31.2 C
Hyderabad
Thursday, April 23, 2026

డివిజన్లవారీగా షీటీమ్స్ ఏర్పాటు: పోలీస్ కమిషనర్

డివిజన్లవారీగా షీటీమ్స్ ఏర్పాటు: పోలీస్ కమిషనర్

యదార్థవాది ప్రతినిది సిద్ధిపేట

సిద్దిపేట జిల్లాలో ఉన్న షీటీమ్స్ బృందాలు ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ పాఠశాలల్లో, తెలంగాణ మోడల్ స్కూళ్లలో, రెసిడెన్షియల్ స్కూల్ లలో కేజీబీవీ స్కూళ్లలో విద్యార్థిని విద్యార్థులకు ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో, షీటీమ్స్, యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ లపై బస్టాండ్లలో మార్కెట్లలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన వివరాలను వివరించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత.. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా షీటీమ్స్ ఏర్పాటు చేశారని, మహిళల, బాలికల, విద్యార్థిని విద్యార్థులకు రక్షణగా నిలుస్తూ సేవలు అందించడం జరుగుతుందని, 100 ఫోన్ వస్తే వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్తున్నామని, ప్రజల బద్రత దృశ్య సీసీ కెమెరాలు పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్నామని తెలిపారు. షీటీమ్ కంప్లైంట్ కొరకు QR కోడ్ గుర్చి తెలియజేస్తూ ఆన్లైన్ ద్వారా ఎక్కడి నుండి అయిన పిర్యాదు చేసేందుకు ఉపయోగపడే ఈ షీటీమ్ కంప్లైంట్ QR కోడ్ స్కానింగ్ పోస్టర్స్ ను జిల్లాలో RTC బస్ లలో, బస్ స్టాండ్ లలో, సినిమా హల్ లు, స్కూల్స్, కళాశాలలు,ఇతర ముఖ్యమైన ప్రాంతాలలో అతికించబడి ఉంటాయని తెలిపారు. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో డయల్-100 కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని, ఎవరైనా వేధించిన గురి చేస్తే షీటీమ్ వాట్సప్ నెంబర్ 7901640473, సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ 8333998699 పెళ్లయిన మహిళలు శారీరకంగా మానసికంగా గృహహింసకు గురైతే వెంటనే స్నేహిత మహిళ సపోర్ట్ సెంటర్ 9494639498 ఫోన్ చేసినచో (ఫేస్ బుక్ (మెయిల్ sdptsheteam@gmail.com), (ట్విట్టర్ @sdptsheteam) పిర్యాదు చేసినచో, వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చదువుకునే విద్యార్థినిలకు 18 సంవత్సరాలు నిండకుండానే వివాహము చేస్తున్నట్లుగా తెలిస్తే వెంటనే 1098 కు తెలియజేయాలని, యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ యూనిట్ను సిద్దిపేట కమిషనరేట్ లో ప్రారంభించడం జరిగిందని, మహిళల, మనుషులు అక్రమ రవాణా జరిగితే వెంటనే సమాచారం అందించాలని కమిషనర్ తెలిపారు. మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఏ.బి దుర్గా, ఆధ్వర్యంలో షీటీమ్స్ బృందాలు పనిచేయడం జరుగుతుందని, మహిళా పోలీస్ స్టేషన్ సాంబయ్య ఎస్ఐ, షీటీమ్ సిబ్బంది మమ్మద్ ముజీబ్ హైమద్, ఏఎస్ఐ,, అమృత్, ఏఎస్ఐ,, మల్లేశం, ఏఎస్ఐ,హెడ్ కానిస్టేబుల్ సంజీవరెడ్డి, మహిళ కానిస్టేబుళ్లు పద్మ, సంగీత, జ్యోతి, రజిత, కానిస్టేబుళ్లు స్వామి, ప్రకాష్, రవి, యుగేందర్, అన్వేష్. దుద్యా నాయక్, షీటీమ్స్ డివిజన్లో వారిగా విధులు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు.


ఘనంగా పోలీస్ కమిషనర్ పుట్టినరోజు వేడుకలు..

ఘనంగా పోలీస్ కమిషనర్ పుట్టినరోజు వేడుకలు..

యదార్థవాది ప్రతినిధి నిజామాబాద్

నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి పోలీస్ అధికారులు.. 60వ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన నిజామాబాద్ జిల్లాలో ని
ఏసిపిలు కిరణ్ కుమార్, కిరణ్, సంతోష్ కుమార్, శ్రీనివాస్, మధుసూధన్ రావు, సర్కిల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఇతర అధికారులు, జిల్లా పోలీస్ కార్యాలయం సిబ్బంది, టి.ఎన్.జి.ఓస్ నాయకులు, ఐ.ఎమ్.ఎ అసోసియేషన్ సిబ్బంది, శాలువాలతో, పుష్పగుచ్చాల తో పోలీస్ కమీషనర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలి..

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలి..

యదార్థవాది ప్రతినిధి నిజాంబాద్

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బుస్సాపూర్ శంకర్ శనివారం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించారు.. ఈ సందర్భంగా అక్కడ వైద్యం పొందుతున్న రోగుల సమస్యలు అడిగి తెలుసుకొని మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల ప్రజల ఎదుగుదలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని, వాటిలో ఆరోగ్య శ్రీ పథకం ద్వారా లక్షల మంది పేద ప్రజలకు లబ్ది చేకూరిందని, కేసీఆర్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకన్ని నిర్వీర్యం చేశారని, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యానికి వచ్చే వారు అత్యధిక శాతం పేద ప్రజలే ఉన్నారని, ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించి పేద ప్రజలను ఆదుకోవాలని ఆయన తెలిపారు. మానవత్వ కోణంలోనన్న వైద్యం అందించలాని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు కస్తూరి ప్రవిన్, యువజన అధ్యక్షులు అంకార్ గణేష్ , నాయకులు, కారంపూరి రవి, సంతోష్ , ఇస్మాయిల్ ఖాన్, మహిళ నేత శశిరేఖ తదితరులు పాల్గొన్నారు..

ఫంక్షన్ హాల్ గా మారిన రైతు వేదికలు

ఫంక్షన్ హాల్ గా మారిన రైతు వేదికలు

యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్

రైతు వేదికలను ఫంక్షన్ హాల్లకు ఇస్తున్న వ్యవసాయ శాఖ అధికారుల పై చర్యలు చేపట్టాలని భారతీయ కిసాన్ సాంగ్ జిల్లా ఉపాధ్యక్షులు కవ్వా వేణుగోపాల్ రెడ్డి అక్కన్నపేట భారతీయ కిసాన్ సంగ్ అధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతక పేట గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి యుద్ధ పాతపాటకంగా ప్రారంభించిన రైతు వేదికలను వ్యవసాయ అధికారులు ఫంక్షన్ హాల్ కు ఉపయోగిస్తున్నారు రైతు వేదికలో వ్యవసాయానికి సంబంధించిన అవగాహన సదస్సులు శిక్షణ తరగతులు జరగవలసింది అధికారులు తమ లాభం కోసం రైతువేదికలను శుభకార్యాలకు పెళ్లిళ్లకు ఇస్తూ లాభాన్ని చేకూర్చుకుంటున్నారు ఈ సంఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో చోటు చేసుకుంది ఇట్టి కార్యక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని భారతీయ కిసాన్ సాంగ్ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు

పోలీసు పహార మధ్య గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం పనులు!

పోలీసు పహార మధ్య గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం పనులు!

యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్

అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో గౌరవెల్లి ప్రాజెక్టు కట్ట నిర్మాణం పనులు శుక్రవారం అర్ధరాత్రి నుండి ప్రారంభించిన అధికారులు.. నిర్వాసితులు పనులు అడ్డుకోకుండా ఉండేందుకు గుడాటిపల్లిలో పోలీసులు అర్థరాత్రి నుండే భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలీసుల పహార మధ్య కట్ట మూసివేత పనులు కొనసాగుతున్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత స్వయంగా పర్యావేక్షిస్తునట్లు తెలుస్తుంది. గుడాటిపల్లి నుండి ఎవరిని కూడా కట్టవైపు ప్రజలను, మీడియాకు కూడా అనుమతించడం ఇవ్వడం లేదు. నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండానే గౌరవెల్లి ప్రాజెక్టు కట్ట పనులు చేస్తుండడం పట్ల గ్రామంలోని మహిళలు కన్నీరు మున్నీరుగా విలపిస్తు, పోలీసులతో వాగ్వాదానికి దిగిన నిర్వాసితులు. గ్రామపంచాయతీ వద్ద తమ నిరసనను కొనసాగిస్తున్నారు. రామవరం రోడ్డు కట్ట మూసివేత పనులు పూర్తయితే గౌరవెల్లి ప్రాజెక్టు కట్ట పనులు పూర్తయినట్లే అవుతుంది…

ఫైరింగ్ ప్రాక్టీస్ చేసిన జిల్లా పోలిస్ అధికారులు

ఫైరింగ్ ప్రాక్టీస్ చేసిన జిల్లా పోలిస్ అధికారులు

యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల

జిల్లా ఫైరింగ్ శిక్షణ శిభిరాన్ని సందర్శించి ఫైరింగ్ ప్రాక్టీస్ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్బమహాజన్.. జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి వార్షిక మొబలైజేషన్ వార్షిక శిక్షణలో భాగంగా శనివారం జిల్లా 17వ బెటాలియన్ లో ఫైరింగ్ రేంజ్ లో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ అధికారులు అధునాతన టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవలని, అన్ని రకాల ఆయుధ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలని, సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఏమైనా అల్లర్లు సంభవించినప్పుడు అల్లరి మూకలను చేదరగోటడనికి వజ్ర వెహికల్ శిక్షణలో నేర్పించిన మెలకువులను శ్రద్ధతో అభ్యసించి శాంతిభద్రతలు పరిరక్షణకు ఉపయోగించాలని, ఫైరింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలిస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ మహాజన్ అభినదించారు. ఈ శిక్షణలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్.ఐ లు కుమారస్వామి, రజినీకాంత్, యాదగిరి, సి.ఐ అనిల్ కుమార్, ఆర్.ఎస్.ఐ లు ఏ.ఆర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

“సిద్ధిపేట జిల్లా సమగ్ర స్వరూపం” గ్రంథావిష్కరణ

యదార్థవాది ప్రతినిది సిద్ధిపేట

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట విపంచి కళా ఆడిటోరియంలో గురువారం సాయంత్రం తెలంగాణ సారస్వత పరిషత్తు సిద్ధిపేట జిల్లా ఉత్తవం “సిద్ధిపేట జిల్లా సమగ్ర స్వరూపం” గ్రంథావిష్కరణ, సిద్ధిపేట వైభవం కవి సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు హాజరై పుస్తక ఆవిష్కరించారు. మంత్రి వెంట ప్రభుత్వ సలహాదారు కే.వీ.రమణాచారి, సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి దేశపతి శ్రీనివాస్, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి, తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య, కన్వీనర్ కొండి మల్లారెడ్డి, డాక్టర్ తైదల అంజయ్య, ఇతర కోర్ కమిటీ సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణ శర్మ, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మోదీ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకానికి రెఫరెండం ఈ ఎన్నికల ఫలితాలు

మోదీ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకానికి రెఫరెండం ఈ ఎన్నికల ఫలితాలు

యదార్థవాది ప్రతినిధి కామారెడ్డి

త్రిపుర నాగాలాండ్ మేఘాలయ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన సంధర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద మిఠాయిలు తినిపించుకొని టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటురి శ్రీకాంత్ మాట్లాడుతూ మోదీ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకానికి రెఫరెండం ఈ ఎన్నికల ఫలితాలు అని అన్నారు. దేశం మొత్తం బీజేపీ వెంట ఉందని సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ నినాదంతో పని చేస్తున్న బీజేపీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రాంతం, భాషా తేడా లేకుండా అన్ని రాష్ట్రాల్లో కాషాయ జండా ఎగురుతుందనీ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే ఎన్నికల్లో కాషాయ జండా ఎగుర బోతోందని జోస్యం చెప్పారు. బీజేపీ విజయము గురించి చర్చ జరగొద్దని BRS గ్యాస్ ధర పై నిరసనలు చేశారని అన్నారు. విద్యుత్, రిజిస్టేషన్, బస్సు చార్జీలు, పెట్రోల్ చార్జీలు, ఇలా అన్ని చార్జీలు పెంచి గ్యాస్ చార్జీల గురించి నిరసన తెలపడం సిగ్గు చేటు అని అన్నారు. అంతర్జాతీయంగా క్రుడ్ ఆయిల్ ధరల పెరుగుదలకు అనుగుణంగా గ్యాస్ ధరలు పెరిగాయని అన్నారు. రాష్ట్రంలో రోజుకో విద్యార్థి ఆత్మ హత్య చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడం సిగ్గుచేటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

అదానీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకే గ్యాస్ ధరల పెంపు

అదానీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకే గ్యాస్ ధరల పెంపు

యదార్థవాది ప్రతినిధి కరీంనగర్

భారతదేశానికి మోడీ ప్రధాని కావడం మన దురదృష్టకరమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రధాని మోడీ మిత్రుడు అదానీకి లబ్ధి చేకూర్చేందుకు గ్యాస్ సిలిండర్లపై 50 రూపాయల పెంచారని విమర్శించారు. పెరుగుతున్న ధరల పై ఆడబిడ్డలు ఆలోచన చేయాలని, పెరిగిన ధరలు తగ్గించే వరకు ఆడబిడ్డలు చేపట్టే ఉద్యమానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని మంత్రి గుంగుల అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు బీజేపీ ప్రభుత్వం మరోసారి పేద మధ్య తరగతి ప్రజలపై ఊహించని భారాన్ని మోపిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ మిత్రుడు అదానీకి ఇటీవల జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకే తాజా గ్యాస్ పెంపు అని విమర్శించారు. 75 సంవత్సరాల స్వతంత్ర పాలనలో సిలిండర్ పై సంవత్సరానికి 100 రూపాయలు పెంచిన ఘనత కేవలం ప్రధాని మోడీకే దక్కుతుందన్నారు బీజెపీ అధికారంలోకి రాకముందు.. 8 సంవత్సరాల క్రితం కేవలం 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు 1200 రూపాయలకు చేరుకుంది. స్వాతంత్ర్య భారత దేశ చరిత్రలో ఇంతగా ధరలు పెంచిన ప్రధాని ఎవరు లేరనీ, గడిచిన 8 సంవత్సరాలలో సిలిండర్ పై 800 రూపాయలు పెంచిన మహానుభావుడు ప్రధాని మోడీ అని ఎద్దేవ చేశారు. ధరల పెంచడంపైన దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం… పేద, మధ్యతరగతి ప్రజల బాధలను పట్టించుకోవడం లేదని, పెరిగిన ధరలను తగ్గించేందుకు చర్యలు కూడా తీసుకోవడం లేదని మంత్రి గంగుల మండిపడ్డారు.

జిల్లాకు సాగునీరు.. మత్స్యకారులలో కొత్త వెలుగులు

జిల్లాకు సాగునీరు.. మత్స్యకారులలో కొత్త వెలుగులు

యదార్థవాది ప్రతినిది సిద్దిపేట

మత్స్యకారులలో కొత్త వెలుగులు జిల్లాకు సాగునీరు.. మత్స్య సంపద జిల్లాలోని 28వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు..

సిద్ధిపేట మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పోలీస్ కమిషనర్ శ్వేత, ఇరిగేషన్ ఈఈ గోపాల కృష్ణ, మత్స్యశాఖ జిల్లా అధికారి రాములు, నియోజకవర్గ పరిధిలోని అన్నీ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులతో మత్స్యకార పురోభివృద్ధి, రిజర్వాయర్లలో చేపలు పట్టే అంశం, 58, 59 జీఓలు, సుడా ప్రగతి, ఇతరత్రా జిల్లా అభివృద్ధి, పురోగతిపై మంత్రి సమిక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా దాదాపు 28 వేల మంది మత్స్యకారులు ఉన్నారని, వారందరికీ గుర్తింపు కార్డులను పంపిణీ చేయాలని మత్స్యకార శాఖ అధికారిని ఆదేశించారు. దేశంలోనే ప్రధానంగా రంగనాయక సాగర్ లో చేపలను ప్రయివేట్ ఏజెన్సీలకు విక్రయించి వచ్చిన సొమ్మును మత్స్యకార సొసైటీలకు పంపిణీ చేయాలని, రంగనాయక సాగర్ లో మూడేళ్లుగా చేపలు వదలడం జరిగిందని, ఇప్పటి వరకు చేపలు పట్టలేదని, లక్షలాది రకాల విలువైన చేపలు ఉన్నాయని తెలిపారు. వీలైనంత తొందరగా మత్స్యకార సొసైటీ ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఉన్నదని మంత్రి తెలిపారు.

58, 59 జీఓలకు సంబంధించి లబ్ధిదారులతో త్వరగా పేమెంట్స్ కట్టించి వారికి క్రమబద్ధీకరణ చేసిన పట్టాలు పంపిణీకి సర్వం సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. పట్టాలు వస్తే లబ్ధిదారులకు చాలా లబ్ధి చేకూరుతుందని, శాశ్వత హక్కులు వస్తాయని, దీంతో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కలిగి విక్రయించే వీలు ఉంటుందని మంత్రి తెలిపారు.

సుడా పరిధిలో ల్యాండ్ పూలింగ్ -లే అవుట్స్ సిద్ధిపేట మున్సిపాలిటీ పరిధిలో మిట్టపల్లి, పొన్నాలలో భూమి గుర్తించారు. ప్లాటింగ్ చేసి మార్చి నెలాఖరులోగా యాక్షన్ లోకి వెళ్లాలని, సుడా తరహాలో గజ్వేల్ గడలో చేయాలని జిల్లా కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు. జిల్లాలోని హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాలలో సైతం పరిశీలనలు చేయాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...