31.2 C
Hyderabad
Thursday, April 23, 2026

మహిళామూర్తులను దేవతలుగా పూజించాలి..

మహిళామూర్తులను దేవతలుగా పూజించాలి..

యదార్ధవాది ప్రతినిధి సిరిసిల్ల

“యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా” స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో, అక్కడ దేవతలు నివాసం: కమాండెంట్ శ్రీ కె.సుబ్రమణ్యం..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం 17వ పోలీస్ బెటాలియన్ లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా బెటాలియన్ కార్యాలయ మహిళా సిబ్బంది యొక్క సేవలను గుర్తించి వారిని అభినందించిన కమాండెంట్ కె.సుబ్రమణ్యం.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని స్త్రీల యొక్క ప్రాముఖ్యతను కొనియాడారు.. ప్రపంచవ్యాప్తంగా మహిళలు సాధించిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలను గుర్తుగా ప్రపంచం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటునమని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలు సాధించిన విజయాలను జరుపుకోవడానికి మాత్రమే కాకుండా లింగ వివక్ష పక్షపాత ధోరణి, అసమానతలను రూపుమాపడానికి సమ సమాజాన్ని సృష్టించడానికి అందరూ కట్టుబడి ఉండాలని సుబ్రమణ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

పల్లె దవాఖాన ప్రారంభించిన: మంత్రి కెటిఆర్..

పల్లె దవాఖాన ప్రారంభించిన: మంత్రి కెటిఆర్..

యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల

తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్‌ క్లాస్‌రూం, సరస్వతీ విగ్రహ వేదిక, పల్లె దవాఖాన ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కే తారక రామారావు.. ఈ సందర్భంగా డిజిటల్‌ క్లాస్‌రూం లో విద్యార్థుల ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించి, విద్యార్థులను అభినందించిన మంత్రి..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సంక్షోభం వల్ల వేతనాలు పెంచాలని ఉన్న పెంచ లేక పోయామని తెలంగాణ ఆర్థిక పరిస్థితులు కుదుటపడగానే ఆశా వర్కర్ల కు వేతనాలు పెంచుతామని కరోనా కష్ట కాలంలో ఆశా వర్కర్ల సేవలు వెలకట్ట లేనివని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతుందని పల్లె దవాఖానా, బస్తీ దవాఖానా, హెల్త్ ప్రొఫైల్, ఉచిత డయాగ్నసిస్ సేవలు, కేసిఆర్ కిట్ వంటి కార్యక్రమాలు తెలంగాణ లో అమలు అవుతున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు..

బ్రహ్మోత్సవాల సందర్భంగా బందోబస్తు పర్యవేక్షించిన: డీసీపీ మహేందర్

బ్రహ్మోత్సవాల సందర్భంగా బందోబస్తు పర్యవేక్షించిన: డీసీపీ మహేందర్

యదార్థవాది ప్రతినిది కొమురవెల్లి

మల్లికార్జున స్వామి ఆలయం బందోబస్తును పర్యవేక్షించిన అడిషనల్ డీసీపీ మహేందర్.. శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల ఏడవ ఆదివారం సందర్భంగా అడిషనల్ డిసిపి ఎస్. మహేందర్.. దర్శనానికి వచ్చే భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ మల్లికార్జున స్వామిని ప్రశాంతంగా దర్శించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కొమురవెల్లి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల ద్వారా బందోబస్తును పరిశీలించి భక్తుల దర్శనం సజావుగా జరిగేటట్టు భక్తులకు పోలీసులకు చూచనలు చేశారు. పార్కింగ్ శ్రిలఘు వీఐపీ సాధారణ దర్శన ప్రదేశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏసిపి రమేష్ చేర్యాల సీఐ, కోమురవెల్లి ఎస్ఐ, పోలీస్ అధికారులు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు..

నిర్వాసితులకు న్యాయం చేయాలి: చాడ

నిర్వాసితులకు న్యాయం చేయాలి: చాడ

గౌరవెల్లి ప్రాజెక్టుతో సర్వస్వం కొల్పొయిన భూనిర్వసితులను గోస పట్టడం సరికాదు: చాడ వెంకటరెడ్డి..

యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్

రిజర్వాయర్ నిర్మాణం కోసం సర్వస్వం కొల్పొయిన భూనిర్వసితుల సమస్యలు పరిష్కారం చూపకుండా పొలిస్ బలగాలతో ప్రాజెక్టు పూర్తి చేయించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనికి తగదని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి సింగిరెడ్డి భవన్ లో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుతం ఇచ్చిన జీవో గేజిట్ ప్రకారం గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం జరుగలేదని పోలీసు బలగాలతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయించడం సరికాదని వెంకటరెడ్డి అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వస్వం కొల్పొయిన యువతీ యువకుల కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మంత్రి తన్నీరు హరీష్ రావు చోరవ తీసుకోవలని తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జాగీర్ సత్య నారాయణ, జిల్లా మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శిలాజినగర్ లో హనుమాన్ శివ పంచ నవగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు

శిలాజినగర్ లో హనుమాన్ శివ పంచ నవగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు

యదార్థవాది ప్రతినిధి దుబ్బాక

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం శిలాజి నగర్ గ్రామంలో ప్రజలందరి సహకారంతో గ్రామ సర్పంచ్ మాడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మూడురోజలుగా కొనసాగుతున్నా హనుమాన్ దేవస్థానం ఉత్సవాలు విగ్రహ ప్రతిష్ట, శివ పంచ నవగ్రహాల ప్రతిష్ట కార్యక్రమాలు వేద పండితులచే హోమం యజ్ఞ యాగాలు గ్రామంలోని అన్ని కుటుంబాలు యజ్ఞంలో పాల్గొన్నారు.రోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుతున్నారు.శనివారం సాయంత్రం పోచమ్మ బోనాలు అంగరంగా వైభవంగా నిర్వహించనున్నారని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు బాణాల శ్రీనివాస్, వేంకటగిరి తండా సర్పంచ్ పాతూలోతు పెంటవ్వ బాలకిషన్ హాజరైనారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాలక వర్గం,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం

స్ర్తీ సమానత్వమే మన ప్రగతికి మూలం

యదార్థవాది ప్రతినిధి ములుగు

ములుగు లిటిల్ ఫ్లవర్ పాటశాల లో వర్డ్ మహిళా మహా సభ సానుభూతి కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగే నిరంతర జీవనాధార అవకాశాలు తామే స్వయంగా నిర్మించుకోగలిగే ఉన్నత స్థితికి చేరుకుని స్త్రీ శక్తి ఏంటో ప్రపంచానికి తెలియజెప్పుతూనే ఉన్నారు. విద్య వైద్యం వ్యాపారాలు, రాజకీయాలు క్రీడలు బ్యాంకింగ్ అంతరిక్షం టెక్నాలజీ వంటి పలు రంగాల్లో మహిళలు రాణిస్తూ మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తున్నారు కాని దేవతగా కొలవాల్సిన స్త్రీ మూర్తిపై అత్యాచార సంస్కృతి నేటి పరిస్థితుల్లో ఆందోళన కలిగిస్తోంది సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం అని అన్నారు అనంతరం అనాధ పిల్లలకు బట్టలు పంపిణీ చేసి 5వేల రూపాయలు అందించడం జరిగింది
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్మం మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

ట్రాన్స్ ఫార్మర్ ల దొంగల అరెస్ట్

ట్రాన్స్ ఫార్మర్ ల దొంగల అరెస్ట్

యదార్థవాది ప్రతినిది పెద్దపల్లి

మంథని పోలీస్ స్టేషన్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పెద్దపల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్ నిందితుల అరెస్ట్ వివరాలను తెలియచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంథని మండలం ఎక్లాస్పూర్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన మడిపెల్లి సాయి తేజ, దోనిపల్లి సురేష్, మీనుగు మల్లేష్, రేగుంట వర్ధన్, చిప్పకుర్తి రాకేష్, పులి సిద్దు @ బరద్వాజ్, బానేష్ ఇద్దరు మైనర్స్ లను అదుపులోకి తీసుకున్నారని, వారి వద్ద నుండి మూడు జిల్లాలలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లు దొంగలించిన 2.70 క్వింటాళ్ల కాపర్ వైర్, ఉపయోగించిన వాహనం స్వాధీనం చేసుకొని విచారించమని తెలిపారు. నిందితులు 9 మంది ముఠా గా ఏర్పడి రెండు గ్రూపులుగా విడిపోయి పెద్దపల్లి జిల్లా, జయ శంకర్ భుపాలపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా లలో (62) విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ చోరీ చేసి అందులోని కాపర్ వైర్ ను అమ్ముకున్నట్లు గుర్తించామని డీసీపీ తెలిపారు. కొన్ని నెలలుగా పెద్దపెల్లి జిల్లా మరియు మంచిర్యాల లలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ల చోరీలు పెరగడంతో రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి (డిఐజి) ఆదేశాల మేరకు గోదావరిఖని ఏసిపి గిరి ప్రసాద్, మంథని సీఐ సతీష్ లు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లపై దృష్టి సారించారన్నారు. ఈ క్రమంలోనే ట్రాన్స్ ఫార్మర్ చోరీకి పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించాలని ప్రజలను డీసీపీ తెలిపారు. ఈ పత్రిక సమావేశంలో ఏసీపీ గిరి ప్రసాద్, సిఐ సతీష్, ఎస్సై వెంకటేశ్వర్, రవి ప్రసాద్ పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు..

అఖిల భారత సర్వీసు క్షేత్ర స్థాయి శిక్షణ..

అఖిల భారత సర్వీసు క్షేత్ర స్థాయి శిక్షణ..

యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల

అఖిల భారత సర్వీసు అధికారులు సర్వీసు శిక్షణ లో భాగంగా శనివారం క్షేత్ర స్థాయి శిక్షణ కోరకు డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం నుండి 20 మంది శిక్షణ అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లాకు రావడం జరిగిందని జిల్లా పరిపాలన అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. తేదీ 04.03.2023 నుండి 10.03.2023 వరకు గ్రామస్థాయి శిక్షణ కొరకు ముస్తాబాద్ మండలం లోని నామపూర్ గ్రామం, తంగళ్ళపల్లి మండలంలోనే బస్వపూర్, ఎల్లారెడ్డిపెట్ మండలం లోని రాజన్నపేట మరియు వేములవాడ రూరల్ మండలంలోని మర్రిపల్లి గ్రామాలు ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. ఆయా గ్రామాల లో క్షేత్ర స్థాయి పరిశీలన చేసి ప్రజల సామాజిక ఆర్థిక జీవన పరిస్థితులకు సంబంధించి, అలాగే జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన చేసి అవగాహన పెంచుకోవడం జరుగుతుందని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత సర్వీసుల శిక్షణ అధికారులు, జిల్లా, మండల, అధికారులు పాల్గొన్నారు.

సైబర్ క్రైమ్ నివారణకు ప్రత్యేక చర్యలు: సి.పి. ఎన్ శ్వేత

సైబర్ క్రైమ్ నివారణకు ప్రత్యేక చర్యలు: సి.పి. ఎన్ శ్వేత

యదార్థవాది ప్రతినిది సిద్దిపేట

సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో రోజు ఏరకమైన సైబర్ నేరాలు జరుగుతున్నాయో పత్రికా ద్వారా తెలియజేస్తాం. ఈ సందర్భంగా పోలిస్ కమిషనర్ ఎన్ శ్వేత మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు సైబర్ నేరాలు చేస్తున్నారని, ఏదైనా ఆశ చూపించి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చూపి అతని నుండి వ్యక్తిగత సమాచారం తీసుకుని సైబర్ నేరం చేయడం జరుగుతుందని, వ్యక్తికి సంబంధించిన బ్యాంకు అకౌంట్ కానీ, పాన్ కార్డు కానీ, ఇతర అకౌంట్లు బ్లాక్ అవుతుందని భయపెట్టి వారి నుంచి వ్యక్తిగత సమాచారం తీసుకొని సైబర్ నేరం చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత సమాజంలో ఇంటర్నెట్ ఉపయోగం పెరగడం వల్ల ప్రతి వ్యక్తి ఏదో అవసరానికి ఫోన్లు వాడడం జరుగుతుందని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదని సైబర్ నేరగాళ్లు అవకాశాల కోసం వేచి చూస్తారని ఫోన్లు జాగ్రత్తగా ఉండాలని ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 కి కాల్ చేస్తే మీరు పోగొట్టుకున్న డబ్బులను తిరిగి పొందేలా చేయవచ్చుని తెలిపారు.

శనివారం సిద్దిపేట జిల్లా పోలీస్ స్టేషన్ ల పరిధిలో జరిగిన సైబర్ నేరాల వివరాలు.

(SMS Fraud) ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి పాన్ కార్డు అప్డేట్ చేసుకోమని మెసేజ్ రాగా బాధితుడు లింకునీ క్లిక్ చేయగా బాధితుని అకౌంట్ నుంచి నుంచి 44,997 రూపాయిలు దొంగలించారని, (Trading fraud)సిద్దిపేట రూరల్ పరిధిలో బాధితునికి క్రిప్టో కరెన్సీ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు రెండింతలు వస్తాయని చెప్పగా బాధితుడు సైబర్ నేరస్తులకి 43000 వేల రూపాయలు పంపించినాడు మరల ఫోన్ చేయగా అతని నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.

(Honey Trap) సిద్దిపేట టూ టౌన్ పరిధిలోని బాధితునికి మీ ఇంస్టాగ్రామ్ లో పరిచయమై వాట్సాప్ లో నంబర్ ఎక్సేంజ్ చేసుకొని సైబర్ నేరస్థుడు బాధితునికి న్యూడ్ కాల్ చేసి రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేసి 4000 రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. కావున పై విధంగా ఎవరు ఫోన్ చేసి చెప్పినా సైబర్ నేరస్తులని గుర్తించి వారికి ఏ విధమైన సమాచారం ఇవ్వద్దని కమిషనర్ ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు.

వంద పడకల దవాఖానలో ఆధునిక వైద్య సేవలు..

వంద పడకల దవాఖానలో ఆధునిక వైద్య సేవలు..

యదార్థవాది ప్రతినిది ఆర్మూర్

ప్రజల ఆరోగ్యానికి సంపూర్ణ రక్షణ ఆర్మూర్ వంద పడకల దవాఖాన అని జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ ఆసుపత్రిలో శనివారం ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్మూర్ ఆసుపత్రి ద్వారా ఆధునిక వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ఇప్పటికే 25వేలకు పైగా ఉచిత ప్రసవాలు జరిగి ఒక్కో తల్లికి 50వేల రూపాయల చొప్పున ఖర్చు తప్పింది. మహిళల సంక్షేమం కోసం తల్లికి చీరె, పుట్టిన బిడ్డకు బట్టలు, పిల్లల కోసం జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఆరోగ్య సామాగ్రి, ఆట వస్తువులు, దోమల తెర వంటి వాటితో శిశు రక్షణకు ఇస్తున్నదే కేసీఆర్ కిట్. 6 నెలల గర్భవతి నుంచి 3 నెలల బాలింత వరకు ఆమెకు ఆర్దికంగా అండగా ఉండేందుకు 12 వేల రూపాయలు ఇస్తూ, ఆడపిల్ల పుడితే అదనంగా 1000 రూపాయలతో పాటు ఇస్తున్న ప్రభుత్వమిది. దీనివల్ల 10 లక్షల మంది మహిళలు లబ్ది పొందారని, ఆర్మూర్ ఆసుపత్రిలో మరిన్ని అత్యాధునిక సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్డెంట్ నాగరాజు ఆసుపత్రి డాక్టర్లు బిఆర్ఎస్ నాయకులు పండిత్ పవన్ పండిత్ ప్రేమ్ కౌన్సిలర్లు గంగా మోహన్ చక్రు రంగన్న మైనారిటీ నాయకులు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...