28.2 C
Hyderabad
Thursday, April 23, 2026

మహిళా సాధికారత గురించి అవగాహన సదస్సు..

మహిళా సాధికారత గురించి అవగాహన సదస్సు..

యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల  

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని అంబేద్కర్ భవనంలోని ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ తీసుకుంటున్నటువంటి విద్యార్థులకు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారత గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం గారు మాట్లాడుతూ స్త్రీలు, బాలికలు ఎదుర్కొంటున్న హింస, వేధింపులు నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు, సేవలు గురించి వివరించారు, మన రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి హక్కులు, చట్టాలు, సమానత్వం , గృహహింస, లైంగిక వేధింపులు స్త్రీలు, బాలికలు అక్రమ రవాణా వివిధ సంస్థలలో లైంగిక వేధింపులు, అత్యాచారాలు యాసిడ్ దాడులు వృద్ధుల పట్ల నిరాదరణ వంటి అంశాలను గురించి చర్చిస్తూ మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చట్టాలు హక్కుల పైన బాల్య వివాహాల నిరోధక చట్టం బాల కార్మిక వ్యవస్థ, డివి యాక్ట్ మరియు టోల్ ఫ్రీ నెంబర్లు పిల్లల హెల్ప్ లైన్ 1098. మహిళా హెల్ప్ లైన్ 181. వయోవృద్ధుల హెల్ప్ లైన్ 14567, దివ్యాంగుల హెల్ప్ లైన్ 155326, గురించి అవగాహన కల్పించారు. సఖి కేంద్రం సెంటర్ అడ్మినిస్ట్రేటర్ రోజా మాట్లాడుతూ సఖి కేంద్రం అందిస్తున్నటువంటి వైద్య, న్యాయ, కౌన్సిలింగ్, పోలీస్, తాత్కాలిక నివాసం వంటి ఐదు రకాల సేవలు, లింగ వివక్షత,ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాల గురించి వివరించారు మహిళలు బాలికలు ఏదైనా హింస గురైతే ధైర్యంగా టోల్ ఫ్రీ ద్వారా సంప్రదిస్తే వారి సమస్యను గురించి గోప్యంగా ఉంచబడుతుందని మరియు వారికి కావలసిన సహాయాన్ని వెంటనే ఉచితంగా అందిస్తామని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో సఖి కేంద్రం కౌన్సిలర్ దేవిక గారు, కేస్ వర్కర్ అంజలి, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ రాఘవేందర్ గారు విద్యార్థిని, విద్యార్థులు, పాల్గొనడం జరిగినది,

గాడ్ విజన్ నూతన కమిటీ సన్మాన కార్యక్రమం

గాడ్ విజన్ నూతన కమిటీ సన్మాన కార్యక్రమం

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

కరుణామయుడు ప్రేమ స్వరూపియైన యేసుక్రీస్తు బోధనలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లి ప్రజలను ప్రేమ తత్వమను బోధిస్తూ మూఢనమ్మకాలనుంచి దూరం చేస్తూ సన్మార్గంలో నడవాలని బోధించే వారే దైవ సేవకులని గాడ్ విజన్ గౌరవ అధ్యక్షులు నేలమల్లి సికిందర్ అన్నారు సిద్దిపేట మండలం రంగారెడ్డి పల్లి గ్రామంలో బెత్తేస్తా క్రీస్తు కిరణాల ప్రార్థన మందిరంలో గురువారం గాడ్ విజన్ నూతన కార్యవర్గ సభ్యులను స్థానిక పాస్టర్ యాకోబు రాజు పూలమాలతో ఘనంగా సన్మానించారు నూతన కమిటీ ప్రెసిడెంట్ దోమకొండ సాగర్ వైస్ ప్రెసిడెంట్ కర్నేకంటి జోషి జనరల్ సెక్రటరీ భోగి బాబు బిఏ పాల్ జాయింట్ సెక్రటరీ బొత్త నాగభూషణం క్యాషియర్ కొత్త నాగరాజు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా కరుణాకర్ ప్రేమ్చంద్ భూపతి ఆనంద్ నూతన కమిటీ సభ్యులను సన్మానించారు ఈ సందర్భంగా ప్రెసిడెంట్ సాగర్ మాట్లాడుతూ గాడ్ విజన్ కమిటీకి ప్రెసిడెంట్ గా నియమించినందుకు కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు నా సాయ శక్తుల కమిటీ నియమం ఇబ్బందులకు లోబడి కమిటీని విజయవతములో నడిపిస్తారని అన్నారు జనరల్ సెక్రెటరీ మాట్లాడుతూ గత దినముల నుండి గాడ్ విజన్ కమిటీ సిద్దిపేటలో సేవకులను ఐక్యపరచి కొన్ని విధాలుగా సభ్యులకు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతున్న కమిటీ అన్నారు గౌరవ అధ్యక్షులు సికిందర్ మాట్లాడుతూ కరుణామయుడు ప్రేమ స్వరూపియైన యేసుక్రీస్తు బోధనలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లి ప్రజలను ప్రేమ తత్వమను బోధిస్తూ మూఢనమ్మకాలనుంచి దూరం చేస్తూ సన్మార్గంలో నడవాలని బోధించే వారే దైవ సేవకులను అన్నారు గత ఐదు సంవత్సరాల నుండి గాడ్ విజన్ కమిటీ ఏర్పడి అనేకమంది ప్రజలకు సేవలందిస్తూ ముందుకు సాగుతుందని బీద సేవకులు అయినవారు వారికి సహవాసం కల్పిస్తూ అండగా నిలిచి ప్రోత్సహిస్తున్న కమిటీ అని దీని ద్వారా ఆర్థికంగా ఆరోగ్యపరంగా కొన్ని సహాయ సహకారాలు అందిస్తున్నాం కొంతమంది దైవజనులు యాక్సిడెంట్ లో ఇబ్బంది పడినప్పుడు వారికి ఆర్థికపరమైన సహాయం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సేవకులకు వారి సంఘాలకు వచ్చే ప్రజలకు సహాయం అందించిన ఘనత గాడ్ విజన్ కమిటీ దే అన్నారు ఇంకా ముందు ముందుకు అనేక రకమైన సేవా కార్యక్రమాలను చేపట్టబోతున్నదని తెలిపారు ఈ సందర్భంగా కొన్ని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్థానిక పాస్టర్లకు అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక పాస్టర్ గాడ్ విజన్ కమిటీ సభ్యులు విశ్వాసులు సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

 

ప్రయాణికులకు మరింత చేరువ..

ప్రయాణికులకు మరింత చేరువ..

యదార్థవాది ప్రతినిది ఆర్మూర్

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్మూర్ డిపో నుండి వేల్పూర్ భీంగల్ సిరికొండ గడుకోల్ కామారెడ్డి మీదుగా హైదరాబాద్ కొత్త సర్వీసు ప్రారంభం. ఆర్మూర్ నుండి ఉదయం 5 గంటలకు బయలుదేరి భీంగల్ లో 5:30 సిరికొండ 5:50 మీదుగా గడుకోల్6:00 మీదుగా కామారెడ్డి నుండి సికింద్రాబాద్, హైదరాబాద్ చేరుకుంటుందని గురువారం డిపో మేనేజర్ కవిత ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ సౌకర్యాన్ని వేల్పూర్ మోతే భీమ్గల్ సిరికొండ గడుకోల్ కొండాపూర్ రెడ్డిపెట్ రామరెడ్డి కామారెడ్డి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

దేశ ప్రజల బతుకుల్లొ చికటి నింపుతున్న బిజెపి.

దేశ ప్రజల బతుకుల్లొ
చికటి నింపుతున్న బిజెపి.

యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్

కేంద్రంలో అధికార బిజెపి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలు వాడుతున్న వంటగ్యాస్ పై అనేక సార్లు అడ్డు అదుపు లేకుండా వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపును వెంటనే విరమించు కోవాలని సిపిఐ జాతీయ, రాష్ట్ర సమితి పిలుపు మేరకు గురువారం హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలొ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ కార్యకర్తలతో కలిసి నిరసన తెలియజేశారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి గడిపె మల్లేశ్ మాట్లాడుతూ దేశ ప్రజల గోడు పట్టని బిజెపి పేదలను కృంగదిసేవిదంగా ధరలను పెంచడం అన్యాయమని వెంటనే ఉపసంహరించుకోవాలని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను అనేక రకాల నిత్యావసర వస్తువుల ధరలు, డిజిల్, పెట్రోల్, వంట నూనేలు ఉప్పు పప్పు దినుసులు వంట గ్యాస్ సిలిండర్ల ధరలు విపరీతంగా పెంచి అన్ని వస్తువులపై జిఏస్టిని పెంచి దేశ ప్రజలపై అధిక భారం వేసిందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం అనలొచిత నిర్ణయం వల్ల ధరలు పెరిగి దేశ ప్రజలు అల్లాడి పోతున్నారని పెంచిన వంట గ్యాస్ సిలిండర్ల, నిత్యావసర వస్తువుల ధరలను అదుపులోకి తీసుకురావాలని, లేకుంటే రానున్న ఎన్నికల్లో బిజెపి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి భారత దేశ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని గడిపె మల్లేశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అద్వర్యంలో మహాదర్న

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అద్వర్యంలో మహాదర్న

యదార్థవాది ప్రతినిది నిజామాబాద్

వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అద్వర్యంలో నిజమాబాద్ నగరంలోని రాజా రాజేంద్ర చౌరస్తా వద్ద మహా దర్న చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బుస్సాపూర్ శంకర్ మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే ప్రధాన మంత్రి మోదీ వంటగ్యాస్‌ ధరలను పెంచారని, ప్రతిసారీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచడం. కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని, గృహావసరాల సిలిండర్‌ ధరను రూ.50, వాణిజ్య సిలిండర్‌ ధరను రూ. 350 మేర భారీగా పెంచారని, మోదీ ప్రభుత్వం రాకముందు రూ.400 ఉన్న సిలిండర్‌ ధర గురువారం నాడు రూ. 1160 దాటి రూ.1200 వరకు పెరిగిందన్నారు, ఒకవైపు ఉజ్వల స్కీమ్‌ పేరుతో మాయమాటలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం భారీగా గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పెంచుతూ, వారిని సిలిండర్‌లకు దూరం చేస్తోందని విమర్శించారు. గతంలో రాయితీ ద్వారా సిలిండర్లు పొందిన మహిళలు ఇప్పుడు వాటిని కొనలేక కట్టెల పొయ్యిపై వంట చేయాల్సిన పరిస్థితులు తలెత్తాతయని, పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని అయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సంక్షేమ పాలన రావాలని, వచ్చేది వైఎస్ఆర్ ప్రభుత్వమే అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎస్ సి, ఎస్ టి, బీసీ, మైనారిటీ జిల్లా అధ్యక్షులు, మహిళ అధ్యక్షురాలు, యువకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలి

గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలి

యదార్థవాది ప్రతినిది ఆర్మూర్

నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ లో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక వస్తువుల ధరలను పెంచి సామాన్యుడిని మరింత పేదరికంలోకి నెట్టేసేలా వ్యవహరిస్తుందని ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని, సామాన్యుడిపై ఎటువంటి భారం పడకుండా వెంటనే గ్యాస్ ధరలు తగ్గించాలని బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కౌన్సిలర్లు, యూత్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ మోదీ దిష్టిబొమ్మ దగ్ధం..

వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ మోదీ దిష్టిబొమ్మ దగ్ధం..

యదార్థవాది టౌన్ హుస్నాబాద్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని అక్కన్నపేట చౌరస్తాలో కేంద్రం పెంచిన వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ హుస్నాబాద్ మునిసిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత ధ్వర్యంలో ధర్నా చేశారు .. ఈ సంద్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ఓ వైపు నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బిజేపి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ అనిత, ఎంపీపీ లు భూక్యమంగా, లకావత్ మానస, మార్కెట్ చైర్ పర్సన్ ఎడబోయిన రజిని, బీఅర్ఎస్ మండల నాయకులు, యూత్ కార్యకర్తలు పాల్గొన్నారు.

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మంగళవారం సిద్దిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు 40 ప్రయోగాల్ని తయారు చేసి ప్రదర్శించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. భగవంతయ్య మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ దృక్పతాన్ని, వైఖరిని కలిగి ఉండాలని ప్రశ్నించడం పరిశీలించడం ప్రయోగాల ద్వారా పరీక్షించడం విశ్లేషించడం అనే ప్రక్రియలను అలవర్చుకోవాలని అన్నారు నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలు సవాళ్లకు పరిష్కారాలు కనుక్కునేందుకు శాస్త్రీయ విధానములో ఆలోచించి పరిష్కరించాలని సూచించారు ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస, సాంస్కృతిక పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, చంద్రశేఖర్ తిరుపతి రెడ్డి భూపాల్ రెడ్డి రవీందర్ రెడ్డి రమాదేవి శంకరవ్వ శ్రీనివాస్ గౌడ్ ఆంజనేయులు అంజిరెడ్డి డి మల్లయ్య ప్రభాకర్ సందీప్ కౌసర్ సుల్తానా శ్రీనివాస్సం ధ్యారాణి కరుణా దేవి బాల లక్ష్మి ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు

ఘనంగా సైన్స్ డే

ఘనంగా సైన్స్ డే

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబిటస్ పాఠశాలలో మంగళవారం సైన్స్ డే నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు తమ తమ సైన్స్ ఎగ్జిబిట్లను సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శించారు ఈ సందర్భంగా అంబిటస్ పాఠశాల డైరెక్టర్ జ్యోతి రెడ్డి మాట్లాడుతూ నోబెల్ బహుమతి గ్రహీత భారత రత్న సర్ సి వి రామన్ కనిపెట్టిన రామన్ ఎఫర్ట్ కనుగొన్నది ఫిబ్రవరి 28 అందుకని 1987 సంవత్సరం నుండి ఫిబ్రవరి 28 న జాతీయ సైన్సు దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని సైన్స్ ప్రతి ఒక్కరి జీవితంతోను ముడిపడి ఉందని మనిషి దైనందిన జీవితంలో సైన్స్ ఒక భాగమని కాబట్టి ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పధాన్ని అలవరచుకోవాలని సైన్స్ అభివృద్ధి చెందడం వలన ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతుందని మన శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేసి కొత్త కొత్త ఆవిష్కరణలు కొత్త విషయాలు కనుగొంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

సంక్షేమ వసతి గృహ విద్యార్థులపై దృష్టి సారించండి

సంక్షేమ వసతి గృహ విద్యార్థులపై దృష్టి సారించండి

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, హాస్టల్ వార్డెన్ లు స్థానికంగా ఉంటూ విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేలా చూడాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్దన్ అన్నారు..మంగళవారం రోజున కలెక్టరేట్ బీసీ సంక్షేమశాఖ అభివృద్ధి అధికారికి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇంటర్మీడియట్,10వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వసతి గృహాల వార్డెన్లు స్థానికంగా హాస్టల్ లో ఉంటూ టైం టేబుల్ ప్రకారం ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని విద్యార్థులకు సమయానికి మెనూ ప్రకారం భోజనం అందించి,మానసిక శారీరక ఒత్తిళ్లకు గురి చేయకుండా పరీక్షలకు సన్నద్ధం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సంగెం మధు రామగళ్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...