ పెట్టి ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ పెట్టి వాటితో టైం వేస్ట్ చేయ‌కండి మంచిగా చ‌దువుకొని ఐఐటీ, నీట్ ఎంట్రెన్స్‌ల‌తో పాటు ఇత‌ర రంగాల్లో మంచి ర్యాంకులు సాధించండి. ప్ర‌ప‌చంతో పోటీ ప‌డే పౌరులుగా త‌యారు కావాల‌నే ఉద్దేశంతోనే మీకు ఈ ట్యాబ్‌లు అంద‌జేస్తున్నాం గిఫ్ట్ఏ స్మైల్ కార్య‌క్ర‌మంలో భాగంగా చిన్నారి త‌మ్ముళ్లు, చెల్లెళ్ల ముఖాల్లో చిరున‌వ్వులు చూడాల‌ని ఆకాష్ బై జూస్ సాఫ్ట్‌వేర్ ట్యాబ్‌ల‌ను విద్యార్థులకు అందజేస్తున్నాo ట్యాబ్‌ల‌ను పంపిణీ చేస్తున్నాం అని కేటీఆర్ తెలిపారు. ఈ ట్యాబ్‌ల ద్వారా పోటీ ప‌రీక్ష‌ల‌కు ఉప‌యోగప‌డే మెటిరీయ‌ల్‌ను అంద‌జేస్తున్నాం. బ‌య‌ట కంటే ఈ ట్యాబ్ విలువ రూ. 10 వేలు అవుతుంది. మెటిరీయ‌ల్ విలువ రూ. 75 వేలు అవుతుంది. అంటే ఒక్కో ట్యాబ్ విలువ రూ. 86 వేలు.. దీన్ని ఉచితంగా మీ చేతుల్లో పెడుతున్నాం. మీరు బాగా చ‌దువుకుంటే.. మేమంతా సంతోష‌ప‌డుతాం. గ‌ర్వ‌ప‌డుతాం అని అన్నారు.

ఫిర్యాదులపై తక్షణమే స్పందించండి: పోలీస్ కమిషనర్

ఫిర్యాదులపై తక్షణమే స్పందించండి: పోలీస్ కమిషనర్

ప్రజలతో మంచి సత్సoబంధాలు ఉండాలి. ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా పనిచేయాలి: పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి..

యదార్థవాది ప్రతినిది పెద్దపల్లి

ప్రజలతో మంచి సత్సoబంధాలు ఉండాలి. ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా పనిచేయాలి: పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి.. పెద్దపల్లి జోన్ పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సబ్ డివిజన్, సర్కిల్, స్టేషన్ ల వారిగా ఏసిపిలను, సర్కిల్ ఇన్ స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ లను వారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాలలోని బౌగోళిక పరిస్థితిలు, నేరాలు, ఫ్యాక్టరీలు, ప్రాజెక్ట్ లు, పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల పూర్తి వివరాలు, శాంతి భద్రతలు, నేరాల అదుపునకు తీసుకుంటున్న చర్యలును అడిగి తెలుసుకోన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నేరాలు జరిగిన తర్వాత వాటిని చేధించడం కన్నా, అప్రమత్తంగా ఉంటూ నేరాలను నిరోధించడమే ఉత్తమమని, న్యాయం కోసం స్టేషన్ కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఎస్సై పనితీరుపై శాంతి భద్రతలు ఆధారపడి ఉంటాయని, ప్రతి పోలీస్ అధికారులతో పాటు సిబ్బందికి పోలీస్ స్టేషన్ పరిధిపై పూర్తి అవగాహన ఉండాలని, తమ ప్రాంతంలో జరిగే చిన్న విషయంన్ని వదలకూడదని, సమాచారం అందినవెంతనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ కు వెళితే న్యాయం కలుగుతుందని నమ్మకం కలిగేలా విధుల నిర్వహించాలని, సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రియ ఆధారాలతో దర్యాప్తు చేయాలని, ఫోరెన్సిక్ సైన్స్ పై, శాస్త్రీయ ఆధారాల తో నేర పరిశోధన వంటి అంశాలపై సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో పాటు, సహాయం కోసం వచ్చే వారిని స్నేహ పూర్వకంగా పలకరించి వారి సమస్య తెలుసుకోని, ప్రజలకు జవాబుదారీగా విధులు నిర్వహిస్తూ వారి మన్ననలు పొందేలా పోలీసు యంత్రాంగం పనిచేయాలని తెలిపారు. ఈ సమావేశం లో పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్,పెద్దపల్లి ఏసీపీ ఏడ్ల మహేష్, గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్, ట్రాఫిక్ ఏసీపీ బాలరాజ్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మోహన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ లు సత్యనారాయణ, శ్రీనివాస్, సిసి ఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లు ప్రవీణ్ కుమార్, అనిల్ కుమార్, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ బాబు రావు, ఐటి సెల్ ఇన్స్పెక్టర్ కర్ణాకర్, సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ కర్ణాకర్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, పెద్దపల్లి జోన్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్స్, సిసి శ్రవణ్ కుమార్, ఆర్ఐ లు, ఎస్ఐ లు పాల్గొన్నారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జండా ఎగురుతుంది..

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జండా ఎగురుతుంది..

యదార్థవాది ప్రతినిది నిజామాబాద్

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ గడ్డ మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జండా రేప రేప లాడుతుందని. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం కో ఆర్డినేటర్ బుస్సాపూర్ శంకర్ అన్నారు. మంగళవారం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలోని ప్రతి డివిజన్లో అధ్యక్షులు పార్టీ బలోపేతం చేయాలని, తమ డివిజన్లలో ఉన్న సమస్యలపై పోరాటం చేద్దాం అని, ఇప్పటికే నగరంలోని 60 డివిజన్లలో కమిటీలు పూర్తి చేశామని, నేటి నుండి నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ముందుకెళ్తామన్నారు. నగరంలో ఉన్న ప్రతి సమస్య మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మైనారిటీ, బీసీ, విభాగం జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్. యువజన అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

దేశ వ్యాప్త స్వచ్ఛ సర్వేక్షణ్ 2023..గ్రామీణంలో సిద్ధిపేట జిల్లా ప్రథమ స్థానం

దేశ వ్యాప్త స్వచ్ఛ సర్వేక్షణ్ 2023..గ్రామీణంలో సిద్ధిపేట జిల్లా ప్రథమ స్థానం

త్రైమాసిక ఫలితాల్లో పల్లెప్రగతితో జిల్లాకు నాల్గవ స్టార్ కేటగిరి

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2023 ర్యాంకుల్లో భాగంగా మొదటి త్రైమాసిక ఫలితాల్లో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు జిల్లాలోని అన్నీ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, క్షేత్రస్థాయి అధికార యంత్రగాన్ని, సిబ్బందిని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య మంత్రి హరీశ్ రావు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ తో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితోనే ఇది సాధ్యమైందని మంత్రి పేర్కొన్నారు. కాగా జిల్లాలోని అన్నీ గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయడం ద్వారానే గ్రామాలు సంపూర్ణ స్వచ్ఛ పంచాయతీలుగా రూపుదిద్దుకోవడం జరుగుతున్నది. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాల్లో భాగంగా, ప్రతి కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్లు పాఠశాలల్లో అంగన్వాడి కేంద్రాల్లో మరియు పంచాయతీల్లో మరుగుదొడ్ల సౌకర్యం, ఘన మరియు ద్రవ వ్యర్ధాల ఏర్పాట్లు మొదలగు కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా సిద్ధిపేట జిల్లా మూడవ స్టార్ కేటగిరీ నుంచి నాలుగో స్టార్ కేటగిరికి రావడం జరిగింది. మొదటి త్రైమాసిక ఫలితాల్లో దేశవ్యాప్తంగా ఆన్లైన్లో నమోదైన వివరాల ప్రకారం మన జిల్లా దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా రెండవ స్థానంలో నిలవగా, కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లా మూడవ స్థానంలో నిలిచింది. ఇందుకుగాను గ్రామపంచాయతీలో ఈ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నందుకు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బందికి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అభినందనలు తెలిపారు

సత్వరమే న్యాయం చేయాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్..

సత్వరమే న్యాయం చేయాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్..

యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల

పోలీస్ స్టేషన్ ఫిర్యాదులు వేగవంతంగా పరిష్కరింప చేయడంలో రిసెప్షన్ అధికారులు చురుకుగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం రోజున జిల్లాలోని పోలీస్ స్టేషన్ రిసెప్షన్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలకు తగు న్యాయం లభింస్తుందన్న నమ్మకాన్ని కలిగించడంలో పోలీస్ రిసెప్షన్ అధికారులు కీలకంఅని తెలిపారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి చెందేలా సేవలందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన రెండు రకాల వివరాలతో ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని, ఫిర్యాదుల పరిష్కారం వివరాలను పై స్థాయి అధికారులు కూడ పరిశీలిస్తున్నారనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఫిర్యాదులు అందిన వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని, సమర్థవంతమైన సేవలందించే విభాగాలకు చెందిన అధికారులకు ప్రతి నెలా రివార్డులను అందజేయడం జరుగుతుందని, ఫిర్యాదుల పరిష్కారం పైనే స్టేషన్ పనితీరు ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సి.ఐ అనిల్ కుమార్, రిసెప్షన్ అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచాలకు అంబేద్కర్ సాక్షిగా నిరసన తెలిపిన బిజెపి నాయకులు.

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచాలకు అంబేద్కర్ సాక్షిగా నిరసన తెలిపిన బిజెపి నాయకులు.

యదార్థవాది ప్రతినిధి ఆర్మూర్

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు మహిళపై అత్యాచారాలు, దాడులు పెరుగుతున్న అరికట్టలేని రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరిని తప్పుపడుతూ ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో గురువారం అంబేద్కర్ సాక్షిగా ఆయన విగ్రహం ముందు భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి ఆర్మూర్ అసెంబ్లీ మహిళా నాయకురాలు ఆలూరు విజయభారతి, బిజెపి పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నిరెత్తినట్లుగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. బీఆర్ఎస్ గుండాలు బిజెపి దేవరకొండ మండల మహిళా మోర్చ అధ్యక్షురాలు లక్ష్మీ పై లైంగిక వేధింపులకు పాల్పడడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. కేఎంసి ఎంజీఎం లో లౌ జిహాద్ వేధింపులకు, ర్యాగింగ్ కు గురి కావడంతో మనస్థాపము చెంది పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య ప్రయత్నం చేయడం తమను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. ఈ సంఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజకీయాలకతీతంగా ఈ దుర్మార్గపు చర్యలకు పాల్పడినటువంటి వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి శిక్షించవలసిన అవసరం ఉందన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళకు గంతులు కట్టుకొని పరిపాలన చేస్తుందా అన్నట్లుగా రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు, వేధింపులు పెరిగిపోతున్న నిమ్మకు నిరేత్తినట్లుగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సైతం తోబుట్టువులు, ఓ కూతురు ఉన్నారని. మరి ఈ రాష్ట్ర మహిళలు అలా కనబడడం లేదా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూన్నామన్నారు. వెంటనే మహిళల రక్షణకు పగడ్బందీగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లేనట్లయితే ఈ మహిళలే రాబోయే కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వానికి సరైన సమయంలో సరైన విధంగా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో స్వభావికా గౌడ్ పోల్కం వేణు భవాని నవీన్ మందుల బాలు కలిగోట ప్రశాంత్ ఉదయ్ గౌడ్ సాయినాథ్ రెడ్డి రెడ్డి బోయిన దక్షిణామూర్తి యుగంధర్ గుగులోత్ తిరుపతి నాయక్, ఆటో రమేష్, కుబీర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఈటెల సమక్షంలో బిజెపిలో చేరిన ఎల్లారెడ్డి సొసైటీ వైస్ చైర్మన్

ఈటెల సమక్షంలో బిజెపిలో చేరిన ఎల్లారెడ్డి సొసైటీ వైస్ చైర్మన్

యదార్థవాది ప్రతినిధి కామారెడ్డి

ఎల్లారెడ్డి సెగ్మెంట్ కామారెడ్డి మండలం కేంద్రంలో జరిగిన బిజెపి స్ట్రీట్ కార్నర్ సమావేశానికి హాజరైన మాజీ మంత్రి హుజురాబాద్ శాసన సభ్యులు ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్ రెడ్డి సమక్షంలో గురువారం ఎల్లారెడ్డి సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంతి గౌడ్ బిజెపిలో చేరారు. ప్రశాంత్ గౌడ్ ప్రస్తుత ఎమ్మెల్యే సురేందర్ అనుచరుడిగా గతంలో పార్టీలో ఉండి వైస్ చైర్మన్ అయ్యారు. గత కొంతకాలంగా ఎమ్మెల్యేతో విభేదాలతో, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కి దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే బిజెపిలోనే కొనసాగాలని నిర్ణయించుకొని ఈటెల సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన ప్రశాంత్ గౌడ్ కు పార్టీ కండువా కప్పి ఈటెల పార్టీలోకి స్వాగతించారు. ఆయనతో పాటు తన వర్గీయులు కూడా అందరు బిజెపిలో చేరారు ఈ సందర్భంగా ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి సెగ్మెంట్ లో బిజెపి పార్టి బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

గర్భిణీయులకు వరం ఆరోగ్య లక్ష్మి పథకం

గర్భిణీయులకు వరం ఆరోగ్య లక్ష్మి పథకం

యదార్థవాది ప్రతినిధి కామారెడ్డి

ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా గర్భిణీలకు పౌష్టికాహారం అందుతుందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ కొమ్ముల తిరుమల్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో గురువారం అంగన్వాడి కేంద్రాలను, ఆరోగ్య ఉప కేంద్రాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. అంగన్వాడి కేంద్రంలో చిన్నారుల వయసును బట్టి ఎత్తుకు తగిన విధంగా బరువు ఉండే విధంగా చూడాలన్నారు వయసుకు తగిన ఎత్తు, బరువు లేకపోతే వారికి అదనంగా పౌష్టికాహారాన్ని అందించాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. కెసిఆర్ న్యూట్రిషన్ కిట్టు ద్వారా గర్భిణీలకు అందించే మందులు, డ్రై ఫ్రూట్స్ వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందుతున్న తీరును విద్యార్థులను అడిగి తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ సాయన్న, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

జిల్లా బాలల సంరక్షణ కమిటీ సమావేశం: జిల్లా కలెక్టర్

జిల్లా బాలల సంరక్షణ కమిటీ సమావేశం: జిల్లా కలెక్టర్

యదార్థవాది ప్రతినిధి కామారెడ్డి

కామారెడ్డి జిల్లాలోని అనాధలైన చిన్నారులకు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలను మండల స్థాయి అధికారులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లో గురువారం జిల్లా బాలల సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు అనాథలైన చిన్నారులకు సంబంధించిన భూ, గృహ సమస్యలను పరిష్కరించడానికి అన్ని శాఖల అధికారులు సహకారం అందించాలని తెలిపారు. జిల్లాలో 365 మంది అనాధ పిల్లలను పాఠశాలల్లో చేర్పించినట్లు చెప్పారు. వారికి గురుకుల పాఠశాలలో చేర్పించడానికి రిజర్వేషన్ ఉన్నందున అనాధ చిన్నారులుగా గుర్తింపు కార్డులను ఆయా మండలాల అధికారులు అందజేయాలని సూచించారు ఈ సమావేశంలో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, మెంబర్ స్వర్ణలత, జిల్లా బాలల పరిరక్షణ అధికారిని స్రవంతి, అధికారులు పాల్గొన్నారు.

బంజారాల సంక్షేమానికి తెలంగాణ సర్కారు పెద్దపీట..

బంజారాల సంక్షేమానికి తెలంగాణ సర్కారు పెద్దపీట.. సేవాలాల్ జయంతి ముగింపు ఉత్సవాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి..

యదార్థవాది ప్రతినిది నిజామాబాద్

తెలంగాణ రాష్ట్రంలో బంజారాల సంక్షేమానికి కేసిఆర్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు… బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండల కేంద్రంలో గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 284 జయంతి ముగింపు ఉత్సవాలను గురువారం అధికారికంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని రూ. 50 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన బంజారా భవన్ కు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 700 తండాలు మాత్రమే గ్రామ పంచాయతీలుగా ఉండేవని, గిరిజనులకు పాలనాధికారం కల్పించాలనే లక్ష్యంతో 500 జనాభా కలిగిన ప్రతి తండాను గ్రామ పంచాయతీ హోదా కల్పించడంతో రాష్ట్రంలో ప్రస్తుతం కొత్తగా 2400 తండాలు జీ.పీలుగా అవతరించాయని తెలిపారు. గ్రామ పంచాయతీలకు పక్కా భవనాల నిర్మాణాల కోసం ఒక్కో జీ.పీ కి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగిందని, రూ. 1276 కోట్ల నిధులను వెచ్చిస్తూ ప్రతి తండాకు ప్రభుత్వం రోడ్డు సదుపాయం కల్పించిందని తెలిపారు. 100 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్న గిరిజన కుటుంబాలకు ఉచిత విద్యుత్ అమలవుతోందని గుర్తుచేశారు. తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటుకు ముందు కేవలం పాతిక వరకు మాత్రమే ఉండేవని అన్నారు. ప్రభుత్వ సంకల్పంతో ప్రస్తుతం ప్రతి ఏటా సుమారు లక్ష మంది వరకు గిరిజన బిడ్డలు ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారని మంత్రి తెలిపారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడుస్తూ, ఆయన ఆశయాల సాధనకు కృషి చేసినప్పుడే ఆ మహనీయుడికి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని, 18 వ శతాబ్దంలోనే అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలోనూ ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ సేవాలాల్ మహారాజ్ సంఘ సంస్కర్తగా పని చేశారని కొనియాడారు. అయన పరమపదించి దాదాపు రెండు వందల సంవత్సరాలు దాటినా కూడా సేవాలాల్ మహారాజ్ ను దైవంగా భావిస్తున్నారంటే ఆయన చేసిన బోధనలు, అనుసరించిన మార్గం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన జట్లకు ట్రోఫీలతో పాటు, నగదు పారితోషికాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో భీంగల్ మున్సిపల్ చైర్ పర్సన్ ప్రేమలత సురేందర్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షురాలు మంజుల, ఎంపీపీ మహేష్, జెడ్పిటీసి రవి, జెడ్పి కో-ఆప్షన్ మొయిజ్, బాల్కొండ నియోజకవర్గ ప్రత్యేక అధికారి సింహాచలం, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగూరావు, ఆర్మూర్ ఆర్ డీ ఓ శ్రీనివాసులు, బంజారా సేవా సంఘం ప్రతినిధులు, వివిధ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ తండాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గిరిజనులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...